Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బీమా పాలసీ చేస్తున్నారా అయితే పూర్తి అవగాహన కోసం ఈ విషయాలు తెలుసుకోండి - about insurance policy details in telugu

బీమా ఏజెంట్లు చెప్పింది గుడ్డిగా నమ్మి బీమా పాలసీ ప్రీమియం చెల్లిస్తారు కానీ సవివరంగా తీసుకోబోయే పోలసీ గురించి చర్చించే మనస్తత్వం కూడా నేడ...


బీమా ఏజెంట్లు చెప్పింది గుడ్డిగా నమ్మి బీమా పాలసీ ప్రీమియం చెల్లిస్తారు కానీ సవివరంగా తీసుకోబోయే పోలసీ గురించి చర్చించే మనస్తత్వం కూడా నేడు చాలామంది వద్ద లేదు. అత్యవసర సమయంలో ఉపయోగ పడే ఆరోగ్య బీమా గురించి మన "వినియోగ భారతి" మిత్రు లు మరియు సామాన్య వినియోగదారులను ఉద్దేశించి శ్రీ తూటుపల్లి కోదండ రామయ్య గారు వ్రాసిన విషయాలు యథాతదంగా... తగిన అవగాహన కొరకు 5 నిమిషాలు కేటాయించి శ్రద్దగా చదవండి.

భారీగా పెరిగిన ప్రైవేటు హాస్పిటల్ లో వైద్య ఖర్చులు ప్రతివ్యక్తిని ఆరోగ్య బీమా వైపు ఆలోచించేలా చేస్తున్నాయి. ఆరోగ్య బీమా లేకుంటే పెద్ద మోత్తం లో అప్పులు చేయటం లేదా ఉన్న పొదుపు మొత్తం కరిగించేసుకోవటం రెండింటిలో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్తితులు నేడు ఉన్నాయి. నాలుగు రోజులు ప్రైవేటు ఆసుపత్రి లో ఉండవలసి వస్తే కనీసం లక్ష రూపాయల బిల్లు నేడు అవుతోంది.యిది పెరిగేదే కాని తగ్గేది కాదు. అందు వలన ఆరోగ్యబీమా పాలసీ తప్పనిసరి గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు నేడు గుర్తించారు. మీకు ఆరోగ్య బీమా పై సమగ్ర అవగాహనా కలించే ప్రయత్నం లో భాగంగా ఈ ఆర్టికల్

భారత దేశంలో ఆరోగ్యబీమా ఎన్ని రకాలు ?
A)Indemnity Plans (నష్ట పరిహారం చెల్లించే పథకాలు )

1. Individual Health Insurance
2. Family Health Insurance
3. Group Health Insurance
4. ULIPS
5. Senior Citizen Health Insurance
6. Corona KavachB.)Fixed Benefit Plans ( నష్టం ఎంతజరిగింది అనే దానితో సంభంధం లేకుండా స్థిరమొత్తాన్ని చెల్లించు పథకాలు )
మనం ఎంచుకున్న బీమా మొతాన్ని బట్టి ఈ BENEFIT PLAN లలో కొన్ని సందర్భాల్లో జరిగిన నష్టం కంటే చెల్లింపు తక్కువ ఉండచ్చు. మరికొన్ని సందర్భాల్లో జరిగిన నష్టం కంటే చేసే చెల్లింపు ఎక్కువ ఉండచ్చు.

1. Critical Illness Insurance
2. Top Up Health Insurance
3. Hospital Daily Cash
4. Personal Accident Insurance
5. Critical Illness Insurance
6. Disease-Specific (Corona Rakshak, , Heart Care, Cancer Care etc.)ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉండటం తప్పని సరి అని చెప్పటానికి 6 ప్రధాన కారణాలు
1. జీవనశైలి వ్యాధులతో పోరాడటానికి:ముఖ్యంగా 45 ఏళ్లలోపు వారిలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. మధుమేహం, స్థూలకాయం, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, పాత తరంలో ప్రబలంగా ఉన్న అన్ని వ్యాధులు ఇప్పుడు యువతలో కూడా ప్రబలుతున్నాయి. నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యసనాలు మరియు క్రమశిక్షణ లేని జీవితాలు ఈ వ్యాధులకు దారితీసే కొన్ని కారకాలు. ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవటం ఈ వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది, అయితే దురదృష్టకర సంఘటన ఆర్థికంగా ఎదుర్కోవడం సవాలుగా ఉంటుంది. ఆరోగ్య బీమా ద్వారా ఈ సవాళ్ళను అధిగామించవచ్చు. అకస్మాత్తుగా వచ్చిపడే వైద్య ఖర్చులను చింతించాల్సిన అవసరం లేకుండా సులభంగా చూసుకోవచ్చు.

2. మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి: ఆదర్శవంతమైన ఆరోగ్య బీమా ప్లాన్ కోసం శోధిస్తున్నప్పుడు, మీరు ప్రతి ఒక్కరి పేరుతో ప్రత్యేక పాలసీలను కొనుగోలు చేయడం కంటే ఒకే పాలసీ కింద మీ మొత్తం కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి FAMILY FLOATER POLICY ను ఎంచుకోవచ్చు. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉన్న మీ వృద్ధాప్య తల్లిదండ్రులను, అలాగే ఆధారపడిన పిల్లలను పరిగణించండి. వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందుతుందని నిర్ధారించుకోవడం, వారికి ఏదైనా జరిగితే, మీకు తగిన ఆరోగ్య కవచం ఉంటే మీరు ఒత్తిడి కి గురి అవ్వాల్సిన అవసరం లేదు. క్షుణ్ణంగా పరిశోధించండి, నిష్పక్షపాత అభిప్రాయం కోసం నిపుణులతో మాట్లాడండి మరియు మీరు ఆల్ రౌండ్ కవరేజీని అందించే ప్రణాళికను పొందారని నిర్ధారించుకున్న తరువాత అడుగు ముందుకు వేయండి

3. సరిపోని బీమా రక్షణను ఎదుర్కోవడానికి:మీరు ఇప్పటికే ఆరోగ్య బీమాను కలిగి ఉన్నట్లయితే (ఉదాహరణకు, మీ యజమాని అందించిన పాలసీ) అది మిమ్మల్ని దేని నుండి రక్షిస్తుంది మరియు ఎంత కవరేజీని అందిస్తుందో ఖచ్చితంగా తనిఖీ చేయండి. ఇది ప్రాథమిక కవరేజీని అందించే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రస్తుత పాలసీ, కుటుంబంలో వచ్చే వ్యాధులు లేదా జబ్బులు వంటి సాధ్యమయ్యే బెదిరింపులకు రక్షణ కల్పించకపోతే, అది అవసరమైన సమయాల్లో సరిపోదని నిరూపించవచ్చు. మరియు వైద్య చికిత్సలు గణనీయంగా పురోగమిస్తున్నందున, అధిక మొత్తం హామీని కలిగి ఉండటం వలన మీ ప్రతి వైద్య అవసరాన్ని ఆర్థికంగా చూసుకోవచ్చు..

4. వైద్య ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి: వైద్య సాంకేతికత మెరుగుపడటం మరియు వ్యాధులు పెరిగేకొద్దీ, చికిత్స ఖర్చు కూడా పెరుగుతుంది. మరియు వైద్య ఖర్చులు కేవలం ఆసుపత్రులకే పరిమితం కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం. వైద్యుల సంప్రదింపులు, రోగ నిర్ధారణ పరీక్షలు, అంబులెన్స్ ఛార్జీలు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు, మందులు, గది అద్దె మొదలైన వాటి ఖర్చులు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మీరు తగినంతగా సిద్ధం కాకపోతే ఇవన్నీ మీ ఆర్థిక స్థితిపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించడం ద్వారా, మీరు నాణ్యమైన చికిత్సను ఎంచుకునే సమయంలో వైద్య ద్రవ్యోల్బణం యొక్క భారాన్ని ఎంత ఖర్చవుతుందనే చింత లేకుండా అధిగమించవచ్చు..

5. మీ పొదుపులను రక్షించుకోవడానికి:ఊహించని అనారోగ్యం మానసిక వేదన మరియు ఒత్తిడికి దారి తీసి మిమ్మల్ని హరించేలా చేస్తుంది - ఖర్చులు. తగిన ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం ద్వారా మీ వైద్య వ్యయాన్ని మెరుగ్గా నిర్వహించవచ్చు. వాస్తవానికి, అన్నిఆరోగ్య బీమా కంపెనీలు నగదు రహిత చికిత్సను అందిస్తున్నాయి. కాబట్టి మీరు రీయింబర్స్‌మెంట్‌ల గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పొదుపు ఇంటిని కొనుగోలు చేయడం, మీ పిల్లల చదువు మరియు పదవీ విరమణ వంటి వారి ఉద్దేశించిన ప్లాన్‌ల కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, ఆరోగ్య బీమాప్రీమియం పై ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.

6. సురక్షితంగా ఉండటానికి ముందుగానే బీమా చేయండి :జీవితంలో ప్రారంభంలో ఆరోగ్య బీమాను ఎంచుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉన్నందున, మీరు తక్కువ ధరలకు ప్లాన్‌లను పొందవచ్చు మరియు మీరు పెద్దయ్యాక కూడా ప్రయోజనం కొనసాగుతుంది. అదనంగా, మీకు మరింత విస్తృతమైన కవరేజ్ ఎంపికలు అందించబడతాయి. చాలా పాలసీలు ముందుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి, ఇది ముందుగా ఉన్న అనారోగ్యాల కవరేజీని మినహాయిస్తుంది. మీరు ఇంకా యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ కాలం ముగుస్తుంది, తద్వారా మీరు జీవితంలో తర్వాత అనారోగ్యానికి గురైతే ఉపయోగకరంగా ఉండే సమగ్ర కవరేజ్ యొక్క ప్రయోజనాన్ని మీకు అందిస్తుంది.

భారత దేశంలో ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తున్న బీమా కంపెనీలు

1. National Insurance Co. Ltd.
2. Go Digit General Insurance Ltd.
3. Bajaj Allianz General Insurance Co. Ltd.
4. Cholamandalam MS General Insurance Co. Ltd.
5. Bharti AXA General Insurance Co. Ltd.
6. HDFC ERGO General Insurance Co. Ltd.
7. Future Generali India Insurance Co. Ltd.
8. The New India Assurance Co. Ltd.
9. Iffco Tokio General Insurance Co. Ltd.
10. Reliance General Insurance Co. Ltd.
11. Royal Sundaram General Insurance Co. Ltd.
12. The Oriental Insurance Co. Ltd.
13. Tata AIG General Insurance Co. Ltd.
14. SBI General Insurance Co. Ltd.
15. Acko General Insurance Ltd.
16. Navi General Insurance Ltd.
17. Edelweiss General Insurance Co. Ltd.
18. ICICI Lombard General Insurance Co. Ltd.
19. Kotak Mahindra General Insurance Co. Ltd.
20. Liberty General Insurance Ltd.
21. Magma HDI General Insurance Co. Ltd.
22. Raheja QBE General Insurance Co. Ltd.
23. Shriram General Insurance Co. Ltd.
24. United India Insurance Co. Ltd.
25. Manipal Cigna Health Insurance Company Limited
26. Aditya Birla Health Insurance Co. Ltd.
27. Star Health & Allied Insurance Co. Ltd.
28. MAX Bupa Health Insurance Company Ltd.
29. Care Health Insurance Ltd.
30. Universal Sompo General Insurance Co. Ltd.


ఈ పై పేర్కొన్న బీమా కంపెనీలలో ఏ కంపెనీలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పటికీ ఈ దిగున నిభందనలు తప్పనిసరిగా వర్తిస్తాయి. అయితే యజమాని తన ఉద్యోగులకు కల్పించే గ్రూప్ హెల్త్ ఇన్సురెన్సు కు ఈ నియమాలు వర్తించవు

• మొదటి 30 రోజులు ప్రమాదం వలన గాయాలయి ఆసుపత్రిలో చేరితే తప్ప అనారోగ్యం తో చేరితే ఎటువంటి COVERAGE ఉండదు.

• యిక్కడ పేర్కొన్న నిర్దేశిత రుగ్మతలకు మొదటి రెండు సంవత్సరాలు Coverageనుండి మినహాయింపు ఉంది. కంటిశుక్లం మరియు వయస్సు సంబంధిత కంటి వ్యాధులు, నిరపాయమైన ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ, మెనోరేజియా, ఫైబ్రోమయోమా, మైయోమెక్టమీ లేదా గర్భాశయం యొక్క ప్రోలాప్స్, హెర్నియా, హైడ్రోసెల్, పుట్టుకతో వచ్చే అంతర్గత వ్యాధి, మలద్వారంలో ఫిస్టులా, ఫిషర్స్, పైల్స్, సైనడైటిస్ మరియు సంబంధిత రుగ్మతలు, సైనడైటిస్ మరియు సంబంధిత రుగ్మతలు, , గౌట్ మరియు రుమాటిజం,మూత్ర వ్యవస్థలో రాళ్లు, గాల్ బ్లాడర్ లో రాళ్లు కీళ్ల వ్యాధులు, ఏదైనా చర్మ రుగ్మత, అన్ని అంతర్గత మరియు బాహ్య నిరపాయమైన కణితులు, తిత్తులు, నిరపాయమైన రొమ్ము ముద్దలు, నిరపాయమైన చెవి, ముక్కు, గొంతు రుగ్మతలు ,గ్యాస్ట్రిక్ లేదా డ్యూడెనల్ అల్సర్, నాన్-ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, PIVD (ఇంటర్-వెన్నెముక డిస్క్ యొక్క ప్రోలాప్స్) ప్రమాదం నుండి ఉత్పన్నమైతే తప్ప, అనారోగ్య సిరలు మరియు అనారోగ్య పుండ్లు(అల్సర్)

• పాలసీ తీసుకునే సమయానికి BP/DIABETIC వంటి ఏమైనా రుగ్మతలతో భాదపడుతూ ఉండే వాటి వలన ఆసుపత్రిలో చేరవలసి వస్తే మొదటి 4సంవత్సరాలు COVERAGE నుండి మినహాఇంపు ఉంది. అయితే ఈ మినహాయింపు మూడు లేదా రెండు సంవత్సరాలకు కుదించి పాలసీ ను రూపొందించుకొనే సౌలబ్యం బీమా కంపెనీలకు IRDA ఇచ్చింది.అందువలన కొన్ని కంపెనీలు 2 లేదా 3 సంవత్సరాల మినహాఇంపు తో కూడా పాలసీలు రూపొందించాయి. యిటువంటి రుగ్మతలు పాలసీ తీసుకునే సమయంలో బహిర్గత పరచకుండా ఉండిఉంటె క్లెయిమ్ వచ్చినప్పుడు క్లెయిమ్ ను తిరస్కరించటమే కాదు పాలసీ ను కూడా రద్దు చేస్తారు.దానివల్ల పాలసీ సీనియారిటీ ను కోల్పోతారు.

• పుట్టుకతో వచ్చిన రుగ్మతలు ఎన్నటికీ కవర్ కావు.

సాధారణంగా మనం హాస్పిటల్ కు వెళితే ఏ మేం ఖర్చులు అవుతాయి
• డాక్టర్ కన్సల్టేషన్ (OP)
• వివిధ రకాల పరీక్షలు ( Investigations )
• ఫార్మసీ
• రూమ్ రెంట్
• ICU చార్జెస్
• నర్సింగ్ చార్జెస్
• డాక్టర్ విజిటింగ్ చార్జెస్
• శస్త్ర చికిత్స జరిగితే OT కు చెందిన అన్ని ఖర్చులు
• అంబులెన్సు చార్జెస్

ఈ పై ఖర్చులు అన్నీఆరోగ్య బీమా పాలసీ ద్వారా మీరు బీమా పాలసీ తీసుకున్న కంపెనీ తో బిజినెస్ అగ్రిమెంట్ చేసుకున్న అన్ని Network Hospital ల లో నగదు రహిత (cashless) చికిత్స పొందవచ్చు. మీరు Non Network Hospital లలో చేరితే Reimbursement పొందవచ్చు. సాధారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన కేంద్రాలలో ఉన్న అన్ని ప్రధాన ఆసుపత్రులు అన్ని బీమా కంపెనీలకు Network Hospital లు గా ఉన్నాయు. అయితే ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారివద్ద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట్టం ప్రకారం Registar కాని చిన్న చిన్న క్లినిక్ లలో వైద్యం పొందితే ఈ సదుపాయం ఉండదు.

సాధారణ ఆరోగ్య పాలసీ మరియు సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ మధ్య వ్యత్యాసం
(Normal Health policy Vs Comprehensive Health Policy)


• సాధారణ హెల్త్ పాలసీ లో కొన్ని పరిమితులు(Sub Limits) ,సహా చెల్లింపు (Co-Pay) మరియు కొన్ని రుగ్మతల చికిత్సకు చెల్లించే మొత్తానికి గరిష్ట చెల్లింపు మొత్తం పై సీలింగ్ ఉంటుంది. దాన్ని Eliment Caping అంటారు.

• రూమ్ రెంట్ చెల్లించే విషయంలో సాధారణంగా బీమా మోత్తం లో ఒక శాతం కు లోబడి గరిష్టంగా రోజుకు రూ.5 వేలు మాత్రమే చెల్లిస్తారు. అదే ICU లో ఉంచి చికిత్స అయితే బీమా మోత్తం మీద 2 శతం లోబడి గరిష్టంగా రోజుకు రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తారు. కేటరాక్ట్ జరిగితే కంపనీను బట్టి గరిష్టంగా రూ,12 వేలు / 25వేలు... యిలా ప్రతి రుగ్మతకు పరిమితి ఉంటుంది. మత్తు ఇచ్చే డాక్టర్ ఫీజు గరిష్టంగా రూ.5 వేలు మాత్రమే ఉంటుంది. వాస్తవ ఖర్చు లో బీమా కంపెనీ యివ్వంగా మిగిలినది పాలసీ దారుడు తన పాకెట్ నుండి కట్టుకోవాల్సి ఉంటుంది. విటమిన్ టాబ్లెట్ లు టానిక్ లు , బాండేజ్, కాటన్ , థర్మామీటర్ వంటి Non-Medical వాటికి చెల్లించరు,

• సమగ్ర హెల్త్ పాలసీ ( Comprahensive Health Insurance Policy )లో క్లెయిమ్ చెల్లింపు కు ఎటువంటి పరిమితులు(Sub Limits) ,సహా చెల్లింపు (Co-Pay) ఉండవు. వాస్తవముగా అయినటువంటి ఖర్చులు అన్నీ చెల్లించబడును.Network హాస్పిటల్ ల నందు అయితే cashless non-Network Hospital అయితే Reimbursement.

క్యుములేటివ్ బోనస్ ( Cumulative Bonus ) :
ఆరోగ్య బీమా పాలసీలలో మొదటి సంవత్సరం ఎటువంటి క్లైమూ లేకున్నాచో కొంత బీమా మొత్తాన్ని బోనస్ రూపంలో బీమా మొత్తానికి జత చేస్తారు. ఇది క్లైమ్ లేని ప్రతి సంవత్సరం బీమా మొత్తంలో 10 శాతం భీమా మొత్తము ను జత చేస్తారు.అలా గరిష్టంగా 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు ఈ బోనస్ 20 శాతం ఇస్తాయి. అదే కాంప్రహెన్సు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మొదటి సంవత్సరం ఎటువంటి క్లైమూ లేకుండాచో రెండవ సంవత్సరం భీమా మొత్తంలో 50 శాతం బీమా మొత్తం కు జత చేస్తారు. రెండవ సంవత్సరం కూడా ఎటువంటి క్లైమ్ లేకుండా ఉన్నచో బీమా మొత్తానికి 100 శాతం భీమా మొత్తము ను జత చేస్తారు. ఈ ప్రయోజనం కల్పించినందుకు ఏటువంటి అదనపు ప్రీమియం చెలించవలసిన అవసరం లేదు.

హాస్పిటల్ లో చేరటానికి ముందు మరియు డిశ్చార్జ్ అయిన తరువాత అయిన ఖర్చులు చెల్లింపు.
హాస్పిటల్ లో చేరటానికి 30రోజుల ముందు మరియు డిశ్చార్జ్ అయిన తరువాత 60 రోజుల వరకు అయిన ఖర్చులు చెల్లింపు. కొన్ని కంపనీలలో యిది 60రోజులు – 90 రోజులుగా ఉంది .

రీ లోడ్ లేదా రీ చార్జ్ బెనిఫిట్ ( Reload or Recharge Benefit ) :
ఆరోగ్య భీమా రంగంలోకి ఎక్కువ కంపెనీలు వచ్చిన తర్వాత పోటీ తత్వంతో పాలసీదారులకు అందించబడిన మరొక ప్రయోజనం ఈ రీలోడ్ లేదా రీఛార్జ్ బెనిఫిట్. కుటుంబం మొత్తానికి ఫ్యామిలీ ఫ్లోటరిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు ఒక క్లైమ్ వల్ల గాని వివిధ క్లైముల వల్ల కానీ తీసుకున్న పాలసీ కి చెందిన బీమా మొత్తం అంతయూ క్లైమ్ రూపంలో చెల్లింపులు జరుపబడిబడి ఉండి ఉంటే ఆ సంవత్సరంలో తదుపరి కాలానికి కాలంలో ఏదన్నా క్లైమ్ సంభవించిన ఎడల మరలా వినియోగించు కొనటానికి భీమా మొత్తానికి సమానమైన మొత్తాన్ని ఎటువంటి అదనపు ప్రీమియం వసూలు చేయకుండా బీమా కంపెనీ కేటాయిస్తుంది. కొన్ని కంపెనీలు అపరిమిత రేలోడ్ లేదా రీ చార్జ్ సదుపాయం కల్పిస్తున్నాయి.

కనిష్ట ప్రవేశ వయస్సు – గరిష్ట ప్రవేశ వయస్సు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవలనుకున్నచో కనిష్ట ప్రవేశ వయస్సు 90రోజులు గరిష్ట ప్రవేశ వయస్సు 65 సం.లు . అదే Senior Citizen Health Insurance పాలసీ కొరకు అయితే కనిష్ట ప్రవేశ వయస్సు 60 సం. లు గరిష్ట వయస్సు పై పరిమితి లేదు . ఏ పాలసీ అయినా పాలసీ దారుడు జీవించి ఉన్నంత వరకు రెన్యువల్ చేయబడుతుంది.

ప్రత్యామ్నాయ వైద్య విధానం(AYUSH) లో వైద్యం తీసుకుంటే ...
హోమియూ , ఆయుర్వేదం , యునాని ,సిద్దవైద్యం మొదలగు విధానాలలో వైద్యం పొందినా బీమా సదుపాయం కల్పించబడును. ఈ సదుపాయం కోసం అనుమతించే బీమా మొత్తం విషయంలో ఒక కంపని కి మరొక కంపనీ కు కొన్ని తేడాలు ఉంటాయి.
 
ప్రసూతి ప్రయోజనం (Meternity Benefit): భార్య భర్త యిరువురు కలిపి పాలసీ తీసుకున 24 వ నెల అనంతరం మాత్రమే డెలివరీ ఖర్చులు (గరిస్తంగా కొన్ని కంపెనీలు 50 వేలు మరికొన్ని కంపనీలు ఒక లక్ష రూపాయలు చెల్లిస్తాము అనే నిభందనలతో) చెల్లిస్తామని ఇటీవలే ఈ ప్రయోజనాన్ని కొన్ని బీమా కంపెనీలు మాత్రమే కల్పిస్తున్నాయి. అయితే పుట్టిన బిడ్డ కు ఏదైనా తేడా చేస్తే మాత్రం భార్య భర్తలు తీసుకున్నపాలకి బీమా మొత్తం కు సరిపడా బీమా మొత్తం బిడ్డకు కవరేజ్ ఇస్తున్నారు. యిది మంచి ప్రోయోజనం అని చెప్పవచ్చు. ఒక్కోసారి పుట్టిన బిడ్డకు లక్షలాది రూపాయలు వెచ్చించవలసి రావటం మనం చూస్తున్నాం.

ముందస్తు వైద్య పరీక్షలు : కోవిడ్ ముందు వరకు 45 సం లు ( కొన్ని కంపెనీలు 50 సం )దాటిన ప్రతి వ్యక్తికి ముందస్తు వైద్య పరీక్షలు తప్పనిసరి అనే నియమం ఉండేది . ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు మొబైల్ కు కాల్ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకోవటం ద్వారా పాలసీ ఆమోదిస్తున్నాయి. ఆ సంభాషణలో ఆరోగ్య సమాచారం ఆధారంగా అవసరం అయితే అప్పుడు వైద్య పరీక్షల కు పిలుస్తున్నాయి .

అవయవ దాత ( ORGAN DONAR ) కు అయ్యే వైద్య ఖర్చులు చెల్లింపు
COMPRAHENSIVE హెల్త్ ఇన్సురన్సు పాలసీ లో ఏదేని అవయవ మార్పిడి శస్త్ర చికిత్స అవసరం అయినప్పుడు ఆ అవయవం దాత కు అయ్యే విద్య ఖర్చులు కూడా బీమా మొత్తం కు సమానం అయిన మొత్తం వరకు చెల్లించ బడును.

ఇప్పటికే ఉన్న జబ్బులు కవర్ చెస్తూ పాలసీ దారులకు ప్రయోజనం కల్పించటం లో వారికీ అనుకూలంగా వచ్చిన తాజా మార్పులు
రక్తపోటు . మధుమేహం,ఒబేసిటీ , అస్తమా.. ఈ నలుగు రుగ్మతలలో ఏవైనా ఉన్నచో వాటిని ముందుగా ఉన్న జబ్బుల జాబితా లో చూడకుండా వాటివల్ల వచ్చే ఇబ్బందుల వలన హాస్పిటల్ లో చేరవలసి వస్తే వాటికి Pre-Existing Decease గా పరిగణించకుండా మొదటి రోజు నుండే coverage కొంత అదనపు ప్రీమియం స్వీకరించటం ద్వారా కొన్ని బీమా కంపెనీలు మాత్రమే కల్పిస్తున్నాయి .

బ్యాంకు లు తక్కువ ప్రేమియం తో అందించే గ్రూప్ రిటైల్ ఆరోగ్య బిమ్మ పథకాలు ఎంతవరకు సురక్షితం:
గ్రూప్ రేటైల్ హెల్త్ ప్రోడక్ట్ అనేది బీమా కంపెనీ ఒక బ్యాంకు లేదా ఒక సంస్థ మెంబెర్ లకు covarage కల్పించటానికి డిజైన్ చేయబడిన ప్రత్యక పాలసీ. ఈ గ్రూప్ పాలసీ లో ఎక్కువ క్లెయిమ్ లు వచ్చి బీమా కంపెనీ కి నష్ట శతం పెరిగితే బీమా కంపెనీ ప్రీమియం పెంచి వేస్తుంది. పెంచిన ప్రీమియం అధికంగా ఉంటె ఆ బ్యాంకు లేదా సంస్థ రెన్యువల్ కు ముందుకు రాకుంటే మాస్టర్ పాలసీ రద్దు అయి పాలసీ దారులు ఇబ్బంది పడతారు.

ఒక బీమా కంపెనీ పాలసీ మరొక బీమా కంపెనీ కు బదిలీ చేసుకోవటం ( Health Insurance Portability ):
మనము యిప్పుడు కలిగి ఉన్న ఆరోగ్య బీమా పాలసీ కంటే మరో కంపెనీ ఆరోగ్య బీమా పాలసీ లో ప్రయోజనాలు ఎక్కువ ఉంటె రెన్యువల్ సమయంలో మన పాలసీ ను ఆ కొత్త కంపెనీ లోకి మర్చుకోవచ్చు. మన అబ్యర్ధన పరిశీలించి పోర్టబులిటి అనుమతించాలా వద్దా అనేది బీమా కంపనీ నిర్ణయించుకుంటుంది. పోర్టబిలిటీ కు అనుమతిస్తే పాలసీ దారుడు తన సీనియారిటీ ని కోల్పోడు. కాని తనకు పాలసీ తీసుకున్నపుడు లేని రుగ్మతలు యిప్పుడు ఉన్నచో వాటి వివరాలు తప్పనిసరిగా తెలియ పరచవలెను. ఆ విధంగా తెలియ పరచని యెడల క్లెయిమ్ వచ్చిన సమయంలో క్లెయిమ్ ను తిరస్కరించి పాలసీ కూడా రద్దు చేసెదరు.

నోట్: మీరు మీ కుటుంబ సబ్యులు అందరి పుట్టిన తేదీలు యిచ్చి మీరు కోరుకుంటున్న బీమా మొత్తం ఎంతో తెలిపిణ యెడల బీమా కంపెనీ తన ప్రీమియం వివరాలు ఉన్న కోటేషన్ అందిస్తుంది .

మీరు ఆరోగ్య బీమా పాలసీ కు వెళ్లేముందు ఈ పై అంశాలు శ్రద్దగా అద్యయనం చేయండి. ఏజెంట్ గారికి అన్నీ తెలిసి ఉండాలి అనే నియమం లేదు . వాళ్ళ మేనేజర్ గారులు చెప్పిన విధంగా వారు పాలసీ దారులకు చెపుతారు . చాలామంది ఏజెంట్ లకు బీమా కంపెనీ కి చెందిన ఆధీకృత పత్రాలు చదివే అలవాటు ఉండదు .

క్లెయిమ్ ల విషయంలో ముఖ్యంగా తెలుసుకోవలసిన అంశాలు:
మనం ఏదైనా ఒక రుగ్మతతో ఆసుపత్రిలో జాయిన్ అయితే ఆ ఆసుపత్రి బీమా కంపనీ యొక్క Network హాస్పిటల్ అయివుంటే ఆసుపత్రి వారు మన పాలసీ వివరాలు మరియు మన యొక్క అస్వస్థత వివరాలు మరియు చికిత్స ఏం చేయవలసి ఉంటుంది ఎన్ని రోజులు చేయవలసి ఉంటుంది ఎంత ఖర్చు అవ్వవచ్చు అనే అంచనాతో బీమా కంపెనీ కి Pre-Authoraisation form లెటర్ ను తగు పత్రాలతో కలిపి పంపుతారు. అత్యవసర పరిస్థితులలో తప్ప సాధారణంగా అస్వస్థత కు గురి కావటం తోనే యెవరూ ఆసుపత్రిలో అడ్మిట్ అవరు . ముందుగా కొంత చికిత్స అవుట్ పేషెంట్ గా జరిగి ఉంటుంది. కాబట్టి ఆ వివరాలు ( ఆసుపత్రిలో జాయిన్ కావటానికి ముందు ఎవరైనా డాక్టర్ గారి వద్ద చూపించు కొని ఉంటె ఆ డాక్టర్ గారు రాసిన ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ ఖచ్చితంగా బీమా కంపెనీ కి సమర్పిచాలి. అప్పుడు మాత్రమే బీమా కంపెనీ హాస్పిటల్ వారి ద్వార వచ్చిన అబ్యర్ధన పరిశీలించి కొంత మొత్తానికి ప్రాధమిక అనుఅమతి యిస్తుంది. డిశ్చార్జ్ సమయంలో హాస్పిటల్ వారు డిశ్చార్జ్ సమ్మరీ , ఫైనల్ బిల్ సమ్మరీ ,ఫార్మసి బిల్లులు , లాబ్ బిల్లులు అన్నీ బీమా కంపనీ కు పంపుతారు . అప్పుడు మనం తీసుకున్న బీమా పాలసీ నిభంధనల మేరకు మనకు ఎంత మొత్తం కు అర్హత ఉన్నదీ పరిశీలించి ఆ మొతానికి బీమా కంపెనీ ఆసుపత్రి వారికీ అప్రూవల్ లెటర్ ఇస్తుంది . మనం బాలన్స్ ఏమైనా చెల్లించాల్సి ఉంటె చెల్లించి డిశ్చార్జ్ అవుతాము.

CKYC వివరాలు
ఆదాయపు పన్ను శాఖవారి నియమాల మేరకు రూ . ఒక లక్ష మరియు ఆ పైన ఉన్న క్లెయిమ్ ల విషయంలో పాలసీ ఎవరి పేరుతో ఉన్నదో వారు CKYC పత్రం కూడా హాస్పిటల్ వారి ద్వారా బీమా కంపెనీ కు సమర్పించాలి . ఆ పత్రంలో పాలసీ దారుని ఫోటో అంటించి ఆధార్ మరితు పాన్ కాపీ కూడా సమర్పించాలి .లేదంటే డిశ్చార్జ్ రోజున ఫైనల్ బిల్ అప్రూవల్ యివ్వరు. కుటుంబ సబ్యులలో ఎవరు పేషెంట్ అయినప్పటికీ పాలసీ ఎవరి పేరున ఉందో వారి వివరాలు మాత్రమే CKYC form మీద యివ్వాలి .ఆసుపత్రి వారు అడగక పోయినా అడ్మిట్ అవ్వాల్సిన పరిస్తితి వచ్చినప్పుడు పై వివరాలు మనతో ఉంచుకుంటే అవసరం అయితే వెంటనే అందచేయచ్చు . లేదంటే ఆ వివరాలు ఇంటినుండి తెప్పించుకోనటానికి ఆలస్యం అయి ఒకరోజు లేటుగా డిశ్చార్జ్ అవుతారు.

ఏ బీమా కంపెనీ లో పాలసీ తీసుకున్నప్పటికీ మొదటి రెండు సంవత్సరాలకు కొన్నికవర్ కావు. పాలసీ తీసుకునే సమయానికి ఉన్న జబ్బులు మొదటి 3 సం లు కవర్ కావు. వీటిల్లో తేడా ఏమిటి . మనం ఏం తెలుసుకోవాలి ?

ఈ క్రింది రుగ్మతలు మొదటి రెండు సంవత్సరాలు కవర్ అవ్వవు అని ప్రారంభం లో చదివారు.
• కంటిశుక్లం మరియు వయస్సు సంబంధిత కంటి వ్యాధులు, నిరపాయమైన ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ, మెనోరేజియా, ఫైబ్రోమయోమా, మైయోమెక్టమీ లేదా గర్భాశయం యొక్క ప్రోలాప్స్, హెర్నియా, హైడ్రోసెల్, పుట్టుకతో వచ్చే అంతర్గత వ్యాధి, మలద్వారంలో ఫిస్టులా, ఫిషర్స్, పైల్స్, సైనడైటిస్ మరియు సంబంధిత రుగ్మతలు, సైనడైటిస్ మరియు సంబంధిత రుగ్మతలు, , గౌట్ మరియు రుమాటిజం,మూత్ర వ్యవస్థలో రాళ్లు, గాల్ బ్లాడర్ లో రాళ్లు కీళ్ల వ్యాధులు, ఏదైనా చర్మ రుగ్మత, అన్ని అంతర్గత మరియు బాహ్య నిరపాయమైన కణితులు, తిత్తులు, నిరపాయమైన రొమ్ము ముద్దలు, నిరపాయమైన చెవి, ముక్కు, గొంతు రుగ్మతలు ,గ్యాస్ట్రిక్ లేదా డ్యూడెనల్ అల్సర్, నాన్-ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, PIVD (ఇంటర్-వెన్నెముక డిస్క్ యొక్క ప్రోలాప్స్) ప్రమాదం నుండి ఉత్పన్నమైతే తప్ప, అనారోగ్య సిరలు మరియు అనారోగ్య పుండ్లు(అల్సర్).

కొన్ని సందర్భాల్లో రెండు సంవత్సరాలు తరువాత కూడా కవర్ అవ్వవు. అది ఎలా అనేది తెలుసుకుందాం:
మనం బీమా పాలసీ తీసుకొనే ముందు అనేక ప్రశ్నలకు సమాధానం యివ్వాల్సి ఉంటుంది. దాదాపు 25 నుండి 30 ప్రశ్నలు ఉంటాయి . అందులో మీరు గతంలో ఎప్పుడైనా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా ? ఏదైనా శస్త్ర చికిత్స లు చేయించు కొని ఉన్నారా ? ప్రస్తుతం ఏదైనా రుగ్మత తో భాధ పడుతున్నారా ? యిలా ... ప్రశ్నలు ఉంటాయి. సాధారణంగా ఏజెంట్లు అన్నీ No అని సమాధానం పేర్కొంటారు . అన్నే మనల్ని అడగరు . ఒకేలా ప్రతి ప్రశ్న ను మనలను అడిగినా అన్ని విని సమాధానాలు యిచ్చే ఓపిక మనవైపు కూడా ఉండదు. గతములో అయితే సంతకం ఇప్పడు అయితే OTP చెప్పేస్తున్నాం. పాలసీ వచ్చేస్తుంది. ఉదాహరణకు పాలసీ దారునకు పాలసీ తీసుకునే నాటికీ మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి. కారణం ఏది అయినప్పటికీ ఆ విషయం అప్లికేషను లో ఎక్కడా పొందుపరచబడలేదు. రెండు సంవత్సరాల తరువాత మోచిప్పలు మార్చే సర్జరీ అవసర మైంది. హాస్పిటల్ కు వెళ్లారు . ఎంతో కాలంగా అంటే పాలసీ తీసుకోక ముందు నుండి ఉన్న ఉన్న మోకాళ్ళ నొప్పుల వివరాలు డాక్టర్ Case Sheet లో పొందు పరిచారు. బీమా కంపెనీ క్లెయిమ్ తిరస్కరించటం తో పాటు తమను మోసం చేసి పాలసీ తీసుకున్నారు అని పాలసీ కూడా రద్దు చేస్తుంది. ఈ అంశం పై కోర్ట్ కు వెళ్ళినా బీమా కంపెనీ వాదనే నెగ్గుతుంది. అదే మోకాళ్ళ నొప్పుల విషయం ముందే బీమా కంపెనీ కి పాలసీ దారుడు పేర్కొని ఉంటె కొంత అదనపు ప్రీమియం వసూలు చేసి మూడు సంవత్సరాల అనంతరం మోచిప్పల మార్పిడి సర్జరీ కవర్ చేస్తాము అనే కండిషన్ తో పాలసీ యిచ్చేది. అప్పుడు ఎవరికే ఏ యిబ్బంది ఉండదు. ముందుగా ఉన్న జబ్బులు 3 సంవత్సరాల తరువాత కవర్ చేయబడతాయి అంటే అర్ధం అన్నీ అని కాదు. బహిర్గత పరచబడిన రుగ్మతలకు మాత్రమే( Declared Pre-Existing Deceases only) అని అర్ధం.

పై ఉదాహరణలో పాలసీ దారుడు తెలివిగా డాక్టరు గారితో మోకాళ్ళ నొప్పులు పాలసీ తీసుకున్న ఏ ఆరు నెలల తరువాతో మొదలయ్యాని అని చెప్పారనుకోండి క్లెయిమ్ వస్తుంది. అది వేరే విషయం. కాని అలా ఎవరు చెప్పారు . డాక్టర్ గారి వడ నిజం చెప్పాలి కాబట్టి నిజమే చెపుతారు . క్లెయిమ్ కూడా రాదు. First Consultation Paper క్లెయిమ్ రావటానికి గుండెకాయ లాంటిది. మోచిప్పల చికిత్స మాత్రమే కాదు BP, షుగర్ , ఆస్తమాల విషయం లో కూడా అంతే.....

పై విషయాలపై చాలా మంది ఏజెంట్ లకు మేనేజర్ లకు కూడా తగిన అవగాహనా లేకుండటం తో పాటు టార్గెట్ లు పూర్తి చేసుకోవాలి అనే ఆత్రుత తో కూడా పాలసీ దారులకు వాస్తవ సమాచారం యివ్వటం లేదు. ఎన్నో సంవత్సరాలు గా కడుతున్నపాలసీ వీళ్ళ తప్పుల కారణంగా రద్దు అయితే ఆ పాలసీదారునకు ఎంత నష్టమో కదా. ఈ వివరాలు చదివిన అనంతరం మీరు ఆరోగ్య బీమా పై ఒక అవగాహన కు వచ్చిఉంటారని భావిస్తున్నాను.నా ఈ వ్యాసం పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. T Kodanda Ramaiah MBA.,LL B.,PGADR Advocate. & Sole Arbitrator.

No comments