Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జాతీయోద్యమంలో విప్లవాన్ని రగిల్చిన పత్రికలు జర్నలిస్టులు - Fearless Journalists Who Rose Against the Britishers in Freedom Struggle

విప్లవాన్ని రగిల్చిన రచనలు: స్వరాజ్యకు సంపాదకుడు కావలెను, జీతం రెండు ఎండిపోయిన రొట్టెలు, ఒక గ్లాసు చల్లని నీరు. ప్రతి సంపాదకీయా...

విప్లవాన్ని రగిల్చిన రచనలు: స్వరాజ్యకు సంపాదకుడు కావలెను, జీతం రెండు ఎండిపోయిన రొట్టెలు, ఒక గ్లాసు చల్లని నీరు. ప్రతి సంపాదకీయానికి పది సంవత్సరాల జైలు ఇది 1884లో ప్రచురితమైన ప్రకటన. బహుశా పది సంవత్సరాల జైలు జీవితాన్ని జీతంగా ప్రకటించిన ప్రపంచంలోనే ఏకైక ప్రకటన ఇది. దాస్య శృంఖలాల్లో దేశం మగ్గుతున్న సమయంలో జర్నలిజం ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నదో తెలియజేయడానికి ఈ ప్రకటన ఉదాహరణ. అదే సమయంలో మొదటి హిందీ భాషా వార్తా పత్రిక ఉదాంత్ మార్తాండ్ మే 30, 1826లో ఇండియాలో ప్రచురితమైంది.

బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం పలు విధాలుగా జరిగింది. ప్రజలు తమ ప్రాంత, వర్గ, కులాలకు అతీతంగా అన్ని హద్దులను దాటి పోరాటం చేశారు. ఈ పోరాటంలో సమాజంలోని ఇతర ప్రతినిధులు, మేధావులతో కలసి జర్నలిస్టులు పాల్గొన్నారు. బ్రిటన్ ప్రభుత్వ దోపిడీని, అన్యాయ మార్గాలను ఎండగడుతూ దేశం యావత్తూ ఒకతాటిపై నిలిచేలా కృషి చేశారు. నాటి జర్నలిస్టులు తమ రచనలతో సమాజంలోని చెడుపై పోరాటం చేస్తూనే బ్రిటీష్ బానిస పాలనకు వ్యతిరేకంగా రచనలు చేసి ప్రజల్లో తగిన స్పూర్తిని నింపారు.

జర్నలిస్టుల పాదాల మీద ఏర్పడిన బొబ్బలపైన చరిత్ర రాయబడుతోందని ప్రఖ్యాత కవయిత్రి మహాదేవి వర్మ ఓ.. సందర్భంలో అన్నారు. ఆమె చెప్పిన ఈ మాటలు స్వాతంత్ర్య సమరంలో జర్నలిస్టుల పాత్రను ప్రతిఫలిస్తున్నాయి. నాడు జర్నలిస్టుల లక్ష్యం ఏదంటే సామాజిక సంస్కరణల్లో, జాతీయ ఉద్యమంలో ప్రజలు భాగమయ్యేలా చూడడమే. ఆ రోజుల్లో వార్తా పత్రికను ప్రచురించడమంటే చాలా ధైర్యమైన పని, ఎందుకంటే అందులో ప్రచురితమైన అంశాలు తమకు వ్యతిరేకంగా వున్నాయని బ్రిటీష్ పాలకులు భావిస్తే జర్నలిస్టులు, ప్రచురణకర్తలపై ఉక్కుపాదం మోపేవారు. స్వాతంత్ర్య పోరాటంలో వార్తా పత్రికలను శక్తివంతమైన ఆయుధాలుగా పరిగణించేవారు. బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలకులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పౌరులను ఐక్యం చేయడమనే గర్వకారణమైన సంప్రదాయాన్ని వార్తా పత్రికలు, మ్యాగజైన్లు నెలకొల్పాయి. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా విల్లమ్ములు, కత్తులు ఎక్కుపెట్టాల్సిన అవసరం లేదని, బ్రిటన్ సిపాయిల ఫిరంగులకు వ్యతిరేకంగా వార్తా పత్రికను బయటకు తీయండి అని నాడు అనేవారు. ఈ మాటలు వార్తాపత్రికల బలాన్ని సూచిస్తున్నాయి.

ఎంతో మంది జర్నలిస్టులు జర్నలిజం ద్వారా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూ దేశానికి సేవ చేశారు. స్వాతంత్య్ర పోరాట యోధులు దాపుగా ప్రతి ఒక ప్రముఖుడు తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. నేటి ప్రపంచంలో జర్నలిజం పరిధి నాటకీయంగా విస్తరించింది. అంతే కాదు దాని బాధ్యతలు కూడా పెరిగాయి. అందుకే దేశ ప్రగతి జర్నలిజం ద్వారా జరగాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కాని ఈతరం జర్నలిస్టులకి తప్పనిసరిగా తెలియజేయాలి.. జర్నలిజం సవ్యంగా వుంటేనే ప్రభుత్వాలు చేస్తున్న పనులు ప్రజలకు చేరువవుతాయి అలాగే నాయకులకి వారు చేసిన వాగ్దానాలను గుర్తుచేసిన వారూ అవుతారు.. ఈ నేపథ్యంలో జర్నలిజం ద్వారా సాంఘిక సంస్కరణలకు, స్వాతంత్య్ర సమరానికి నూతన మార్గాన్ని నిర్దేశించిన  రాజా రామ్మోహన్ రాయ్, అజిముల్లా ఖాన్, మఖన్ లాల్ చతుర్వేది, గౌరీ శంకర్ రాయ్ గాధలను ఈ వ్యాసం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

Raja Ram Mohan Roy


రాజా రామ్మోహన్ రాయ్ మొదటి పత్రికా స్వేచ్ఛా: జర్మలిజం ద్వారా భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నూతన మార్గాన్ని అందించిన గొప్ప వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఆయన్ను ఆధునిక భారతదేశ పునరుద్ధరణోద్యమ పితామహునిగా పిలుస్తారు. దేశంకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. బెంగాల్లోని రాధానగర్ లో బ్రాహణ కుటుంబంలో మే 22, 1772లో రాజా రామ్మోహన్ రాయ్ జన్మించారు. ఆయన్ను అందరూ స్వతంత్ర పాత్రికేయ పితామహునిగా కూడా పిలుస్తారు. ఆయన మూడు భాషలలో ఆంగ్లం, బెంగాలీ, ఉర్దులలో వార్తా పత్రికలను ప్రచురించేవారు. అంతే కాదు తన రచనల ద్వారా, ఇంకా ఇతర కార్యక్రమాల ద్వారా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకోసం పోరాటం చేశారు.

ముద్రణా యంత్రాన్ని 1778లో కనుగొన్నారు. రాజా రామ్మోహన్ రాయ్ జర్నలిజం రంగంలోకి వచ్చే భారతదేశ వార్తా పత్రికలను బ్రిటన్ ప్రభుత్వం నియంత్రిస్తూ వుండేది. అలాంటి పరిస్థితుల్లో పత్రికా స్వేచ్ఛకోసం ఆయన మొదటి ఉద్యమాన్ని ప్రారంభించారు. పత్రికలపై సెన్సార్ షిప్ ను 1819లో లార్డ్ హేస్టింగ్స్ ఎత్తేశారు. దాంతో రాజా రామ్మోహన్ రాయ్ మూడు జర్నల్స్ ను ప్రచురించడం మొదలెట్టారు. అవి ది బ్రాహ్మనికల్ మ్యాగజైన్ (1821), బెంగాలీ వారపత్రిక సంవాద కౌముది (1821), పర్షియన్ వారపత్రిక మిరాత్ ఉల్ అర్బర్ (1821), భారతదేశ పునరుజ్జీవన ఉద్యమానికి పునాది వేసిన ఆయన బ్రహ్మ సమాజాన్ని ప్రారంభించడమే కాకుండా. నాటి స్వాతంత్య్ర్య సామాజిక సంస్కరణ ఉద్యమాలకు తన జర్నలిజం ద్వారా నూతన మార్గాన్ని కల్పించారు, ఆయన ప్రారంభించిన ఉద్యమాల కారణంగా జర్నలిజానికి వన్నె తెచ్చారు. అదే సమయంలో ఆయన జర్నలిజం కూడా ఆయా ఉద్యమాలను సరైన మార్గాల్లో నడిపేది, రాజా రామ్మోహన్ రాయ్ తన జీవితకాలంలో అనేక పత్రికలకు సంపాదకత్వం వహించి ప్రచురించారు. బంగదూత్ అనేది ఆయన ప్రచురించిన ప్రత్యేకమైన పత్రిక. ఇందులో ఒకేసారి బెంగాలీ, హిందీ, పర్షియా భాషలను ఉపయోగించేవారు.

ఆయన పలు సందర్భాలలో తన బలమైన వ్యక్తిత్వాన్ని, పోరాట పటిమను ప్రదర్శించారు. 1821లో ప్రతాప్ నారాయణ్ దాస్ అనే భారతీయునికి బ్రిటీష్ జడ్జి మరణశిక్ష విధించారు. కొరడా శిక్ష సరిపోయేటప్పుడు మరణశిక్ష విధించడంతో దాన్ని ఖండిస్తూ రాజారామ్మోహన్ రాయ్ ఒక వ్యాసం రాశారు. బ్రిటీషువారి దౌర్జన్యాన్ని ఎండగట్టారు. ఆయన చేసిన కృషి కారణంగా భారతీయ పత్రికా వ్యవస్థకు బలమైన పునాది ఏర్పడింది. అంతే కాదు భారతీయ జర్నలిజం నూతన మార్గాల్లో అడుగుపెట్టింది. ఆ కాలంలో ఆధునిక యుగం ప్రాధాన్యతను గుర్తించిన అతి కొద్ది మందిలో ఒకరు రాజారామ్మోహన్ రాయ్ స్వేచ్చ లేకుండా తమంతట తామే మానవ నాగరికత ఆదర్శాలు మనుగడలోకి రావని అవి స్వేచ్ఛతో కలిసి వుండేవని ఆయన అన్నారు.

విప్లవాన్ని రగలించడానికి 'పాయమ్ -ఇ- అజాదీ'ని ప్రచురించిన యోధుడు అజీముల్లాఖాన్: అజీముల్లాఖాన్ తండ్రి నజీబ్ మిస్త్రీను ఒకసారి ఒక బ్రిటన్ అధికారి పిలిచి అశ్వశాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఆయన ఆ పని చేయనని చెప్పడంతో వెంటనే ఆగ్రహించిన అధికారి నజీబ్ మిస్త్రీని పై అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అంతే కాదు, ఇటుకతో కొట్టాడు. ఘటనతో తీవ్రంగా గాయాలపాలైన నజీబ్ మిస్త్రీ చికిత్స తీసుకుంటూ ఆరు నెలల తర్వాత మరణించాడు. ఆ విధంగా అజీముల్లాఖాన్ చిన్ననాడే తన తండ్రిని కోల్పోయారు. తండ్రి మరణం చిన్నారిపై తీవ్ర ప్రభావం చూపింది.

1857 తిరుగుబాటులో పాల్గొన్న ఆయన ఆ సమయంలో మిలిటరీ, రాజకీయ పాత్రలనే కాకుండా ఆ విప్లవాన్ని నడిపించిన ఆలోచనాపరునిగా కూడా పని చేశారు.. ఆయన గొప్ప విప్లవవాది, వ్యూహకర్త. 1857లో కాన్పూర్ మంచి మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపించారు. కాన్పూర్ పాలకుడు, ఆ తర్వాత ప్రధానిగా పని చేసిన నానా సాహెబ్ కు మొదటి సలహాదారునిగా పని చేశారు. అజీముల్లాఖాన్, యూరప్ పర్యటించిన తర్వాత భారత్ కు వచ్చేటప్పుడు ముద్రణా యంత్రాన్ని తీసుకొచ్చారు. దేశంలో విప్లవాన్ని, తిరుగుబాటును ప్రోత్సహించడానికిగాను ఆయన ఈ ముద్రణా యంత్రాన్ని ఉపయోగించి 'పాయమ్ -ఇ- అజాదీ' అనే వార్తాపత్రికను ప్రచురించారు. ఆయన దీన్ని హిందీ, ఉర్దూ, మరాఠీ భాషల్లో ప్రచురించేవారు.

హమ్ హై ఇస్కీ మాలిక్, హిందూస్థాన్ హమారా, పాక్ పతన్ హై కౌమ్ డా, జన్నత్ సే ప్యారా అనేది ఆ పత్రికలో ఆయన రాసిన పాటల్లో ఒక పేరొందిన పాట, అది 1857 పోరాటంలో పాల్గొన్న యోధులకు ప్రధాన గీతంగా నిలిచింది. ఈ పాట 1857 నాటి ఆదర్శాలు, లక్ష్యాలను స్పష్టంగా ప్రతిఫలించింది. ఈ పాటలో జాతీయ భావాలను పొందుపరిచారు. పోరాటంలో 1857 ప్రజల తరపున వివరించాయి. 1857 పోరాటంలో పాల్గొన్న విప్లవ సైనికుల ఉద్యదు గీతమైన ఈ పాట జాతీయ గీతాల్లో తలమానికంగా నిలిచింది. ఇది ప్రజల గుండెలను నేరుగా తాకింది. స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా వుంటూ అపరిమితమైన శక్తిని కలిగి వుండేది. అందులో దేశ ఘనతను కీర్తించడమే కాకుండా స్వాతంత్య్ర పోరాటం చేద్దామనే పిలుపు వుంది. ఈ పాటను విన్న తర్వాత రచయిత అజీముల్లాఖాన్ ఆధునిక భారత మొదటి జాతీయవాది అని పిలవడం అతిశయోక్తి కాదని అనిపిస్తుంది.
Makhanlal Chaturvedi


జర్నలిజం, సాహిత్యం, జాతీయ ఉద్యమాలకు అంకితమైన తిరుగులేని యోధుడు మఖన్ లాల్ చతుర్వేది: మఖన్ లాల్ చతుర్వేది అరుదైన యోధుడు, పాత్రికేయుడు మరియు సాహితీవేత్త. ఆయన దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని జైలుకు వెళ్లారు. యువత అభివృద్ధిని కాంక్షించి వారికి మార్గదర్శకునిగా నిలవడమే కాకుండా దేశంపట్ల ఆయన ప్రేమ అంకితభావం నిరుపమానమైనవి. దేశానికి స్వాతంత్య్రం రాకముందు తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రజలను ప్రభావితులను చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయన తన కృషిని కొనసాగించి, తద్వారా జాతి నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంగాబాద్ జిల్లా బవాయి గ్రామంలో ఏప్రిల్ 4 1889లో ఆయన జన్మించారు. మఖన్ లాల్ చతుర్వేది తన పాత్రికేయ జీవితం మొదలు పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం ఉండేది. జాతీయ భావాల గురించి మాట్లాడుకునేవారు. సాంఘిక సంస్కరణల గురించి చర్చించేవారు, దేశాన్ని బ్రిటన్ పాలకులను వెళ్ళగొట్టాలనే భావాలు అధికంగా వుండేవి. 1913లో ఖాండ్వాకు చెందిన కాలురామ్ గంగా రణడే అనే ఆయన ప్రభ అనే మాస పత్రికను ప్రారంభించి దాని సంపాదకీయ బాధ్యతలను మఖన్ లాల్ కు అప్పగించారు.

తన జీవితాన్ని జర్నలిజానికి, సాహిత్యానికి, జాతీయ ఉద్యమానికి అంకితం చేయడంకోసం మఖన్ లాల్ 1913లో తన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రభ అనే ఉత్తమ నాణ్యత కలిగిన సాహిత్య పత్రికను ప్రచురిస్తూ దాని ద్వారా స్వాతంత్య్ర్య ఉద్యమానికి సేవలందించారు. ప్రభలో ప్రచురించిన రచనల కారణంగా అది చాలా వేగంగా ప్రజల అభిమానం పొందింది. హిందూ సాహిత్య ప్రపంచంలో పేరు సంపాదించుకుంది. ప్రజలను జాగృతం చేసే రచనలు అందులో రావడమే ఆ పత్రిక పేరు ప్రతిష్టలకు కారణం.

కాన్పూర్ నుంచి ప్రతాప్ అనే వారపత్రికకు సంపాదకత్వం వహిస్తున్న గణేష్ శంకర్ విద్యార్థితో మఖన్ లాల్ కలిశారు. 1920లో జరిగిన మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో మొదటగా అరెస్టయిన వ్యక్తి మఖన్ లాల్. జులై 17, 1920లో మఖన్ లాల్ నాయకత్వంలో కరమ్ వీర్ ప్రచురణ మొదలైంది. రాజస్థానాల గురించి అందులో రచనలు వచ్చేవి. ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఈ మ్యాగజైన్ రచనల్ని ప్రచురించేవారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది రాజులు ఆ పత్రికకు తమ మద్దతును ఉపసంహించుకున్నారు. ఆ పత్రిక తన అస్థిత్వాన్ని కొనసాగిస్తూనే రకాల సమస్యలను ఎదుర్కొంది. కరమ్ వీర్ పత్రిలో స్వాతంత్యం పైనే కాకుండా ఇతర అనేక అంశాల పైన ప్రచురితమైన రచనలు ఆ కాలంలో దేశాన్నంతా అట్టుడికించేవి. అందులో సహాయ నిరాకరణ, ప్రజాస్వామ్యం, ఖిలాఫత్, రౌలత్ చట్టం, పంచాయితీ రాజ్, హిందూ ముస్లిం వివక్ష విధానాల విప్లవ ఉద్యమం, అతివాద మితవాద పార్టీలు ఇలా అనేక అంశాల పైన రచనలు వెలువడేవి.

మఖన్ లాల్ చతుర్వేది చాలా ఉత్సాహంగా కరమ్ వీర్ పత్రిక సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేవారు. దాంతో ఆయన బ్రిటన్ పాలకుల కంట్లో నలుసుగా మారారు. ఆయన అరెస్టయినప్పుడు దాన్ని ఖండిస్తూ మహాత్మా గాంధీ, గణేష్ శంకర్ విద్యార్థి తమ యంగ్ ఇండియా, ప్రతాప్ పత్రికల్లో సంపాదకీయాలు రాశారు. వాటి ద్వారా తీవ్రస్వరంతో బ్రిటన్ పాలకులను హెచ్చరించారు. అంతే కాదు దేశవ్యాప్తంగా వున్న పలు వార్తా పత్రికలు ఆయన అరెస్టును గట్టిగా ఖండించాయి. మఖన్ లాల్ చతుర్వేది తన విలువలతో కూడిన జర్నలిజ ప్రమాణాలను కరమ్ వీర్ పత్రికలో చాటారు. ఆయన పాత్రికేయం భారతీయ జర్నలిజానికి లభించిన ఒక అమూల్యమైన వారసత్వం. తన జర్నలిజం జీవితం ద్వారా ప్రభ, ప్రతాప్, కరమ్ వీర్ పత్రికల ద్వారా ఆయన ప్రజల్లో చైతన్యాన్ని రగలించారు.
Gourishankar Ray


జర్నలిజం ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు ఇచ్చిన యోధుడు గౌరీ శంకర్ రాయ్: మొదటి ఒడియా మాగజైన్ ఉత్కల్ దీపికను 1866లో గౌరీ శంకర్ రాయ్ ప్రచురించారు. నాడు సంభవించిన తీవ్ర కరువు సమయంలో బ్రిటీష్ పాలకుల వైఖరిని బయటపెడుతూ ఒడిషా యువతలో చైతన్యం రగిలిస్తూ ఈ పత్రికను ప్రారంభించారు. ఆ సమయంలో ఒడిషా వ్యాప్తంగా వచ్చిన కరువులో పది లక్షలకు పైగా ప్రజలు చనిపోయారని తెలుస్తోంది. ఆ సమయంలో భారతదేశంలో సొంత పరిపాలన వుండి ఉంటే అలాంటి కరువు పరిస్థితులు తలెత్తేవి కావని ప్రజలు భావించారు. ఈ నేపధ్యంలో స్వేచ్ఛకోసం పోరాటం తీవ్రతరమైంది. కరువు కాలంలో గౌరీ శంకర్ రాయ్, బాబు విచిత్రానంద దాస్ కలిసి ఒరియా భాషలో ఉత్కల్ దీపికా పత్రికను ప్రచురించడం మొదలెట్టారు.

ఈ పత్రిక కారణంగా ప్రజలకు అన్ని విషయాలు తెలిసేవి. కరువుకు ప్రధాన కారణం ఎవరో తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఈ పత్రికను మొదట 13 జులై 1838లో కటక్ లో ఏర్పాటు చేశారు. అయితే మొదటి ముద్రణ గారి శంకర్ రాయ్ ఆధ్వర్యంలో 4 ఆగస్టు, 1866లో జరిగింది. అందుకే ఈ రోజున ఒడియా జర్నలిజం దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఒడిషా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్రాంత ప్రజల్లో స్వేచ్ఛాభావనలు రగిలించడానికిగాను గౌరీ శంకర్ రాయ్ ప్రారంభించిన మ్యాగజైన్ లో కరువు, గురించి వ్యాసాలను ప్రచురించారు. తన జాతీయ వాద ప్రధానమైన మ్యాగజైన్ ద్వారా ఆయన బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతీయుల ప్రయోజనాల కోసం పోరాటం చేశారు.

ఆయన తన పత్రికలో బ్రిటీష్ పాలనను నిశితంగా విమర్శిస్తూ ప్రజల డిమాండ్లను ముందుకు తీసుకువచ్చేవారు. వరదలు లాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఏం చేయాలనేదానిపై ఆయన తన పత్రికలో సూచనలు, సలహాలు చేసేవారు. ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన శక్తి భూషణ్ రథ్ తర్వాత రోజుల్లో ఒడియా దిన పత్రికను 1915లో బెర్హంపూర్ నుంచి ప్రచురించడం ప్రారంభించారు. అంతే కాదు గోవిందా సత్యవతి అనే పేరుతో పత్రికను ప్రచురించారు. అందులో ఒడియా సాహిత్యాన్ని ప్రోత్సహించారు.

ఒక పక్క బ్రిటీష్ వారు బైబిళ్లను ప్రచురించి వాటిని ఇంటింటికీ పంచుతుంటే ఆయన మహాభారతం, రామాయణం, ఇంకా ఇతర భారతీయ ఇతిహాసాలను తన ముద్రణాలయం ద్వారా ఒడియా భాషలో ప్రచురించేవారు. బ్రహ్మ సమాజంలో భాగంగా పని చేసిన గౌరీ శంకర్ రాయ్ రాష్ట్రంలో సంగీతం, నాటక కళల్ని ప్రోత్సహించడంలో కీలకంగా పని చేశారు. అంతే కారు సమాజంలో సాంస్కృతిక అభివృద్ధికోసం ఇతోధికంగా కృషి చేశారు.

మరికొంత మంది గురించి మరో వ్యాసంలో తెలుసుకుందాం లేదా మన వెబ్ సైట్ లో చూసినప్పటికీ బాలగంగాధర్ తిలక్, బరీంధ్ర ఘోష్, డాక్టర్ హెడ్గేవార్, అరవింద్ ఘోష్, మదన్ మోహన్ మాలవీయ, మహాత్మా గాంధీ, జి.సుభ్రహ్మణ్య అయ్యర్, శిశిర్ కుమార్ ఘోష్, మోతిలాల్ ఘోష్, కె.రామకృష్ణ పిల్లై ఇలాంటి ఎందరో వీరులు పత్రికా సంపాదకులుగా పత్రికలు నడిపారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments