Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆస్ట్రేలియా జగత్ తారిణి దాసి గురించి తెలుసా?

భగవంతుని ప్రేమకు ప్రత్యక్ష స్వరూపంగా బృందావనాన్ని చెప్తారు. బృందావన మహిమను మనందరం మన శక్తికి తగ్గట్టుగా చెప్పుకుంటాం. కానీ బృంద...

భగవంతుని ప్రేమకు ప్రత్యక్ష స్వరూపంగా బృందావనాన్ని చెప్తారు. బృందావన మహిమను మనందరం మన శక్తికి తగ్గట్టుగా చెప్పుకుంటాం. కానీ బృందావన అంటే ఆనందం, ఈ ప్రదేశం అందించే అనుభూతి, దాని తాదాత్మ్యత పొందితే తప్ప మనకు తెలియదు. ఇది అపరిమితంగా ఉంటుంది. అందుకే బృందావనం ప్రపంచం నలుమూలల ప్రజలను ఆకర్షిస్తోంది. మనం ప్రపంచంలోని ఏ మూలకెళ్ళినా దీని గురించి మనకు ఆనవాళ్ళు దొరుకుతాయి అంతటి గొప్ప ఆధ్యాత్మిక బృందావనం ద్వారా ప్రపంచానికి లభించింది.

పెర్త్ పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక నగరం. క్రికెట్ ప్రేమికులు ఈ పెర్త్ తో బాగా పరిచయం కలిగి ఉంటారు. ఎందుకంటే పెర్త్‌లో క్రికెట్ మ్యాచ్‌లు తరచుగా జరుగుతాయి. పెర్త్‌లో 'సాక్రెడ్ ఇండియా గ్యాలరీ' పేరుతో కళా ప్రదర్శన శాల కూడా ఉంది. ఈ గ్యాలరీని స్వాన్ వ్యాలీలోని ఒక అందమైన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా నివాసి జగత్ తారిణి దాసి గారి కృషి ఫలితంగా ఇది ఏర్పాటైంది. జగత్ తారిణి గారు ఆస్ట్రేలియాకు చెందినవారు. ఆమె అక్కడే పుట్టారు. అక్కడే పెరిగారు. అయితే ఆమె బృందావనం వచ్చిన తర్వాత 13 సంవత్సరాలకు పైగా కాలాన్ని ఇక్కడే గడిపారు. తాను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళినా బృందావనాన్నిమరచిపోలేనని చెప్పారు.

అందువల్ల బృందావనంతో, దాని ఆధ్యాత్మిక స్ఫూర్తితో అనుసంధానమయ్యేందుకు ఆమె ఆస్ట్రేలియాలోనే బృందావనాన్ని ఏర్పాటు చేశారు. తన కళను మాధ్యమంగా చేసుకుని అద్భుతమైన బృందావనాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు అనేక రకాల కళాఖండాలను చూసే అవకాశం లభిస్తుంది. వారు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రాలు బృందావనం, నవద్వీప్, జగన్నాథ పూరీల సంప్రదాయం, సంస్కృతిల సంగ్రహావలోకనం పొందుతారు. శ్రీకృష్ణుని జీవితానికి సంబంధించిన అనేక కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు తన చిటికెన వేలితో ఎత్తిన ఒక కళాఖండం కూడా ఉంది. దాని కింద బృందావన ప్రజలు ఆశ్రయం పొందారు. జగత్ తారిణి గారి ఈ అద్భుతమైన ప్రయత్నంకృష్ణభక్తి లోని శక్తిని చూపిస్తుంది. ఈ ప్రయత్నానికి వారందరిని మనం అభినందించాలి అలాగే ధన్యవాదాలు కూడా తెలుపాలి.

అలాగే మన బుందేల్‌ఖండ్‌కు చెందిన ఝాన్సీతో ఆస్ట్రేలియాకు కూడా సంబంధం ఉందనేది ఆసక్తికరమైన విషయం. నిజానికి ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు ఆమె న్యాయవాది జాన్ లాంగ్. జాన్ లాంగ్ నిజానికి ఆస్ట్రేలియా వాసి. భారతదేశంలో ఉండి ఆయన రాణి లక్ష్మీబాయి విషయంలో పోరాడాడు. మన స్వాతంత్ర్య పోరాటంలో ఝాన్సీ, బుందేల్‌ఖండ్‌ల భాగస్వామ్యం మనందరికీ తెలుసు. రాణి లక్ష్మీబాయి, ఝల్కారీ బాయి వంటి వీరనారీమణులు ఇక్కడివారే. మేజర్ ధ్యాన్ చంద్ వంటి ఖేల్ రత్నను కూడా ఈ ప్రాంతమే దేశానికి అందించింది.

ఆస్ట్రేలియా మరియు భారత్ ల మద్య సత్సంభందాలు ఇలాంటి కొన్ని చరిత్ర ఆదారిత విషయాల కారణంగా దృఢంగా వుంది. సనాతన ధర్మ్ కీ జయ్, భారత్ మాతా కీ జై.. జై హింద్.

సావర్కర్ వ్రాసిన అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి:
మా వాట్సాప్ నెంబర్ : +91 8500-5819-28

or Directly Buy

No comments