గణపతి విఘ్నాలు తొలగించేవాడు మాత్రమే కాదు, బానిసత్వాన్ని ప్రారదోలడానికొక సాధనం. భరతమాత బానిస సంకెళ్లు తొలగించి, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం కలలు కన్న వారికి ఆయనొక నిశ్చబ్ద ఆయుధం.
"గణపతి బప్పా మోరియా" అనే నినాదం, భక్తితో కూడిన అద్బుతమైన శబ్ద తరంగం పలికినప్పుడల్లా మనకు గుర్తు రావాల్సినది, ఈ దేశ స్వాతంత్ర్య ఉద్యమం. అలాగే మనం ఈ రోజు వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటే కూడా లక్షలాది మంది భారతమాత పాదాలకు పూల వలే తమ జీవితాల సమర్పించడం వలన మాత్రమే అనేది గుర్తుకురావాలి.
అవును డోలకుల శబ్దాలతో, హారతులతో మరియు నిమజ్జనాలతో, కేరింతలతో, జయ్ బోలో గణేష్ మహారాజ్ కి జయ్ నినాదాలు ఒకప్పుడు శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకిలించివేసింది. నమ్మశక్యం కావట్లేదా? ఈ వినాయక చవితి ఈ వ్యాసం చదివి జరుపుకుందాం, చివరివరకు ఈ భావోద్వేగాన్ని నాతో కలిసి పంచుకోండి.
1857 మొదటి స్వాతంత్ర్య ఉద్యమానికి వినాయక చవితి: క్రీ.పూ. నుంచి క్రీ.శ. 1200 వరకు సామూహిక వినాయక చవితి ఉత్సవాలు జరిగినట్లు కొన్ని శాసనాలు వివరిస్తున్నాయి. శాతవాహనులు, చాళుక్యుల కాలంలో గణపతి ఉత్సవాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాలంలో ఛత్రపతి శివాజీ వినాయక చవితిని వైభవంగా నిర్వహించారు. హిందూ సంస్కృతి, సామూహికంగా పండుగలు జరిపి సమరసతను తీసుకురావడానికి ఈ వేడుకలు మహారాష్ట్రలో పీష్వాల పాలనలో కూడా ఆధ్యాత్మికతా వాతావరణం జరిగాయి.
తర్వాత కాలంలో సామూహిక వేడుకలు ఎందుకు నిలిచిపోయాయి? మన దేశం మీద దండయాత్రకు వచ్చిన విదేశీయులే కారణమని చెప్పవచ్చు. బహిరంగ వేడుకలపై ఆంక్షల వలన ప్రజలు ఇళ్లలోనే వినాయక చవితి పండుగను జరుపుకునేవారు.
1880 ల సమయంలో పూణే లో ఇరుకైన ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ జరుపుకునే వారు. వీధులు నిశ్శబ్దంగా ఉండేవి. అప్పట్లో గణేష్ చతుర్థి అనేది ఒక వ్యక్తిగతంగా కుటుంబంలో నలుగురు కలిసి జరుపుకునే పండుగగా మారిపోయింది. ఇప్పటిలా సందడిగా ఉండే రోడ్లపై లేదా గొప్ప వేదికలపై కాదు. భక్తి వ్యక్తిగతమైనదిగా, ఒంటరిగా చేసుకునేదిగా పరిమితం చేయబడింది. ఈ పండుగ తరువాత రోజుల్లో జాతీయ ఉద్యమంగా మారబోతోందని ఏ ఒక్కరూ ఊహించలేదు.
కానీ గుబురైన మీసాలున్న వ్యక్తి మాత్రం దీనిని ఒక ఉద్యమంగా మలిచాడు అతనే లోకమాన్య బాల గంగాధర్ తిలక్. అది 1893 లోకమాన్య బాల గంగాధర్ తిలక్ మనస్సులో ఒక తుఫాను చెలరేగింది. బ్రిటిష్ వారు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పెద్ద సమావేశాలను నిషేధించారు, ప్రతి సమావేశాన్ని ఎహ్యభావంతో, అలాగే కొద్దిపాటి భయంతో చూశారు. ఇది సహించని తిలక్ ఆ కొద్దిపాటి భయాన్ని వారికి ఒక తుఫానుగా మార్చాడు.
మతపరమైన సమావేశాలను బ్రిటీషర్స్ పెద్ద పట్టించుకోలేదు పూణే లాంటి పట్టణాల్లో మరియు బ్రాహ్మణుల నుండి రైతుల వరకు, వ్యాపారుల నుండి కార్మికుల వరకు ప్రతి భారతీయుడిని ఏకం చేసే ఒకే ఒక పండుగ వినాయక చవితి దీనిని గమనించిన తిలక్ కి ఒక స్పష్టత వచ్చింది.
వాడవాడలా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు పిలుపునిచ్చారు. అలా 1893లో ప్రారంభమైన ఈ సామూహిక, బహిరంగ వేడుకలు క్రమంగా దేశమంతా విస్తరించాయి. ఇందులో ధనికులు, పేదలు అనే అంతరం లేకుంగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనేలా ప్రోత్సహించారు. ప్రజలందరినీ ఐకమత్యంతో ఒక చోట చేర్చి పూజలు నిర్వహించడంతో పాటు దేశభక్తి జాగృతం చేసేందుకు గణేష్ చవితి వేడుకలు ఉపయోగపడ్డాయి.
శివాజీ మహారాజ్‌ను కీర్తిస్తూ నాటకాలు, ప్రసంగాలు స్వరాజ్ స్ఫూర్తిని రేకెత్తించాయి. దేశభక్తి పాటలు ఇంతకు ముందు ఎప్పుడూ అనుభూతి చెందని భావోద్వేగాలను రేకెత్తించాయి. పైకి ఇది ఒక పండుగలా కనిపించినా వాస్తవానికి జాతీయవాదం యొక్క రహస్య కేంద్రాలుగా మారాయి.
అగ్నిలా వ్యాపించింది: పూణే లో పుట్టిన అగ్గిరవ్వ దావానలంలా వ్యాపించింది. ముంబై, నాగ్‌పూర్ మరియు ఇతర నగరాలు గొప్పగా గణేష్ ఉత్సవాలను నిర్వహించాయి. మహారాష్ట్ర దాటి, ఈ ఆలోచన కూడా వేళ్ళూనుకుంది. బెంగాల్‌లో, దుర్గా పూజ జాతీయవాద ఉత్సాహంతో పునరుద్ధరించబడింది. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్‌లో 1895లో తొలిసారిగా సామూహిక గణేష్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తిలక్ ఇచ్చిన పిలును అందుకున్న హైదరాబాద్‌లోని మహారాష్ట్రీయులు పాతబస్తీ శాలిబండలో భారత గుణవర్థక్ సంస్థను అదే సంవత్సరం ఉగాది రోజున స్థాపించారు. గుణవర్థక్ సంస్థ ప్రాంగణంలో వినాయకచవితి వేడుకలను ప్రారంభించింది. భారత గుణవర్థిని సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఈ వేడుకలను కొనసాగించడం విశేషం. అలా అనేక పట్టణాలు మరియు గ్రామాలలో దక్షిణ భారతమంతా గణేష్ మండళ్లు, విగ్రహాలు పెరిగాయి. విదేశాలలో ఉన్న భారతీయులు కూడా, బర్మా, ఫిజి, మారిషస్‌లలో కూడా గణేష్ ఉత్సవాలను జరుపుకోవడంలో ముందుకొచ్చారు. అలా మొదటిసారిగా, పండుగలు కేవలం ఆచారాలు కాదు అవి ఐక్యతకు ఆయుధాలుగా తిలక్ మలిచాడు.
బ్రిటిష్ వారిని ధిక్కరించిన పండుగ గణేష్ చతుర్థి:
బ్రిటిష్ వారు భయంతో చచ్చారనే చెప్పాలి అప్పటివరకు వారు కులం, మతం మరియు భాష ద్వారా విభజించబడిన భారతీయులను చూసి ఎగతాళి చేశారు. కానీ ఇక్కడ వారి కళ్ళ ముందు ఒక మట్టి విగ్రహం లక్షలాది మందిని ఒకే హృదయ స్పందనతో భారతమాతా కీ జయ్, జయ్ బోలో గణేష్ మహారాజ్ జయ్ నినాదం వారిని ఒకటిగా కలిపింది. కానీ వారు దానిని నిషేధించలేకపోయారు, ఆపలేకపోయారు.
ప్రజా గణేష్ ఉత్సవం ప్రజల సమాంతర ప్రభుత్వంగా మారింది. స్వాతంత్ర్యం లభించేవరకు ఈ ఉత్సవాలు వేదికలుగా పనిచేశాయి, మహదేవ రాణడే పిలుపుతో బలవంత్ ఫడ్కే, చాపేకర్ సోదరులు ఇలా అనేకమంది బ్రిటీషర్స్ పై విరుచుకుపడ్డారు.
ఇప్పటికీ ఉత్సవాలు అదే తరహాలో కొన్ని మార్పులతో ముందుకు సాగుతున్నాయి. దేశంలోని ప్రముఖమైన అన్ని పట్టణాల్లో భక్తితో సజీవంగా ఉన్నాయి. ప్రజలు విగ్రహం ముందు నృత్యం చేస్తారు, పెద్దలు హారతులు పడతారు మరియు నిమజ్జనం చిన్నపిల్లల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టిస్తుంది.
నేడు మనం చూసే ప్రతి విగ్రహం వేడుక తిలక్ దూర దృష్టికి కొనసాగింపు. విశ్వాసం ఒకప్పుడు భయాన్ని ఓడించింది. భక్తి విప్లవాన్ని రేకెత్తించింది. కాబట్టి మనం విగ్రహాన్ని చూసిన ప్రతిసారి ఇది కేవలం పూజ కాదు ఇదొక చరిత్ర, ఇదొక విప్లవం అని గుర్తుంచుకోవాలి. గణపతి అడ్డంకులను తొలగించేవాడు మాత్రమే కాదు, బానిసత్వాన్ని తొలగించేవాడు.
నేడు మనం ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ పర్యావరణం, కుటుంబ వ్యవస్థ, గ్రామాలు, సమాజం లో సమరసతను తీసుకురావడం, పౌరుల్లో సమాజం పట్ల గౌరవ భావాలు పెంచే కేంద్రాలుగా మనమంతా తీర్చిదిద్దుకోవాలి. జాతీయవాద చైతన్యాన్ని నింపే వినాయక చవితి వేడుకలను కలిసికట్టుగా జరపుకుందాం.
చివరిగా గణపతి బప్పా మోరియా ఇదొక నినాదం, కేక, భక్తి తరంగమో కాదు ఇది సగటు భారతీయుడి ధైర్యం, భావోద్వేగం. అందరూ నాతో కలిసి ఒకసారి జయ్ బోలో గణేష్ మహారాజ్ కీ జయ్.... రాజశేఖర్ నన్నపనేని. MegaMinds.
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
Ganesh Mandapams, Hindu unity festivals, Ganesh Chaturthi celebrations, Hindu consciousness, social harmony in festivals, community bonding in India, Ganesh mandap culture, spiritual unity festivals, cultural harmony India, Ganesh Utsav 2025
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.
ఏడు దశాబ్దాలు గడిచే సరికి అందుకు పూర్తి భిన్నంగా కొనసాగుతున్న వినాయక చవితి మండపాలు.
ReplyDelete