Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఈ పి ఎఫ్ ఓ ఆన్లైన్ లో ఈ నామినీ చేయండి 7 లక్షలు బీమా పొందండి

ఈపీఎఫ్‌ఓ డిజిటలైజేషన్‌:  ఈపీఎఫ్‌ఓ గత కొంత కాలంగా డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఈపీఎఫ్‌ చందాదారుడిగా నమోదైనప్పుడే ...


ఈపీఎఫ్‌ఓ డిజిటలైజేషన్‌: ఈపీఎఫ్‌ఓ గత కొంత కాలంగా డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఈపీఎఫ్‌ చందాదారుడిగా నమోదైనప్పుడే సభ్యుల నామినీ వివరాలను కాగితం రూపంలో సేకరించింది. ఆ వివరాలు పూర్తిస్థాయిలో డిజిటైలేషన్‌ కాలేదు. దీంతో చందాదారుడు చనిపోయినపుడు వారసులకు ఈపీఎఫ్‌ మొత్తం, పింఛను, ఉద్యోగి డిపాజిట్‌ ఆధారిత బీమా(ఈడీఎల్‌ఐ) అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు ఈ-నామినేషన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. చందాదారులు ఈ వివరాలను నమోదు చేసుకోవాలని గత కొంతకాలంగా సూచిస్తూ వస్తోంది. పీఎఫ్ ఖాతాదారులందరూ నామినీ పేరును నమోదు చేసుకోవడం తప్పనిసరి. కనుక పి ఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా నామినీ పేరును పూర్తిచేసుకోండి.

ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) బంపరాఫర్‌ ఇచ్చింది. ఈ నామినీ ప‍్రక్రియ నమోదు చేసిన వారికి లక్షల్లో ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

పీఎఫ్ నామినీ పేరును ఆన్ లైన్ లో ఎలా చేర్చాలి?

  • ఈపీఎఫ్ఓ https://unifiedportal-mem.epfindia.gov.in/ ​​అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీ యుఏఎన్, పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి. 
  • ‘మేనేజ్‌మెంట్’ ట్యాబ్ కింద ‘ఈ-నామినేషన్’పై క్లిక్ చేయండి. 
  • మీ కుటుంబం ఉంటే ‘అవును’ అని క్లిక్ చేయండి 
  • ఇప్పుడు నమోదు చేయలని అనుకున్న కొత్త నామినీ పేరు ఎంటర్ చేయండి.
  • ‘నామినేషన్ వివరాలు’పై క్లిక్ చేయండి 
  • డిక్లరేషన్ తర్వాత, ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి 
  • ఓటీపీని పొందడానికి ‘e-Sign’ని ఎంచుకోండి 
  • ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఫిల్‌ చేయండి. 
  • ఇప్పుడు కొత్త నామినీ ఈపీఎఫ్ఓలో నమోదు అయింది.

ఇలా  "ఈ-నామినేషన్ దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు"  

సభ్యుడు మరణించిన తర్వాత ఆన్‌లైన్ లో క్లయిమ్‌ చేసుకోవచ్చు.  

పేపర్‌లెస్, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్.

పీఎఫ్‌, పెన్షన్ ఆన్‌లైన్ చెల్లింపు.

అర్హులైన నామినీలకు రూ.7 లక్షల వరకు బీమా.

For English:

EPF NOMINATION ONLINE

You need to go to the EPFO website. Go to the services section and then to 'For Employees' category.

You need to click on 'Member UAN/Online Service.'

Login with Universal Account Number (UAN) and password.

Select 'E-Nomination' under 'Manage Tab'.

The 'Provide Details' tab will appear on screen. Click 'Save'.

Click 'Yes' to update family declaration.

Click 'Add Family Details'. (More than one nominee can be added).

Click 'Nomination Details' to declare the total amount of share.

Click 'Save EPF nomination'.

Click 'E-sign' to generate OTP. Submit 'OTP' sent to the mobile number linked with Aadhaar.


ఈ పోష్ట్ చూసిన ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ఉద్యోగులకు పంపడం మరచిపోవద్దు, ఇలా చేయడం వలన మీరు వారికి సాయం చేసిన వారవుతారు.

No comments