లద్దాఖ్ అగ్నికి ఆహుతి: నలుగురు మృతి, 45 మంది పౌరులు క్షతగాత్రులయ్యారు మరియు 22 మంది పోలీసులకు గాయాలయ్యాయి, ఇందులో ఒకరు SSP ర్యాంక్ అధికారి.
సోనమ్ వాంగ్చుక్ – రామోన్ మాగ్ సెసే అవార్డు గ్రహీత ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. మనమంతా త్రీ ఈడియట్స్ సినిమా చూసే ఉంటాం, అందులో అమీర్ ఖాన్ పోషించిన పాత్ర సోనమ్ వాంగ్ చుక్ దే... సోనమ్ మొదట్లో భారత విద్యావ్యవస్థలో మార్పుకు కృషి చేసిన మాట వాస్తవం. అన్నా హజారే కూడా దేశం కోసం ఎంతో పనిచేశాడు అలాంటి వారే సోనమ్ కూడా. మనం ఒకటి గుర్తుంచుకోవాలి మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఈ రోజు మంచిగా ఉన్న వ్యక్తి రేపటి రోజున మంచిగా ఉండకపోవచ్చు. అలాగే ఈ రోజు చెడ్డ వ్యక్తి రేపు మంచిగా కూడా కావొచ్చు.
మాగ్‌సెసే అవార్డు – గుర్తింపు కాదు అదొక రిక్రూట్‌మెంట్ సెంటర్!: రాక్ఫెల్లర్ ద్వారా ఫండింగ్ తో నడపబడే సంస్థ రామన్ మాగసెసే అవార్డు ఫౌండేషన్. మేగసెసే అవార్డు 2018 లో అది సోనమ్ వాంగ్ చుక్ ని వరించింది. మరియు క్లైమేట్ యాక్టివిస్ట్ గా సోనమ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు. ("Harnessing nature, culture and education for community progress" ) ఇలా తను అవార్డు పొందాక ఒక క్లాసిక్ డీప్ స్టేట్ ఆస్తి గా మారిపోయాడు.
ఈ అవార్డులు కేవలం గుర్తింపు మాత్రమే కాదు, “ఇదొక ప్రత్యేకమైన తయారీ కేంద్రం”. ఉదా: అరుణా రాయ్, రవీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టిస్ట్,యాంటీ డెవలప్‌మెంట్, సమాజంను విచ్చిన్న చేసే రచయితలు ఇలా అనేకమంది ఈ కోవలోకి వస్తారు.
క్లైమేట్ యాక్టివిజం పేరుతో జాతీయవాద స్రవంతిలోకి ఎంట్రీ: ప్రపంచవ్యాప్తంగా ఒక ప్యాటర్న్ ఉంది. మొదట పర్యావరణం, క్లైమేట్ ఉద్యమాలతో పేరు తెచ్చుకుంటారు. ఇది గ్లోబల్ అటెన్షన్ పొందడానికి సులభమైన మార్గం. తరువాత మెల్లగా రాజకీయ ఉద్యమాల్లోకి మలుస్తారు.
సోనమ్ వాంగ్ చుక్ – ఐస్ స్టూపాస్, క్లైమేట్ ప్రచారం → లడఖ్ రాజకీయ ఆందోళనలు (సిక్స్ షెడ్యూల్, స్టేట్‌హుడ్).
మెధా పట్కర్ – నర్మదా ఆందోళన → యాంటీ గ్లోబలైజేషన్ ఉద్యమాలు.
గ్రెటా థన్‌బర్గ్ – క్లైమేట్ → భారత రైతు ఉద్యమం సమయంలో టూల్‌కిట్.
ఇదొక రాజకీయ ప్రయోగం మాత్రమే: 2018–19 మాగ్‌సెసే – వెంటనే CAA–NRC నిరసనలు, షాహీన్ బాగ్. 2020 గల్వాన్ ఘర్షణ వాంగ్చుక్ “చైనా వస్తువుల బహిష్కరణ” – పక్కా జాతీయవాదిగా ముద్ర. అసలు జాతీయవాదే 2018 వరకు ట్రాప్ చేశారు అవార్డుతో. 2020–21 రైతు నిరసనలు + లడఖ్ హక్కుల కోసం ప్రచారం రెండూ మోడీ ప్రభుత్వంపై “సివిల్ రైట్స్” ఫ్రేమ్‌లో. 2023–24 ఉపవాసాలు, ఢిల్లీ మార్చ్ అన్నా హజారే స్టైల్ లో పునరావృతం వీటికి ప్రభుత్వాలతో సంబంధం ఉండదు. కులగణన, CAA 2.0 చర్చలతో కలిపి వీధి రాజకీయాల వలే గొడవలు సృష్టించడం. 2025 లో లడఖ్ మంటల్లో కాలిపోయింది. ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది ఆగిద్దా ఆగదా అన్నది నాయకులు, యువత చేతుల్లో వుంది.
లడఖ్ ఎందుకు టార్గెట్?: చైనాతో నేరుగా సరిహద్దు. రేర్ ఎర్త్ ఖనిజ సంపద. సోలార్ ఎనర్జీ పొటెన్షియల్. ఇక్కడ చిన్న అశాంతి కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారాన్ని తెచ్చేస్తుంది. వాంగ్చుక్ “క్లైమేట్ యాక్టివిస్ట్” ఇమేజ్ వెనుక అసలు నిజం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం.
Gen Z టూల్‌కిట్ అమలు: 2023–25లో వాంగ్చుక్ ఆందోళనలు సిక్స్ షెడ్యూల్/స్టేట్‌హుడ్‌పై ఫోకస్ చేయడం, ఇది ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాలు (నాగాలాండ్, పంజాబ్, కాశ్మీర్, ఈశాన్య భారతం) అంతర్జాతీయ మానిటరింగ్ ఎంట్రీ పాయింట్స్‌గా ఎలా మారాయో ప్రతిధ్వనిస్తోంది. మనకందరికీ తెలిసిన కీవర్డ్ “Gen Z”.
తస్మాత్ జాగ్రత్త: ఎందుకంటే ఇది సులభంగా అమ్ముడయ్యే పదం. ఈ పదాన్ని లక్షసార్లు వాడుతూ టూల్‌కిట్ పూర్తిగా యాక్టివేట్ చేస్తుంది. కానీ నాకు నమ్మకం ఉంది, గతంలో ఆపరేషన్లలాగే ఇది కూడా విఫలం అవుతుంది.
కారణం ఏమిటంటే భారత యువత సామాజికంగా చైతన్యవంతులు. అయితే కొంత పెద్ద ఎత్తున గందరగోళానికి గురయ్యారు, తప్పుదోవ పట్టించబడ్డారు కానీ యువకిశోరాలు, Gen Z తెలివైనవారు. ఏది ఏమైనప్పటికీ, ప్రభుత్వం మరియు ఏజెన్సీలు తమ ప్లాన్ సిద్ధం చేసుకున్నాయి. ఎవరేంచేశారు, ఎందుకు చేస్తున్నారు అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది. దేశ నాయకులు ప్రజలముందు అన్నీ విపులంగా ఉంచుతారు. మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. “ఇది ప్రజలని కలిపేది కాదు, కేవలం ఒదొక డీప్ స్టేట్ ప్రయోగం.”
ఈ దేశపు యువత ఏనాడు తన ఆస్తుల్ని తనే ద్వసం చేసుకోలేదు. అలాగే తనకు కావలసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాలే యువతను ఇబ్బందుపాలు చేశాయి. కానీ యువత ఎప్పుడూ దేశం వైపే వుంది. ఇక ముందూ ఉంటుంది. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds