Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అరబ్బుల సామ్రాజ్యవాదం - ఖలీఫాలకు నజరానాలు - Islam Imperialism by Anwar Shaikh

Anwar Shaikh అరబ్బుల సామ్రాజ్యవాదం: మహమ్మద్ కాలంలో అరేబియా పేదరికంతో మ్రగ్గుతున్నది. అలాంటి సమయంలో మహ్మద్ ప్రవక్త వారికి రెండు ...

Anwar Shaikh


అరబ్బుల సామ్రాజ్యవాదం: మహమ్మద్ కాలంలో అరేబియా పేదరికంతో మ్రగ్గుతున్నది. అలాంటి సమయంలో మహ్మద్ ప్రవక్త వారికి రెండు సూత్రాలు చెప్పాడు. పేదరికంపోవాలంటే కష్టపడి పనిచేయాలి లేదా ఇతరులను దోచుకోవాలి. ఇస్లాం రెండవదాన్ని వారి ముందు ఉంచింది. అల్లా అనుజ్ఞమేరకు అవిస్వాసులపై దాడి దైవ సమ్మతమెకాక తప్పక అనుసరించవలసిన విధి. అవిశ్వాసులను అంతంచేశాక వారి సంపద, స్త్రీలు అన్నీ వారి సొంతం అని మహమ్మద్ చెప్పడం మూలాన మహదానందంగా కనిపించింది. ఇక ఆరోజు మొదలుకుని అరబ్బులు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద విస్తరణలో రెచ్చిపోయారు.

రచయిత ముస్లిం నాయకుడు అయిన అన్వర్ షేక్ ఈ విధంగా అరబ్ సామ్రాజ్యవాద విస్తరణను వివరించాడు. ప్రవక్త మానవాళిని అరబ్బులుగా, ఇతరులుగా విభజించాడు. అరబ్బులు ఎప్పుడూ పాలకులుగా ఉండాలి. అరబ్బులు కానివారు ఎప్పుడూ పాలితులుగానే ఉండాలి. ఆ లక్ష్యం నెరవేరడానికి ఇస్లాం ఒక ఉపకరణం సాధనం. అరబ్బుల వలన ప్రపంచదేశాలు విచ్చిన్నం అయ్యాయి అయినప్పటికీ మేము శాంతి కాముకులమనే చెబుతుంటారు.

అరబ్బీకరణ: ఖురాన్ అరబిక్ లో ఉండటం మూలానా అందరూ ముస్లింలు అయినప్పటికీ అరబిక్ నేర్చుకోవాలి. అలాగే ఇతర భాషలలో ఖురాన్ ఉన్నప్పటికీ అది వారి దృష్ఠిలో ఖురాన్ కాదు. మరియు ముఖ్యంగా మతం మారిన ముస్లిం ప్రతి ఒక్కరూ కాబాకు తన జీవితంలో ఒక్కసారైనా రావాలి లేదంటే అతను ముస్లిం కాజాలడు మక్కా ని దర్శించకపోతే కోరికలు తీరవు అలాగే దర్శించకపోతే అతను అరబ్ ని వ్యతిరేకించినట్లు కనుక ప్రతి ముస్లిం చచ్చినట్లు కాబా వెళ్ళి తీరాల్సిందే దీని మూలానా అరబ్బులకు హజ్ యాత్ర వలన మంచి ఆదాయ వనరుగా ఏర్పడింది. అలాగే అరబ్బుల దోపిడీల గురించి అన్వర్ షేక్ ఇలా వివరించారు కాబా కి వచ్చిన వారిని దారి దోపిదీలు చేయడం, నగలు దొంగిలించడం, మహిళలపై అత్యాచారాలు చేసి పవిత్రమైన కార్యంగా భావించేవారు మొదటగా వీరి అరాచకం ఈజిప్ట్, ఇరాన్ లపై సాగించారు.

మతమార్పిడీ మరణభయంతోనే: మహమ్మద్ ప్రవక్త శాంతి, సహనం వచనాలు కేవలం మక్కాలో ఉన్నప్పుడు మాత్రమే ఖురాన్ లో ఉన్న సురలు తెలియజేస్తున్నాయి. ఎప్పుడైతే మదీనా వైపు తన పయనం సాగిందో అప్పుడు ప్రవక్త ఆలోచనలన్నీ హింస వైపు మరలాయి అని ఖురాన్ చెబుతుంది. మదీనా వచ్చాక చంపమనీ, నరకమనీ, తలలుతెగగోయమనీ, అవయవాలు ఛేదించమనీ చెబుతున్నాయి.అలాగే వచనం 9.5 లో విగ్రహారాధకులు ఎక్కడ కనపడితే అక్కడ చంపివేయమనీ ఇచ్చిన ఆదేశం కనబదుతుంది. ఇస్లాంలో రెండు రకాల ప్రమాణాలు ఉన్నాయి ముస్లిం విశ్వాసులపట్ల విధేయత, స్నేహం, సమానత్వం చూపించాలి. ఇక అవిశ్వాసులైతే వారిని క్రూరంగా, నిర్ధాక్షిణ్యంగా ఎలా చంపాలో ఖురాన్, హద్దిస్, సన్నాహ్లలో చాలా బాగా వివరించారు. మొదట సామ్రజ్య విస్తరణను చిన్నదేశాలపై సాగించి 622 సంవత్సరంలో వారు చాలా తక్కువ 632 సంవత్సరంకల్లా మొత్తం అరేబియా వారి చేతుల్లోకి వచ్చేసింది. ఈజిప్ట్, సిరియ, ఇరాక్, ఇరాన్, ఉత్తర అఫ్రికా ను చాలా తెలికగా జయించారు.

ఇస్లామిక్ సామ్రాజ్యవాదం: ఇస్లాం ఒక మత, సామాజిక, రాజకీయ సిద్ధాంతం. మతాన్ని సమాజాన్ని, రాజకీయాన్ని వెరుచేసి చూడలేము. ఈ మూడు కలిపిన జీవన విధానాన్ని ఖురాన్ అరబ్బుల ముందుంచింది. అల్లా అరబ్బులను జీహాద్ చేయాలని పిలుపుని ఇస్తాడు ఖురాన్లొ... ఒక విదేశీ రాజ్యపు భూభాగాన్ని యుద్ధంద్వారా గానీ, బెదిరింపుల ద్వారాగానీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు విగ్రహారాధకులను చంపుతానని భయపెట్టి మతం మారుస్తారు. వారి ఆరాధనా స్థలాలను ద్వంసం చేస్తారు. పన్నులు విధిస్తారు, వయస్సులో ఉన్న ఉవతులను వేస్యలుగా మారుస్తారు, ఉంపుడుకత్తెలుగా చేసుకుంటారు, ముసలమ్మలను వంటాచేయిస్తారు, పసిపిల్లలచేత చాకిరీ చేయిస్తారు.

ఇస్లామిక్ పాలన వలసపాలనే: మొదట అరబ్బు ముస్లింలు, ఆ తరువాత పర్షియా, టర్కీ, బెర్బర్, మంగోలియలకు చెందిన ముస్లింలు తమ తమ దేశాల హద్దులు దాటి సుదూర ప్రాంతాలలోని దేశాలపై భీభత్సంగా వరుసదాడులకు పాల్పడి, విజేతలై ఆ దేశాలలో శత్బ్దాలపాటు వలసపాలన నెలకొల్పారు, ఆ తరువాత ఆ దేశాల సంపదను దోచుకుపోయారు, భయపెట్టి బలవంతంగా మతం మార్చారు.ఐరోపాను 711 సంవత్సరంలో దారుణంగా పాలించి స్పైయిన్ తో మొదలయ్యి అన్నిటినీ లూటీ చేస్తూ క్రైస్తవాన్ని వారి నాయకులను మట్టుపెట్టారు. 9 వ శతాబ్దంలో 846 శంవత్సరంలో రోం మీద దాడిచేసి స్యింట్ పీటర్, పాల్ ల చర్చిలను ద్వంసంచేసి రోం ప్రజలు ఊచకోతకోశారు. చివరకు నైజీరియా లాంటి దేశాంలో అల్పసంక్యాకులైనప్పటికీ రాజకీయంగా అధికారం చెలాయిస్తున్నారు.

భారతదేశంలో ముస్లింల వలసపాలన: మొదటగా ఇరాన్ వారికి హస్తగతం అయ్యాక ఖలీఫా రాజ్యపు హద్దు భారత భూభాగం అయ్యింది. మిగతదేశాలవలే కాకుండా వారు తీవ్రప్రతిఘటనను భారత్ నుండి ఎదుర్కోవలసి వచ్చింది ఖలీఫాలు చిత్తయ్యారు. 712 సంవత్సరంలో మహమ్మద్ ఖాసీం అనేవాడు మనదేశంపై దండెత్తి కొన్ని ముఖ్యమైన ప్రాంతలలో గెలవగలిగాడు బౌద్దులు ఉన్న ప్రాంతాలన్ని నిదానంగా మతం మార్ప్డిలూ చేస్తూ మనల్ని నిదానంగా దెబ్బకొడుతూ పంజాబ్ వరకూ వచ్చారు. పంజాబ్ పై మహమ్మద్ ఘజనీ దాడులుచేశాడు. మహమ్మద్ ఘజనీ 30 సంవత్సరాల పాటు భారత్దేశంపై 17సార్లు దండెత్తి వీలయినంతమేరకు దోచుకున్నాడు ఖలీఫాకు నజరానాలు పంపాడు. ఖలీఫాకు దోచుకున్న వజ్రవైడూర్యాలు బంగారాన్ని కానుకలుగా పంపాడు. హిందువులను ముస్లింలుగా మార్చడం, దేవాలయాలను నేలమట్టంచేయడం, సంపదను కొల్లగొట్టాడం ఇస్లాం సామ్రాజ్యవాదాన్ని భారత్ పై తీవ్రంగా చూపించాడు. ఇక ఘోరీ ఘజనీతో పోలిస్తే ఏమాత్రం తీసిపోకుండా దాడులుచేశాడు పృద్విరాజు చేతుల్లో ఓడినప్పటికీ డిల్లీ, గుజరాత్ రజ్యాలను దారుణంగా దెబ్బతీసి ధనాన్ని దోచుకుని ఖలీఫాలకి పంపేవాడు.

ముస్లిం లు ఏదేశంపై దాడిచేసినా ఆ దేశ సంపదలన్నీ అరబ్బులకు, ఖలీఫాలకు నజరానాలు అందేవి, ఆడపిల్లలను అనుభవించేవారు, ముసలమ్మలను భానిసలుగా చేసి వంటచేయించేవారు చిన్నపిల్లలను వెట్టిచాకిరీ చేయిస్తూ వేలవేసి అమ్మేవారు. మరికొంత సమచారం రాబోయే వ్యాసాలలో తెలుసుకుందాం.

(అన్వర్ షేక్, ఎం.ఎ.ఖాన్, కె ఎస్ లాల్, రాబర్ట్ స్పెన్సర్ ల రచనల ఆధారంగా డా. బి. సారంగ పాణి గారు వ్రాసిన భారతదేశంలో విదేశీ ముస్లిం పాలన పర్యవసానాలు పుస్తకం ఆధారంగా)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments