Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? - భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళల పాత్ర

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా: ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకొం...

international women's day


యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది.

మార్చి 8వ తేదీనే ఎందుకు జరుపుకోవాలి:- 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ''ఆహారం - శాంతి'' డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ( అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు ) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన ( ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్ ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.

'స్త్రీమూర్తి'ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ.. చెల్లిగా తోడుంటూ.. భార్యగా బాగోగులు చూస్తూ.. సేవకురాలిలా పనిచేస్తూ.. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది మహిళ. ఈ సంవత్సరం భారతదేశం స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు జరుపుకుంటుంది. భారతదేనికి స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత చరిత్ర సరిగా వ్రాయలేదు కుహనా లౌకిక వాదుల చేతిలో మన చరిత్ర నలిగిపోయింది. భారతదేశాన్ని శతాబ్దాలుగా పరిపాలించిన అనేక రాజవంశాలు ఉన్నాయి, కాని తక్కువ సంవత్సరాలు పాలించిన కొద్దిమంది ఆక్రమణదారులకు చరిత్రలో ఎక్కువ స్థానం లభించింది. చాలా మంది యోధులు, ముఖ్యంగా మహిళలు నిర్లక్ష్యం చేయబడ్డారు మరియు మనదైన చరిత్ర ఎక్కడా వ్రాయలేదు.

1176 సమయంలో ఘోరీ మహమ్మద్ గురించి పృధ్వీరాజ్ ని ఓడించాడు అని వ్రాశారే తప్ప ఘోరీ మహమ్మద్ ని ఓడించి మట్టికరిపించిన సోలంకి రాజు రాజా అజయపాల భార్య రాణీ నాయకీదేవీ వేసిన ఎత్తులకు చిత్తయి పలాయనం సాగించాడు ఘోరి, ఆ ప్రస్తావనే చరిత్రలో ఎక్కడాలేదు. ఇంకా గోండ్వానా రాణీ దుర్గావతి సాహస బలిదానం, పోర్చుగీస్ వారినెదిరించే సమయంలో భర్తతోనే తెగతెంపులు చేసుకుని సింధూ,గంగా సాగరాలపై ఆధిపత్యం చలాయించిన రాణీ అబ్బక్క చౌత‌ చరిత్రలో ఎక్కడా కానరాదు. శివగంగై రాణీ‌ వేలూ నాచియార్ అలాగే అంగరక్షకురాలు కుయిలి బలిదానం చరిత్రలో ఏ మూల వెతికినా దొరకదు. ఇలా మన దేశ రాణులు ఎప్పుడూ మహల్ కే పరిమితం కాకుండా కదనరంగంలో శతృవుల తలలు తెగనరికిన‌ స్త్రీ జాతి భారతదేశంలో తప్ప మరెక్కడా కనపడదు. పాశ్చాత్యులు స్త్రీని భోగవస్తువుగానే చూశారు, ఇక హక్కులు సంగతి పక్కనపెట్టండి అసలు గౌరవమేలేదు.

భారతదేశ చరిత్రలో 1857 లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామాన్ని సిపాయిల తిరుగుబాటుగా చరిత్ర వక్రీకరించి వ్రాశారు. కానీ ఈ స్వతంత్ర సంగ్రామంలో సుమారు రెండు కోట్లమంది సామాన్య ప్రజలు‌ పాల్గొన్నారు. మహిళలు మేము ఏ మాత్రం తక్కువ కాదంటూ ఝాన్సీ రాణీ లక్ష్మి బాయి వీరాంగణ గణంలో శిక్షణ పొంది తెల్లవాళ్ళ గుండెల్లో బాణాలు, కత్తులు దింపి తలలు తెగనరికారు ఒక ఝాల్కరీబాయి, దళిత వీరాంగని ఉదాదేవి ఒంటిచేత్తో 32 మంది బ్రిటిషర్లన్ని మట్టుబెట్టింది. అక్కచెల్లెళ్ళు శివదేవి, జయదేవీ తోమర్లు పసిప్రాయంలోనే బలిదానం అయ్యారు. మహల్ సుఖాలను వదిలిన బేగం హజ్రత్ మహల్. సమరసత, సద్బావన తీసుకురావడం కోసం పాటుపడుతూ 22 మంది మహిళా బృందం తో బ్రిటీషర్లని రాళ్ళతో, రోకళ్ళతో, కారంతో కొట్టి కొట్టి చంపిన మహాబిరి దేవి చరిత్ర ఏ కోశానా కానరాలేదు చరిత్రలో.

ప్రథమ స్వతంత్ర సంగ్రామం పూర్తయ్యాక ఎందరో వీరాంగనలు దేశం కోసం పోరాడారు వారిలో అత్యంత ముఖ్యులు బైకాజీ కామా అత్యంత సంపన్న పార్సీ కుటుంబంలో పుట్టిన ఆమె దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం ఉద్యమ పంతాను ఎంచుకుని భారతదేశం స్వాతంత్ర్యం వచ్చాక జెండా ఇలా ఉంటుంది అని చూపించి మరీ పాశ్చాత్య దేశాలలో అనేకమంది తో కలిసి పనిచేసింది. ఎక్కడో ఐర్లాండ్ లో జన్మించిన మార్గరేట్ నోబెల్‌ సోదరి నివేదిత గా మారి ఈ దేశ స్వాతంత్ర్యంకోసం, బాలికా విద్యకోసం ఒక అగ్నిశిఖలా పనిచేసింది. సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ లే కాక ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం లో లక్షలాది సామాన్య ప్రజానికం పాల్గొన్నారు. అందులో వేలాదిమంది మహిళలున్నారు. చిట్టాగాంగ్ వీరకిషోరి ప్రీతిలతా వడ్డేదార్, గదార్ పార్టీ గులాబ్ కౌర్, లక్ష్మీపతి రుక్మిణి, ఉమాబాయి‌ కుందాపూర్, రమాదేవి చౌధురి, రాజ్ కుమారీ‌గుప్తా, ఓరుగంటి మహాలక్ష్మమ్మ, పసిప్రాయంలో ఆంగ్ల అధికారిని‌ చంపి అండమాన్ జైలు శిక్ష ‌అనుభవించిన ఇద్దరు స్నేహితురాళ్ళు, నేతాజీకి తన చేతికున్న రెండు గాజులూ ఇచ్చి చచ్చేలోపు ఒక బ్రిటీషర్నైనా చంపుతా అన్న సరస్వతీ రాజమణి మరియు గోవా కి స్వాతంత్ర్యం తేవడం కోసం ‌కుటుంబం మొత్తం దేశం కోసం పనిచేసిన సుధాతాయి జోషి ఇలా ఎందరో దేశంకోసం అహర్నిశలు శ్రమించి, తపించి, జ్వలించిన జ్వాలామణులు మన దేశపు ఆడపడుచులు.

రాణీ‌ నాయకీ దేవి‌ మొదలుకొని‌ సుధాతాయి‌జోషీ వరకు వీరందరిని‌ గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై వుంది. సత్యాన్ని అన్వేషించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మన స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను పునఃసమీక్షించి దేశం కోసం జ్వలించిన జ్వాలామణుల త్యాగాల గురించి తెలియజేసేందుకు ప్రయత్నం చేయాలి. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనసారా శుభాకాంక్షలు తెలియజేయండి.

సావర్కర్ వ్రాసిన అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి:
మా వాట్సాప్ నెంబర్ : +91 8500-5819-28

or Directly Buy

No comments