ఇజ్రాయెల్ జూన్ నెలలో ఇరాన్ పై యుద్ధం, అంతకు ముందు గాజా పై యుద్ధం చేస్తూనే ఉంది. ఈ రెంటిపై యుద్ధం ఎందుకు చేస్తుందో తెలుసు. ఇరాన్ పై ఎందుకంటే అణుబాంబులు తయారుచేసి మా పై వేస్తారనే భయం తో దాడి అని ఇజ్రాయెల్ చెప్పింది. అలాగే గాజా పై ఎందుకంటే ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకుంటునే మిస్సైల్స్ తో ఉగ్రదాడికి హమాస్ దిగడం మూలాన గాజా లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది ఇంకా చేస్తుంది. కానీ మరి సిరియా పై డమస్కస్ నగరం లో పలు సైనిక స్థావరాలు ఆర్మీ జనరల్ ఇళ్లపై ఎందుకు జూలై 16 న మిస్సైల్స్ తో దాడి చేసింది అనేది చాలామంది కి తెలియదు. కారణాలేంటో తెలుసుకుందాం ప్రపంచ రాజకీయాల నుండి మనమూ నేర్చుకుందాం...
డ్రూజ్ అనే తెగకు మద్ధతుగా ఇజ్రాయెల్ సిరియాపై వైమానిక దాడి. సిరియాలో చిన్న జాతి కోసం పెద్ద పోరాటం! చేస్తుంది ఇజ్రాయెల్.
మధ్యప్రాచ్యంలో మతపరమైన, జాతిపరమైన కల్లోలాలు నిత్యకృత్యం. కానీ ఈసారి ఒక చిన్న, శాంతవంతమైన బలమైన తెగకోసం ఇజ్రాయెల్ దాడి చేసింది. సిరియాలోని డ్రూజ్ కమ్యూనిటీని రక్షించేందుకు జూలై 16న ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడి అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.
డ్రూజ్ లు ఎవరు?: డ్రూజ్‌లు ఓ ప్రత్యేకమైన మత-జాతి (ఇస్లాంలో ఓ చిన్న తెగ) సమూహం. వారు ఇస్మాయిలీ ఇస్లాం నుండి 11వ శతాబ్దంలో విడిపోయి తమ స్వంత నమ్మకాలతో జీవిస్తున్న తెగ. మతం మార్పును డ్రూజ్‌లు అంగీకరించరు. తమ మత సూత్రాలు కేవలం కొంతమందికే అర్ధమవుతాయి. వారిలో సామాజిక విధేయతకు చాలా ప్రాధాన్యం ఉంటుంది.
ఇజ్రాయెల్‌లో డ్రూజ్ లు ఉన్నారా?: ఇజ్రాయెల్‌లో సుమారు 1.4 లక్షల మంది డ్రూజ్‌లు ఉన్నారు. వీరంతా గెలీలీ, మౌంట్ కార్మెల్ ప్రాంతాల్లో ఉంటారు. మిగిలిన అరబ్ మైనారిటీల కంటే విభిన్నంగా, డ్రూజ్ పురుషులు ఇజ్రాయెల్ ఆర్మీలో విధులు నిర్వర్తిస్తారు. చాలా మంది సీనియర్ హోదాలో కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ జనాభానే 95+ లక్షలు అందులో డ్రూజ్ లు 2% పైనే ఉన్నారు.
సిరియా, లెబనాన్ లో కూడా డ్రూజ్ లు ఉన్నారా?: సిరియాలో డ్రూజ్ జనాభా సుమారు 7 లక్షల పైచిలుకు. ప్రధానంగా జబల్ అల్-డ్రూజ్ (డ్రూజ్ పర్వతం), స్వీడా జిల్లాలో నివసిస్తున్నారు. సిరియా అంతర్యుద్ధంలో డ్రూజ్‌లు తటస్థతను పాటించే ప్రయత్నం చేశారు. అయితే 2018లో ISIS జరిపిన దాడుల్లో వందలాది డ్రూజ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి రక్షణ కోసం సిరియా ప్రభుత్వంపై కొంతమంది ఆధారపడుతున్నారు. మరికొందరు స్వయం రక్షణ మిలీషియాల ద్వారా తాము ప్రాంతాన్ని కాపాడుకుంటున్నారు.
అయితే జూలై 16 కి రెండు రోజుల ముందు అత్యంత పాశవికంగా డ్రూజ్ లను సిరియా ప్రభుత్వం అలాగే ఉగ్రవాదులు దారుణమైన హింసాకాండకు పాల్పడ్డారు. దాంతో ఇజ్రాయెల్ కి ఎంతో నమ్మకంగా ఉన్న డ్రూజ్ ల రక్షణ బాధ్యతను ఇజ్రాయెల్ తీసుకుని డ్రూజ్‌లకోసం దాడికి దిగింది. సిరియన్ సైనిక స్థావరాలపై మిస్సైల్స్ తో టార్గెట్ చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం దక్షిణ సిరియాలోని డ్రూజ్ జనాభాను రక్షించడం. గోలన్ హైట్స్ ప్రాంతంలో డ్రూజ్‌లు సిరియన్లుగానే తమను గుర్తించుకుంటారు, కానీ వారిలో కొత్త తరాలు ఇజ్రాయెల్ సమాజంతో కలిసిపోతున్నారు అందుకని ఈ మిస్సైల్ దాడికి దిగింది.
ఇజ్రాయెల్ ఎందుకు అంత ప్రాధాన్యతను ఇచ్చింది?: ఇజ్రాయెల్ రాజకీయంగా, మిలిటరీ పరంగా డ్రూజ్‌లకు కీలక మిత్రులుగా ఉన్నారు. అధికారులుగా కూడా ఉంటూ యూదుల కోసం ఇజ్రాయేల్ దేశం కోసం ఎలాంటి ప్రాణ త్యాగం చేసేవారు డ్రూజ్ లు అదుకే ఇలాంటి చర్యలు మతపరమైన మైనారిటీల రక్షణలో వారి బాధ్యతను తీసుకుంది. అదే సమయంలో, సిరియాలో ఉగ్రవాదం పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.
ఒక చిన్న సమాజం కోసం ఇజ్రాయెల్ దేశం అంతవరకూ వెళ్లడం అరుదైన విషయం. డ్రూజ్‌ల కోసం ఇజ్రాయెల్ చేసిన ఈ చర్య, మానవీయ పరంగా ప్రశంసనీయం.
మనం ఇక్కడ ఒకటే గమనించాలి. భారత్ విడిపోయినప్పుడు కోట్లాది మంది హిందువులు పాక్, బాంగ్లాదేశ్ లో ఉండిపోయారు. వారి రక్షణ బాధ్యత కూడా మనదే కానీ కాంగ్రేస్ వాటిని తుంగలో తొక్కింది. అలాగే పాక్ హిందువులని హతమార్చింది. కనీసం ఇప్పుడున్న హిందువుల ప్రాణాలకూ దిక్కులేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎప్పుడో వచ్చిన కొంతమంది హిందూ, సిఖ్, క్రైస్తవ, బౌద్ధ, జైనులకు CAA ద్వారా భారత పౌరసత్వం ఇస్తామంటేనే నానా యాగి చేస్తునాయి. ఒకవేళ వారికోసం ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తే మద్ధతిస్తాయా? అదే ఇజ్రాయెల్ దేశం లో రాజకీయంగా ఎన్నున్నా బయటి దేశాలతో విదేశీ విధానం అన్ని పార్టీలు సుముఖతను వ్యక్తం చేస్తున్నారు. అందుకే వారు ఇటువంటి పరిస్తితులలో కూడా సంఘటిత జీవనాన్ని కొనసాగిస్తూ వారి మనుగడ కోసం కనీసం పది దేశాలతో కొట్లాడుతున్నారు వారి జనాభా కేవలం కోటి లోపల మాత్రమే అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మనలో కూడా ఆ ఐక్యత రావాలని ఆశిస్తూ... రాజశేఖర్ నన్నపనేని. మెగామైండ్స్.