Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అక్కడ వేలంలో అమ్మయిల్ని అమ్మేవారు...

హిమాలయ పర్వతాలు అనగానే నేపాల్ పైన అలాగే ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాక్ ప్రాంతాల పై భాగాన ఉండేవని మనము భావిస్తాము. కానీ నిజంగా ఈ హిమా...

Hindu Kush

హిమాలయ పర్వతాలు అనగానే నేపాల్ పైన అలాగే ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాక్ ప్రాంతాల పై భాగాన ఉండేవని మనము భావిస్తాము. కానీ నిజంగా ఈ హిమాలయ పర్వతశ్రేణి మయన్మార్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పర్వతాలను హిందూ ఖుష్ పర్వతాలు అంటారు. ఈ పర్వతాలు గద్దలు కూడా ఎగరలేనంత ఎత్తులో ఉన్నవి.

సహజంగా హిందూ ఖుష్ అనగానే హిందువులకి పవిత్ర స్థలంగా భావిస్తాం. అలాగే హిందువులందరూ ఈ ప్రదేశంలో సంతోషంగా ఉండినటువంటి ప్రదేశంగా కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ఇది పచ్చి అబద్ధం. ఈ పర్వత శ్రేణిని ఉపరిష్యేన అని పిలిచేవారు, ఇరాన్ ప్రాచీన భాష అవేస్తాన్‌లో ఉపిరిసాన అని పిలుస్తారు. అలాంటప్పుడు ఈ పర్వత శ్రేణికి హిందూ ఖుష్ అనే పేరు ఎలా వచ్చింది?

హిందూ ఖుష్ అనే పదానికి నిజమైన అర్ధం 'హిందూ కిల్లర్' అని, ఖుష్ అనేది అవెస్తాన్  భాష 'కౌష్' కి మృదువైన రూపాంతరం. కౌష్ అంటే చంపేవాడు లేదా హంతకుడు. హిందూ ఖుష్ పర్వత మార్గాలు మధ్య ఆసియాలో అతిపెద్ద వేలం వేసే సంత. ఈ సంతలో భారత్, మరికొన్ని ఆసియా దేశాల నుండి ఆడపిల్లల్ని, బానిసల్ని ఇక్కడకు తెచ్చి వేలం వేసి అమ్ముకుంటారు. ఇది మొత్తం ముస్లిం ల కనుసన్నల్లో జరిగే సంత. ఇక్కడ లక్షలాదిమంది హిందూ స్త్రీలను వేలం వేసేవారు అలాగే మగవాళ్ళని కూడా పనిచేయడానికి బానిసలుగా అమ్ముకునే వారు. చెప్పిన పనులు చేయని వారిని క్రూరంగా హింసించి చంపేవారు. ఈ ఉపరిష్యేన పర్వతశ్రేణి ప్రాంతంలో 8 వశతాబ్దం తరువాత ఎక్కువగా ఇక్కడ హిందూ మహిళలను వేలం వేసిన మరియు చంపిన కారణంగా ఈ పర్వతశ్రేణి కి హిందూ ఖుష్ గా పేరు వచ్చింది. హిందువులు ఖుషీగా ఉండటం కాదు హిందూ ఆడపడుచుల్నే ఇక్కడ మంగోలియా, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలు ఖుషీ చేసుకునేవారు.

8వ శతాబ్దం నుండి ఈ సంత 19వ శతాబ్దం వరకు జరిగింది. మిత్రులారా 1100 సంవత్సరాల కాలఖండంలో ఘజని నుండి ఔరంగజేబ్ వరకు ఈ ముస్లిం సామ్రాజ్యవిస్తరణ వలసవాదులు ఎంతమంది మనదేశ స్త్రీలను బానిసలుగా చేసుకుని వేలంవేసి మన మానబిందువులని దోచుకున్నారో ఒకసారి లోతుగా ఆలోచించండి.

మెగస్తనీస్ (అతని గ్రంథం ఇండికాలో) వంటి విదేశీ యాత్రికులు భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు ముందు బానిసలు  లేరని భారతీయులందరూ స్వేచ్ఛగా ఉన్నారని ప్రకటించారు.

విదేశీ ముస్లిం ఆక్రమణదారులు, ఢిల్లీ సుల్తాన్ లు మరియు మొఘల్ రాజవంశాలు చేసిన సామ్రాజ్య విస్తరణ ప్రయత్నాలలో హిందూ బానిసలను మధ్య ఆసియా సంతకు పంపడం ఒక ముఖ్యమైన భాగం. నిజానికి, ఈ బానిస వ్యాపారం ముహమ్మద్ అల్-ఖాసిమ్ నేతృత్వంలో భారతదేశం పై మొదటి ఇస్లామిక్ దండయాత్ర ప్రారంభంలోనే ప్రారంభమైంది. ముస్లిం సమాజాలలో హిందువులు కాఫిర్లు లేదా అవిశ్వాసులుగా గుర్తించబడటం వలన, హిందువులకి ముఖ్యంగా యూరోపియన్లు, షియా ఇరానియన్లు మరియు జొరాస్ట్రియన్‌లతో పాటు  మధ్య ఆసియా బానిస వేలం వ్యాపారాల్లో హిందూ స్త్రీలకి, బానిసలకి గిరాకీ ఉండేది. ఈ విషయాన్నిఆండ్రీ వింక్ అనే బ్రిటీషర్ తన పుస్తకంలో వ్రాసుకున్నారు.

హిందూ ఖుష్ పర్వతశ్రేణి సంతలో జరిగే వేలంపాటలో మన హిందూ స్త్రీలని అత్యధిక ధనం ఇచ్చి కొనుక్కునేవారు. వారిలో ముసలి వారిని వంటచేయడానికి, చిన్నపిల్లల్ని కాళ్ళు ఒత్తించడానికి అలాగే వాళ్ళ భార్యలకి సపర్యలు చేయడానికి, అలాగే యువతుల్ని పడక సుఖానికి, మగవాళ్ళని పొలం పనులు చేయడానికి నానా చిత్రహింసలకు గురిచేస్తూ వాడుకునేవారు.


1001సంవత్సరంలో పెషావర్‌పై దాడి చేసిన సమయంలో ఘజనీకి చెందిన మహమ్మద్ దాదాపు 100,000 మంది హిందూ యువకులను పట్టుకున్నాడు మరియు భారతదేశంలోకి అతని 12వ దాడి తర్వాత చాలా మంది హిందూ బానిసలతో తిరిగి వెళ్ళాడు, తద్వారా వారి విలువ కేవలం 2-10 దిర్హామ్‌లకు పడిపోయింది. అత్యధికంగా మొదటిసారి లక్షమంది బానిసలను తీసుకెళ్ళింది ఈ సమయంలోనే. పన్నులు చెల్లించడంలో విఫలమైన హిందువులను బలవంతంగా అపహరించడం మరియు బానిసలుగా చేయడం. ఈ విధానం మొఘల్ యుగం వరకు కొనసాగింది.

అక్బర్ అయితే ఢిల్లీ వీధుల్లో మన రాజకుటుంబీకుల స్త్రీలను వేలం వేశాడు. షాజహాన్ పాలనలో మరింత పెరిగింది. ముస్లిం పాలకులు యుద్ధానికి వెళ్లినప్పుడు వారి హిందూ బానిస సంఖ్యను కూడా పెంచారు. అల్లావుద్దీన్ ఖాల్జీ దాదాపు 50,000 మంది బానిసలను హిందూ ఖుష్ పర్వతశ్రేణి సంతలో అమ్మాడు. మరో 70,000 మంది బానిసలు వివిధ నిర్మాణ పనులకు బలవంతంగా ఉపయోగించుకున్నాడు. ఫిరూజ్ తుగ్లక్  తన జీవితకాలంలో 180,000 మంది బానిసలను వేలం వేశాడు. మొఘలులు మాత్రమే కాదు తైమూర్, బహానీ సుల్తాన్, ఖిల్జీలు, లోడీ లు అందరూ ఈ పర్వత శ్రేణిలో ఎప్పుడూ బానిసలుగా వేలంలో అమ్ముతుండేవారు.

పోర్చుగీస్ జెస్యూట్ మిషనరీ ఫాదర్ ఆంటోనియో మోన్సెరేట్ (1581)  పంజాబ్ ప్రాంతం నుండి తీసుకెళ్ళిన అమ్మాయిలను వేలంలో గుర్రాలకి బదులుగా అమ్మాయిలను బానిసలుగా పంపేవారు అని వ్రాసుకున్నాడు. 1874 నాటి బ్రిటిష్ యాంటీ-స్లేవరీ సొసైటీ నివేదిక ప్రకారం ఫైజాబాద్ గవర్నర్ మీర్ గులాం  8,000 మంది గుర్రాల కోసం మన హిందూ స్త్రీలను వేలంలో అమ్మి గుర్రాలను తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముస్లింలే కాదు ఈ నీచ బ్రిటీషర్స్ కూడా మన హిందూ స్త్రీలను ఇబ్బందులకి గురిచేశారు అలాగే వాళ్ళ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేయించుకుని రూపాయికూడా ఇవ్వకుండా వాడుకున్నారు.

ఇదంతా నిజంగా నాకు వ్రాయాలనిపించలేదు కాని వాస్తవాలను చెప్పకపోతే తెలిసేదెలా? మనం జాగృత మయ్యేదెప్పుడు మన జాతిని కాపడుకోవాలి. ఇప్పటికీ మన హిందూ ఆడపడుచులు లవ్ జీహాద్ కి బలవుతూనే వున్నారు. రోజూ మనం టీవీల్లో, వార్తా పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. కులం కులం అనివాగే మనం మన కులపు అమ్మాయిని పరాయి మతస్తుడు జీహాద్ చేసి పెట్టెల్లో పెట్టి పంపుతుంటే మాత్రం పట్టనట్టు ఉంటే ఎలా? మన ధర్మము, మతము ఉంటేనే మన కులం ఉంటుంది. ఇది ఆలోచించి మనల్ని మనం కాపాడుకుందాం, మన ఆడపడుచుల్ని కాపాడుకుందాం. ఉపరిష్యేన పర్వతశ్రేణిలో జరిగిన వాటిని మరల మరల పునరావృతం కాకుండా జాగ్రత్తపడుదాం.. జై హింద్ - మీ రాజశేఖర్ నన్నపనేని.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments