Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఉమ్మడి పౌర స్మృతి పూర్తి వివరాలు - What is Uniform Civil Code - MegaMinds

  సంస్కరణలతో ఉమ్మడి పౌరస్మృతికి బాటలు వేద్దాం       ప్రముఖ కాలమిస్ట్, రచయిత శ్రీ భాస్కరయోగి గారు పదే పదే ఓ కథ చెబుతుంటారు. ఓ కోళ్ల ఫారం యజమా...

 


సంస్కరణలతో ఉమ్మడి పౌరస్మృతికి బాటలు వేద్దాం
      ప్రముఖ కాలమిస్ట్, రచయిత శ్రీ భాస్కరయోగి గారు పదే పదే ఓ కథ చెబుతుంటారు. ఓ కోళ్ల ఫారం యజమాని కోళ్ల సమావేశం ఏర్పాటు చేసాడు. "మీ వల్ల నాకు నష్టం బాగా కల్గుతోంది.ఏం చేస్తారో ఏమో నాకు తెల్వది, కానీ రేపు తెల్లారేసరికి ఒక్కొక్క కోడి 2 గుడ్లు పెట్టాలి'' అని కోళ్ళకు హుకుం జారీ చేశాడు. తెల్లారి వచ్చేసరికి అన్ని కోళ్ళు రెండేసి గుడ్లు పెట్టినాయి. కాని ఒక కోడి ఒకటే గుడ్డు పెట్టింది. దాన్ని ఉరిమే కనుగుడ్లతో చూస్తూ.... "అన్ని 2 గుడ్లు పెడితే, నువ్వు ఒక్కదానివే ఒకే గుడ్డు పెట్టినవు,భయం లేదా?"అని యజమాని అడిగాడు. ఆ కోడి "ఆగాగు నీ భయానికి నేను ఒక గుడ్డు పెట్టినా!అసలు నేను పుంజునురా!!"అని అన్నది. ఈ కథ తమాషాకే అయినా, ఓ గొప్ప స్ఫూర్తి ఇందులో ఉంది. ఎవ్వరినీ కూడా భయపెట్టి బలవంతంగా మనసు మార్చలేము అనేదే ఈ సందేశం.  
       ప్రస్తుతానికి మన దేశంలో అందరికి భారత రాజ్యాంగమే శిరోధార్యం. రాజ్యాంగంలో ప్రవేశిక మొదలుకొని ప్రాథమిక హక్కులతో పాటు ఎన్నో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఎన్నో ఆర్టికల్స్, మరెన్నో మినహాయింపులు కలవు. అనేక సవరణలు కూడా చేసుకున్నాం. ఏదేమయినప్పటికీ రాజ్యాంగమే మనకు ప్రమాణం అనేది నిర్వివాదాంశం. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకి లోబడి దేశపౌరుల అందరి (కుల,మత,ప్రాంత,వర్గ,వర్ణ,పంథా,భాష లకి అతీతం) మనస్తత్వం రూపొందాలి. కానీ బలవంతంగా ఎవ్వరి మనసుల్ని మార్చలేము. అలాంటి రాజ్యాంగ పరిధిలోని అంశమే ఉమ్మడి పౌర స్మృతి. దాని గురించి అపోహలు తొలగించటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

ఉమ్మడి పౌరస్మృతి అంటే?
     మత పరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం. అంటే వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, జీవనభృతి(మనోవర్తి, భరణం లేదా ఇతరత్రా నిర్వహణ ) మొదలైన అన్ని అంశాల్లో కుల, మత, వర్గాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే చట్టం. ఇంతవరకూ ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలు ఉన్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్‌ చట్టాలు అమలవుతున్నాయి. ఎవరికీ వాళ్ళుగా అమలు చేసుకునే చట్టాలు ఉమ్మడి పౌర చట్టంలో చెల్లవు.
రాజ్యాంగంలో ఉందా?
         రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో దీన్ని రేఖామాత్రంగా ప్రస్తావించారు. అధికరణం 44లో దీని గురించి ఉంది. ‘‘దేశంలోని పౌరులందరికీ వర్తించేట్లు ఒకే చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి’’ అని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతిని రాజ్యాంగ రూపకర్త బీ.ఆర్‌.అంబేడ్కర్‌ గట్టిగా సమర్ధించారు.

ఆర్టికల్‌ 25కు విరుద్ధమా?
      రాజ్యాంగంలోని 25వ అధికరణంలోని కొన్ని అంశాలతో ఉమ్మడి పౌర స్మృతి విభేదిస్తుందని కొందరి వాదన. పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, అనుసరించేందుకు, వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్‌ 25 వీలు కల్పిస్తుంది. ఉమ్మడి పౌర స్మృతి వల్ల మతస్వేచ్ఛ విషయంలో మార్పు ఏమి ఉండబోదు.

అనుకూలతలు/ప్రయోజనాలు
-కులం, మతం, వర్గం, స్త్రీ,పురుష భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది.
-లైంగిక సమానత్వం సాధించవచ్చు. స్త్రీ పురుషులిద్దరూ చట్టప్రకారం సమానమే అని తీసుకోవచ్చు. 
-క్రిమినల్‌, సివిల్‌ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి. ప్రస్తుత పర్సనల్‌ చట్టాలను సంస్కరించాల్సిన పనిలేదు. 
-బహుభార్యత్వం నేరంగా మారుతుంది. 
-అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం వస్తుంది.
-దేశ నిర్మాణంలో యువత సామర్థ్యాన్ని వాడుకోవచ్చు
-దేశ సమగ్రత,అఖండత లని సాధించవచ్చు.
-మతరీత్యా ఆరాధనా పద్దతులు వేరు కావచ్చు, కానీ జాతీయత పట్ల భ్రమలు తొలగి "భారతీయత"భావం పెంపొందుతుంది.

ప్రతికూలతలు/నష్టాలు
-ఉమ్మడి చట్టం తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా కొన్ని వర్గాలు భావించే అవకాశం ఉంది. 
-మతం వంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఏమిటనే నిరసన వస్తుంది. 
-రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు అడ్డంకి అని భావించవచ్చు.
-ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం వల్ల కొన్నిమతాలు పిడి వాదంతో  వ్యవహరించవచ్చు.

ప్రతీ మతం తనను తాను సంస్కరించుకోవాలి
       సంస్కరణ అనేది ప్రతి మతంలో అంతర్గతంగా మొదలుకావాలి. సతీ సహగమనం, బాల్య వివాహాల వంటి వాటి విషయంలో సంస్కర్తల కృషి వల్ల హిందువులలో మార్పు వచ్చింది. అలాగే బహుభార్యత్వం మనకి మంచిది కాదని ముస్లింలు తమంత తాముగా నిర్ణయించుకోవాలి.హిందువులు,ముస్లింలు, క్రైస్తవులు మొ,, లగు వివిధ మతాలవారు వారి చట్టాలను వారే సంస్కరించుకోవాలి. ప్రతీ జననాన్ని, మరణాన్ని నమోదు చేయాలి. ప్రతీ వివాహానికి, విడాకులకు ఒకే పద్ధతి అమలు చేయాలి. పెళ్లిని చట్టరీత్యా నమోదు చేయడం అవసరం. ఉమ్మ డి నేర చట్టాలు అమలు లాగ ఉమ్మ డి పౌర స్మృతి  ఉంటె ఎవ్వరికి నష్టం లేదు.
      సంస్కరణల వల్ల అన్ని మతాలలోని సమాజ అభ్యుదయానికి కావాల్సిన మంచి అంశాలని/ సదాచారాల్ని అందరికి అందజేయవచ్చు. వివక్ష చూపే చెడు అంశాలని/దురాచారాల్ని దూరం చేసుకోవచ్చు. కాలానుగుణంగా అన్ని మతాలు, తమ మత గ్రంథాలలోని గుడ్డి విధానాలని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

సమైక్యత ని చాటుదాం
          వ్యక్తిగత మరియు మతపరమైన చట్టాలు రెంటినీ సమన్వయ పరచి ఉమ్మడి పౌర స్మృతిని అమలుపరిస్తే ఫర్వాలేదు. దీని కోసం ఆయా మత పెద్దలతో న్యాయకోవిదులు చర్చలు, సంప్రదింపులు జరపాలి. ఆయా మతాల ప్రత్యేక చట్టాల్లో రావాల్సిన కాలానుగుణ మార్పులకి అన్ని మతాలు సిద్ధపడాలి. దేశ శ్రేయస్సు కంటే ఉన్నతం మరొకటి కాదనే సత్యాన్ని మతపెద్దలు దృష్టిలో ఉంచుకోవాలి. కుహనా రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకి ఎవ్వరూ బలికావొద్దు.రాజకీయ ప్రయోజనాల్ని పక్కనపెట్టి చిత్తశుద్ధితో ప్రభుత్వం కూడా ముందడుగు వేయాలి. దేశ సమగ్రత కి బలాన్నిచ్చే నూతన స్మృతివ్యాఖ్యకి మతాలన్ని ఒక్కటిగ నిలవాలి. మతానికి పై చేయి మా దేశ అఖండత అని ప్రపంచ దేశాలకి చాటి చెప్పాలి. - సాకి, MegaMinds.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

No comments