Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సతీ సహగమనం పూర్వాపరాలు, చరిత్ర - sati sahagamana history in telugu

డిసెంబర్ 4 1829 న సతీ సహగమనాన్ని రద్దుచేసిన దినంగా  జరుపుతూ  చాలామంది  హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ తప్పుపడుతున్న  కుహనా లౌకికవాద...

డిసెంబర్ 4 1829 న సతీ సహగమనాన్ని రద్దుచేసిన దినంగా జరుపుతూ చాలామంది హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ తప్పుపడుతున్న కుహనా లౌకికవాదులు, సంబరాలు చేస్తున్న మేథావులకి, వెంగలప్పలకి మెగామైండ్స్ సమాదానం ఈ వ్యాసం... 

సతీ సహగమనం చరిత్ర /History Of Sathi Samagamana
సతీ సహగమనం
సతీ అంటే "పతివ్రత" లేదా "భార్య" అని అర్ధం.
సహ అంటే "తో పాటుగా" అని అర్ధం.
గమనం అంటే "కదలిక" లేదా "నడక" అని అర్ధం.

సతీ సహగమనం అంటే "భర్త చనిపోయిన స్త్రీ తమ భర్తని కాల్చే చితి మంటల్లో దూకి తమను తాము అగ్నికి ఆహుతి చేసుకోవడం". ఇది మన దేశం లో రాజుల పాలనా సమయం లో ఆచరణలో ఉండేది.

వేద - పురాణాల్లో సతీ సహగమనం:
సతీ సహగమనం ఆచరించాలని గానీ, సతీ సహగమనం అనే పదం గానీ, దాని ఆనవాలు గానీ ఏ వేదములలో కూడా లేదు. మరి ఈ సతీ సహగమనం అనే సంప్రదాయాన్నీ సనాతన వైదిక ధర్మానికి(హిందూ ధర్మానికి) ఏ విధముగా అంటగట్టారు? ఈ వేద భూమి పై, ఏ విధముగా ఇంతటి దురాచారం సంప్రదాయం గా మారింది?

ఈ ప్రశ్నలకు సమాధానలు దొరకాలి అంటే మన పురాణాలని మరియు దేశ చరిత్రను క్షుణ్ణంగా, లౌకికంగా చదవాలి. పురాణాలు ఎందుకు చదవలాంటే, మన పురాణాల్లో సతీ సహగమనానకి పోలిన సంఘటనలు మనకు తెలసినవి రెండు ఉన్నాయి. ఒకటి శివ పురాణం లో ఉంది, ఇంకోటి మహాభారతం లో ఉంది. కానీ అవి అందరు ఆచరించే సంప్రదాయం మాత్రం కాదు. ఆ సంఘటనలను అర్ధమయ్యేల తెలుసుకుందాం.

శివ పురాణం లో: శివ పురాణం ప్రకారం(రుద్ర సంహిత, సతీఖండము) సతీదేవి బ్రహ్మ కుమారుడైన దక్ష ప్రజాపతి కూతురు. ఈ సతీ అన్న పదం అక్కడ నుంచి వచ్చినది. సతీదేవి తన చిన్నతనం నుంచి శివుని పై అపారమైన భక్తి కలిగి ఉండేది. ఆ భక్తితోనే అమె శివుడుని అపారంగా ప్రేమిస్తుంది, వివాహం చేసుకుంటే శివుణ్ణే చేసుకుంటానని తండ్రి దగ్గర పట్టుబడుతుంది. కానీ తండ్రి దానికి అంగీకరించడు. దక్షుడుకి(దక్ష ప్రజాపతి) శివుడు అంటే ఇష్టం ఉండదు, శివుణ్ణి ద్వేషించేవాడు. శరీరం పై బూడిద పూసుకుని, శ్మశానాల్లో తిరిగే వాడని దూషించేవాడు. అప్పుడు సతీదేవి ఆమె తండ్రితో విభేదించి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది.

ఒకనాడు దక్షుడు యజ్ఞం చేయాలని అనుకుంటాడు. ఆ యజ్ఞం కోసం బ్రహ్మ, విష్ణు మరియు దేవతలను, ఋషులను ఆహ్వానిస్తాడు. కానీ సతీదేవి-శివుడుకి ఆహ్వానం ఇవ్వడు. సతీదేవి యజ్ఞం దగ్గరకు వచ్చి తనకు మరియు తన భర్తకు ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నిస్తుంది. అప్పుడు దక్షుడు శివుడుని అవమానిస్తూ మాట్లాడుతాడు. దేవతలందరి లో తన భర్తకి అవమానం జరగటం భరించలేక సతీదేవి ఆ యజ్ఞం లో దూకి అగ్నికి ఆహుతి చేసుకుంటుంది.

మహా భారతం లో: పాండు రాజు కు ఇద్దరు భార్యలు. ఒకరు కుంతీదేవి, ఇంకోరు మాద్రి దేవి. ఒకనాడు పాండు రాజు తన రెండవ భార్య అయిన మాద్రి దేవిని వెంట పెట్టుకొని వేటకు వెళ్తాడు. మాద్రి దేవి ఒక మాయ లేడీని చూసి కావాలని కోరుతుంది. పాండు రాజు దానికి బాణం వేస్తాడు. కానీ ఆ మాయ లేడీ రూపం లో ఉన్నది కిండమ ఋషి. అప్పుడు కిండమ ఋషి పాండురాజును దాంపత్య సుఖం పొందితే చనిపోతావని శపిస్తాడు.

ఒక రోజు పాండురాజు తన శాపం విషయం మరచి, మాద్రి పట్ల ఆకర్షితుడై వారు శారీరకంగా దగ్గరవ్వగా, ఋషి శాప ఫలితంగా వెంటనే పాండురాజు మరణిస్తాడు. అయితే మాద్రి వల్లే పాండురాజు కి మరణం సంభవించిందని భావించి, మాద్రి కూడా పాండు రాజు తో పాటు గా చితి లోకి ప్రవేశిస్తుంది. యాదవ రాజపుత్రి కుంతి 'సహగమనం' చేయలేదు. తన,మాద్రి పిల్లల భాధ్యత తీసుకున్నది. కానీ

రామాయణం'లో: సూర్యవంశానికి చెందిన ధశరధ మహారాజు మరణించగా రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి సహగమనం' చేయలేదు.

పూర్వాకాలం లో భారతీయ సాంప్రదాయంలో సాహిత్యం లో ఎక్కడా కూడా బాల్యవివాహాలు జరుగలేదు, వాటికి ఆధారాలు కూడా లేవు. సతీసహగమనాలు కూడాలేవు కానీ 1000, 1200 ఏళ్ళ క్రితం నుండి మన భారతదేశం మీద దురాశతో దండెత్తి వచ్చిన దురాత్ములు మతపిశాచులు, దోచుకోవడమే గాకుండా స్త్రీలమాన ప్రాణాలపై అత్యాచారాలు చేస్తుంటే, కన్నెపిల్లలను చెరుస్తుంటే వారిని కాపాడుకునే భాధ్యతను అనవసరంగా మనపెద్దలు నెత్తిన తెచ్చిపెట్టుకున్న అధికభారమే ఈ బాల్యవివాహాలు. సాంఘిక దురాచారాల కారణాలవల్ల అప్పుడు అలా చేయవలసి వచ్చింది.

బాల్య వివాహాలు: ఇవి కూడా పురాణగాధల్లో ఎక్కడా కనబడవు. చిన్నపిల్లలకు, రాజ కుమార్తెలు పెళ్లిళ్లు అతిచిన్న వయసులో జరిగినట్టు ఎక్కడా ఆధారభూతమైన సాక్షాలు లేవు, కొన్ని ట్టుకధలు తప్ప. ఎందుకంటే ఆనాడు కూడా రాజులు తమ యుక్తవయసు కొచ్చిన కుమార్తెలకు (పసిపిల్లలకు కాదు ) స్వయంవరం అనే పద్ధతి నియమం పెట్టేవారు , స్వయం = తనకు ఇష్టం, వర = భర్త ను ఎంపిక చేసుకునే విధానం పెట్టారు

1000, 1200 ఏళ్లకిందటి బాల్య వివాహాల దురాచారం పసిపిల్లలను యుక్తవయసు రాని వారిని, అధిక వయస్సు ఉన్నవారికిచ్చి పెళ్లిళ్లు చేసేవారు. దానికి చాలానే కారణాలున్నాయి. పేదరికం, ఆర్థికపరమైన ఇబ్బందులు, మతదాడుల నేపధ్యం. మతచాందసవాదుల నుండి కాపాడుకోవడానికి ఆడకూతుళ్ళకు చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసేవారు (ఇతర పాశాండ మతాల వారు దండెత్తి వచ్చినపుడు వాళ్లకున్న మతపరమైన ఆచార, ఆజ్ఞల ప్రకారం పెళ్లిళ్లు కానీ కన్య స్త్రీ లను చెఱచె వారని చరిత్ర, ఇవి వారి మత పిచ్చి పుస్తకాలలో ఇప్పటికీ ఉన్నాయ్ )

యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః మన గ్రంథాలు చెబుతున్నాయి. కుటుంబ గౌరవాన్ని నిలపాలన్నా, పోగొట్టాలన్నా స్త్రీయే కారణమూ అటువంటి స్త్రీని కనిపెట్టుకోవాలని, రక్షించుకోవాలని, సుఖపెట్టాలని కూడా మన గ్రంథాలు చెబుతున్నాయి.

సెమెటిక్ మతాల మారణకాండ: పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపేయండి. కన్యలైన బాలికలను మాత్రం మీకోసం బతకనీయండి. సంఖ్యాకాండం 31:17. ఈ మాటలు అనేది స్వయంగా బైబుల్ దేవుడు యెహోవా. మోషే ఆ మాటల్ని అక్షరాల పాటిస్తాడు. అలా మొత్తం 16000 కన్యలైన మిద్యాని బాలికలు ఇశ్రాయేలీయులకు దొరుకుతారు. అంటే పెళ్ళైన ఆడవాళ్ళని, పిల్లల్ని, పశువులను, గొర్రెలను ఎన్నిటిని నిష్కారణంగా చంపేసి ఉండాలి.? ఇలాంటివి మనదేశంలో నూ కోకొల్లలు చేశారు.

పరాయి పాలకుల దాడులనుండి తప్పించుకోవటానికి, కొన్ని ఆచారాలు సమాజంలో ప్రవేశ పెట్టబడ్డాయి దానిలోనిదే బాల్య వివాహాలు. విదేశీ మతస్థులు వారి మత గ్రంథాలు ప్రోత్సహించిన విధంగా, కన్నె పిల్లమీద మనస్సు పడితే ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవచ్చు. ఎవ్వరి అనుమతి అవసరం లేదు. పైగా వారి పెద్దల ప్రోత్సాహం అది మతాను సారం జరుగుతున్నదనే భావన. పెళ్ళైన స్త్రీ మీద మనసు పడితే ఆ స్త్రీ భర్తను చంపి ఆ స్త్రీ ని లోబరుచుకోవచ్చు. వారి పెద్దల అభ్యంతరముండదు.

ఇప్పుడు చెప్పండి హిందూ సమాజం ఏమి చెయ్యాలో. ఈ సెక్యులర్ పాలనలో ఇప్పటికి హిందూ స్త్రీలకు రక్షణ లేదు. సతీ సహగమనం కూడ అటువంటిదే. రాజస్తాన్, బెంగాల్ లోని క్షత్రియకుటుంబాలలో ఈ దురాచారం ప్రవేశం చేసింది. రాజు ను ఓడించిన తరువాత ఆయన సొత్తుగా భావించ బడ్డ అతని భార్యను ఆ పాలకుల పరం చెయ్యాలి. లేక పోతే రక్తపాతమే. అక్బర్ జమానాలో ఇటువంటి రాజ పుత్ర స్త్రీలు బలవంతంగా అప్పగించబడ్డారు. ఆ పాలకులకు లొంగని స్త్రీలు సతీసహగమనానికి సిధ్ధపడ్డారంటే ఆశ్చర్యమేముంది.? ఎక్కడో ఎందుకు మన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు లో తిరుపతమ్మ తల్లి తన భర్త మంటల్లో కాలిపోవడం చూడలేక తను కూడా అగ్నికి ఆహుతి అయ్యింది. అలాగే నర్రవాడ వెంగమాంబ కూడా సతీసహగమనం చేసింది.

ఆ తరువాత కొన్నాళ్ళకి ఇది ఒక ఆచారణగా మారిపోయింది. మరి కొన్నాళ్ళకి భార్యకి ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా చితి మంటల్లోకి తోయడంలాంటివి జరిగాయి. సమాజంలో చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఈ దురాచారాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. మళ్ళీ ఈ సతీసహగమనాన్ని ఆపడానికి మనలోనే ఒకడైన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారు 1818 వ సంవత్సరం లో  ఆత్మీయ సభా అను సంస్థను స్థాపించి, సమాజంలో జరిగే దురాచారాల పై పోరాటం చేశారు. వితంతు పునర్వివాహానికి కూడా చాలా కృషి చేశారు. స్త్రీ విద్యకై పాటుపడ్డారు.1829 వ సంవత్సరంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం `అనాగరిక మూడాచారాలను’ పాటించే హిందూసమాజానికి `నాగరికత, సభ్యత’ నేర్పించాలని బ్రిటిష్ పాలకులు తమకుతామే ప్రకటించుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా, బ్రిటిష్ గవర్నర్-జనరల్ `లార్డ్ బెంటిక్’, 1829సం.లో `సతీ నిర్మూలన చట్టం’ చేసారు. స్త్రీల అభివృద్ధికి, విధవలపై హిందూమతం చేసిన హింసకు, బ్రిటిష్ పాలకులు 19వ శతాబ్దoలో చేసిన అతిముఖ్యమైన `సంస్కరణ’ ఈ చట్టమని గత రెండు దశాబ్దాలుగా చిత్రీకరించబడింది, ఇదే మనం పాఠ్యపుస్తకాలలో ఇప్పటికీ చదువుకుంటాము. కానీ ఇప్పటికీ కూడా భర్త పై అపారమైన ప్రేమాప్యాయతలు కలిగిన వారు స్వయంగా తమకు తాము అగ్నికి ఆహుతి చేసుకొంటున్నారు. ఈ నాటి కి ఏంతో మంది అపవాదులు ఈ సతీ సహగమనం అనేది సనాతన ధర్మంలో ఒక సంప్రదాయమని అనేవాళ్ళు లేకపోలేదు, వారికి తెలియజేప్పడం కోసమే ఈ మా ప్రయత్నం.
  "మన దేశ ఔన్నత్యాన్ని తెలుసుకుందాం, దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం." - MEGAMINDS

No comments