భారత నౌకాదళం జలాంతర్గాములు - Indian Navy’s Submarines: Strength, Strategy & Expansion

megaminds
0
Indian Navy submarine

భారత నౌకాదళం - జలాంతర్గాములు

భారతదేశం మూడు వైపులా సముద్రంతో కూడిన దేశం కావడంతో ఇది మనకు అనేక విధాలుగా లాభాలను చేకూరుస్తుంది. అదే సమయంలో చైనా రూపంలో పెద్ద ముప్పు కూడా ఎదురవుతోంది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత్‌ను తరచూ రెచ్చగొడుతున్న చైనా, ఇప్పుడు హిందూ మహాసముద్రంలోకీ తన యుద్ధ నౌకలను ప్రవేశపెట్టి సాగర జలాల్లోనూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత్ తీరప్రాంత రక్షణను మరింత బలోపేతం చేస్తూ, అణు జలాంతర్గాముల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం.

భారత నౌకాదళంలో ప్రస్తుతం ఉన్న జలాంతర్గాములు:
భారతదేశం సముద్రతీర భద్రతలో బలమైన రక్షణ వ్యవస్థ కలిగి ఉండటానికి నౌకాదళంలో  జలాంతర్గాములు (Submarines) ప్రధాన ఆధారం. ఇవి శత్రువుల కదలికలను గమనించడం, గోప్యతగా దాడి చేయడం ద్వారా మనదేశాన్ని కాపాడుకోవడంలో  జలాంతర్గాములు ప్రముఖ పాత్రని పోషిస్తాయి. భారతదేశం సముద్రం నుంచే అణు క్షిపణులను ప్రయోగించే శక్తిని కూడా కలిగిఉన్నవి. వీటివల్ల ఏ పరిస్థితుల్లోనైనా దేశ భద్రత సుస్థిరంగా ఉంటుంది.

అణు జలాంతర్గాములు – అరిహంత్ క్లాస్ (SSBN)

INS Arihant (2016) – భారత తొలి అణు జలాంతర్గామి.
INS Arighaat  (2024) – మరింత శక్తివంతమైనది.
INS Aridhaman (రాబోయేది) – అధిక సామర్థ్యం గల క్షిపణి.
S-5 తరగతి (భవిష్యత్తులో) – అంతర్జాతీయ స్థాయిలో అణు నిరోధక శక్తి.    -దేశం శత్రువులపై ఎప్పుడైనా ప్రతిదాడి చేసే బలమైన జలాంతర్గాములు ఇవి.
 
డీజిల్ - ఎలక్ట్రిక్ జలాంతర్గాములు (SSK)

సింధుఘోష్ క్లాస్ (Kilo-Class):

రష్యా నుండి వచ్చిన ఈ జలాంతర్గాములు 1986 నుంచి సేవలో ఉన్నాయి.  సింధుఘోష్ జలాంతర్గాములు: INS Sindhughosh (S55), INS Sindhudhvaj (S56 – decommissioned 2022), INS Sindhuraj (S57), INS Sindhuratna (S59), INS Sindhukesari (S60), INS Sindhukirti (S61), INS Sindhuvijay (S62), INS Sindhurakshak (S63 – lost in 2013), INS Sindhushastra (S65).  ఇవి తీరప్రాంత రక్షణలో, గోప్యంగా శత్రువులపై దాడి చేయడంలో ఇవి అగ్రగామి.
 
శిశుమార్ క్లాస్ (Type- 209/1500):

జర్మనీ సహకారంతో నిర్మించినవి. సముద్రంలో ఎక్కువకాలం గడిపే శక్తి కలిగినవి. ఈ జలాంతర్గాములు 1986 –1994 నుంచి సేవలో ఉన్నాయి.
శిశుమార్ జలాంతర్గాములు: INS Shishumar (S44), INS Shankush (S45), INS Shalki (S46), INS Shankul (S47). ఇవి ప్రత్యేక భద్రతా వ్యవస్థలతో యుద్ధంలో బలంగా నిలుస్తాయి.
 
కల్వరి క్లాస్ (Scorpène / Project-75):

ఫ్రాన్స్ సాంకేతికతతో, ముంబైలో నిర్మించిన ఆధునిక జలాంతర్గాములు. అధునాతన స్టెల్త్ టెక్నాలజీతో శత్రువుకు కనిపించకుండా పనిచేస్తాయి. ఈ జలాంతర్గాములు 2017 నుంచి సేవలో ఉన్నాయి.
కల్వరి జలాంతర్గాములు: INS Kalvari (S21), INS Khanderi (S22), INS Karanj (S23), INS Vela (S24), INS Vagir (S25), INS Vagsheer (S26 – under trials). ఇవి తాజా క్షిపణి వ్యవస్థలతో అత్యంత శక్తివంతమైనవి.

రాబోయే జలాంతర్గాములు - ప్రాజెక్టులు: 

Project 75I – కొత్త తరహా జలాంతర్గాములు, ఎక్కువ కాలం నీటిలో ఉండే శక్తి (AIP టెక్నాలజీ).
Project 75 Alpha – స్వదేశీ అణు దాడి జలాంతర్గాములు.
 
జలాంతర్గాముల ప్రధాన స్థావరాలు:

INS వజ్రబాహు (ముంబై) – సింధుఘోష్, శిశుమార్, కల్వరి తరగతులు.
INS వీర్ బాహు  (విశాఖపట్నం) – సింధుఘోష్, శిశుమార్ తరగతులు తూర్పు సముద్ర ప్రాంతంలో జలాంతర్గాముల నియంత్రణ.
INS వర్ష (ఆంధ్రప్రదేశ్) – అణు జలాంతర్గాముల కోసం ప్రత్యేక రహస్య స్థావరం.

2025 నాటికి భారత నౌకాదళం వద్ద: 1 అణు జలాంతర్గామి (SSBN), 17 డీజిల్ - ఎలక్ట్రిక్ జలాంతర్గాములు (SSK) ఉన్నాయి.

కొత్త ప్రాజెక్టులు పూర్తవుతున్న కొద్దీ భారత్ ప్రపంచంలో అగ్రగామి జలాంతర్గామి శక్తిగా ఎదగనుంది. జలాంతర్గాములు కేవలం యుద్ధ నౌకలు మాత్రమే కాదు, అవి భారత భద్రతకు, వ్యూహానికి ఆధారం, అణు నిరోధకతకు నిదర్శనం, స్వావలంబనకు ప్రతీక. భవిష్యత్తులో మరిన్ని ఆధునిక జలాంతర్గాములు నౌకాదళంలో చేరడంతో, భారతదేశం సముద్ర రక్షణలో అజేయ శక్తిగా నిలిచి, ప్రపంచానికి తన శౌర్యం, శక్తి, సామర్థ్యాన్ని మరింత గర్వంగా చాటుతుంది.

Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

Indian Navy submarines, Arihant class, Kalvari class, Sindhughosh class, Shishumar class, nuclear submarines India, Indian Navy 2025, Project 75I, submarine fleet India


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top