Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

1857 నాటి స్వాతంత్య్ర పోరాటం భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం First War of Independence 1857

1857 నాటి స్వాతంత్య్ర పోరాటం భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం: భారత స్వాతంత్య్ర్య పోరాట చరిత్రలో 1857 పోరాటం ఒక కీలక ఘట్టం, మాతృ...

1857 నాటి స్వాతంత్య్ర పోరాటం భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం: భారత స్వాతంత్య్ర్య పోరాట చరిత్రలో 1857 పోరాటం ఒక కీలక ఘట్టం, మాతృభూమిని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు ఎందరో విప్లవకారులు తమ ప్రాణాలను అర్చించారు. ఆ సమయంలో కులం మతం, వర్గం, హోదా, ప్రాంతం, భాషా ప్రాతిపదికలకు ఎలాంటి చోటూ లేకుండా అన్నిటికీ అతీతంగా ఈ తిరుగుబాటు సాగింది. అప్పటికే వంద సంవత్సరాలకు పైగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పాలిస్తోంది. 1857 మే 10వ తేదీని మొట్టమొదట చెలరేగిన ఈ స్వాతంత్య్రపు జ్వాల, తిరుగుబాటు బ్రిటన్ దాస్య శృంఖలాలను ఛేదించేందుకు యావత్తు భారతదేశం ఐక్యంగా నిలబడేలా చేసింది.

ఏ దేశమైనా చరిత్రను గౌరవించకపోతే, ఆ దేశ భవితకు బలమైన పునాదులు చేసిన వారిని గౌరవించకపోతే ఆ దేశ భవిష్యత్ సురక్షితంగా ఉండదు. 200 సంవత్సరాలకు పైగా భానిసత్వంలో మగ్గిన భారతదేశ చరిత్రను చాలాసార్లు తప్పుగా వ్రాశారు. స్వాతంత్యం వచ్చిన తర్వాత చరిత్రను పరిరక్షించుకునే ప్రత్యేక ప్రయత్నాలు ఏమీ జరగలేదు. చరిత్రను మరుగునపడేస్తూన్నారనడానికి 1857లో జరిగిన స్వాతంత్య్ర పోరాటం కూడా ఒక ఉదాహరణ. దీన్ని ప్రపంచం సిపాయి తిరుగుబాటుగా పిలుస్తుంది. కానీ 52 సంవత్సరాల తరువాత 1909లో వినాయక్ దామోదర్ సావర్కర్ రాసిన "ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857" అనే పుస్తకం ఈ ఉద్యమానికి ఉన్న విశ్వసనీయత చాటింది. ఇది భారతదేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన మొదటి ఉద్యమం, వీర్ సావర్కర్ అనే వ్యక్తి లేకపోతే, 1857 విప్లవం అసలు భారతదేశ చరిత్రలో భాగమై ఉండేది కాదు, మనం దీన్ని బ్రిటీష్ వారి దృష్టికోణం నుంచే చూడవలసిన పరిస్థితి ఏర్పడేదని మనం మరచిపోకూడదు.

1857 విప్లవం భారత స్వాతంత్య్ర్య ఉద్యమ చరిత్రలోనే అతి పెద్ద పోరాటం. కమలం, రొట్టె ముక్క దాని ప్రతీకలుగా ఉండేవి. 1857 మే 31వ తేదీని ఆ విప్లవానికి నాంది పలికే దినంగా నిర్ణయించారు. అయితే ఈ విప్లవం మీరట్ కంటోన్మెంట్ నుండి కొన్ని వారాల ముందే మే 10వ తేదీనే ప్రారంభమైంది. గ్రీజు కాట్రిజులను ఉపయోగించేందుకు నిరాకరించినందుకుగానూ భారత సైనికులను జైలులో పెట్టాలని కోర్ట్- మార్షల్ ఆదేశించింది.

కానీ తిరుగుబాటు దారులు జైలు గోడలు బద్దలు కొద్ది వారికి అడ్డువచ్చిన ప్రతి బ్రిటీష్ అధికారిని చంపేశారు. వారు ఒక గ్రామం దగ్గర గుమిగూడారు. తర్వాత ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించారు. చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ను వారు తమ నాయకుడిగా ప్రకటించుకున్నారు. ఈ తిరుగుబాటుకు సంబంధించిన సమాచారం తెలియగానే మీరట్ నుంచి ఢిల్లీ మార్గంలో అనేక మంది ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వీరికి మద్దతు తెలుపుతూ ఉద్యమంలో పాల్గొన్నారు. దాంతో బ్రిటీష్ వారు భారతదేశంలో భారీ ఎత్తున జరుగుతున్న సామూహిక ప్రతిఘటనను మొట్టమొదటి సారిగా ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.

పీష్వా, నానా సాహిబ్, తాంత్యా తోపే, రాణి లక్ష్మీబాయి, బాబు కున్వర్ సింగ్, అజీముల్లా ఖాన్, బేగం హజ్రత్ మహల్ పంటి ప్రముఖులతోపాటు ఎందరో విప్లవకారులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమ జ్వాలను అణచేయడానికి బ్రిటీష్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. ఫలితంగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. ఈ విప్లవం భారతదేశంలో భూస్వామ్య యుగానికి తెరదించి, ప్రగతిశీల, విద్యావంతులైన కొత్త శకానికి జన్మనిచ్చింది.

ఈ తిరుగుబాటు భారత రాజకీయాలను, పరిపాలన, సామాజిక, ఆర్థిక వ్యవస్థ, జాతీయ స్పూర్తిని ఎంతగానో ప్రభావితం చేసింది. నిజానికి, 1857 విప్లవం కేవలం సాధారణ సిపాయిల తిరుగుబాటో, లేదా సంఘటనలకు తక్షణ ప్రతిచర్యగా జరిగిన తిరుగుబాటు కాదు. ఇది భారతమాత స్వేచ్ఛా వాయువుల కోసం మన స్వాతంత్య్ర్య సమరయోధులు చక్కటి యుక్తితో చేసిన స్వాతంత్య పోరాటం, దాని ఫలితంగానే 90 ఏళ్ళ తరువాత 1947లో భారతదేశం స్వాతంత్య్ర్యాన్ని పొందగలిగింది. మీరట్ లో ఈ స్వాతంత్య్ర పోరాటం జరిగిన ప్రదేశంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమరవీరులైన 85 మంది సిపాయిల జ్ఞాపకార్ధం బలిదాన స్మారకం నిర్మించారు.

1857 స్వాతంత్ర్యోద్యమం 165 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అలాగే ఆజాది కా అమృత మహోత్సవాలలో భాగంగా భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన తాంత్యా తోపే, ఉదా దేవి, ఈశ్వరీ ప్రసాద్, సోదరులు నీలాంబర్, పీతాంబర్, ఇండా పియాలీ ఐదు గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

గెరిల్లా యుద్ధ కథానాయకుడు తాంత్యా తోపే: తాంత్యా తోపే, 1857 తిరుగుబాటులో పాల్గొన్న అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరుగా నిలిచారు. ఆయన 1857 స్వాతంత్యోద్యమానికి పునాది వేయడమే కాదు. దేశమాత స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పాటుపడే విధంగా ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాడు.
Tatya Tope


తాంత్యా తోపే 1814 ఫిబ్రవరి 16న జన్మించారు. ఆయన అసలు పేరు రామచంద్ర పాండురంగా రావు, మహరాష్ట్రలోని యోలా గ్రామం. ఆయన స్వస్థలం. పీష్వా బాజీరావ్ -2 పూణే విడిచి కాన్పూర్ సమీపంలోని బితుర్ ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు పూణే నుంచి అనేక కుటుంబాలు అతనితోపాటు కలిసి వెళ్ళాయి. వారిలో పాండురంగ కుటుంబం కూడా ఉంది. పాండురంగ తన భార్య, రామచంద్ర, గంగాధర్ అనే ఇద్దరు పిల్లలతో కలిసి బితుర్ వచ్చారు. తాంత్యా తోపేకి బితూర్లో నానా సాహెబ్, మోరోపంత్ తాంబే అంటే (రాణీ లక్ష్మీబాయి తండ్రి) తో పరిచయం ఏర్పడింది. నానా సాహెబ్ కి అత్యంత సన్నిహితుడు కావడంతో తాంత్యా తోపే దీవాను, ప్రధానమంత్రి, ఆర్మీ సిబ్బందిలో సైన్యాధ్యక్షుడు వంటి అనేక పదవులు నిర్వహించారు.

బ్రిటీష్ వారు ఝాన్సీని ముట్టడించినప్పుడు నానా సాహెబ్ తాంత్యా నాయకత్వంలోని సైన్యాన్ని ఝాన్సీకి పంపారు. తాంత్యా తోపే సైన్యం ఈ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినప్పటికీ విజయం సాధించలేకపోయిందని విష్ణుబట్ గాడ్సే తాను రచించిన మజ్జా ప్రవాస్ యాత్రా గ్రంథంలో పేర్కొన్నారు. తాంత్యా తోపే కాన్పూర్, చర్కారి, ఝాన్సీ, కోచ్ యుద్ధాలకు నాయకత్వం వహించాడు. అయితే దురదృష్టవశాత్తు వారి సైన్యం చర్కారే యుద్ధంలో తప్ప మిగతా చోట అపజయం పాలైంది. తాంత్యా, లక్ష్మీభాయిలకు గ్వాలియర్లో విజయం లభించింది.

గ్వాలియర్ కోటను తాంత్యా స్వాధీనం చేసుకోవడంతో బ్రిటీష్ వాడు ఆశ్చర్యానికి గురయ్యాడు. దాంతో బ్రిటీషువారితో భయంకరమైన యుద్ధం మళ్ళీ మొదలైంది. అందులో లక్ష్మీబాయి వీరమరణం పొందింది. అయితే నానా సాహేబ్ అల్లుడు రావ్ సాహేబ్, తాంత్యా ఇద్దరూ బ్రిటీష్ వారి నుంచి తప్పించుకున్నారు. యుద్ధంలో తాంత్యా తోపే నుంచి వచ్చిన ప్రతిఘటన అతన్ని గొప్ప వీరుడిగా ఉన్నత స్థాయిలో ప్రతీచోటా తిరుగుబాటుదారులను అణచివేస్తున్నప్పటికీ తాంత్యా బ్రిటీష్ సైన్యాన్ని ఒక సంవత్సరం పాటు సుదీర్ఘకాలం నిలువరిచగలిగాడు. ఈ సమయంలో ఆయన శత్రువులకు వ్యతిరేకంగా భీకర గిరిల్లా యుద్ధం నిర్వహించాడు.

తాంత్యా తోపే నాయకత్వాన తిరుగుబాటుదారులు మధ్యప్రదేశ్ రాజస్థాన్ లలోని దుర్గమమైన కొండచర్యలు, లోయలు, నదులు, దట్టమైన అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని గెరిల్లా యుద్ధం చేశారు. శివపురి సమీపంలో ఉన్న నార్వార్ రాజు మాన్ సింగ్ తాంత్యా ఎక్కడున్నదీ బ్రిటీషువారికి తెలియజేశాడని చెబుతారు. మాన్ సింగ్ చేసిన మోసం కారణంగా బ్రిటీష్ ప్రభుత్వం తాంత్యా ను 1859 ఏప్రిల్ 7న నిద్రపోతున్న సమయంలో పట్టుకున్నది.

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరగబడి యుద్ధం చేశాడనే ఆరోపణలతో శివపురి కోర్టు తాంత్యా తోపే ని 1859 ఏప్రిల్ 15న మరణశిక్ష విధించింది. ఏప్రిల్ 18వ తేదీన వేలాది మంది సమక్షంలో బహిరంగ ప్రదేశంలో తాంత్యాని ఉరి తీశారు. తాంత్యా ఏ మాత్రం బెదరకుండా ధృఢంగా తన మెడను ఉచ్చులో పెట్టాడని అంటారు. అయితే ఈ అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాంత్యా స్థానంలో బ్రిటీషువారు వేరెవరినో పట్టుకున్నారు అని కూడా అంటారు. తాంత్యా మరణం పట్ల వివాదం ఎలా ఉన్నప్పటికీ అతని శౌర్యం కచ్చితంగా బ్రిటీష్ సామ్రాజ్యాన్నికుదిపివేసిందనడంలో సందేహం లేదు.

ఉదా దేవి 1857 తిరుగుబాటులో 32 మంది బ్రిటీషు సైనికులను ఒంటి చేత్తో చంపిన వీర వనిత: 'రాణి లక్ష్మీభాయి లాగానే 1857 తిరుగుబాటులో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని విపరీతమైన ఇబ్బందులు గురిచేసిన వారిలో ఉదా దేవి కూడా ఉన్నారు. అర్హత ఉన్నప్పటికీ అంతగా పేరు, గౌరము లభించలేదు. అవధ్ ప్రాంతంలోని ఉజ్రియావ్ గ్రామంలో ఓ పేద కుటుంబంలో ఆమె జన్మించింది. ఉదాదేవికి చిన్నతనం నుంచి బ్రిటీషువారి పట్ల ద్వేషం ఉండేది.
Uda Devi


బ్రిటీష్ వారు 1856లో అవధ్ నవాబు వాజిద్ అలీని కలకత్తాకు బహిష్కరించారు. దాంతో అవధ్ ప్రాంతం ఆయన భార్య హజ్రత్ మహల్ చేతుల్లోకి వెళ్ళింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వవలసిందిగా ఉదా దేవి హజ్రత్ మహల్ ని అభ్యర్థించింది. అందుకామె ఒప్పుకుంది. శిక్షణ పొందిన, స్త్రీలు ఒక బృందంగా సిద్ధం చేయమని బేగం కోరింది. అదే సమయంలో ఉదా దేవికి అవధ్ సైనికుడైన మక్కా పాసితో వివాహం జరిగింది. 1857 జూన్ 10వ తేదీ లక్నోలోని చిణట్ పట్టణ సమీపంలోని ఇస్మయిల్ గంజ్ ప్రాంతంలో తిరుగుబాటుదారులకు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన యుద్ధంలో మక్కా పాసి అమరుడయ్యాడు. భర్త మరణం దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆ మరణం ఉదాదేవికి ప్రేరణగా మారింది.

దాంతో తన భర్త బలిదానానికి ప్రతీకారం తీర్చుకుంటానని ఉదాదేవి ప్రతిజ్ఞ చేసినట్టు చెబుతారు. 1857 నవంబర్ 16న భారీ సంఖ్యలో వచ్చిన బ్రిటీష్ సైన్యం లక్నోలోని సికందర్ బాగ్ ప్రాంతాన్ని ముట్టడించింది. ఆ సమయంలో సుమారు రెండు వేల మంది భారత సైనికులు సికందర్ బాగ్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇంగ్లీష్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉదాదేవి తన మహిళా సైనిక బృందాన్ని ఆదేశించింది. అదే సమయంలో ఆమె పురుషులు దుస్తులు ధరించి, రెండు చేతుల్లో తుపాకి మందుగుండు సామాగ్రిని పట్టుకుని రావి చెట్టు ఎక్కింది. అక్కడి నుంచి ఆమె బ్రిటీష్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంది.

ఆమె వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి మొత్తం అయిపోయేంతవరకు ఆమె బ్రిటీష్ సైన్యాన్ని నిలువరించి, సికందర్ బాగ్ ఆక్రమించకుండా అడ్డుకోగలిగింది. ఉదాలేవి ఒక స్మయపర్ లా దాడి చేసి 32 మంది బ్రిటీష్ సైన్యాన్ని మట్టుబెట్టింది. బుల్లెట్లు చెట్టు నుంచి దూసుకువస్తున్నాయని బ్రిటీష్ సైన్యం గమనించింది. ఉదాదేవి చెట్టు దిగుతుండగా బ్రిటన్ సైనికులు ఆమెను కాల్చి చంపేశారు. ఉదాదేవి పరాక్రమానికి ఆశ్చర్యపోతూ బ్రిటీష్ జనరల్ తన టోపీ తీసి ఆమెకు సెల్యూట్ చేశాడని చెబుతారు. ఆమె పేరు బ్రిటీష్ వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. ఉదాదేవి శౌర్యాన్ని, పరాక్రమాన్ని ప్రశంసిస్తూ పిలిబిత్ ప్రాంతంలోని జానపద పాటలు పాడుతుంటారు. ఉదాదేవి పరాక్రమం, మాతృభూమి పట్ల అంకితభావం యావత్తు భారతదేశ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

Piyali Baruah


పియలి బరువా 1857 స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీషు వారికి వ్యతిరేకంగా అస్సాంలో తిరుగుబాటు చేసిన యోధుడు: పియలి బరువా 1857లో జరిగిన స్వాతంత్య ఉద్యమంలో మరుగ్గా పాల్గొనడమే గాక, మరో ఉద్యమకారుడు మణిరాం దేవన్ తో కలిసి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదిలించారు. అస్సాం నాయకుడు స్వాతంత్య్ర్య సమరయోధుడు పియలి బరువా అస్సాం స్వాతంత్యం కోసం బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అస్సాంలో చీఫ్ కెప్టెనెంట్గా ఉంటూ బ్రిటీష్ కు వ్యతిరేకంగా అన్ని రకాల పథకాలను రచించి అమలు చేశారు. బ్రిటీషువారికి వ్యతిరేకంగా జరిగిన ఈ మొదటి యుద్ధంలో తిరుగుబాటుకు ఒక రూపాన్నివ్వటంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

పియలి బరువా సాధారణ జీవితం గడిపేవారు. పాశ్చాత్య, ప్రభావానికి దూరంగా ఉండేవారు. 1857లో జరిగిన మొట్టమొదటి స్వాతంత్య పోరాటంలో పియలి బరువా బ్రిటీష్ పాలనను ప్రతిఘటించాలని అస్సాం యువతకు పిలుపునిచ్చి, విప్లవకారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. మణిరామ్ కలకత్తా లో ఉన్నప్పటికీ పియలి బరువాతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ ఇద్దరూ కలిసి బ్రిటన్ కు వ్యతిరేకంగా వ్యూహాలు రూపొందించేవారు. అయితే వారి రహస్య సమావేశానికంటే ముందరే వారి పథకం ఒకటి విఫలమైంది. దాంతో బ్రిటిషువారు మణిరామ్ దేవన్ని కలకత్తాలో, పియలి బరువాని జోర్హట్ లో అరెస్ట్ చేశాడు. దేశ ద్రోహం అరోపణ కింద వారిద్దరినీ 1858 ఫిబ్రవరి 26న జోర్హాట్ లో బహిరంగంగా ఉరితీశారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26న ఈ అమరవీరులకు దేశం మొత్తం నివాళులు అర్పిస్తుంది. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీషువారికి వ్యతిరేకంగా సాగించిన పోరాటానికి, త్యాగానికి గోరవార్ధం వీరిద్దరి విగ్రహాలు గౌహతిలో స్థాపించారు.

బ్రిటీషు వారిని గడగడలాడించిన నీలాంబర్, పీతాంబర్ గెరిల్లా యుద్ధ వ్యుహాలు: ఝార్ఖాండ్ కి చెందిన నీలాంబర్, పీతాంబర్ ఇద్దరూ 1857లో జరిగిన మొదటి స్వాతంత్య్ర్య పోరాటంలో దేశమాత స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప స్వాతంత్య్ర్య సమరయోధులు, నీలంబర్, పీతాంబర్ ఝార్ఖండ్ లోని పాలము ప్రాంతానికి చెందినవారు. చిన్నతనం నుంచి వీరికి దేశభక్తి భావన మెండుగా ఉండేది.

బ్రిటీషువారికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో తోబుట్టువులిద్దరూ భోగ్తా, ఖార్వార్ అనే రెండు సంఘాలనూ ఐక్యం చేసి శక్తివంతమైన సంస్థను ఏర్పాటు చేశారు. బ్రిటీషువారికి వ్యతిరేకంగా తిరగబడడం కోసం తమ శక్తిని బలపరుచుకునేందుకు వీరు చెరెన్ కి చెందిన జాగీర్దారులతో స్నేహం చేశారు. వారి పోరాటంలో భాగంగా బాబు కున్వర్ సింగ్ తో తరచూ సమావేశమయ్యేవారు.

గెరిల్లా యుద్ధ నిర్వహణలో అన్నదమ్ములిద్దరూ నిష్ణాతులు. వీరి వ్యూహ రచన బ్రిటీషువారిని దిగ్భ్రాంతికి గురిచేసేది, వీరి నాయకత్వంలో బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడేందుకు గ్రామీణులు పెద్ద సంఖ్యలో స్వాతంత్య్ర్య సమర ఉద్యమంలో చేరారు. ఈ ప్రజల ఉద్యమం బ్రిటీష్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించింది. ఫలితంగా తిరుగుబాటును అణిచివేసేందుకు స్వయంగా ఆ ప్రాంతపు కమీషనర్ డాల్టన్ 1858 జనవరిలో పాలముకి రావాల్సివచ్చింది. అతనితోబాటు ఒక పెద్ద సైన్యం కూడా రావడంతో ఆ తర్వాత పోరాటం తీవ్రరూపం దాల్చింది. అనేక విధాలుగా ప్రయత్నాలు సాగింది. చివరకు కల్నల్ డాల్టన్ ఈ సోదరులిద్దరినీ పట్టుకోగలిగారు. 1859లో, వీరిద్దరినీ బహిరంగంగా మామిడి చెట్టుకు ఉరితీశారు. దాంతో గిరిజనుల మనోదైర్యం దెబ్బతినింది.
neelambar-peetambar-megaminds



నీలాంబర్, పీతాంబర్ గ్రామమైన కీమో సన్యాలో ఆ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. ఈ చెట్లకిందే ఈ అన్నదమ్ములిద్దరూ బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాదేందుకు వ్యూహరచన సాగించేవారు. నీలాంబర్, పీతాంబర్ ఇద్దరినీ 1857 స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప నాయకులు. వీరు పలము డివిజన్ లోనే కాకుండా ఆర, భోజ్ పూర్, సుర్గుజా, రాంచీ, లోహర్థగా, గుంలా, చత్ర ప్రాంతాలలో కూడా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.

2021 నవంబర్ 15న, రాంచీలో భగవాన్ బీర్సా మూండా మెమోరియల్ ఉద్యాన్ స్వాతంత్య్ర్య సమరయోధుల మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గిరిజనుల ప్రతిష్టాత్మక దినోత్సవం సందర్భంగా నీలాంబర్- పీతాంబర్ గురించిన సమాచారం, ఇతర గిరిజన స్వాతంత్య్రం సమరయోధులకు సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శనకు పెట్టారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

1 comment

  1. మీరు చేయుచున్న ఈ ప్రయత్నం మరో స్వాతంత్ర సమరానికి పునాది. జై భారత్.

    ReplyDelete