Type Here to Get Search Results !

భారత దేశ స్వాతంత్ర పోరాటంలో RSS పాత్ర - What was RSS role in independence?

What was RSS role in independence?
RSS role in independence
భారత దేశ స్వాతంత్ర పోరాటంలో RSS పాత్ర: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ 1925 లో ప్రారంభించారు, సహజంగానే డాక్టర్ జీ ఆజన్మ దేశభక్తుడు మరియు స్వాతంత్రం కోసం అనేక పద్దతులలో పని చేశారు. కాబట్టి వారి చేతి లో పురుడు పోసుకున్న సంస్థ దేశం హితం గురుంచి స్వాతంత్ర పోరాటం కోసం ఎనలేని పాత్రను తనదైన శైలిలో నిర్వర్తించింది. సంఘ స్వయంసేవకులు జాతి కోసం తమ జీవితాలని త్యాగం చేశారు. డాక్టర్ జీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మనం తప్పనిసరి, రోజు ఒక గంట సేపు శాఖ లో ఉండి మిగతా సమయమంతా కూడా ఇవ్వవచ్చు అని చెప్పడం జరిగింది. స్వాతంత్ర పోరాట కోసం ముందస్తుగా కాంగ్రెస్ ఉద్యమ నిర్మాణం చేసింది కాబట్టి ఇంకో రాజకీయ కేంద్రం ఉండకూడదు అని, పూజ్య డాక్టర్ జీ ఆర్ ఎస్ ఎస్ బ్యానర్ పై కాకుండా కాంగ్రెస్ చేస్తున్నటువంటి స్వాతంత్రోద్యమ కార్యక్రమాలలో అందరు కూడా పాల్గొనాలని సూచించారు, ఎందుకంటే ఒకటే వేదిక ఒకటే జెండా ఒకటే బ్యానర్ ఒకే కార్యక్రమం ఉండాలనే భావాన్ని వ్యక్తపరచి వారు కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది.

1929 ఏప్రిల్ 27, 28 తేదీ లలో వార్ధ లో జరిగిన శిబిరం లో అక్కడికి వచ్చిన స్వయంసేవకులకు స్వాతంత్ర సాధనకు తమ సరస్వాన్ని త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని ఉద్బోధించారు. 1929 మార్చ్ లో సైమన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో సంఘం పాలుపంచుకున్నది. స్వాతంత్ర ఉద్యమం సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రతిజ్ఞ లో చివరలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మనం పని చేయాలని అని ప్రతిజ్ఞ చెయ్యడం జరిగేది. అనేకమంది సంఘ స్వయంసేవకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఈ విషయం కొద్దిమందికే తెలుసు ఎందుకంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎలాంటి ప్రచార ఆర్భాటం కోరుకోదు. స్వయంసేవకులు సహజంగానే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు బ్రిటిష్ వాళ్ళ లాటి దెబ్బలకు, తూటాలకు ఎదురోడ్డారు.

పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ పాఠశాల విద్య సమయంలో నీల్సిటీ హైస్కూల్ లోపల విక్టోరియా రాణి 60 వసంతాల యొక్క పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా వితరణ చేసినటువంటి sweet ను తినకుండా విసిరివేసి బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యవాదుల అహంకార ధోరణి వ్యతిరేకించారు. పాఠశాల లో నే వందేమాతర నినాదాన్ని అందరితో చెప్పించి చిన్న వయస్సులోనే స్వాతంత్ర పోరాటానికి ఊపిరులు ఊదారు, కలకత్తా లో డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పుడు అనుశీలనా సమితి అనే విప్లవ సంస్థ తో కలిసి పని చేస్తుండేవాడు ఆ రహస్య సంస్థ లో తను కొకైన్ అనే సంకేత నామముతో పని చేశారు. పాండురావ్ కాంఖజి అనే స్వదేశ్ ఉద్యమకారుడు డాక్టర్ జి అతని మిత్రులు అందరూ స్వదేశీ ఆవశ్యకతను చాటి చెప్పే ఉపన్యాసాలు బాగున్నాయి అని కేసరి పత్రిక లో రాయడం జరిగింది. డాక్టర్ జి వైద్య విద్య పూర్తి అయి కలకత్తా నుండి నాగపూర్ వచ్చిన తరువాత కూడా విప్లవకారుల తో సంబంధాలాను కొనసాగించారు. ఆ పరిచయాలతోని దేశం లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేఖంగా సాయుధ తిరుగుబాటు తీసుక రావడం కోసం ప్రయత్నం చేశారు దీని గురుంచి PL Joshi తను రాసిన ఒక వ్యాసం అయిన mobilization in vidharbha by Tilak in political thought and leadership of Tilak edited by NR Inmadar p-370 లో పేర్కొనడం జరిగింది.

పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ తన స్నేహితులతో కలిసి కాంగ్రెస్ లో చేరి సహాయ నిరాకరణ ఉద్యమము లో చురుకుగా పాల్గొనడం జరిగింది. దీనికి గాను బ్రిటిష్ ప్రభుత్వం పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ మీద కేసు పెట్టి ఒక సంవత్సరం జైలు శిక్ష (21st august 1921 నుండి 12th July 1922 వరకు) వెయ్యడం జరిగింది . బిపిన్ చంద్ర ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా పోరాటం చేశారు అని తను రాసిన పుస్తకం communism in modern India p-332 లో చెప్పడం జరిగింది. గాంధీజీ ఉప్పు సత్యా గ్రహం 6th April 30 న చెయ్యాలని పిలుపు ఇచ్చినప్పుడు పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ తన సర్ సంఘ చాలక్ బాధ్యత ను డాll LV పరంజాపే గారికి అప్పగించి, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు, అంతే కాదు అటవీ సత్యాగ్రహంలో కూడా పాల్గొని 9 నెలలు అంకోలా జైలు లో జైలు శిక్ష కూడా అనుభవించారు. తనతో పాటు అప్పుడు సంఘ లో ముఖ్యమైన కార్యకర్త అప్పాజీ జోషి కూడా పాల్గొన్నారు. అటవీ సత్యాగ్రహం సందర్భంలో పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ "స్వాతంత్ర సాధన కోసం బ్రిటిష్ వాడి షూ పాలిష్ చేసే పని అయిన మరియు అదే బూట్ తో బ్రిటిష్ వాడి తల మీద కొట్టడం" లాంటి ఏ పని అయిన స్వతంత్ర సాధన కోసం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు అయిన EMS నంబూధ్రిపాద్ గారు తను రాసి పుస్తకం Most critical booklet Bjp-Rss in the service of the right reactions లో పేర్కొనడం జరిగింది.

Dec 31 st 1929 లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యం కోసం రావి నది ఒడ్డున తీర్మానం చెయ్యడం జరిగింది దీని సందర్బంగా Jan 26 1930 న స్వాతంత్ర దినోత్సవం దేశమంతటా జరపాలని నిర్ణయించారు, పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ అన్ని శాఖ ల లో స్వాతంత్ర సందేశాన్ని వినిపించాలని చెప్పడం జరిగింది, 21st జనవరి1930 న ఒక సర్క్యూలర్ అన్ని శాఖ లకు డాక్టర్ జీ పంపించడం జరిగింది, ఈ విషయాన్ని సంఘ ను నిరంతరం విమర్శించే సుమిత్ సర్కార్ khaki and safron flag అనే రచన లో చెప్పడం జరిగింది. 1932 లో సెంట్రల్ ప్రావిన్స్ ముఖ్య మంత్రి E Gorden ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా RSS కార్యక్రమాలలో పాల్గొన కూడదు అని నిషేధం విధిస్తు ఒక ఉత్తర్వు జారీ చేశారు. సంఘమును మతతత్వ సంస్థ అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. March 1934 లో బడ్జెట్ సమావేశాలలో VD Kolte అనే కౌన్సిల్ మెంబర్ ప్రభుత్వ ఉత్తర్వుల కు వ్యతిరేఖంగా వాదించారు మరియు ముస్లిం కౌన్సిల్ మెంబర్ అయిన Ms రెహమాన్ RSS ను సమర్దిస్తూ మాట్లాడారు. 1934 జనవరి 8 న పొలిటికల్ ఏజెంట్ భోపాల్ సంస్థానం లోని ప్రభుత్వ కార్యదర్శికి RSS రహస్యంగా తుపాకీ పేల్చడం లో శిక్షణ ఇచ్చే రైఫైల్ క్లబ్ నడుపుతుందని సంచాచారం ఇవ్వడం జరిగింది భోపాల్ లో RSS కార్యక్రమాలను నిలుపుదల చెయ్యాలని భోపాల్ సంస్థానానికి హెచ్చరిక చేశారు మరియు మధ్య ప్రాంతాలలో RSS లో ప్రముఖ్ కార్యకర్త ఘాటె పై క్రిమినల్ ప్రొసీసర్ క్రింద ఆరోపణలు దాఖలు చేశారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, కమ్యూనిస్టు పార్టీ సుమారుగా రెండు ఒకే సంవత్సరంలో అంటే అనగా 1925 లో ప్రారంభించడం జరిగింది కానీ కమ్యూనిస్టు పార్టీలు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను తిట్టారు నేతాజీ ఎప్పుడైతే దేశం బయటకు వెళ్లి అజాదు హిందు ఫౌజు ప్రారంభించాడు అప్పుడు అందరూ నేతాజీని హిట్లర్ ఏజెంట్ అని చెప్పే దూషించారు.

1927 లో నే నేతాజీ కి మరియు డాక్టర్ హెడ్గేవర్ గార్ల కు పరిచయం ఉన్నది 1928 లో కలకత్తా లో వారు కలిసి మాట్లాడుకున్నారు సంఘాన్ని గూర్చి విని నేతాజీ ప్రభావితులు అయ్యారు. 1938 అక్టోబర్ 21 న మరో కాంగ్రెస్ నాయకుడు అయిన శంకరరాందేవ్ కు రాసిన లేఖ లో యువకులపై సంఘ యొక్క సత్ప్రభావం గురుంచి చర్చించారు. 1939 లో డాక్టర్ హెడ్గేవర్ జీ ను కలవడానికి నాగపూర్ వచ్చారు. ఆ సమయంలో డాక్టర్ హెగ్డేవార్ గారు అనారోగ్యంతో వున్నారు ఆరోగ్యం బాగుపడిన తరువాత సమీప భవిష్యత్తు లో నేతాజీ తో కలవాలనే ప్రతిపాదన అంగీకరించారు. నేతాజీ మళ్ళీ డాక్టర్ హెడ్గేవర్ అంతిమ శ్వాసకు సమీపంలో వున్నప్పుడు 1940 జూన్ 20 న కలవడానికి రావడం జరిగింది. కానీ డాక్టర్ హెడ్గేవార్ గారు మాట్లాడే పరిస్థితులలో లేనందున్న వారి చెంత కొద్ది సేపు కూర్చుండి ఆ తరువాత వారికి ప్రణామం చేసి వెళ్లిపోయారు.

1940 లో ఒక బ్రిటిష్ హోం డిపార్ట్మెంట్ నివేదిక ఇలా చెప్పింది: 'RSS సంస్థ తీవ్రంగా బ్రిటీష్ వ్యతిరేకి మరియు స్వాతంత్రం గురుంచి మాట్లాడుతుంది .' ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను 'సైన్యం, నేవీ, పోస్టల్, టెలిగ్రాఫ్, రైల్వే, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వంటి వివిధ ప్రభుత్వ విభాగాలలో ప్రవేశపెట్టారు, సమయం వచ్చినప్పుడు పరిపాలనా విభాగాలపై పట్టు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తున్నదని ' సిఐడి నివేదిక వెల్లడించింది. ఆగష్టు 5, 1940 న డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, బ్రిటిష్ ప్రభుత్వం కసరత్తులు, యూనిఫాం వాడకం మరియు వ్యాయామాలను నిషేధించే ఆర్డినెన్స్ను ప్రకటించింది. వందలాది మంది ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అరెస్టు చేశారు.

1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో చాలా మంది స్వయంసేవకులు పాల్గొన్నారు ప . పూ గురూజీ 27th April 1942 లో పూణే లో జరిగిన శిబిరం లో బ్రిటిష్ ప్రభుత్వానికి స్వార్ధ పూర్తిగా సహాకరించే వారిని విమర్శించారు మరియు దేశం కోసం త్యాగం చెయ్యడం కోసం సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది దీనిని బ్రిటిష్ గూడాచారి సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొన్నది ( No.D home pol (intelligence)) section F.No 28 pol ). అనేకమంది స్వయంసేవకులు సమాంతర ప్రభుత్వాన్ని విదర్భ ప్రాంతం లో ఏర్పాటు చేయడం జరిగింది ,మీరట్ జిల్లా meawn అనే తహసిల్ కార్యాలయంపై 3 రంగుల జండా ఎగురవేయ్యడం జరిగింది.

దాదా నాయక్ , రాందాస్ రాంపూర్ అనే స్వయంసేవక్ లు బ్రిటిష్ వాల్ల చేతిలో చనిపోయారు . 4వ సర్ సంఘ చాలక్ ఆయిన ప .పూ రజ్జు బయ్యగారు ఆనాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు ట్రిబ్యూన్ అనే పత్రిక 2003 లో ఈ విషయాన్ని వారు పేర్కొనడం జరిగింది www.tribuneindia.com 2003 క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొంటున్న అజ్ఞాత ప్రముఖ నాయకులకు స్వయంసేవక్ ల ఇళ్ల లో సురక్షిత మైన వసతి కల్పించడం జరిగింది ఈ విషయాన్ని అరుణ్ అసాఫ్ అలీ తనకు ఢిల్లీ ప్రాంత సంఘచాలక్ ఆయిన్ లాల హంస రాజ్ గుప్తా గారి ఇంట్లో 10-15 రోజులు అజ్ఞాతం లో ఉన్నట్టు 1967 లో హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. ఢిల్లీ సురుచి ప్రకాశన్ వాళ్ళు ప్రచురించిన చిత్తరంజన్ గారు రాసిన' rss and freedom movement 'పుస్తకం లో ఇలాంటివి అనేకం చూడవచ్చు. అజ్ఞాతం లో ఉన్న వారికి వైద్య సహకారం, ఉచితంగా న్యాయ సహకారం చెయ్యడం లాంటి పనులు అన్ని ఆనాడు స్వయంసేవకులు చెయ్యడం జరిగింది.

1947 లో భారత దేశం రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు పాకిస్థాన్ నుండి భారత్ కు రావాలనుకున్న చిట్ట చివరి శరణార్థి యొక్క రక్షణ బాధ్యతను స్వయంసేవకులు తీసుకుని వచ్చిన తరువాత వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి సాధారణ జీవితం గడపడానికి తగిన తోడ్పాటు ను అందించడం జరిగింది. కశ్మీర్ విలీనం కోసం రెండవ సర్ సంఘచాలక్ పూజనీయ గురూజీ చేసిన ప్రయత్నం మరువలేనిది . అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అభ్యర్థన మేరకు ప్రత్యేక విమానం లో కాశ్మీర్ కు వెళ్లి రాజా హరీష్ సింగ్ ను కలిసి కాశ్మీర్ ను భారత దేశం లో విలీనం చెయ్యడానికి ఒప్పించడం జరిగింది . ఆ ఒప్పందం ప్రకారం J&k ను భారత్ లో విలీనం చెయ్యడం జరిగింది .స్వాతంత్రం వచ్చిన కొద్దిరోజులలోనే పాకిస్తాన్ యుద్ధానికి వస్తే శ్రీనగర్ లో మంచు తో కప్పబడి వున్నా ఎయిర్పోర్ట్ ను వైమానిక దళానికి ఉపయోగించే విధంగా కొన్ని గంటల లోనే స్వయంసేవకులు బాగు చేసి సైన్యానికి సహాకరించి J&K ను సంరక్షించడం లో ఎనలేని కృషి చెయ్యడం జరిగింది.

పోర్చుగీసు వాళ్ళ చేత నుండి గోవా విముక్తి చేయడం కోసం దాద్రానగర్ హవేలి విముక్తి చేయడం కోసం జరిగిన పోరాటంలో స్వయంసేవకుల యొక్క కీలక పాత్ర అనిర్వచనీయమైనది. 1954 లో ఆజాది గోమంతక్ దల్ అనే దళం ఆద్వర్యం లో అనేక మంది యువకులు దాద్రా నగర్ హవేలీ ని చేజిక్కించుకోవడం లో ముఖ్య పాత్ర వహించారు ,ఈ ప్రయత్నం లో అనేకమంది స్వయంసేవకులు ప్రాణాలను అర్పించారు .ఈ విషయాన్ని Daadra and nagar Haveli :past and present అనే పుస్తకం ను ps Leele రాయడం జరిగింది, 100 మందికి పైగా ఆరోజు పోరాటం లో పాల్గొన్న స్వయంసేవక్ ల ను అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్ర పోరాట వీరులు గా గుర్తించింది. కృష్ణా జిల్లా ఉయ్యురు కు చెందిన సూరి సీతారాం అనే స్వయంసేవక్ తన దళం తో కలిసి ఈ పోరాటం లో పాల్గొని అమరుడు అయ్యాడు, గోవా స్వాతంత్ర వీరుల మ్యూజియంలో మరియు ఎర్రకోట లో సూరి సీతారాం యొక్క చిత్రపటాన్ని మనం చూడవచ్చు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు అనేటువంటి గోబెల్స్ ప్రచారం అనేకమంది చేస్తున్నారు. సత్యాన్ని అ సత్యం గా చూపించాలని వారి ప్రయత్నం సంఘం ఏ పద్దతి లో స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నది అనేకమంది కి తెలుసు కాని పనిగట్టుకుని దుష్ప్రచారం చెయ్యడం కోసం పని చేస్తున్నారు. సంఘం ప్రారంబించినప్పటి నుండి దేశ స్వాతంత్రం మరియు, సార్వభౌమత్వా పరిరక్షణ కోసం గొప్పనైన పాత్ర తనదైన శైలి లో నిర్వహించడం జరిగింది, దేశం పట్ల స్వయంసేవకుల త్యాగ నిరతి, అంకిత భావం అనిర్వచనీయమైనది. భారత్ మాతాకి జై.. కట్టా రాజగోపాల్, 9490791726

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..