ఆపరేషన్ సింధూర్: భారత రాఫెల్ పై పాకిస్తాన్, చైనా చేసిన ఆరోపణ వెనక ఉన్న అసలైన కథ ఇదే!
పాకిస్తాన్ మరియు చైనా “ఆపరేషన్ సింధూర్” సమయంలో భారతదేశానికి చెందిన రాఫెల్ యుద్ధ విమానం కూలిపోయిందని ప్రచారం చేస్తున్నాయి. కానీ వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందు కొన్ని టెక్నికల్ అంశాలు తెలుసుకోవాలి.
డికాయ్ సిస్టమ్ అంటే ఏమిటి?
డికాయ్ సిస్టమ్ (Decoy System) అనేది శత్రువుని మభ్యపెట్టేందుకు ఉపయోగించే ఒక వ్యూహాత్మక వ్యవస్థ. ఇది కొత్తది కాదు – మొదటి ప్రపంచ యుద్ధం కాలం నుంచే ఈ టెక్నాలజీ వాడుతున్నారు. యుద్ధ ట్యాంకులు, నౌకలు, యుద్ధ విమానాలే కాకుండా, వాటికి బదులుగా వేరే మిషన్లను ఉంచి, శత్రువుని దారితప్పించి నిజమైన వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు.
ఫ్రాన్స్ కు డికాయ్ అభివృద్ధిలో 50 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇవి భూమి, గగనం, నీటి మీద వాడే విధంగా అభివృద్ధి చేయబడ్డాయి.
ఎక్స్-గార్డ్ డికాయ్ సిస్టమ్ – భారత్ ఉపయోగించిన అద్భుత టెక్నాలజీ
భారత్‌కు రాఫెల్ యుద్ధవిమానాలు అందించడంలో భాగంగా ఫ్రాన్స్ ఎక్స్ గార్డ్ డికాయ్ సిస్టమ్ (X-Guard Decoy System) కూడా ఇచ్చింది. ఈ వ్యవస్థను ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రాఫెల్ జెట్ పై అమర్చారు.
అక్కడ శత్రువులు ఈ డికాయ్ ను చూసి అసలు రాఫెల్ కూలిపోయిందని భావించారు. కానీ, ఇది ఒక ఎలక్ట్రానిక్ డికాయ్ మాత్రమే. అసలు రాఫెల్ సురక్షితంగా తిరిగి వచ్చింది.
ఎక్స్-గార్డ్ RT ఎలా పనిచేస్తుంది?
ఈ వ్యవస్థను ఒక యుద్ధవిమానంపై అమర్చిన తర్వాత, దాడి జరిగే సూచనలు లభించిన వెంటనే ఆటోమేటిగ్గా డికాయ్ ను విడుదల చేస్తుంది. పైలట్ చేతితోగానీ, ఎలక్ట్రానిక్ మానవీయ చర్యలు కానీ అవసరం లేదు.
ఈ డికాయ్ UAVలో పే లోడ్ (Bomb) కూడా అమర్చవచ్చు. శత్రువు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను జామ్ చేయగలదు.
ఇందులో వాడే టెక్నాలజీలు:
- AESA రాడార్ (Active Electronically Scanned Array)
- Digital Radio Frequency Memory (DRFM)
- High ERP Transmitter
వీటివల్ల 360° స్పేషియల్ కవరేజీ లభిస్తుంది. ఏ దిశ నుంచైనా దాడి జరిగినా వెంటనే స్పందన ఉంటుంది.
అంతర్జాతీయ మీడియా కథనాలపై స్పష్టత
కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు రాఫెల్ కూలిపోయిందని ప్రచురించాయి. కానీ ఇది నిజం కాదు. Dassault Aviation (రాఫెల్ తయారీ సంస్థ) సీఈఓ ఇచ్చిన ఇంటర్వ్యూలోని టెక్నికల్ గ్లిచ్ వేరే విషయం, ఆపరేషన్ సింధూర్ కు దాని సంబంధం లేదు అని వారు అధికారికంగా స్పష్టం చేశారు.
F35 వ్యవహారంలో అమెరికా డ్రామా?
ఇటీవల అమెరికా f-35 ఫైటర్ జెట్ తిరువనంతపురంలో జామ్ అయినట్టు వార్తలు వచ్చాయి. దీనికి కారణం భారత X-Guard Decoy System అయితే ఆశ్చర్యమే లేదు. ఇది అయిదవ తరం యుద్ధవిమానాలను జామ్ చేసే సామర్థ్యం ఉన్నటువంటి టెక్నాలజీ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు ఇవ్వబడిన చిత్రాలలో చూడవచ్చు
ప్రధాన అంశాలు:
- రాఫెల్ విమానం కూలిపోలేదు, డికాయ్ ద్వారా తప్పించుకుంది.
- X-Guard RT ఒక అత్యాధునిక డికాయ్ టెక్నాలజీ, ఇది విమానాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
- అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాల ప్రచారం వాస్తవానికి దూరం.
- Dassault సీఈఓ వ్యాఖ్యలకు భిన్నంగా అధికారిక ప్రకటనలో టెక్నికల్ గ్లిచ్ ను ఖండించారు.
- భారత్ టెక్నాలజీ వినియోగం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇది ఏకకాలంలో భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని, అలాగే ఇంటెలిజెంట్ వార్‌ఫేర్ స్ట్రాటెజీని చూపించింది. ఈ సంఘటన ప్రపంచానికి ఒక విషయం స్పష్టంగా చెప్తోంది – భారతదేశం మేధో ప్రబలతతో యుద్ధం చేయగల శక్తిగా ఎదిగింది. - పతంజలి వడ్లమూడి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Rafale Jet India, Operation Sindhoor Explained, X-Guard Decoy System, Indian Airforce Strategy, Pakistan China Rafale Fake News, India Electronic Warfare, Rafale did not crash, Dassault Rafale India, India Jammed F-35, AESA Radar DRFM, Indian Defence News 2025, Xguard Decoy in Action, Rafale vs F35, Electronic Countermeasures India