Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం 90 రోజుల ప్రచారం - ప్రచారంలో భాగస్వాములవ్వండి - రాజశేఖర్ నన్నపనేని

వీర సావర్కర్ గారి వర్ధంతి ఫిబ్రవరి 26 అలాగే జయంతి మే 28 ఈ లోపు వారి హృదయ స్పందనను, ఆలోచనలను కనీసం 16168 మందికి చేర్చాలనే మా మెగ...

వీర సావర్కర్ గారి వర్ధంతి ఫిబ్రవరి 26 అలాగే జయంతి మే 28 ఈ లోపు వారి హృదయ స్పందనను, ఆలోచనలను కనీసం 16168 మందికి చేర్చాలనే మా మెగామైండ్స్ ప్రయత్నం.
(Please Share in all FB & WhatsApp Groups)
జాతీయవాదులారా మెగామైండ్స్ కి మద్దతు తెలిపి సావర్కర్ గారి జాతీయ దృక్పదాన్ని గుండె గుండెకు చేర్చుదాం.

ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులకు భారత దేశానికి స్వాతంత్రం సిద్దించిన తరువాత చరిత్రలో చోటుదక్కలేదు, అలాగే దేశంకోసం సర్వస్వాన్ని త్యాగంచేసినప్పటికీ కుహనలౌకికవాదులు పిరికివాడిగా చిత్రిస్తూ, బ్రిటీషర్స్ కి క్షమాబిక్ష కోరుతూ ఉత్తరాలు వ్రాశాడంటూ హేళనలు, పెన్షన్ తీసుకున్నాడంటూ కట్టు కథలు అల్లుతూ ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైనా స్వాతంత్ర్య వినాయక దామోదర్ సావర్కర్ గారు ఒకరు. పేరులోనే స్వాతంత్ర్య చేర్చిపిలుచుకున్న ప్రజల నాయకుడతడు. భయం ఎరుగని యోధుడతడు. అతని గురించి ఇక నుంచి ప్రతి సంవత్సరం 90 రోజులపాటు వారి సాహిత్యాన్ని ప్రజలకు చేర్చాలని మెగామైండ్స్ సంకల్పించింది.

వినాయక దామోదర్ సావర్కర్ గారు తమ జీవితంలో మొత్తం 16 పుస్తకాలు దేశ హితార్దం వ్రాశారు. వాటిలో ఒకటి తను అండమాన్ జైలు లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, తన ఆలోచనలకు సంబందించినది అదే "అండమాన్ లో ఆజన్మాంతం" వీరసావర్కర్ జైలుగాథ ని తెలుగులో శ్రీ ఆచార్య కసిరెడ్డిగారు అనువదించారు, దీనిని సావర్కర్ జి సాహిత్య ప్రచారం, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలలో భాగంగా మెగామైండ్స్ పున:ముద్రించింది. ఈ పుస్తకాన్ని తొంబై రోజులపాటు ప్రచారం చేస్తున్నాము.

ఏదో సావర్కర్ వర్దంతి రోజు, జయంతి రోజు సోషల్ మీడియాలో పోస్ట్ లకు పరిమితం కాకుండా సావర్కర్ ఆలోచనలను మనం ముందు తెలుసుకోవాలి అలాగే తెలుగు యువతని చైతన్యం చేయాలని ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది.

బ్రిటీషువారి దమననీతికి, సామ్రాజ్యవాద దురహంకారానికి ఎదురొడ్డి నిలిచి, భారతీయుల్లో స్వాతంత్య్ర కాంక్షను జాగృతం చేసిన స్వాతంత్య్ర వీరసావర్కర్ జైలు జీవిత గాథయిది.

భారత ప్రప్రథమ స్వాతంత్య్ర సమరగాధను (1857) మొదటిసారిగా రచించి, దానిని రహస్యంగా అచ్చువేయించి బ్రిటీషు వారి క్రూరపైశాచిక పరిపాలనను ఎన్నో దృశ్యాలుగా ప్రపంచం కళ్ల ముందుంచిన ఒక మహా స్వాతంత్య్ర పిపాసి అండమాన్ జైలు జీవిత కథయిది.

జైలుగోడలపై వేల పద్యాలు రచియించి, వాటిని ధారణచేసి, విడుదలయిన తర్వాత అవి కావ్యాలుగా వెలయించిన మహావిజ్ఞాని, మహాజాతీయవాది స్వాతంత్య్ర వీరసావర్కర్ జైలు గాథయిది.

ఈ జైలుగాథని రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం పోస్టాఫీస్ లు 16168 ఉన్నవి ప్రతి పోస్టాఫీస్ పరిదిలో ఒక్కరికైనా చేర్చాలని సంకల్పం తీసుకున్నాము.

పుస్తకం పేజీలు - 390, వెల - 375/- రూపాయలు

అయితే పోస్టల్ చార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ చేస్తున్నాము. అలా కాకుండ ఎక్కువ పుస్తకాలు తీసుకున్న వారికి ప్రత్యేక తగ్గింపులతో పాటు డెలివరి ఉచితంగా ఉంటుంది. ఈ క్రింది నెంబర్ కి కాల్ చేయండి, లేదా వాట్సాప్  ద్వారా సంప్రదించండి.

8500581928 నెంబర్ కి Phone Pe, GPay లేదా UPI : megamindsmedia@ybl ద్వారా అమౌంట్ పంపి... ఇదే నెంబర్ కి  వాట్సాప్ ద్వారా అడ్రెస్ పంపి కన్మార్మ్ చేసుకోండి...  
 
మీరు పేమెంట్ చేసిన వారం లోపల పోస్ట్ ద్వారా మీకు Mega Minds సంస్థ నుంచి పుస్తకం అందుతుంది....!!
ఈ పోస్ట్ ని చివరి వరకు చదివిన వారు పుస్తకాన్ని ఆర్డర్ చేయడంతో పాటు, వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్ లలో శేర్ చేసి మీ మద్దతు తెలుపండి...  Rajasekhar Nannapaneni MegaMinds.

No comments