Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బహుదేవతారాధన తప్పా?

"బహు దేవతారాధన" తప్పు విషయమా.?  ఎలా అర్థం చేసుకోవాలి..?:  బహుదేవతారాధన అంటే అనేకమంది దేవతలను ఆరాధించడం పూజించడం అని అర...

"బహు దేవతారాధన" తప్పు విషయమా.?
 ఎలా అర్థం చేసుకోవాలి..?: బహుదేవతారాధన అంటే అనేకమంది దేవతలను ఆరాధించడం పూజించడం అని అర్థం, హిందువులు అనేక మంది దేవతలను పూజించి ఆరాధిస్తారు ఇది తప్పు ఒకే దేవతను మాత్రమే ఆరాధించాలి అంటూ పొసగని ప్రచారం జరుగుతోంది.
    ఈ అంశాన్ని ముఖ్యంగా ఎడారి మతాలైన ఇస్లాం, క్రైస్తవ మతానికి చెందిన వారే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.

   అసలు దేవతారాధన అంటే ఏమిటంటే తాము,తమ కుటుంబం ఒక జీవనవిధానాన్ని అనుసరించడం అన్నమాట..., అంటే ఒక మార్గదర్శిని ఎన్నుకోవడం అన్నమాట,  ఒక ఆచార్యుని యొక్క నేతృత్వంలో ఒక అధిష్టానాన్ని అనుష్టించడం అన్నమాట  దీనితో ఆహారపు అలవాట్ల నుండి ప్రారంభించి ఉదయం లేచి పడుకునే వరకు మన జీవితంలోని అనేక అంశాల పైన ఆ ప్రభావం ఉంటుంది. 

   దేవతారాధన అంటే ఉదాహరణకు విద్యనభ్యసించే వారు సరస్వతీదేవిని, వైద్య వ్రృత్తిలో ఉన్నవారు ధన్వంతరి నీ, నాట్యము నేర్చుకునే వారు నటరాజ స్వామిని, ధనం సంపాదించాలనుకనే వారు లక్ష్మీదేవిని, వ్యాయామము చేసేవారు ఎవరిని ఆరాధిస్తారో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది.... హనుమన్ననే కదా. ఇలా ఏ ఆలోచనతో దేనిని సాధించాలని కోరుకుంటున్నారో ఆ అంశానికి అధిష్ఠాన దేవతను పూజిస్తారు. ఒకే సమయంలో అనేక అంశాలను సాధించాలని కోరుకునేవారు అనేక మంది దేవతలను ఆరాధిస్తారు. ఇందులో ఏం తప్పు కనిపిస్తున్నది..??

    మనం చిన్నప్పుడు హైస్కూలు చదువులు చదివుతున్న రోజుల్లో... ప్రతి తరగతికి  క్లాస్ టీచర్ ఉండేవారు  అలాగే మొత్తం పాఠశాలకు ఒకే హెడ్మాస్టర్ గారు ఉండేవారు. కదా అంటే ఆమాత్రం తెలియదా మాకు అంటారు.... అదే విధంగా ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ కి వెళ్తే అక్కడ తరగతులన్నింటికీ ఒకే హెడ్ కాకుండా ప్రతివిషయానికి ఒక హెడ్ ఉంటారు కదా.!

   హిందువులను తమ మతంలోకి మార్చాకోలని అనుకుంటున్నవారి సంప్రదాయానికి, వారి మతానికి ఉండేది ఒకే పుస్తకము ఒకే హెడ్ లేదా  ఆచార్యుడు.  మరి ఇక్కడేమో హిందువులకు అనేక అంశాలు ప్రతి సబ్జెక్టుకు ఒక హెడ్ లేదా ఆచార్యుడు ఇలా అనేక అంశాలను అధ్యయనం చేస్తున్న హిందువులకు అనేకమంది ఆచార్యులు ఉండడం సహజమే కదా మరి ఇలాంటి హిందువుల  గొప్పదైన 'బహుదేవతారాధన' గురించి గొప్పగా చెప్పకుండా దానిని తక్కువ చేసి ప్రచారం చేయడం వెనుక వారియొక్క "లేమితనం" మరియు సత్యాన్ని వక్రీకరించడం, తద్వారా హిందువులను వారి మతంలోకి మార్చేందుకు చేసే ప్రయత్నమని,  వారి అధ్యయన స్థాయి ప్రాథమిక విద్యార్థి దశలో ఉన్న ఒకే ఆచార్యుడు, ఒకే పుస్తకము , ఒకే హెడ్మాస్టర్, ఒకే దేవుడు... అని అర్థం చేసుకొని తగిన విధంగా స్పందించాలి. ~ ఆకారపు కేశవరాజు. 29/12/2023.

No comments