Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మణిపూర్ సమగ్ర చరిత్ర

మణిపూర్ గొప్ప చరిత్రను కలిగివుంది . అర్జునుడి భార్యల్లో ఒకరైన చిత్రాంగద పుట్టింది మణిపూర్ లోనే. వారి కొడుకైన బబృవాహనుడు, మణిపూర్ ను చాలా కాల...

Manipur history in Telugu


మణిపూర్ గొప్ప చరిత్రను కలిగివుంది. అర్జునుడి భార్యల్లో ఒకరైన చిత్రాంగద పుట్టింది మణిపూర్ లోనే. వారి కొడుకైన బబృవాహనుడు, మణిపూర్ ను చాలా కాలం పరిపాలన చేశాడు. చరిత్రలో మణిపూర్ రాజులు ముఖ్యమైన పాత్ర పోషించారు. మణిపూర్ రాజ్యం మొత్తం 109 మంది పాలకుల పాలనలో టిల్లి-కోక్‌టాంగ్, సన్నా-లీపాక్, పోయిరే-లామ్, మిటే-లీపాక్, మీత్రాబాక్ మరియు ప్రస్తుత మణిపూర్ వంటి వివిధ పేర్లతో పిలువబడింది. క్రి.శ 0033 నాటి నుండి లార్డ్ పఖంగ్బా రాజవంశం నేరుగా కాలక్రమానుసారంగా రాజ్యాన్ని పాలించడం 1949 వరకు కొనసాగింది

మణిపూర్ మొదటి ప్రసిద్ధ రాజు మహారాజా పఖంగ్బా క్రి.శ 0033 లో పాలించాడు. ప్రసిద్ధ మణిపురి రాజులు 16వ శతాబ్దంలో ఖగెంబా (సనా హిహోన్హాన్) మరియు 17వ శతాబ్దంలో పామ్‌హీబా (గరీబ్ నివాజ్) పొరుగు రాజ్యమైన బర్మాలోకి ప్రవేశించడం ద్వారా మణిపూర్ రాజ్యాన్ని మరింత విస్తరించారు. మహారాజా భాగ్యచంద్ర 18వ శతాబ్దంలో పరిపాలించాడు. మహారాజా భాగ్యచంద్ర (1762 - 1798 ) ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. ప్రసిద్ధ నృత్య రూపమైన రాస్ లీలా, మహారాజా భాగ్యచంద్రచే రూపొందించబడింది. మహారాజు మణిపూర్‌లో వైష్ణవాన్ని పెద్ద ఎత్తున వ్యాప్తి చేశారు.  పరాక్రమం కలిగినరాజు తన భూమిని రక్షించుకోవడానికి బర్మీస్‌తో పోరాడాడు బర్మా దండయాత్రల నుండి మణిపూర్‌ను పదే పదే పోరాడి, రక్షించిన ఘనత కూడా మహారాజుకే చెందుతుంది.

ఖోంగ్‌జోమ్‌లో జరిగిన ఆంగ్లో-మణిపురి యుద్ధంలో బ్రిటిష్ వారు మణిపూర్‌ను ఓడించిన తర్వాత 1891 లో మణిపూర్ రాజ్యం తన సార్వభౌమత్వాన్ని కోల్పోయింది. 1891లో బర్మీయులను ఓడించడంతో మణిపూర్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. మణిపూర్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. ఇంఫాల్ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశంపై దాడి చేయడానికి జపాన్ చేసిన విఫల ప్రయత్నం. భీకర యుద్ధం మార్చి 6, 1944 నుండి కొనసాగింది మరియు జూన్ 22, 1944 వరకు కొనసాగింది. ప్రపంచ చరిత్రలో జపాన్ యొక్క గొప్ప వైఫల్యాలలో ఇది , సుమారు 110,000 మంది సైనికులతో కూడిన భారీ జపాన్ సైన్యం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుండి బ్రిటిష్ మరియు భారతీయ దళాలను తొలగించి భారతదేశంపై దాడి చేయడానికి ప్రయత్నించింది. తీవ్రమైన యుద్ధం జరిగింది మరియు జపాన్ సైన్యం వారిపై భారీ నష్టాలను చవిచూసింది. ఇంఫాల్ యుద్ధంలో వైమానిక మరియు ఫిరంగిదళాలలో బ్రిటిష్ మరియు భారతీయ సంయుక్త దళాల ఆధిపత్యం మరియు కమాండ్ మణిపూర్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది.

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య సంగ్రామం కోణం నుండి ఇంఫాల్ యుద్ధం ముఖ్యమైనది. ఈ యుద్ధంలో వాస్తవానికి జపాన్ వైపు సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంది. ఎందుకంటే వారు భారతదేశం నుండి బ్రిటీషర్లను తరిమికొట్టాలని తద్వారా స్వాతంత్ర్యం పొందాలని అనుకున్నారు కానీ ప్రణాళిక విఫలమైంది.

దట్టమైన అడవి, వ్యాధి, రుతుపవన వర్షాలు, అలసట, కష్టమైన భూభాగం, ఆకలి మరియు సరఫరా సమస్యలతో కప్పబడిన మణిపూర్ కొండలు జపాన్ సైన్యానికి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. సైన్యం ఆకలితో అలమటించింది. బ్రిటీషర్లు నిటారుగా ఉన్న భూభాగంలో ట్యాంకులను ఉపయోగించలేరని భావించినందున జపనీయులు కూడా అపోహలో ఉన్నారు. తెలియని మార్గాలు, అననుకూల వాతావరణ పరిస్థితులు జపనీస్ సైన్యంపై పెద్దగా కనిపించాయి. చివరికి వారి పతనానికి దారితీశాయి.

ఇంఫాల్ యుద్ధం ముగిసే సమయానికి, సైన్యం నుండి భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ మరియు బ్రిటీష్ దళాలకు 30,000 మరియు జపాన్ దళాలకు 80,000 అని లెక్కించారు. బ్రిటీషర్లు 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చే వరకు మణిపూర్‌ను పాలించారు. భారతదేశంతో మణిపూర్ విలీనం 21 సెప్టెంబర్ 1949న అప్పటి భారత గవర్నర్ జనరల్ మరియు మణిపూర్ మహారాజా బోధచంద్ర సింగ్‌ మధ్య జరిగింది. ఒప్పందం ప్రకారం తన జీవితకాలం మణిపూర్‌పై తన అధికారాన్ని కొనసాగించాడు. 1972 లో ఈ రోజు మనకు తెలిసిన మణిపూర్ రాష్ట్రంగా మారింది.

క్రైస్తవ మతమార్పిడీలు: కానీ 19 వ శతాబ్దం లో ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు అక్కడ ప్రవేశించారో అప్పటినుండి అక్కడ అవాంఛనీయ మైన మార్పులు రావడం మొదలయ్యింది. 1894 లో ఇంగ్లాండు కు చెందిన విలియం పెట్టిగ్రు అనే ఒక క్రైస్తవ మిషనరీ మణిపూర్ వచ్చాడు. ఆయన అర్థింగ్టన్ అబారిజీన్స్ మిషనరీ గ్రూప్ కు చెందినవాడు. అంతవరకూ అక్కడ అమెరికన్ బ్యాప్తిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ మతమార్పిడులు చేస్తుండేది. అపుడు ఈ పెట్టిగ్రు బ్యాప్టిస్ట్ గా మారి మతమార్పిడి పనులను వేగవంతం చేశాడు.

మణిపూర్ ప్రధానంగా రెండు ప్రాంతాలు. లోయ ప్రాంతం, కొండప్రాంతం. లోయ ప్రాంతంలో మైతేయిలు వుంటారు. కొండ ప్రాంతంలో కుకీలు, నాగాలు వుంటారు. వీళ్ళలో కుకీలు ముఖ్యమైన వారు. ఈ రెండు ప్రాంతాల్లో ని వాళ్లకు గొడవలు లేవు. సామరస్యంగా ఉండేవారు. ఇద్దరి మధ్య పెళ్లిళ్లు కూడా జరిగాయి. పెట్టిగ్రు మొదట లోయలోని మైతేయిలు దగ్గర మతమార్పిడి ప్రయత్నం చేశాడు. మైతేయిలు అతని ఆటలు సాగనివ్వలేదు. దాంతో అతను కొండ ప్రాంతమైన యూకృల్ వెళ్ళాడు. అక్కడ ఒక బడిని, ఆసుపత్రిని ప్రారంభించాడు. పెట్టిగ్రు బైబిల్ ను స్థానిక మాండలికం అయిన తంగకుల్ లోకి అనువాదం చేశాడు. సేవ, విద్య పేరుతో కుకీలు ఆకట్టుకొన్నాడు. కుకీలు ఆయనను పూర్తిగా నమ్మారు. తరువాతి రోజుల్లో అక్కడికి వాటికిన్ రాబర్ట్, యు.ఎం.ఫాక్స్, డా.జి.జి. క్రోజియర్ అనే క్రైస్తవ మత ప్రచారకులు వచ్చారు. 

వాళ్ళ ఎజెండా లో భాగంగా కుకీల జీవన విధానం, ఆరాధన పద్దతులు, బట్టలు కట్టుకునే పద్దతులు అన్నీ అనాగరికమైనవని, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు, హిందూ మతంలో అంతమంది దేవుళ్ళు ఎలా ఉంటారని , కుకీల మనసుల్లో అనుమానాలు, అపోహలు నాటారు. దానితోపాటు అంత వరకూ కలిసిఉంటున్న కుకీలు ఒకరి పై ఒకరు దాడులు చేసుకొనేలాగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టారు.

అంత చేసినా మతం మారిన కుకీల సంఖ్య వందలకే పరిమితం అయ్యింది. 1911 సంవత్సరానికి మతం మారిన కుకీల అతికొద్ది గానే ఉన్నా, ప్రతి గ్రామంలోనూ చర్చిలు మాత్రం పుట్టుకొచ్చాయి. "మేము ఇపుడు విత్తనాలు నాటాము. దీని ఫలాలు మీరు భవిష్యత్తు లో చూస్తారు" అనేవాడట పెట్టిగ్రు. 

1914 లో మొదలయిన మొదటి ప్రపంచ యుద్ధం ఈ మొత్తం పరిస్థితి ని మార్చేసింది. ఇంగ్లాండ్ తరపున యుద్ధం చేయడానికి మణిపూర్ లోని కుకీలను ఇక్కడి బ్రిటిష్ ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కుకీలు తిరగబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం పై కుకీలు గెరిల్లా పోరాటం చేశారు. కుకీల పోరాటం చూసి ఆంగ్లేయులు బిత్తరపొయారు. రెండు సంవత్సరాలు కుకీలు భీకరంగా పోరాడి చివరకు ఓడిపోయారు. అక్కడి నుండి ఈశాన్య ప్రాంతంలో బ్రిటిష్ ప్రాబల్యం పెరిగింది. బెదిరించి మరీ మతాన్ని మార్చారు. 1944 కి బ్రిటీష్ ప్రభుత్వంతో కలిసి జపాన్ సైన్యంతో ఇంపాల్ లో యుద్ధం చేశారని మనం పైన చదువుకున్నాం. 1951 కి మణిపూర్ లో 12 శాతం  క్రైస్తవులు గా మారారు. 

నెహ్రు-ఇర్విన్ పాలసీ మణిపూర్ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. కుకీలను ప్రధాన స్రవంతి లోకి తీసుకురావడం, వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయడం అనే అందమైన మాటలు చెప్పి క్రైస్తవ మిషనరీలను ఆ ప్రాంతంలోకి అనుమతించి, హిందువులను మాత్రం దూరంగా ఉంచారు. ఫలితంగా మిగిలిన దేశంలో అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుంటే, ఈశాన్యం మాత్రం చర్చిలు, బైబిళ్ళతో నిండిపోయింది.

ఇది ఎక్కడికి దారి తీసిందంటే 1951 లో 12 శాతం ఉన్న క్రైస్తవులు 1961 కి 20 శాతానికి పెరిగారు. బర్మా లో ఉన్న కుకీలు మణిపూర్ లో చొరబడ్డారు. ఫలితంగా మతం మారిన కుకీలు, ఇదే విధంగా కొంతమంది మైతేయిలను కూడా మతం మార్చాక 41 శాతానికి పెరిగింది. ప్రస్తుతం, మణిపూర్‌లో 1,000 చర్చిల కింద దాదాపు 15,000 మంది మైతీ క్రైస్తవులు ఉన్నారు. ప్రస్తుతం మణిపూర్ లో ఉన్న ముఖ్యమైన గిరిజన తెగలు మూడు. మెయితీలు 53 శాతం నాగాలు 24 శాతం, కుకీ/జో (చిన్‌ ‌కుకీ మిజో)లు 16 శాతం ఉన్నారు. కేవలం కుకీలు మాత్రమే క్రైస్తవులు కాదు ఇక్కడ ఉన్న అన్ని గిరిజన తెగల్లోనూ క్రైస్తవులు, హిందువులు ఉన్నారు.

మన యుట్యుబ్ చానల్ ని కూడా సబ్ స్క్రైబ్ చేసుకోగలరు...

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments