Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అసలైన చాణక్యుడు కళ్యాణ్ సింగ్ - The Real Chanakya of Ayodhya

అయోధ్య రామ మందిర విషయంలో చాణక్య నీతి ప్రదర్శించింది ఎవరు అనే విషయంలో మీకందరికీ ఒక స్పష్టమైన అవగాహన కల్పించడం కోసమే ఈ నా పూర్తి వ...


అయోధ్య రామ మందిర విషయంలో చాణక్య నీతి ప్రదర్శించింది ఎవరు అనే విషయంలో మీకందరికీ ఒక స్పష్టమైన అవగాహన కల్పించడం కోసమే ఈ నా పూర్తి వ్యాస సారాంశం... 

సహజంగా చాలా మంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పి.వి నరసింహారావు అయోధ్య రామ జన్మభూమి విషయంలో చాణక్య నీతి ప్రదర్శించాడు అనే ఒక గొప్ప ప్రచారం నడుస్తుంది, అది పచ్చి అబద్దం. ఈ విషయం నేను కూడా చెప్పకపోతే నమ్మిన సిద్ధాంతం కి ద్రోహం చేసినవాడిని అవుతాను. నిజంగా ఆరోజు అయోధ్య రామ జన్మభూమి కరసేవలో చాణక్య నీతి ప్రదర్శించింది ద గ్రేట్ లెజెండరీ లీడర్ అప్పటి ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్.

ఒక జాతీయ ఆదర్శాన్ని నిలబెట్టడం కోసం పదవిని గడ్డిపరకవలె త్యాగం చేయడం సామాన్య విషయం కాదు. అదీ, దేశ జనాభాలో ఆరవవంతు జనాభా (1992) కల్గిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టడం మాటలుకాదు. దేశంలో ప్రధానమంత్రి పదవి తర్వాత అత్యంత ప్రతిష్టాకరమైన పదవి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి. జాతీయ వీరులైన కరసేవకులపై కాల్పులు జరపరాదని, అత్యధిక సంఖ్యాకులైన ప్రజల మనోభావాలను గాయపరచరాదని జాతికి ఆదర్శమూర్తి రఘురాముని ఆలయం కట్టడం వల్ల జాతీయ అభిమానం పెంపొందించగలదనీ భావించినందుకే శ్రీ కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్నాడు. ఫిరాయింపు రాజకీయ ఫిరంగులను మోగించే కాంగ్రెస్ వారు ఈ త్యాగం చేయగలరా? మెడబట్టి గెంటినా, ప్రజలు ఛీకొట్టినా పదవిని వదలని కాంగ్రెస్ వారికి కళ్యాణ్ సింగ్ చేసిన త్యాగం విస్మయం కలిగించి ఉంటుంది. వారికి దిమ్మతిరిగి పోయింది.

1990 అక్టోబర్ లో అయోధ్య రామజన్మభూమి వద్ద రాముని గుడి కట్టడానికి సమావేశమైన కరసేవకులపై అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ యాదవ్ కాల్పులు జరిపించాడు. మృతదేహాలను సంచులలో కట్టి సరయూ నదిలో పడవేయించాడు. ఈ దేశంలో పుట్టిన రాముడి కంటే ఈ దేశాన్ని దోపిడీ చేసిన బాబరుకు ఎక్కువ గౌరవమిచ్చి జాతికి ద్రోహం చేశాడు. పదవిని అంటి పెట్టుకొని ఉండడం కోసం మూలాయం ఈ ఘాతుకం చేశాడు. చరిత్రను రక్తసిక్తంచేసి చివరికి చెత్త కుండీలో కలిపాడు.

కానీ బి.జె.పి.కి చెందిన కళ్యాణ్ సింగ్ అలా చేయలేదు. పదవిని పరిత్యజించి జాతీయ భావ జాగృతీ మందిరం నిర్మించాడు. కళ్యాణ్ సింగ్ ను విమర్శించిన కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు మూలాయంసింగ్ జరపిన హత్యలను మాత్రం హర్షించారు. శ్రీ కళ్యాణ్ సింగ్ (1992) ప్రభుత్వానికి రెండే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కరసేవకై కరసేవకులు లక్షలాది మంది కదలివచ్చారు. అయోధ్యకు చేరిన వారి సంఖ్య రెండు లక్షల పదిహేనువేలు. ఉత్తరప్రదేశ్ కు చేరిన వారి సంఖ్య ఏడు లక్షల అరవైవేల మంది.

ఐదువందల ఏళ్లుగా జాతిగుండెలో ఇనుపముక్కగా ఉన్న అవమానాన్ని తొలగించడానికి కరసేవకులు కదిలారు. వారి మార్గానికి అడ్డురాకపోవడం మొదటి పద్ధతి అందువల్ల అధికారం పోతుంది, పదవులు పోతాయి. కరసేవను అడ్డుకొని కాల్పులు జరపడం రెండవ పద్ధతి. అందువల్ల వందలాది దేశభక్తుల నిండు ప్రాణాలు పోతాయి. శ్రీ కళ్యాణం సింగ్ మొదటి పద్ధతినే ఎంచుకున్నారు. ములాయం సింగ్ గతంలో రెండవపద్ధతిని ఎంచుకున్నారు.

రామజన్మభూమి వద్ద కరసేవ జరిపించే విషయంలో లేదా ఆపించే విషయంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వందే బాధ్యత అనీ తమకు ఎలాంటి బాధ్యత లేదని పి.వి. నరసింహారావు ప్రభుత్వం వారు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఇలా తప్పించుకునే ధోరణిలో ప్రవర్తించిన కేంద్ర ప్రభుత్వం మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే అయోధ్యకు కేంద్ర దళాలను తరలించిన పి.వి ఎలా చాణక్యుడు అవుతాడో మేదావులు చెప్పాలి. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాద స్థలంలో గత 1992 జూలైలో కర సేవకులు నిర్మించిన అరుగులు శాశ్వత కట్టడాలో, తాత్కాలిక కట్టడాలో తేల్చి చెప్పలేక పోయారు సుప్రీంకోర్టు బృందం వారు. డిసెంబరు 6వ తేదీ కంటే ముందు వివాదస్థలం పై తీర్పు చెప్పలేక పోయారు అలహాబాదు హైకోర్టువారు. ఐదువందల ఏళ్లక్రితం ఈ దేశాన్ని కొల్లగొట్టిన విదేశీయ దోపిడీ దారుడు బాబరు పేరు మీద కొందరు చెలామణి చేసిన పాత కట్టడం మసీదు ఎలా అవుతుందో చెప్పలేకపోయారు. కుహనా లౌకికవాదులు ఏనాడు నమాజ్ జరగని ఆ శిథిల గృహం మసీదుగా ముస్లింలు ఎలా భావిస్తారన్న ప్రశ్నకు సమాధానంచెప్ప కుండా తప్పించుకున్నారు మతోన్మాదులు. “కనీసం ప్రశాంతంగా కరసేవ చేయనివ్వండి కోర్టుల తీర్పులు వచ్చే వరకూ” అన్న వారి మాటలను, విశ్వహిందూ పరిషత్ అభ్యర్థనలను, ధర్మచార్యుల వాక్కులను పట్టించుకున్న వారెవరు? కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు, జనతాదళ్ ముఠాల వారు కట్టకట్టుకొని రామాలయ కరసేవను వ్యతిరేకించారు. దాంతో కరసేవకుల కోపం కట్టలు తెంచుకొంది. బాబరీ కట్టడం కొట్టుకుపోయింది. జాతి పరాజయ ప్రతిరూపం ఆనవాలు లేకుండా పోయింది. ఎనభై కోట్ల మంది (1992) ప్రజల ప్రతినిధులుగా వెళ్లిన కరసేవకులను ఎవ్వరు ఆపగలరు? కరసేవ జరిగి కట్టడం కూలిన రోజు కార్యక్షేత్రంలో ఉన్న మహోన్నత వ్యక్తి కళ్యాణ్ సింగ్.

బాబర్ విదేశీయ దుండగుడు. ఈ దేశ పౌరులైన ముస్లింలకు అతని నుండి లభించే స్ఫూర్తి ఏమీలేదు. రాముడు ఈ జాతికి చెందిన వాడు అన్ని మతాలకూ ఆరాధ్యుడు. 'కట్టడం' కదలిపోవడం సాకుగా పెట్టుకొని జాతీయ వాదాన్ని అణగదొక్కాలని ప్రయత్నాలు ఆరంభించింది. పి.వి. నరసింహారావు ప్రభుత్వం. జాతీయ వాదాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టుల చేతిలో ఈ ప్రభుత్వం కీలుబొమ్మగా మారింది. నైతిక విలువలు పాటించే బి.జె.పి అన్నా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘమన్నా ఈ దుర్మార్గులకు హడల్. అందుకే 'కట్టడం' కూలిందన్న సాకుతో ఆర్. యస్.యస్.నూ ఇతర జాతీయ వాద సంస్థలనూ నిషేధించారు. ఏకారణం లేకుండానే మరోమూడు రాష్ట్రాల బి.జె.పి. ప్రభుత్వాలను రద్దుచేశారు.

జాతీయ భావ వర్షం కురిసినంతవరకూ కమ్యూనిస్టు విషాగ్నులు తల ఎత్తలేవు. అందువల్ల వివిధ దేశాలలో జాతీయ వాదాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని జాతీయ సంస్కృతిని సైతం ఇక్కడి కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు. అందువల్లనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని వారు ద్వేషిస్తారు. బి.జె.పి. ప్రబలి పోవడంతో వారి కడుపులు రగిలిపోతున్నాయి. అందువల్ల కట్టడం కూలడం సాకుగా బి.జె.పి. ప్రభుత్వాలను రద్దుచేయించారు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేయించారు.

కళ్యాణ్ సింగ్ పి.వి పై గర్జించారు. మహారాష్ట్ర, గుజరాత్లలో మరీ భయంకరంగా కల్లోలాలు జరిగాయి. మరి ఆ రాష్ట్రాల్లో శాంతి భద్రతలను కాపాడారా? భద్రత కల్పించారా ఆ ప్రభుత్వాల వారు. వాటిని కూడా రద్దుచేయమని ఈదేశ ప్రజలు అడుగుతున్నారు. కాంగ్రెస్ ముఠాల వారే అనేక రాష్ట్రాల్లో కల్లోలాలు సృష్టించారు. మరి కాంగ్రెస్ గుర్తింపును రద్దుచేయండి పి.వి. నరసింహారావు గారూ!! మీరు చేసినా చేయకపోయినా వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ను రద్దు చేయనున్నారు. అంటూ కళ్యాణ్ సింగ్ ఇరుచుకుపడ్డాడు.

బాబ్రీ కట్టడం కూల్చినచోట మళ్లీ 'మసీదు' పేరుతో 'కట్టడం' నిర్మిస్తామని పి.వి వాగ్దానం చేశారు. కమ్యూనిస్టులు జనతాదళ్ వారూ చేయించారు. కట్టడం కూలిన తర్వాత మతోన్మాదులు దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాలు కూల్చారు. మరివాటిని మళ్లీ నిర్మించి ఇస్తామని వాగ్దానాలు రాలేదు.  ఒక విదేశీ తన దురాక్రమణదారుడు తన దురాక్రమణ చిహ్నంగా దేవాలయాన్ని కూల్చి ఓ కట్టడం ఏర్పాటు చేస్తే దాన్ని మసీదు అనడం సిగ్గుచేటైన విషయం. ముస్లింలు ప్రార్థన చేసే మసీదులను ఆ పాపపు కట్టడంతో పోల్చడం ముస్లింలకే అవమానం. హిందూ జాతికి కళంకం. ఆ కళంకాన్ని పునరుద్ధరించడానికి ఆ జాతి ప్రజలు ఒప్పుకోకోలేదు. రాష్ట్రపతి పాలన కాలం తరువాత 1993 నవంబరులో మళ్లీ రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. కళ్యాణ్ సింగ్ అత్రౌలి, కాస్ గంజ్ అనే రెండు నియోజకవర్గాల నుండి ఎన్నికలలో పోటీ చేసి రెండింటినీ గెలుచుకున్నాడు. బిజెపి ఓటు వాటా గత ఎన్నికలలో మాదిరిగానే ఉంది, కానీ గెలిచిన అసెంబ్లీ సీట్ల సంఖ్య 221 నుండి 177 కు తగ్గింది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది, ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. బిఎస్ పి నాయకుడు యాదవ్, మాయావతి మధ్య పొత్తు 1995 లో విచ్ఛిన్నమైంది, మాయావతి బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య  తదనంతరం కళ్యాణ్ సింగ్ 1997 సెప్టెంబరులో రెండవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కానీ వారు ఎన్నో ఒత్తిడిలకు తలొగ్గాల్సి వచ్చింది. 

కళ్యాణ్ సింగ్ మచ్చలేని నాయకుడు, నిజాయితీపరుడు. బాబ్రి కట్టడం కూల్చివేతలో ఏ ఒక్క ప్రభుత్వ అధికారికి సంబంధం లేదని‌ మొత్తం బాధ్యత తనదేనని ఒప్పుకున్న మహానేత. నేను కళ్యాణ్ సింగ్ ని చాణక్యుడు అని ఎందుకన్నానో మీకర్దమయి ఉంటుంది కానీ మరొక్కసారి గుర్తుచేస్తాను. పి.వి. నరసింహారావు సుప్రింకోర్ట్ లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించదని తేల్చి చెబితే కళ్యాణ్ సింగ్ ఆరోజు మా ప్రభుత్వానిది పూచి అని సుప్రింకోర్ట్ కి చెప్పి మరీ గీత దాటి కరసేవకు అనుమతిచ్చి బాబర్ కట్టడాన్ని దగ్గరుండి కూల్చాడు ఇప్పుడు చెప్పండి కళ్యాణ్ సింగ్ చాణక్యుడా కాదా? నిజం చెప్పాలంటే దేశం లో స్వామీజీలందరిని నిట్టనిలువుగా చీల్చే ప్రయత్నం చేశాడు పి.వి. నరసింహారావు.

మరొక విషయం చెప్పి ముగిస్తాను, కళ్యాణ్ సింగ్ ఒక బి.సి కులస్తుడు. ఏదో కార్యక్షేతంలో పనిచేయకుండా పదవిని అలంకరించిన నాయకుడు కాదు. ఉత్తరప్రదేశ్ అంటేనే యాదవ్ డామినేషన్ ఉన్న పరిస్తితులలో మొత్తం బి.సి. కులాలనన్నిటిని ఒక్కత్రాటి పైకి తెచ్చి యాదవ్ వ్యతిరేఖ బి.సి. లందరిని బి.జె.పి వైపు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి. ములాయం మాయ ల నుండి పేద ప్రజలను బి.జె.పి పార్టీ వైపు మొగ్గుచూపేలా చేసిన అపర చాణక్య కళ్యాణ్ సింగ్. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం లో ఎన్నో సంస్కరణలు తెచ్చి ఉత్తరప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేసిన దిశాలి.

అలా ప్రజా నిరసన ప్రవాహంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొట్టుకొని పోయాయి. ఈ నిషేదాలు, రద్దులు వంటివి కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఆక్రమ 'దోస్తి' ని ప్రజలకు అవగతం చేశాయి. ప్రజలు ఒక సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మహోన్నత నేత మన కళ్యాణ్ సింగ్ ని మరో బి.సి. ప్రధాని రాజస్తాన్ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించారు.  ప్రస్తుతం ఆ అడ్డంకులన్నీ తొలగి భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగింది. అయోధ్య రామాలయంలో మనందరి రాముడు జనవరి 22 న కొలువుదీరనున్నాడు. మార్చి/ఏప్రిల్ నెలాఖరుకల్లా రామా భక్తులందరికీ దర్శనం లభిస్తుంది. శభాష్ కళ్యాణ్. జై శ్రీ రామ్. -రాజశేఖర్ నన్నపనేని.

2 comments