Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

1962లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై 12 పాయింట్లతో నిప్పులు చెరిగిన వీరసావర్కర్ - About congress by Vinayak Damodar Savarkar

దేశంలో పిల్లలకు సరియైన, నిష్పక్షపాతమైన చరిత్రను బోధించటం ఒక జాతీయ ప్రభుత్వపు ప్రధాన కర్తవ్యం. ఆ విధంగా చేయని ప్రభుత్వాన్ని తీవ్ర...

 1. దేశంలో పిల్లలకు సరియైన, నిష్పక్షపాతమైన చరిత్రను బోధించటం ఒక జాతీయ ప్రభుత్వపు ప్రధాన కర్తవ్యం. ఆ విధంగా చేయని ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సి వస్తుంది. ఎందుకంటే భ్రమలతో, భేదభావాలతో కూడిన చరిత్రను బోధించటం బౌద్ధికంగా ప్రజలను మోసం చేయటమే.
 2. ప్రస్తుత ప్రభుత్వం (1962లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ) ఒక పాఠ్య పుస్తకంలో "చివరకు భారతదేశం కేవలం గాంధీజీ చూపిన అహింసా మార్గంలోనే పోరాడి స్వాతంత్ర్యాన్ని పొంది 1950 లో రిపబ్లిక్ గా ఏర్పదింది" అని రాయించింది.
 3. చారిత్రకంగా చూస్తే గాంధీజీ చూపిన అహింసా మార్గంలోనే పోరాడి స్వాతంత్ర్యాన్నితెచ్చారు అనేది విషయం అబద్ధము, పక్షపాత పూరితమైంది. అందువల్ల నిందించదగింది. ఇంకా పాఠ్యపుస్తకాల ద్వారానే కాక, ఇతర సాధనాల ద్వారా కూడ అహింసామార్గంలోనే, ఒక రక్తపుబొట్టు కూడ చిందించకుండానే కాంగ్రెస్సే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని ప్రచారం చేయబడుతున్నది. తమ అధికారాన్ని నిలుపుకోటానికి, స్వార్థ ప్రయోజనానికి, చారిత్రక వాస్తవాలను వక్రీకరించి నవతరాలకు బోధించటం మంచిది కాదు.
 4. మనదేశానికి స్వాతంత్ర్యం పూర్తిగా విప్లవకారులు జరిపిన సాయుధ పోరాటంతోనే వచ్చిందని కూడ మేం అనం. మా ఉద్దేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం కేవలం ఏదో ఒక పార్టీ లేక సంస్థ జరిపిన పోరాటంతోనే రాలేదు. 1857 నాటి విప్లవవీరులు, దాదాభాయి నౌరోజీ మొదలుకొని గోఖలే వరకు గల మితవాదులు, అప్పటి విప్లవకారులు, అహింసావాద సత్యాగ్రహులు మొదలైన వాళ్లందరు మనదేశ స్వాతంత్య్రానికి కృషి చేసినవాళ్లే. అందువల్ల ఈ స్వాతంత్య్రం సాధించిన గౌరవం వాళ్లందరికీ సమానంగా లభించాలి.
 5. ఒకవేళ దేశభక్తి డబ్బుతో కొలిచేదైతే దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణా లర్పించిన విప్లవవీరులను కోహినూరు వజ్రంతో అలంకరించాలి. మదన్లాల్ దీంగ్రా, కన్నయలాల్, భగత్ సింగ్, మొదలైన దేశభక్తులు డబ్బు ఆశతో గాని మరే కోరికతో గాని బలిదానం చేయలేదు. అలాంటి విప్లవవీరులను అహింసావాదం పేరుతో కాంగ్రెస్ నాయకులు విమర్శించ బూనుకోవటం, వాళ్లకు చరిత్రలో స్థానం లేకుండా చేయటం ఏ మాత్రం భావ్యం కాదు.
 6. స్వాతంత్ర్య పోరాటపు పూర్తి గౌరవం గాంధీజీకి, కాంగ్రెస్కే దక్కుతుందని భావించటం అసంఖ్యాక విప్లవవీరులకు అన్యాయం చేయటమే. ఇది మన జాతీయ పురుషార్థాన్ని, హిందూజాతి పరాక్రమాన్ని క్షీణింపజేసి, మొత్తం జాతి పతనానికే దారితీస్తుంది.
 7. బ్రిటిషు పార్లమెంట్ భారత్ కు స్వాతంత్య్రం ఇవ్వాలన్న తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు, కదిలిపోతున్న ఆంగ్ల సామ్రాజ్య పునాదులను దృష్టికి తెస్తూ శ్రీ వినిస్టన్ చర్చిల్, అప్పటి ప్రధానమంత్రి అట్లీని 'భారత్కు స్వాతంత్య్రమీయక తప్పదా? మరోమార్గం లేదా?' అని అడిగాడు. అప్పుడు అట్లీ చర్చిల్తో ఇలా అన్నాడు - "బ్రిటిషు ప్రభుత్వం రెండు కారణాలవల్ల భారత్కు స్వాతంత్య్రమేయాల్సి వచ్చింది. మొదటి కారణం ఇదివరకు వలె దేశ శ్రేయస్సును బలిపెట్టే భారతీయ సైన్యం ఇప్పుడు ఆంగ్ల ప్రభుత్వం పట్ల భక్తివిధేయతలు కల్గిలేదు. రెండవ కారణం భారత్ ను అణచివేతతో తన వశంలో ఉంచుకోటానికి సరిపోను సైన్యం ఇప్పుడు బ్రిటిషు ప్రభుత్వం వద్ద లేదు.
 8. ఈ సందర్భంలో గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే అట్లీ (బ్రిటిష్) గాని లేక మరే పార్లమెంటు సభ్యుడు గాని 'గాంధీజీ అహింసా పోరాటానికి ప్రభావితమైగాని, ఆంగ్లప్రభుత్వానికి హృదయ పరివర్తన కలిగిగాని, భారతీయులను అణచివేయటం అనవసరమని భావించి గాని భారత్ కు స్వాతంత్ర్యం ఇస్తున్నామని చెప్పలేదు. ఇదెంతో చారిత్రక ప్రాముఖ్యత గల విషయం.
 9. వాస్తవం ఏమిటంటే విప్లవకారులు దేశభక్తి కార్యక్రమాలు, వాళ్లు చేసిన బ్రిటిషు వ్యతిరేక ప్రచారం ఈ రెంటితో మన సైన్యం మీద, ప్రజల మీద మంచి ప్రభావం పడింది. ఇంతేగాక విప్లవకారులు విదేశాల నుండి ఆయుధాలు పొంది ఆంగ్లేయులను పారదోలాలని యోజన చేశారు.
 10. విప్లవకారుల ద్వారా స్ఫూర్తి పొందిన భారతీయ సైనికులు కూడ తమ ఫిరంగులను బ్రిటిషు సామ్రాజ్యానికే గురిపెట్టటంతో ఆంగ్లప్రభుత్వం భయపడిపోయి భారత్ ను విడిచి వెళ్లక తప్పలేదు. ఈ వాస్తవాన్నే అప్పటి బ్రిటిషు ప్రధానమంత్రి కూడ చెప్పాడు.
 11. 1857 నుంచి నిరంతరం జరుగుతున్న విప్లవ పోరాటాలు, భారతీయ సైన్యంలోకి విప్లవకారుల ప్రవేశం, ఫ్రాంస్, ఇంగ్లాండ్ దేశాల్లో అభినవ భారత్ సంఘటన, రాసబిహారి బోన్ సాహసకార్యం, బ్రిటీషు భారతీయ సైనిక శిబిరా ల్లోకి తన సందేశాన్ని పంపి తిరుగుబాటు జ్వాలను రగిలింపజేసిన వీరపింగళే అద్వితీయ బలిదానం, ఉరికంబాలకెక్కిన అసంఖ్యాక చిరుప్రాయపు బలిదాన వీరుల త్యాగం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ చేసిన అద్భుత పోరాటం, భారత్ లోని నావికా, వైమానికదళాల తిరుగుబాటు మొదలైన సంఘటనలే భారత్ కు స్వాతంత్ర్యం రావటానికి కారణమైనాయి.
 12. చరిత్ర పవిత్ర వస్తువు. దానిలో వక్రీకరణలు చేయటం భావ్యం కాదు. భారతీయ చరిత్ర పవిత్రతను కాపాడటానికి, తమ నవయవ్వనంలో జీవన సుఖభోగాలను కాలదన్ని ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆ విప్లవకారుల నిస్వార్థ దేశభక్తి విలువను పరిగణనలోకి తీసుకొని రాయబడే చరిత్రే నిజమైన చరిత్ర అవుతుంది. ఆ విధమైన నిజమైన భారతీయ చరిత్రనే భారతీయ విద్యాలయాల్లో విద్యార్థులకు బోధించాలి.
సావర్కర్ వ్రాసిన అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి:
మా వాట్సాప్ నెంబర్ : +91 8500-5819-28

or Directly Buy


No comments