సరిహద్దులు, నాయకులు, సైన్యం లేనటువంటి దేశం కాని దేశం గురించి మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
నేను ఎప్పుడూ ఒకటి మాట్లాడుతుంటాను, మనం భారతదేశ చరిత్ర నే కాదు, ప్రపంచ చరిత్రను కూడా మార్చాలంటాను. భారతదేశంకు ఎలా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన చరిత్రకు చదల పట్టిందో అలాగే క్రైస్తవం, ఇస్లాం మతాల కారణంగా అనేక దేశాలు వాళ్ల చరిత్రను మొత్తం కోల్పోయారు. గ్రీకు, రోమన్, పర్షియా దేశాలు ఎలా వాటి అస్తిత్వం కోల్పోయాయో ప్రపంచంలో అనేక దేశాలు వాళ్ల వాళ్ల అస్తిత్వాలను కోల్పోయాయి.
అలాంటిదే పాలస్తీనా, ఇజ్రాయెల్ కూడా వాటి వాటి అస్తిత్వాలను కోల్పోయాయి. బ్రిటీషర్స్ మనదేశాన్ని పరిపాలించినట్లే అనేక దేశాలను పరిపాలించారు అందులో ఇప్పుడు మనం అనుకుంటున్న, ఇజ్రాయిల్, పాలస్తీనా లు కూడా ఉన్నాయి. 1917 లో లార్డ్ బాల్ఫోర్ యూదుల గురించి అనేకసార్లు ప్రస్తావించారు. లార్డ్ బాల్ఫోర్ బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, యూదులకు పాలస్తీనా భూభాగం వారిదే అని వివరించారు. కాకపోతే యూదులు కాని వారిని పాలస్తీనా లో ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకూడదని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని జూలై 2025 లో బ్రిటన్ మాజీ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితి లో ప్రస్తావించారు. ఇజ్రాయిల్ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని కూడా అన్నారు. అయితే పాలస్తీనా యూదుల భూమే అని బాల్ఫోర్ అనేకసార్లు ప్రస్తావించారు అనికూడా అన్నారు.
ఇజ్రాయిల్ ని 1922 నుండి 1948 వరకు బ్రిటన్ లీగ్ ఆఫ్ నేషన్స్ మాండేట్ కింద పాలించిన పాలస్తీన్ భూభాగం ఎప్పటి నుంచో పూర్తి కాని అంతర్జాతీయ సమస్యగా పరిగణించబడుతోంది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది, కానీ పాలస్తీన్ అనే సమాంతర దేశాన్ని సృష్టించే ప్రయత్నాలు అనేక కారణాల వల్ల విఫలమయ్యాయి. డేవిడ్ లామీ చెప్పినట్లుగా, రాజకీయ నాయకులు "రెండు దేశాల పరిష్కారం" అనే పదాలు ఉచ్ఛరించడానికే అలవాటు పడ్డారు. దీని కారణంగా 1967 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు ఉన్న సరిహద్దులను అనుసరించి వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్‌లో ఒక పాలస్తీన్ రాష్ట్రం ఏర్పాటుకు దారితీసింది, తూర్పు జెరూసలేం ఆ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతం దాని రాజధానిగా ఉండాలి. కానీ అంతర్జాతీయ ప్రయత్నాలు ఫలించలేదు, అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌లో విస్తృతంగా వలసలు వెళ్లేట్లు చేయడం మూలాన ఆ ఆలోచనను విరమించుకున్నారు. వాస్తవంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ అలానే ఆ చుట్టుపక్కన ఉన్న అన్ని దేశాలు దాదాపుగా యూదుల భూమే కానీ, ఎప్పుడైతే క్రైస్తవ, ఇస్లాం మత వ్యాప్తి జరిగిందో అప్పటి నుండి యూదులు ప్రపంచంలో అనేక దేశాలకు పారిపోయారు. చివరాకరుకు భారత దేశం వారికి ఆశ్రయం ఇచ్చింది.
అమెరికా సహాయంతో 1948 లో స్వాతంత్ర్యం పొందిన యూదులకు చిన్న భూభాగాన్ని పాలస్తీనాను అప్పగించారు, కాకపోతే యుదులతో పాటు ఇతర మతాల వారు అక్కడున్నారు, దానిని అప్పుడే పరిష్కరించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. ఎలా అంటే భారత్ నుండి పాకిస్తాన్ విభజించి గాలికొదిలేసి ఎలా బ్రిటన్ వెళ్ళిపోయిందో అలానే యూదుల విషయంలో కూడా జరిగింది. జనాభా మార్పిడి జరగలేదు, కానీ యూదులకు ఇతర మతస్తులను ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి వెళ్లిపోయింది.
ఇక అప్పటి నుండి 1988 వరకు పాలస్తీనా మొత్తం యూదులే ఉంటూ వచ్చారు కానీ మనకు తెలిసిందే ఈ క్రైస్తవులు, కానీ ముస్లింలను కానీ మనం చూసీ చూడకుండా వదిలేస్తే భయంకరమైన మతమార్పిడీలు చేస్తారు లేదా ఒకరికి ముగ్గురిని పెళ్లి చేసుకుని వారి సంతానాన్ని అత్యధిక సంఖ్య లో ఉత్పత్తి చేస్తారు. అలాంటిదే పాలస్తీనా లో జరిగింది, 1988 కి ముస్లింల జనాభా పెరిగింది. అప్పటి వరకు లేని సమస్యను ఒక్కసారిగా మాకు సెపరేట్ దేశం కావాల్సిందే అంటూ అడ్డం తిరిగారు. ఆ దెబ్బతో ఇలాంటి వాటి కోసమే ఎదురు చూసే దేశాలు అనేకం ఉన్నాయి అందులో మొదటి మత తత్వ దేశం ఇరాన్. ఈ ఇరాన్ దానితో పాటుగా రష్యా, చైనాలు కూర్పు వంత పాడాయి. దాంతో ఫిబ్రవరి 1988 న మొదటగా ఇరాన్ ఐక్యరాజ్యసమితి లో పాలస్తీనా దేశం గా గుర్తిస్తూ ఓటు వేసింది. ఇక ఆ తరువాత కాస్తో కూస్తో మతం ఆధారంగా ఓట్లు కావాలనుకునే అన్ని దేశాలు సుమారు 75 దేశాలు 1988 నవంబర్ లో చివరాకరకు మన భారతదేశం కూడా ఐక్యరాజ్యసమితి లో పాలస్తీనా ను దేశం గా గుర్తిస్తూ ఓటు వేసింది.
ఆ తరువాత అనేక మధ్య ప్రాచ్య ముస్లిం దేశాలు 1988 నుండి 2010 వరకు సుమారు 110 దేశాలు మద్దతు తెలిపాయి. ఆ తరువాత 2010 నుండి 2024 వరకు 20 దేశాలు మద్దతు తెలిపాయి. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ గాజా పై భయంకరమైన దాడులు చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుండి 2025 సెప్టెంబరు వరకు 20 దేశాలు మద్దతు తెలిపాయి కానీ 2025 సెప్టెంబరు 22 న ఒక్కరోజే 25 దేశాలు పాలస్తీనా ను దేశం గా గుర్తించాలని మద్దతుతెలిపాయి, ఓటు వేశాయి. మొత్తం 193 దేశాలకు గాను 157 దేశాలు పాలస్తీనాకు అనుకూలంగా ఉన్నాయి ఇంచుమించు 75% గుర్తించాయి. ఐక్యరాజ్యసమితిలో దీనికి "పర్మనెంట్ ఆబ్జర్వర్ స్టేట్" హోదా ఉంది, ఇది ఐక్యరాజ్యసమితి లో పాల్గొనే అవకాశం ఇస్తుంది కానీ ఓటు హక్కు మాత్రం ఉండదు.
నిజంగా పాలస్తీన్‌ను ఒక దేశంగా గుర్తించడం అంటే ఏమిటి? పాలస్తీన్ ఒక దేశం లాంటిది, కానీ కాదు కూడా. అంతర్జాతీయ గుర్తింపు ఎక్కువగా ఉంది, విదేశాలలో దౌత్య కార్యాలయాలు ఉన్నాయి, ఒలింపిక్స్ సహా క్రీడా పోటీల్లో జట్లు పోటీ పడతాయి. కానీ ఇజ్రాయెల్‌తో దీర్ఘకాల వివాదం కారణంగా పాలస్తీన్‌కు అంతర్జాతీయంగా అంగీకరించిన సరిహద్దులు లేవు, రాజధాని లేదు, సైన్యం లేదు. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైనిక ఆక్రమణ కారణంగా 1990 లలో శాంతి ఒప్పందాల తర్వాత ఏర్పడిన పాలస్తీన్ అథారిటీ తన భూమి లేదా ప్రజలపై పూర్తిస్థాయి నియంత్రణ కలిగి లేదు. గాజాలో కూడా ఇజ్రాయెల్ ఆక్రమణ కొనసాగుతుండగా, ప్రస్తుతం అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ స్థితికి కారణం ఒక రకమైన దేశం కావడంతో, గుర్తింపు తప్పనిసరిగా కొంతమేరకు ప్రతీకాత్మకమే. ఇది ఒక బలమైన నైతిక, రాజకీయ ప్రకటనగా నిలుస్తుంది కానీ ఇదే భూభాగం అంటూ లేదు అదే పెద్ద సమస్య ఇప్పుడు.
దేశంగా ఎవరెవరు గుర్తించారు? ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి 193 సభ్య దేశాలలో సుమారు 75% దేశాలు పాలస్తీనాను గుర్తించాయనుకున్నాము. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ గుర్తింపు ఇచ్చిన తర్వాత, పాలస్తీన్ త్వరలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఐదు శాశ్వత సభ్యుల్లో నలుగురి మద్దతు పొందుతుంది. చైనా, రష్యా రెండూ 1988లోనే పాలస్తీనా ను గుర్తించాయి.
కాకపోతే అమెరికా ఇజ్రాయెల్‌కు అత్యంత బలమైన మిత్రదేశం కనుక పాలస్తీనా ను ఒంటరిగా విడిచిపెట్టింది. వాషింగ్టన్ 1990ల మధ్యలో ఏర్పడిన పాలస్తీన్ అథారిటీని గుర్తించింది. అప్పటి నుంచి పలు అధ్యక్షులు పాలస్తీన్ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం వారిలో లేరు. ఆయన రెండు సార్లు పాలనా సమయంలో అమెరికా విధానం ఇజ్రాయెల్ పక్షాన బలంగా నిలబడింది.
ఇప్పుడు బ్రిటన్ మరియు ఇతర దేశాలు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? అనేక బ్రిటిష్ ప్రభుత్వాలు పాలస్తీన్‌ను ఒక దేశంగా గుర్తించాలని అనుకుంటూ వచ్చాయి, కానీ శాంతి ప్రక్రియలో భాగంగా, ముఖ్యంగా ఇతర పాశ్చాత్య మిత్ర దేశాలతో కలసి "అత్యధిక ప్రభావం కలిగించే సమయంలో" మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాయి. కేవలం ఒక సంకేతంగా చేయడం తప్పు అవుతుందని, అది ప్రజలకు ధార్మిక సంతృప్తి కలిగించినా భూభాగం పై ఏమీ మార్చదని భావించాయి.
కానీ ఈ మధ్య సంఘటనలు అనేక ప్రభుత్వాలను ఒత్తిడి తెస్తున్నాయి. మీకర్దమయ్యిందనే భావిస్తాను, సెప్టెంబరు 22 న మద్దతుతెలిపిన అన్ని క్రైస్తవ దేశాలైనప్పటికీ ముస్లింల ప్రభావం విపరీతంగా పెరిగి వాళ్ల రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారేట్లు ఓట్ల దందా జరుగుతుంది, కాబట్టి తప్పట్లేదు, ఇదే వాస్తవంగా జరుగుతుంది, కేవలం మనదేశంలోనే కాదు ఇది ప్రస్తుతం మద్దతు తెలిపిన 25 దేశాల్లో ముస్లిం అప్పీజ్ మెంట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అలాగే గాజాలో పెరుగుతున్న ఆకలిమరణ దృశ్యాలు, ఇజ్రాయెల్ సైనిక దాడిపై పెరుగుతున్న ఆగ్రహం, ప్రజాభిప్రాయంలో పెద్ద మార్పులు ఇవన్నీ ఈ స్థితికి దారితీశాయి. తమ చర్యలను సమన్వయం చేసుకోవడం ద్వారా, పాలస్తీనా ను దేశం గా గుర్తిస్తున్న కొత్త దేశాలు గాజా యుద్ధాన్ని ముగించడానికి, తరువాతి రాజకీయ ప్రక్రియపై ఆలోచనను ప్రేరేపించడానికి పెద్ద ప్రభావం చూపాలని ఆశిస్తున్నాయి.
అమెరికా వ్యతిరేకం ట్రంప్ ప్రభుత్వం వ్యతిరేకతను ఎప్పుడూ దాచలేదు. అమెరికా అధ్యక్షుడు కూడా గురువారం జరిగిన సంయుక్త పాత్రికేయ సమావేశంలో "ఈ విషయంలో ప్రధానమంత్రితో విభేదం ఉంది" అని అంగీకరించారు. అయినప్పటికీ, ఇద్దరు నాయకులు ఒకే ఒక సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారు. నిజానికి, అమెరికా వైఖరి పాలస్తీనా స్వతంత్రత అనే భావనకే పూర్తిగా వ్యతిరేకంగా మారిందని స్పష్టంగా తెలుస్తోంది. జూన్‌లో ప్రస్తుత అమెరికా రాయబారి మైక్ హకాబీ, అమెరికా ఇకపై పాలస్తీనా దేశంగా మద్దతు ఇవ్వదని భావిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పాలస్తీనా ను గుర్తించే అంతర్జాతీయ ప్రోత్సాహం హమాస్‌ను " బలంగా చేస్తుంది" అని అన్నారు. ఆయన సెప్టెంబర్ 15న నెతన్యాహూతో జరిగిన సంయుక్త పాత్రికేయ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, గుర్తింపు "ఉగ్రవాదానికి బహుమానం" అన్న ఇజ్రాయెల్ వాదనకు ప్రతీకగా ఉన్నాయి, ముఖ్యంగా 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడుల తర్వాత. రూబియో ఇంకా, గుర్తింపును ప్రోత్సహిస్తున్నవారికి అమెరికా హెచ్చరించిందని చెప్పారు.
వీళ్లందిరికన్నా ఈ విషయంలో ఒక డైనమిక్ లీడర్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి, ఆమె ఇటలి ప్రధాని జార్జ్ మెలోని తాను పాలిస్తానాకు వ్యతిరేకం అంటూ ఐక్యరాజ్యసమితి లో ఓట్ వేశారు. తరువాత మొత్తం ఇటలీ ప్రధాన నగరాల్లో పాలస్తీనా కు అనుకులాంగా ర్యాలీలు తీసి ఇటలీ నగరాలను తగలబెట్టారు అయినప్పటికీ ఆమె ఏ మాత్రం లొంగకుండా అదే మాటపై నిలబడింది. హమాస్ ఉగ్రవాదం అంతమయ్యి మొత్తం సద్దుమణిగితే అప్పుడు మా మనస్సు మారొచ్చేమో అప్పుడు చూద్దాం అంటూ చాలా స్ట్రాంగ్ గా పాలస్తీనా మద్దతుదారులకు తెలిపింది. అలాగే నాకు మీ ఓట్లు అవసరం లేదు అనే ఒక మెస్సేజ్ ని ఇటలీ లో ఉన్న పాలస్తీనా బ్యాచ్ కి ఒక కౌంటర్ ని పాస్ చేసింది. ప్రపంచ దేశాలన్నీ ముస్లిం ఓట్లకోసం అప్పీజ్ మెంట్ పాలిటిం చేస్తుంటే మెలోనీ మాత్రం బిన్నంగా చెప్పింది.
యూరప్ పాలస్తీన్‌ను గుర్తించడం, గాజా పునర్నిర్మాణం పేరిట బిలియన్ల డాలర్ల సహాయం ఇవ్వడం ఘోరమైన తప్పిదం. అక్కడ అసలు సార్వభౌమత్వం గల దేశం లేదు ఉన్నది మాత్రం హమాస్ ఉగ్రవాద యంత్రాంగం, పాలస్తీనా అథారిటీ అవినీతి. ఈ సహాయం అభివృద్ధి కోసం కాకుండా రాకెట్లు, సొరంగాలు, బంకర్ల నిర్మాణానికే వాడబడింది. అంతిమంగా యూరప్ ఇచ్చిన ప్రతి యూరో జిహాద్ కు ఇంధనమై, హింస విజయవంతమని ఉగ్రవాదులకు సంకేతం పంపింది.
ఇకపై యూరప్ నాయకులు వాస్తవాన్ని గుర్తించాలి. లేని రాష్ట్రానికి గుర్తింపు ఇవ్వడం శాంతిని కాదు, తదుపరి యుద్ధానికి స్వాగతం పలకడమే. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని లాంటి నాయకులు ‘కుదరదు’ అని చెప్పే ధైర్యం చూపుతుంటే, మిగతా యూరప్ నాయకులు మాత్రం భయంతో, ఓట్ల కోల్పోతామనే ఆందోళనతో పాలస్తీనా ను గుర్తిస్తున్నారు. ఈ విధానం చివరికి యూరప్ వీధుల్లోనే అల్లర్లు, హింస, నాశనం రూపంలో భవిష్యత్తు తప్పక దర్శనమిస్తుంది.
అంతిమంగా ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సేవ్ రాఫా సేవ్ గాజా అనే శాంతి ప్రేమికులు, ఇజ్రాయెల్ పౌరులని బందీలుగా తీసుకెళ్లి అనేక చిత్ర హింసలు పెడుతున్నారు, వారి గురించి మాట్లాడే వారే లేకపోవడం ఇజ్రాయెల్ ప్రజల దురదృష్టం గా నేను భావిస్తాను. ఇస్లాం మతం పెరిగితే చివరకు క్రైస్తవ మత దేశాలు కూడా అప్పీజ్ మెంట్ రాజకీయాలు చేస్తాయని మనకు ఈ సందర్భంలో అర్దమవుతుంది. మనదేశంలో ప్రతిపక్షం ప్రస్తుతం అదే అప్పీజ్ మెంట్ రాజకీయాలు చేస్తోంది. కానీ ప్రస్తుతం మన దేశం మనచేతుల్లో ఉంది. దీనిని ఇలాగే మరో యాబై ఏళ్ల పాటు ఉండనిద్దాం... జయ్ హిందురాష్ట్ర. రాజశేఖర్ నన్నపనేని. Mega Minds