దేశం ధర్మసత్రం కాదు – చొరబాటుదారులపై కేంద్రం కఠిన చర్యలు India Is Not a Dharamshala: Centre’s Tough Action Against Illegal Intruders

megaminds
0

రోహింగ్యా చొరబాటు దారుల్ని తిప్పి పంపిస్తున్న భారత ప్రభుత్వం. భారతదేశం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముప్పు రోహింగ్యా చొరబాటుదారులు, బాంగ్లాదేశీ అక్రమవలసలు. బాంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా ప్రవేశించిన ఈ చొరబాటుదారులు సాధారణ పేదవాళ్లు కాదని అనేక ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు చెబుతున్నాయి. అక్రమ వ్యాపారాలు, మత్తు పదార్థాల రవాణా, నేరగాళ్లతో సంబంధాలు ఇవన్నీ రోహింగ్యా శిబిరాల చుట్టూ ఉన్న అంశాలుగా బయటపడ్డాయి.

ఓటు బ్యాంకు కోసం నీచ రాజకీయాలు:
భయబ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే, కొందరు ప్రతిపక్ష నేతలు వీరిని శాశ్వత ఓటర్లుగా మార్చేందుకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు చొరబాటుదారులకి అక్రమంగా జారీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దేశ భద్రతను పక్కన పెట్టి, కేవలం ఓటు రాజకీయాల కోసం ఈ విధానాన్ని అనుసరించడం దేశద్రోహం.

కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం:
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశ ప్రజలకు నిశ్చింతను కలిగించింది. ఢిల్లీలో పట్టుబడిన రోహింగ్యాలను ఆండమాన్ మార్గం ద్వారా మయన్మార్ తీరానికి పంపే నిర్ణయం ‘అక్రమ వలసదారులకు జీరో టాలరెన్స్’ అన్న సందేశం ఇస్తోంది. చాలామంది దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొదట అండమాన్ పంపి అక్కడ నుండి పడవల్లో మయన్మార్ బీచ్ లకి దగ్గరకు తీసుకెళ్లి పడవనుండి దింపేస్తున్నారు. దేశం లో ఉన్న ఏ ఒక్క అక్రమవలసదారుణ్ని వదలమని, చివరి రోహింగ్యా వరకు వెతికి పంపుతామని గృహ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మానవత్వం పేరుతో మోసం:
ప్రతిపక్షాలు దీన్ని “మానవత్వం లేని చర్య” అంటూ విమర్శిస్తున్నాయి. కానీ నిజం ఏమిటంటే భారత్ ఎన్నో దశాబ్దాలుగా శరణార్థులకు, అక్రమవలసదారులకి ఆశ్రయం ఇస్తూనే ఉంది. టిబెట్లు, శ్రీలంక తమిళులు ఎవరినీ వదలలేదు. కానీ చట్టబద్ధంగా వచ్చినవారికి, మనస్పూర్తిగా సమాజంలో కలిసిపోయినవారికి మాత్రమే సాయం చేయాలి. నకిలీ పత్రాలతో దేశాన్ని మోసం చేసేవారికి కాదు.

జాతీయ భద్రతే ప్రధానం:
ఇంటెలిజెన్స్‌ సంస్థలు అనేకసార్లు హెచ్చరించాయి రోహింగ్యా శిబిరాలు ఉగ్రవాద సంస్థలకు వసతి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని. హైదరాబాదు, జమ్మూ, ఢిల్లీ వంటి పట్టణాల్లో వీరి స్థావరాలు పెరుగుతుండటం గమనార్హం. ఇది కేవలం శరణార్థి సమస్య కాదు, జాతీయ భద్రత సమస్య.

భారత పౌరులుగా మారినట్టు నకిలీ ఆధార్, రేషన్ కార్డులు కలిగి ఉన్నవారిని నిజంగా భారత పౌరులా లేక రోహింగ్యాలా అనేది గుర్తించలేని స్థితి వచ్చింది. పౌరసత్వం నకిలీగా పొందడం అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే.

భద్రత, అభివృద్ధి ద్వంద్వ సూత్రం:
మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది “భద్రత లేకుండా అభివృద్ధి ఉండదు.” ఈ సూత్రాన్ని ఆచరణలో చూపుతూ, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇది కేవలం ఓ ప్రభుత్వ నిర్ణయం కాదు, దేశ భవిష్యత్తును రక్షించే చర్య.

ప్రతిపక్షాల కపట వైఖరి:
ఓటు బ్యాంకు కోసం దేశాన్ని బలిపశువుగా మార్చడం ప్రతిపక్షాల అసలు స్వరూపం. ఈ దేశంలో కోట్లాది నిరుద్యోగులు, పేదలు సహాయం కోసం ఎదురుచూస్తుంటే  రోహింగ్యాలకే ప్రత్యేక సాయం చేయాలా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాలు కేవలం నినాదాలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి.

ప్రభుత్వం సాహాసోపేతమైన నిర్ణయం:
భారత దేశం ఎవడుపడితే వాడు వచ్చి అక్రమంగా ఉండటానికి సత్రం కాదని, రోహింగ్యాలను వెనక్కి పంపించడం ద్వారా మోదీ సర్కార్ మరోసారి నిరూపించింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య కూడా దేశమే ప్రథమంగా భావించడం నిజమైన నాయకత్వానికి కొలమానం.

రోహింగ్యా చొరబాటు అరికట్టడం కేవలం ఒక సరిహద్దు సమస్య కాదు, ఇది భారత భవిష్యత్తును కాపాడే యుద్ధం. నిజమైన పౌరుల హక్కులను రక్షించడం, జాతీయ భద్రతను బలపరచడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. ఇవన్నీ ఈ నిర్ణయంతో సాధ్యమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం, భారత్‌ను మరింత శక్తివంతమైన దేశంగా నిలబెడుతుంది. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds.

Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

MegaMinds

Indian Army, India not a dharamshala, Centre action against intruders, Illegal immigrants India, Rohingya infiltrators India, Modi government illegal immigration policy, India border security measures, Deportation of illegal immigrants, Amit Shah illegal immigrants statement, India national security illegal migrants, Centre crackdown on infiltrators


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top