ఒక సాద్వి, ఒక కల్నల్, ఒక తీర్పు - హిందూ తీవ్రవాదం నిజమేనా?
మాలేగావ్ పేలుళ్ళ తీర్పు - పూర్వాపరాలపై - సమగ్ర సమాచారం: జూలై 31, 2025 ‘హిందూ తీవ్రవాదం’ వాదన కు ముగింపు – రాజకీయ కుట్ర, నిర్దోషులకు న్యాయం.
ఈ సమాచారాన్ని అందించే క్రమంలో ఒళ్ళు గగుర్పొడించింది. ఈ అంశం భారతీయతకు, హిందుత్వానికి, హిందువులకు ఒక భావోద్వేగం. కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారంకు ముగింపు. ఓ సాద్వికి, ఓ కల్నల్ కి, ఓ మేజర్ కి మరో నలుగురు దేశ భక్తులకు స్వేచ్చా, గర్వం.
నేపథ్యం: సాద్వి ప్రజ్ఞ సింగ్ ఠాకూర్ విశ్వ విద్యాలయంలో చదువుకునే రోజుల్లో ఉపయోగించిన స్కూటర్ ను ఆధారం చేసుకుని, సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ దగ్గర RDX లభించిందంటూ, మరో మేజర్ రమేష్ ఉపాధ్యాయ, సమీర్ కులకర్ణి తో పాటు అభినవ భారత్ సంబంధించిన ముగ్గురు కార్యకర్తలతో కలిపి మొత్తం ఏడుగురిని అక్టోబర్ 23 2008 న కనీస సమాచారం లేకుండా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముఖ్య అధికారి హేమంత్ కర్కరే అరెస్ట్ చేశారు. వారు ఎందుకు అరెస్ట్ చేయబడ్డారో కూడా వాళ్ళల్లో ఏ ఒక్కరికి తెలియదు. తరువాత రోజు కుటుంబ సభ్యులు పేపర్లో చూసి ఒక్క సారిగా కుప్పకూలిపోయారు.
అసలు జరిగింది ఏమిటంటే September 29, 2008 న నాసిక్ జిల్లా మాలెగావ్ అనే పట్టణం లో ఒక పెద్ద బాంబు పేలుడు జరిగింది. స్కూటర్ కి బాంబు అమర్చి పేల్చారు, ఈ పేలుడు లో ఆరుగురు మరణించారు, వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు. మొదటగా 2001 , 2006 బాంబు పేలుళ్లకు సూత్రదారులైన సిమి ఉగ్రవాద సంస్థ అని తేలింది. కొంతమంది సిమి అనుమానితులను అరెస్ట్ లు కూడా చేసారు. అనూహ్యంగా 24 రోజుల తరువాత ముందుగా చెప్పుకున్న ఏడుగురిని అనుమానితులుగా భావిస్తూ అరెస్ట్ చేశారు. అలాగే ఈ బాంబు పేలుళ్ల కేసులో ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భాగవత్ గారిని కూడా ఇరికించాలని ప్రయత్నించారు.
అరెస్ట్ పేరుతో ఈ ఏడుగురిని మాటల్తో చెప్పరాని విధంగా హింసించారు. సాద్వి ప్రజ్ఞా సింగ్ కి నార్కోటిక్ టెస్టులు ఒకటికి మూడు సార్లు చేసి ఒప్పుకోమని హింసించారు. కల్నల్ పురోహిత్ ఈ అరెస్ట్ కాకపొతే సైన్యం పెద్ద అధికారి అయ్యేవారు. పురోహిత్ ని అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి సూత్రదారులు మేమే అంటూ ఒప్పుకోమన్నారు అలాగే మిగతా ఐదుగురిని కుడా చిత్రహింసలు చేశారు.
ఈ ఏడుగురు అరెస్ట్ కాగానే కాంగ్రెస్ లో ఉన్న కొద్దిమంది ఒక వాదన లేవదీశారు, మొదటగా దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం ఒకటికి పదిసార్లు ఇస్లామిక్ తీవ్రవాదం కన్నా కూడా ఈ దేశం లో హిందూ తీవ్రవాదం పేట్రేగిపోతోంది అంటూ నోటికొచ్చింది వాగారు. తరువాత సోనియా, రాహుల్ కుడా అందుకున్నారు. ఇలా కాంగ్రెస్ అగ్ర నాయకులు అంతా హిందూ తీవ్రవాదం అంటూ వంతపాడారు.
నిజంగా కాషాయం తీవ్రవాదాన్ని కోరుకుంటే ఈ దేశాన్ని ముస్లింలు, బ్రిటిషర్లు పాలించేవాళ్లా? కాషాయం త్యాగానికి ప్రతీక, కాషాయం సేవకు నిదర్శనం, కాషాయం ఓ జాతి మొత్తాన్ని మేల్కొలిపే ఉద్వేగం, ఉత్సాహం. ఈ దేశం చీమలకు, పాములకు కుడా పాలుపోసి వాటిని పూజించే సంస్కారం ఉన్న దేశం అలాగే హిందూ ధర్మం. ఇక్కడ భారతీయత, హిందుత్వం, కాషాయం, జాతీయత, సనాతన ధర్మం అన్నిటికి ఒకటే అర్ధం. అటువంటి హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ కాంగ్రెస్ హిందూ తీవ్రవాదం, కాషాయ తీవ్రవాదం, సంఘ తీవ్రవాదం ఇలా అనేక పదాలను ఉపయోగిస్తూ అతిపెద్ద కుట్రను పన్ని ఒక కథనాన్ని అల్లింది కానీ అది నేడు పటాపంచలైంది.
2008 లో మొదలయిన ఈ కేసు 2025 జులై 31 ఒక కొలిక్కి వచ్చింది. ఈ 17 సంవత్సరాల వ్యవధిలో ఎందరో న్యాయవాదులు, జడ్జ్ లు మారిపోయారు. కనిసం 300 మంది పైబడి విచారణ జరిపారు. అంతిమంగా సాద్వి ప్రజ్ఞా స్కూటర్ ని తాను ఎప్పుడో చదువు అయిపోనప్పుడే అమ్మితే ఆ తరువాత ఒకరిద్దరి చేతులు మారిందని, పురోహిత్ ఇంట్లో ఆర్ డి ఎక్స్ ని ఎవరో పెట్టినట్లుగా, మిగతా ఐదుగురు పై కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి 2013 నుండి బెయిలుపై ఉన్న ఈ ఏడుగురిని నిర్దోషులుగా మహారాష్ట్ర బొంబాయి Special National Investigation Agency (NIA) Court తీర్పునిచ్చింది. తీర్పులో భాగంగా న్యాయమూర్తి ఈ విధంగా అన్నారు..
“కోర్ట్ కొద్దిమంది ప్రజాప్రాయాలు పై నిర్ణయం తీసుకోదు. పెద్ద నేరాల్లో ఇంకా మెరుగైన, సమగ్రమైన ఆధారాలు కావాలి. కేవలం అనుమానం ద్వారా శిక్ష విధించలేం.” – విచారణా న్యాయమూర్తి. (వ్యాఖ్య సంక్షిప్తం)
జూలై 31, 2025న విడుదలైన ఈ తీర్పు మనదేశంలో ఉగ్రవాద దర్యాప్తులో రాజకీయ ప్రమేయాన్ని నిర్మూలించడం అవసరమని చూపించింది. అలాగే న్యాయబద్ధమైన, పారదర్శకత ద్వారా నిస్సహాయకులైన వారిని విముక్తి చేయడమే కాకుండా, “హిందూ తీవ్రవాదం” అనే వాదనను కూడా తుడిచిపెట్టేసింది. న్యాయస్థానం తీర్పు దేశ ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థపైనా, విచారణ సంయమనం పైనా విశ్వాసాన్ని పెంచింది. రాజకీయాలకు బలి అయిన నిర్దోషుల జీవితాలను సైతం న్యాయస్థానం మళ్లీ తమ జీవితంలో ముందుకు నడిపేలా చేసింది.
ఈ పదిహేడు సంవత్సరాలుగా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నవారు సుదీర్ఘ కాలంగా కస్టడీలో, బెయిల్ పై గడిపారు. సైనికులు, సాద్వి వారి కుటుంబాలు మానసికంగా, సామాజికంగా తీవ్ర అవమానానికి గురయ్యారు. వారి వ్యక్తిగత జీవితంలో ఎంతో నష్టపోయారు.
ఇప్పటికైనా నిర్దోషులను విడుదల చేయడం ద్వారా ఈ ఏడుగురు కుటుంబాలు సమాజం లో తలెత్తుకుని తిరగవచ్చని సామాన్య ప్రజలు అభిప్రాయం పడుతున్నారు. యావత్ దేశం అంతా హిందూ తీవ్రవాదం అనేది కల్పితమని నిరూపితమైనందుకు తినుబండారాలు పంచుకున్నారు. -మీ రాజశేఖర్ నన్నపనేని. మెగామైండ్స్.