Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మన మాతృభూమి యొక్క విశాల స్వరూపం

మన మాతృభూమి యొక్క విశాల స్వరూపం:  మన మహా కావ్యాలు పురాణాలు కూడా మాతృభూమి యొక్క విశాల స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న...

మన మాతృభూమి యొక్క విశాల స్వరూపం: మన మహా కావ్యాలు పురాణాలు కూడా మాతృభూమి యొక్క విశాల స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆఫ్గనిస్తాన్ మన గణరాజ్యాలలో ఒకటి. మహాభారతంలోని శల్యుడు ఇక్కడికి చెందినవాడే. కాబూల్ కందహార్, గాంధార దేశంలో భాగాలు. కౌరవుల తల్లి గాంధారి ఇక్కడే పుట్టింది. మౌలికంగా ఇంచుమించు ఇరాన్ వరకు ఆర్య భూమి విస్తరించింది. ఇరాన్ ఆఖరి రాజైన షాహ్ పహల్వి ఇస్లాం కన్నా సనాతన భారతీయ సిద్ధాంతాలను అధికంగా అనుసరించేవారు. పార్శీల యొక్క పవిత్ర మత గ్రంథం "జెందా వేస్తా"  అధిక శాతం ఋగ్వేవేదం నుంచి గ్రహించబడినది.

తూర్పున ఉన్న బర్మా మన ఒకప్పటి బ్రహ్మదేశము. మహాభారతంలో ఇరావత ప్రాంతం ఉల్లేఖించబడింది. ప్రస్తుతం ఉన్న ఇరావాడి పర్వతాలకు ఆ మహా యుద్ధంతో సంబంధం ఉంది. ప్రస్తుత ఈశాన్య భారతం లోని అసోం రాష్ట్రం, మహాభారతంలో ప్రాజ్యోతిషపురం అనే పేరుతో ప్రాచుర్యం పొందింది. సూర్యుడు మొట్టమొదటిగా ఉదయించే ప్రాంతం  కావడంతో దానికి ఆ పేరు వచ్చింది. దక్షిణంలో ఉన్న లంక కూడా పూర్వం మన దేశంలోని అంతర్భాగమే.

ఇది మన మాతృభూమి యొక్క విశాల స్వరూపం. ఆర్యన్ దేశము (ఇరాన్) నుండి శృంగపూర్ (సింగపూర్) వరకు రెండు సముద్రాల మధ్య విశాలంగా విస్తరించింది ఈ భరతభూమి. హిందూ మహాసముద్రంలో భరతమాత పాదాల చెంత వాలిన పద్మంలా శ్రీలంక కొలువై ఉంది. మాతృభూమి యొక్క ఈ బృహద్రూపం వేల సంవత్సరాలుగా జనుల హృదయాలలో విరాజిల్లుతున్నది. ఈరోజుకి కూడా ప్రతి హిందువు స్నానం చేసే సమయంలో గంగా యమునా గోదావరి సరస్వతి నర్మదా సింధు మరియు కావేరి వంటి పవిత్ర నదులను ఆవాహన చేస్తాడు.

గంగేచ యమునేచైవా గోదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు||


( గంగా, యమునా, సరస్వతి సింధు, గోదావరి, కావేరి వంటి పుణ్యనదుల యొక్క జలములు ఈ స్నానజలముల యందు ఉండుగాక)
ఈ ప్రక్రియ మనకు భక్తి తత్వాన్ని బోధిస్తున్నది. ఈ దివ్య నదులలోని ప్రతి నీటి బిందువులో మానవుల యొక్క సమస్త పాపాలను ప్రక్షాళన చేయగలిగే శక్తి ఉన్నది అనే అనుభూతిని మనకు కలిగిస్తోంది.
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యణ హిమవాన్ ఇవ
(వాల్మీకి రామాయణం, బాలకాండం, ప్రథమ సర్గ, శ్లోకం 17) భరతజాతి గర్వించదగ్గ మహోన్నతుడు, మన చరిత్ర సంస్కృతి, సంప్రదాయాలపై చెరగని ముద్ర వేసిన మహాపురుషుడు శ్రీ రామచంద్ర మూర్తి. వాల్మీకి,‌ రామాయణంలో శ్రీరాముని శాంతస్వరూపం ఉదారచిత్తం జ్ఞానగాంభీర్యం వంటి ఉన్నత గుణములను అప్రమేయమైన‌ సముద్రము యొక్క గాఢత మరియు గాంభీర్యం తో పోల్చారు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ధైర్య సాహసాలను అజేయమైన హిమాలయంతో పోల్చారు. 

మన మాతృభూమి ఒక దిక్కున హిమాలయంతో మిగిలిన మూడు దిక్కులు సముద్రంతో పరివేష్టితమై ఉన్నదని మనకి తెలుసు కదా. శ్రీరాముని యొక్క ఆదర్శ వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ తద్వారా మన మాతృభూమి యొక్క సంపూర్ణ  దృష్టాంతాన్ని మనకు వివరించారు. అనేక రకాలుగా మన మాతృభూమిని పూజనీయ స్థలంగా వర్ణించారు. దీనిని
విభజించాలనే ఆలోచన కూడా అత్యంత హీనమైనదని మనం భావిస్తాము. ప్రతి భారతీయుడికి ఎప్పుడు ఈ మన మాతృభూమి యొక్క విశాల స్వరూపం గుర్తుండాలి, బ్రిటీష్ వాళ్ళచే విడగొట్టబడిన, ముస్లింలచేత ఆక్రమింపబడిన మనదేశాలు మనం తిరిగి స్వాదీనం చేసుకోవాలి. ఈ యొక్క చిత్రం ని మనం కళ్ళారా చూడాలి. అప్పుడే మనదేశం అఖండంగా నిలుస్తుంది.
[ హిమాలయం నీ మకుటం, జగతికి అది ఆభరణం
సాగరాలే రత్నాలతో, సమర్పించెను వందనం]


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments