Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

sarvepalli radhakrishnan in telugu - Teachers Day 2022

స్ఫూర్తిదాయకమైన గురువు: ఆదర్శవంతమైన రాజనీతిజ్ఞుడు, ముందు చూపు గల దౌత్యవేత్త, తాత్వికుడు, మానవతా వాది అయిన డాక్టర్ సర్వేపల్లి రాధ...

స్ఫూర్తిదాయకమైన గురువు: ఆదర్శవంతమైన రాజనీతిజ్ఞుడు, ముందు చూపు గల దౌత్యవేత్త, తాత్వికుడు, మానవతా వాది అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన ఆచరణాత్మక దృక్పథం, అంకిత భావంతో విదేశాల్లో భారతదేశం ప్రతిష్టతను పెంచారు. బహుముఖ వ్యక్తిత్వం గల వాడైనప్పటికీ ఆయన ఒక ఉపాధ్యాయుడుగానే గుర్తింపు పొందాడు. ఆచార్యదేవో భవ - ఉపాధ్యాయుడు భగవంతునితో సమానం అని మన ప్రాచీన గ్రంథాలు బోధిస్తున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించడమే ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి, దేశం పట్ల ఆయన అంకిత భావావికి నిదర్శనం.

డా. రాధాకృష్ణన్ ఎప్పుడూ ఒకటి చెబుతుండేవారు- "విద్యార్థుల మనస్సుల్లోకి వాస్తవాలను బలవంతంగా ఎక్కించేవారు ఉపాధ్యాయులు కారు, భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దేవారు నిజమైన గురువులు" అని ఈ సిద్ధాంతాన్ని ఆయన తన జీవితాంతం పాటించారు. 34 ఏళ్ల తర్వాత ఆవిష్కరించిన నూతన జాతీయ విద్యా విధానంతో భారత్ ఇవాళ తన భవిష్యత్ పయనానికి సిద్ధమవుతోన్న తరుణంలో డాక్టర్ రాధాకృష్ణన్ చెప్పిన ఈ మాటలు ఈ సందర్భానికి మరింతగా అన్వయిస్తాయి. 1962లో, రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన స్నేహితులు, విద్యార్థులు ఆయన 74వ పుట్టిన రోజు వేడుకను నిర్వహిస్తామని అడిగారు. దానికి ఆయన సమాధానంగా, "నా పుట్టిన రోజును చేయడానికి బదులుగా, సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపితే నేను చాలా గర్వంగా భావిస్తాను" అని అన్నారు. ఆ ఏడాది నుంచి ప్రతేడాది సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో 1888 సెప్టెంబర్ 5 న జన్మించారు. రాధాకృష్ణన్ క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలో చదువుకున్నారు. తన బంధువులలో ఒకరు ఇచ్చిన తత్త్వశాస్త్రం పుస్తకాన్ని చదివిన తర్వాత, రాధాకృష్ణను ఆ సబ్జెక్టు ను చదవాలనే ఆసక్తి కలిగింది. మద్రాసు కాలేజీలో, ప్రొఫెసర్ అల్ఫెర్డ్ జార్జ్ హాగ్ దాధాకృష్ణకు పాశ్చాత్య తత్త్వశాస్త్రాన్ని పరిచయం చేశారు. 1909లో ఆయనకు 20 ఏళ్ల వయసున్నప్పుడు మద్రాసు విశ్వవిద్యాలయంలో, తత్వశాస్త్రం విభాగంలో ఉద్యోగం వచ్చింది.

ఉపాధ్యాయుడిగా తొలి ఉద్యోగం ఇదే. 1929లో ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన హారిస్ మాంచెస్టర్ కాలేజీకి ప్రధానోపాధ్యాయుడిగా వెళ్లారు. 1931లో భారత్ కు తిరిగి వచ్చిన ఆయన, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. 1936లో మరోసారి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి పాఠాలు చెప్పేందుకు వెళ్లారు. ఆ సమయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థులలో ఇందిరా గాంధీ కూడా ఒకరు. 1926 ఏదాదిలో, స్వామి వివేకానంద అమెరికా, యూరప్ లు వచ్చి 53 ఏళ్లు అయిన సందర్భంగా, హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కాంగ్రేస్ ఫిలాసఫీని నిర్వహించారు. దానిలో రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు.

రాధాకృష్ణన్ భారతీయ తత్వశాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకెళ్లాడు. అక్కడ మన తత్త్వశాస్త్రానికి అనూహ్యమైన ఆదరణ దక్కింది. అక్కడ ఆయన చేసిన ప్రసంగం తదుపరి రోజు వార్తాపత్రికలలో ప్రధాన శీర్షికగా ప్రచురితమైంది. భారత కు చెందిన ఈ తత్వవేత్తకు పాశ్చాత్య తత్త్వశాస్త్రంపై ఉన్న పట్టును చూసి చాలా మంది పాశ్చాత్య తత్త్వవేత్తలు ఆశ్చర్యపోయారు. బ్రిటీష్ అకాడమీకి ఎంపికైన తొలి భారతీయ ఫెలో రాధాకృష్ణన్నే కావడం విశేషం. 1948లో యునెస్కో చైర్మన్ గా ఎంపికయ్యారు. డాక్టర్ రాధాకృష్ణన్ భారత రాజ్యాంగ పరిషత్తు కు కూడా ఎన్నికయ్యారు. భారత రాయబారిగా 1949లో సోవియట్ యూనియన్కు కూడా ఆయన పంపబడ్డారు.

1952లో దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ పనిచేశారు. ఆ తర్వాత 1962లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తర్వాత భారత రెండో రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. ఈ కాలంలోనే భారత్ రెండు యుద్ధాలను ఎదుర్కొవడంతో పాటు, ఇద్దరు. ప్రధానులను కోల్పోవడంతో ఆయన పదవీకాలం అత్యంత క్లిష్టంగా సాగింది. రాష్ట్రపతి అయిన తర్వాత, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మార్గంలో నడిచిన రాధాకృష్ణన్ స్వచ్చందంగా తన జీతాన్ని తగ్గించుకున్నారు. ముందస్తుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా తనను వారంలో రెండుసార్లు కలవవచ్చని చెప్పారు. సమాజానికి ఆయన అందించిన ఎనలేని సేవకు గుర్తింపుగా, మెరిట్, నైట్ బ్యాచిలర్, టెంపుల్టన్ పురస్కారాల చేత సత్కరించారు. బ్రిటీష్ ప్రభుత్వం చేత నైటిండ్ అనే గౌరవ ప్రధానమైన బిరుదునూ పొందారు. 1954లో భారత రత్న చేత కూడా సత్కరించబడ్డారు.

No comments