Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఎవరేమన్నా ఎదురేమున్నా ఆర్త జనుల సేవనే స్వయంసేవక్ ల పథం - మణిపూర్ లో సేవా భారతి

గత మూడు నెలల నుంచి మణిపూర్ లో హింస కొనసాగుతున్నది. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే భారతీయుల మధ్య విద్వేషం ప్రజ్వరిల్లడం దురదృష...

గత మూడు నెలల నుంచి మణిపూర్ లో హింస కొనసాగుతున్నది. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే భారతీయుల మధ్య విద్వేషం ప్రజ్వరిల్లడం దురదృష్టకర పరిణామం. అక్కడ ఉన్న తెగల మధ్య నెలకొన్న కొద్దిపాటి వైషమ్యాలను అక్కడ తిష్ట వేసుకున్న కొన్ని వి‘దేశీ' శక్తులు హింస ప్రజ్వలించే విధంగా ఒక ప్రణాళికాబద్దంగా వ్యవహరించాయి. వారు దానిలో సఫలీకృతం అయ్యారని చెప్పుకోవచ్చు. పనిలో పనిగా అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, నిరంతరం దేశం కోసం పని చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్​ను విమర్శించడం ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ ఒక దేశభక్తి సంస్థ, ఆర్​ఎస్ఎస్​ శాఖలో పాడే పాటల్లో ఈ దేశంలోఉన్న అందరం అన్నదమ్ములం ఒకే తల్లి సంతానం అని పాటలు పాడుతూ దేశ ప్రజల్లో ఒక ఐక్యతను నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తుంటుంది.
 
విదేశీ సంస్థల దుష్ప్రచారం: విదేశీ భావజాలం ఉన్న కొన్ని రాజకీయ సంస్థలు, వ్యవస్థలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. భారతీయ సమాజంలో ఆర్ఎస్ఎస్​కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని వాళ ఆర్ఎస్ఎస్​ను బద్నాం చేయడం కోసం అక్కడ జరుగుతున్న ఘర్షణలకు పూర్తి కారణం ఆర్ఎస్ఎస్ అని, అక్కడి మహిళలపై జరిగిన అమానవీయ ఘటనలకు బాధ్యులు ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలు అని పోటీ పడి దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసేవారిపై కేసులు పెట్టేసరికి ‘క్షమించండి’ అంటూ కాళ్ల బేరానికి వస్తున్నారు. ఈ గొడవలకు ఆర్ఎస్ఎస్​కు సంబంధం లేదని, ఇది తమ రెండు తెగల మధ్య గొడవ అని, దీనికి ఆర్ఎస్ఎస్​తో ఎలాంటి సంబంధం లేదని అటు కుకీలు, ఇటు మైతీయులు చెబుతున్నారు. అక్కడి రెండు వర్గాల వారిలో ఎవరూ ఆర్ఎస్ఎస్ పేరును ప్రస్తావించడం లేదు. పైగా ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల కుకీలతో పాటు మైతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి అక్కడి కార్యకర్తలతో మాట్లాడినప్పుడు ఇప్పటివరకు జరుగుతున్న అనేక కార్యక్రమాల గురించి సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎప్పుడైతే మణిపూర్​లో హింస చెలరేగిందో వెంటనే ఆర్ఎస్ఎస్ ​తన కార్యకర్తలను ప్రభావిత ప్రాంతాలకు పంపించింది. అక్కడికి చేరుకున్న కార్యకర్తలు అక్కడి వాళ్లకు అవసరమైన సహాయ చర్యల కోసం యోజన చేయడం ప్రారంభించారు. ఆర్‌‌ఎస్‌‌ఎస్ మణిపూర్ ప్రాంత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లైష్‌‌రామ్ జాత్రా సింగ్ నేతృత్వంలోని బృందం ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అంచనా వేసింది. బిష్ణుపూర్ జిల్లా పరిధిలోని ఖోయిజుమాన్ తాబి, కుంబి ప్రాంతాల స్థానిక పెద్దలతో సంభాషించింది.

నిర్వాసితులకు ఉపాధి, నైపుణ్యాలు: అక్కడ నిర్వహిస్తున్న సహాయ శిబిరంలో ఉన్న నిర్వాసితులకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వాళ్ళు స్వస్థలాలకు వెళ్లిన తరువాత స్వయం ఉపాధి పొందేవిధంగా ఉపయోగపడుతుంది. ఆర్ఎస్ఎస్ సేవా విభాగం అయిన సేవాభారతితో కలిసి ప్రస్తుతం రాజర్షి భాగ్యచంద్ర స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్, హరోరూలో లైటాన్‌‌పోక్పి, ఇకౌ, సాదులంపాక్, ఇంఫాల్ ఈస్ట్​లోని సాదు యెంగ్‌‌ ఖుమాన్‌‌లోని బాధిత ప్రజల కోసం ఒక మోడల్ రిలీఫ్ సెంటర్‌‌ను కూడా నడుపుతోంది. కుకీ లు, మైతీలు అందరూ కలిసి ఈ రిలీఫ్ క్యాంప్‌‌లో ఉంటూ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. హింసానంతరం వారి జీవనోపాధికి తోడ్పడాలనే లక్ష్యంతో ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బయోరిసోర్సెస్ సస్టెయినబుల్ డెవలప్‌‌మెంట్, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, ఇంఫాల్‌‌లోని మోడల్ రిలీఫ్ సెంటర్‌‌లో వివిధ ఉద్యోగ నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
 
ప్రతి నిమిషం ప్రజల కోసం: కుహనా లౌకిక మేధావులు దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు శవ రాజకీయాలు చెయ్యకుండా ఉన్నతంగా దేశం హితంకోరే విధంగా ఆలోచించాలి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవాలు, ప్రమాదాలు సంభవించినా అక్కడ అవసరమైన సేవ చెయ్యడం కోసం ముందుకు వచ్చే సంస్థ. ఆర్ఎస్ఎస్ శాఖలో స్వయంసేవకులు నిత్యం చేయి చేయి కలుపుదాం, సేవ చేయ కదులుదాం, ప్రజల కోసమే సంఘంగా ప్రతి నిమిషం బతుకుదాం అనే పాటను నిత్యం పాడుతుంటారు. సేవ అనేది ఆర్ఎస్ఎస్​లో ఉన్న సహజ స్వభావం. ఆర్ఎస్ఎస్ ను విమర్శించే ముందు సంస్థలో ఉన్న స్వయం సేవకులు ఈ దేశం కోసం చేసిన త్యాగాల గురించి తెలుసుకోండి. వారిలో ఉన్న సేవా భావం గురించి తెలుసుకోండి. సేవ చెయ్యడంలో స్వయంసేవకులతో కలిసి రండి. లేదంటే సేవలో పోటీ పడండి.

విద్యాభారతి, వనవాసీ కల్యాణ ఆశ్రమాల సేవలు అద్వితీయం: ఈశాన్య రాష్ట్రాల్లో విద్యా భారతి ఆధ్వర్యంలో 671పాఠశాలలు, 540 ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో 1,82,702 విద్యార్థులు చదువుతున్నారు. 32 హాస్టల్స్​ నడుస్తున్నాయి. వనవాసీ కల్యాణాశ్రమం ఆధ్వర్యంలో 505 పాఠశాలలు, 500 ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. వాటన్నిటిలో కలిపి1,13,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే ఈశాన్యం భారతంలో 200 మంది గ్రామ ఆరోగ్య రక్షా కార్యకర్తలు పనిచేస్తున్నారు. అలాగే, 50,000 మంది కోసం ఆరోగ్య శిబిరాలు నడుస్తున్నాయి. స్వయం ఉపాధి కోసం 10 మహిళా కుట్టు మిషన్ల కేంద్రాలను నడుపుతున్నారు. ఈశాన్య భారతంలో ఇలా విద్యాభారతి, వనవాసీ కల్యాణాశ్రమాలు అక్కడి ప్రజల సేవలో నిరంతరం పనిచేస్తున్నాయి. ఈ విధంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందిన ఆర్​ఎస్​ఎస్​పై ఎవరు ఏ విమర్శలు చేసినా అక్కడి ప్రజలు ఎప్పుడూ నమ్మరు. తప్పుడు ప్రచారాలు చేసి దేశ ప్రజలనూ నమ్మించలేరని వారు గమనిస్తే మంచిది.

270 సహాయ కేంద్రాల్లో 70 వేల మంది: సేవా భారతి బృందం జులై 2న హింసా కాండలో చనిపోయిన ఖోయిజుమంతబికి చెందిన నింగోంబామ్ ఇబోమ్చా, హౌబామ్ ఇబోచా, నౌరెం రాజ్‌‌కుమార్ కుటుంబ సభ్యులతో సమావేశమైంది. బాధిత కుటుంబాల బాధను పంచుకుంటూ, ప్రతి బాధితుడి కుటుంబీకులకు నిత్యావసర వస్తువులతో పాటు రూ.10,000 అందజేశారు. బాధితుల పిల్లలకు చదువుతోపాటు పునరావాసం కల్పించడంలో తమవంతు సాయం అందిస్తామని బృందం హామీ ఇచ్చింది. ఆర్ఎస్ఎస్, సేవా భారతి, వనవాసి కల్యాణాశ్రమం నిర్వహిస్తున్న 270 సహాయ కేంద్రాల్లో 70 వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో హింస చెలరేగిన 2023 మే 3 నుంచి అక్కడి కార్యకర్తలు సహాయ, వైద్య, సామాజిక కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. - త్రిలోక్. Source: V6

No comments