Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

ఒలక్కన్నేశ్వర ఆలయం ఒక లైట్ హౌస్ - About olakkannesvara temple in Telugu

ఒ లక్కన్నేశ్వర  ఆలయం ఒ లక్కన్నేశ్వర ఆలయం ఈ ఆలయం మహాబలిపురంలోని పురాతన ఆలయంలలో ఒకటి. ఇది వెయ్యి సంవత్సరాల కన్నా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం ప్రపంచ...

లక్కన్నేశ్వర ఆలయం
లక్కన్నేశ్వర ఆలయం ఈ ఆలయం మహాబలిపురంలోని పురాతన ఆలయంలలో ఒకటి. ఇది వెయ్యి సంవత్సరాల కన్నా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం ప్రపంచంలోని పురాతన లైట్హౌస్లలో ఒకటి అని చెప్పవచ్చు. ఇది 8 వ శతాబ్దం ప్రారంభంలో నరసింహవర్మన్ II కాలంలో ఈ ప్రాంతంలోని రాళ్ళపై నిర్మించిన మొదటి నిర్మాణాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఆలయ నిర్మాణం సమీపంలోని షోర్ టెంపుల్ యొక్క నిర్మాణాన్ని పోలి ఉంటుంది, రెండూ దాదాపు ఒకే సమయంలో నిర్మించబడ్డాయి.

ఈ ఆలయం మహిషాసురమర్థిని గుహ ఆలయం ముందరి దృశ్యం, మహాబలిపురం శిల్పకళ అద్బుతమైన శిల్పకళ. ఈ ఆలయం రాతిపైన నిర్మాణం జరిగింది. ప్రదాన ఆలయానికి ఎదురుగా రెండు చిన్నపాటి స్థంభాలు కూడా ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మండపాలు, గోపురాలు, బిగ్ రాక్ మొదలైనవి వున్న ప్రాంతం. ఇక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు, అతి సుందరమైన సీషోర్ టెంపుల్ సముద్రుం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఇది.

shore-temple-mahabalipuram

ముఖ్యంగా ఈ ఆలయం గురించి చెప్పాలంటే మహబలిపురం ను బలిచక్రవర్తి పరిపాలించాడని తెలుస్తుంది, అలాగే 7 వ శతాబ్దంలో పల్లవులు మహాబలిపురాన్ని సముద్రవ్యాపారానికి కేంద్రంగా పరిఢవిల్లినట్లు చరిత్ర చెబుతుంది. మహబలిపురం తీరప్రాంతం వ్యాపారనిమిత్తం ఆరోజుల్లో పల్లవులు ఇక్కడ ఈ ఒలక్కన్నేశ్వర శివాలయ్యాన్ని నిర్మించారు. ఇది వారికి అప్పట్లో లైట్ హౌస్ గా పనిచేసేది సముద్రంలోని ఓడలకు ఆచూకీ తెలియడానికి ఈ ఆలయానికి శివుని పేరు పెట్టడానికి కూడా కారణం అదే ఎందుకంటే శివుని మూడో కన్ను, జ్వాలాకన్ను, లేదా శివుని తలపై చంద్రవంక గా ఈ దేవాలయంపై నూనేతో రోజూ రాత్రుళ్ళు లేదా సముద్ర ప్రయాణాలు ఉన్నప్పుడు ఇక్కడ దేవాలయంపై మంటను వెలిగించేవారు ఇది సముద్రానికి 36 మీటర్ల ఎత్తులో ఉండటంవలన ఇక్కడ మండే మంటలు లైట్ హౌస్ గా ఉపయోగపడేవి.

ఈ ఆలయం యొక్క ప్రతి వైపు శివుని యొక్క వివిధ అవతారాలతో అలంకరించబడి ఉంటుంది. 18 వ శతాబ్దం చివరిలో వారెన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ గా ఉన్న సమయంలో ఈ ఆలయంలో లోని శివలింగాన్ని దుండగులు పగులకొట్టి తీసుకుపోయారు ఆ తరువాత ఈ ఆలయం మూసివేయబడింది అది దాని పై భాగాన్ని కూడా కోల్పోయింది. కాని ఆ తరువాత కూడా బ్రిటిష్ర్స ఈ ఆలయాన్ని లైట్ హౌస్ గా ఉపయోగించుకున్నారు.

olakkannesvara temple light house

ఆ తరువాత మరలా ఒలకన్నేశ్వర ఆలయానికి దగ్గరలోనే ఒక లైట్ హౌస్ కొత్తగా నిర్మాణం కూడా చేశారు. దాని ద్వారనే ప్రస్తుతం సముద్రపు ఓడలు రాకపోకలు సాగిస్తున్నాయి మహబలిపురంలో. మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామం. కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది. మహాబలిపురం తమిళ భాషలో మామల్లపురం (மகாபலிபுரம்) (Mamallapuram) అని పిలుస్తారు. భారతదేశంలో అశోకుడు పాలించిన సమయంలో సముద్ర వ్యాపారాలు అప్పటికే జరిగేవి. అలాగే గుజరాత్ తీర ప్రాంతంలో 4000 సంవత్సరాల క్రితం నాటి ఒక లైట్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్ తీరప్రాంతంలో ఒకసారి అబ్దుల్ కలాం గారు పర్యటించినప్పుడు అక్కడ ఉన్న కొన్ని గుర్తులపై ఆర్కియాలజీ వాళ్ళను అధ్యయనం చేయమని కూడా చెప్పారు.

ఈ వ్యాస సారాంశం ఒకటే మనదేశంలోని ప్రతి దేవాలయానికీ ఏదో ఒక కారణంతోనే కట్టించారు, వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఎదో దేవాలయానికి వెళ్ళామా దండం పెట్టుకున్నామా వచ్చామా అన్నట్లు కాకుండా అది మన చరిత్ర అని గుర్తెరిగి ఆ దేవాలయనీకి వెళ్ళినప్పుడు మనకు కలిగిన అనుభూతిని పదిమందికి తెలియజెయాలి, ఆ దేవాలయ నిర్మాణం ఎలా ఆరోజుల్లో చేశారో ఆ టెక్నాలజీ ఎంటో కూడా తెలుసుకుందాం.. జై హింద్. రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..