Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఇస్లామిక్ బ్యాంకింగ్ దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదం

ఇస్లామిక్ బ్యాంకింగ్ / ఇస్లామిక్ ఫైనాన్స్ అని కూడా పిలుస్తారు. ఇది షరియా అనే ఇస్లామిక్ చట్టాన్ని అనుసరించే మరొక బ్యాంకింగ్ వ్యవస...


ఇస్లామిక్ బ్యాంకింగ్ / ఇస్లామిక్ ఫైనాన్స్ అని కూడా పిలుస్తారు. ఇది షరియా అనే ఇస్లామిక్ చట్టాన్ని అనుసరించే మరొక బ్యాంకింగ్ వ్యవస్థ. ఇది ఫిఖ్-ఉల్-ముఅమ్లాత్ అని కూడా పిలువబడే షరియా చట్టాల సూత్రాలను అనుసరించాలి. అధికారికంగా 1960ల నుండి ఇస్లామిక్ బ్యాంకింగ్ ప్రారంభమయ్యింది. అయితే ఇది ప్రవక్త మహమ్మద్ నుండి ఈ బ్యాంకింగ్ ఫత్వా ద్వారా అందుబాటులో వుంది. కాని అప్పుడు, వాణిజ్యం ప్రాథమిక దశలో ఉంది.

ఇస్లామిక్ బ్యాంకింగ్ ప్రయోజనాల కోసం 'ఫత్వాలు' తరచుగా ప్రకటించబడినప్పటికీ రోమన్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభావితమైన కాలిప్ ఉత్మాన్ వరకు కొనసాగింది. చివరగా బ్యాంక్ రూపంలోకి మాత్రం ఈజిప్టులో 1963లో మిట్ ఘమర్ సేవింగ్స్ బ్యాంక్ స్థాపించబడింది.

ఇస్లామిక్ బ్యాంక్ లో వడ్డీలేని రుణం పొందవచ్చు. దీనికి నియమాలు ఉన్నవి. డబ్బులు వడ్డీ కి తీసుకోవడంకు ఖురాన్ వ్యతిరేకం, కనుక కొన్ని ముస్లిం దేశాలు ఈ బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి. సుమారు ప్రపంచ వ్యాప్తంగా 300 బ్యాంకులు మరియు 250 మ్యూచువల్ ఫండ్‌లు ఇస్లామిక్ ఆర్థిక నిర్వహణ సూత్రాలకు (ఫిఖ్ అల్-ముఅమలత్) కట్టుబడి పనిచేస్తున్నాయి. ఈ బ్యాంక్ లు అన్నీ ఇస్లాం దేశాల్లోనే ఉన్నవి. ఈ మద్యనే ఇంగ్లాడ్, థాయ్ లాండ్, శ్రీలంక లలో మొదలయినవి అక్కడ ఆ ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులకి కూడా గురవుతున్నవి.

ఇక భారతదేశానికి వస్తే ఈ బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకురావాలని యు.పి.ఏ ప్రభుత్వం అనేకమార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యింది. భారతదేశంలోని ముస్లింలు దశాబ్దాలుగా భారతీయ ఆర్ధిక వ్యవస్థలోకి నిశ్శబ్దంగా చేరుకోవాలని కాంగ్రెస్ మరియు ప్రాంతీయ పార్టీలను ఒత్తిడి చేస్తున్నారు, కానీ ఇప్పటివరకు అది ఇక్కడ ప్రవేశపెట్టబడలేదు. ప్రపంచంలోని ఏ బ్యాంకింగ్ వ్యవస్థ అయినా ఏదో ఒక రూపంలో వడ్డీ లేకుండా మనుగడ సాగించదు. షరియా ప్రతి రంగంలో తన ఉనికిని చాటుకోవడానికి స్వంత అధీకృత వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

భారతదేశంలోని ఇస్లామిక్ బ్యాంకింగ్ మద్దతుదారులు షరియా-అనుకూలమైన హలాల్ బ్యాంకింగ్ ఎంపికల కొరత కారణంగా, చాలా మంది ముస్లింలు సంప్రదాయ బ్యాంకింగ్ సౌకర్యాలను ఉపయోగించకుండా మరియు సాంప్రదాయేతర పద్ధతులను ఆశ్రయించారని, తమ సమాజంలోని సర్టిఫికేట్ లేని 'బ్యాంకర్లతో' తమ పెట్టుబడులను పణంగా పెడుతున్నారని అభిప్రాయపడుతూ ఈ బ్యాంక్ లను స్థాపించాలని ప్రాంతీయ పార్టీల ద్వారా కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు, ఏమన్నా అంటే మేము మా ఖురాన్ వడ్డీల రూపంలో తీసుకునే ఆర్ధికసహకారానికి వ్యతిరేకం అంటున్నారు.

ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే విషయంలో ఇప్పటికీ గందరగోళం మరియు స్పష్టత లేకపోవడం వలన ప్రాంతీయ పార్టీలు ముస్లిం బ్యాంకింగ్ వలలో చిక్కుకుంటున్నారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ భారత రాజ్యాంగానికి అలాగే ఆర్ బి ఐ నిబందనలకి ఇది వ్యతిరేకం.

దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను కొనసాగించకూడదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక ప్రధాన చర్యగా నిర్ణయించింది. 2017లో RTI ప్రశ్నకు సమాధానమిస్తూ, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలను వినియోగించుకునేందుకు పౌరులందరికీ అందుబాటులో ఉన్న "విస్తృత మరియు సమాన అవకాశాలను" పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 28, 2014న జన్ ధన్ యోజన అనే జాతీయ మిషన్‌ను దేశంలోని అన్ని కుటుంబాలకు సమగ్ర ఆర్థిక చేరికను తీసుకురావడానికి ప్రారంభించారు. కానీ 18కోట్ల మంది ఉన్న ముస్లిం జనాభాలో ఇతర మతాలతో పోలిస్తే భారతదేశంలో తక్కువ మంది ముస్లింలు బ్యాంకు ఖాతాను కలిగిఉన్నారు. 7.4% వద్ద, బ్యాంకు డిపాజిట్లు మరియు రుణాలలో ముస్లిం సమాజం వాటా జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.

ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మరింత ఎక్కువ మంది ముస్లిం వ్యక్తులను వ్యవస్థీకృత బ్యాంకింగ్ వ్యవస్థలో చొరబడటానికి చేసే ప్రయత్నం,  మరో ఎత్తుగడ అని కొంత అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా గుర్తించగలరు. మరోవైపు, ఇది ఆర్థిక జిహాద్ యొక్క మరొక రూపం తప్ప మరొకటి కాదని జాతీయవాదులకి పూర్తిగా తెలుసు.

దేశం అలాగే ప్రపంచం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వెళుతుంటే వీళ్ళు మాత్రం సెక్యులర్ దేశంలో మతం, షరియా అంటూ వెనక్కువెళుతున్నారు. ముందే చెప్పడం జరిగింది ప్రపంచంలో ఏ బ్యాంక్ కూడా వడ్డీలేని ఋణాలు ఇవ్వదు. అలాగే భారత రాజ్యాంగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మతపరమైన బ్యాంక్ లకి వ్యతిరేకం. దేశ ప్రజలందరి ధనాన్ని తీసుకువెళ్ళి ఒక మతానికి వడ్డీలేని ఋణాలు ఇస్తే ఏ ఒక్కరూ ఈ ప్రతిపాదనను అంగీకరించరు. కనుక ఇది తెలుసుకుని ముస్లిం లు, అలాగే రాజకీయ నాయకులు అమలు కాని వాగ్దానాలు చేయడం దేశానికి, ప్రజలకి అంత మంచిది కాదనేది గమనించి మసులుకోవాలి. - నన్నపనేని రాజశేఖర్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. ఆంధ్రా లో పప్పూ గాడేంటి ఇస్లామిక్ బాంక్ పెడతామని వాగుతున్నాడు

    ReplyDelete