యూదుల చరిత్ర - స్వామి వివేకానంద చికాగోలో ఇజ్రాయిల్ ప్రస్తావన - About israel history in telugu

megaminds
0
‘ప్రపంచంలో దమనకాండకు బలి అయిన అన్ని మతాలవారికి అన్ని జాతులవారికి ఆశ్రయం కల్పించిన హిందూ జాతికి చెందినవాడిని కావడం నాకు గర్వకారణం.. రోము నియంతలు తమ పవిత్ర దేవాలయాన్ని పగులకొట్టి పారేసిన సమయంలో శరణార్థులై దక్షిణ భారతదేశానికి వచ్చిన శ్రేష్ఠతమ అవశేష ఇజ్రాయిలీ జాతీయులను మేము అక్కున చేర్చుకుని ఆదరించామని మీకు చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ప్రపంచానికి సహిష్ఠుతను సృష్టిగత సమన్వయాన్ని నేర్పించిన ధర్మానికి చెందినవాడను కావడం నాకు గర్వకారణం.. సహజ సహిష్ణు ప్రవృత్తి మా స్వభావం, అన్నిమతాలను సత్యానికి రూపాలని మేము సంభావిస్తున్నాము’- అని అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ‘ప్రపంచ సర్వమత మహాసభ’లో వివేకానంద స్వామి గుర్తుచేయడం చరిత్ర. వివేకానందుడు తన మొదటి ప్రసంగంలోనే ‘ఇజ్రాయిల్’ను ప్రస్తావించాడు.

1893వ సంవత్సరం లో ఈ సర్వమత సభలు జరిగాయి, అప్పటికి భారతదేశంలో విదేశీయుల దురాక్రమణ పరాకాష్ఠకు చేరుకొని ఉంది. అంధకారం అలముకొని ఉంది.. కానీ మన దేశంలో శరణార్థులుగా ఉండిన ‘యూదుల’కు దేశమే లేదు. అలాంటి దాస్యాంధకారంలో సైతం ‘వివేకానంద చంద్రుడు’ హైందవ జాతీయ స్వభావ ప్రభా కిరణాలను ప్రపంచమంతటా ప్రసరింపజేయగలిగాడు, ఈ హైందవ జాతీయ స్వభావం సార్వజనిక సహిష్ణుత, సృష్టినిహిత సమన్వయం, వైవిధ్య పరిరక్షణ, ‘నితాంత అపార భూతదయ..’! ఈ స్వభావం ఉన్నందువల్లనే భారతీయులు రెండువేల ఏళ్లపాటు ‘ఇజ్రాయిలీ’- యూదు- హిబ్రూ జాతీయులను ఆదరించారు. ఈ హైందవ జాతీయ స్వభావం యూదులను ప్రభావితం చేయడం చారిత్రక పరిణామక్రమక్రమం.. వర్తమాన వాస్తవం..

పశ్చిమ ఆసియా చివర, మధ్యధరా సముద్ర తీరంలోని ప్రాచీన యూదు సీమలో 1948లో మళ్లీ స్వతంత్ర యూదు దేశం ఏర్పడిననాటి నుంచి ఈ వాస్తవం ప్రస్ఫుటిస్తోంది, ఇజ్రాయిల్‌లో ‘సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడి ఉండడం ఈ వాస్తవం! సర్వమత సమభావం అనాదిగా భారత జాతీయ స్వభావం, 1948 నుంచి ‘ఇజ్రాయిల్ స్వభావం’! మధ్యధరా సముద్రపు తూర్పు తీరంలోని ప్రాచీన పాలస్తీనా ప్రాంతాన్ని 1947లో ఐక్యరాజ్యసమితి రెండుగా విభజించడానికి దారితీసిన పరిణామక్రమం బీభత్సకాండలో ముడివడి ఉంది..

అసహిష్ణుతకు ప్రతిరూపాలైన రోము బీభత్సకారులు పాలస్తీనాలోకి చొరబడి యూదుల ప్రధాన దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ‘జెరూసలెం’ నుంచి పాలస్తీనా- ఇజ్రాయిల్ నుంచి యూదు జాతిని నిర్మూలించారు. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో ‘గ్రీసు’ నాగరికతను క్రీస్తుశకం ఒకటవ శతాబ్దిలో ‘హీబ్రూ’ - యూదు - ఇజ్రాయిల్- జాతిని ‘రోము’ బీభత్సకారులు ధ్వంసం చేశారు. ఓడిన ‘ఇజ్రాయిల్’ ప్రజలు ఇతర దేశాలకు పారిపోయారు. భారత్‌లో తప్ప మిగిలిన అన్ని దేశాలలో ‘హీబ్రూలు’ వివక్షకు వేధింపులకు చిత్రహింసలకు బీభత్సకాండకు గురికావడానికి కారణం ఆయా విదేశాల ప్రజల సమష్టి మనఃప్రవృత్తి నిహితమైన ‘అసహిష్ణుత’.. తమవి కాని మతాలను భాషలను జాతులను సంస్కృతులను నామరూపాలు లేకుండా నశింపజేయడం అరబ్బుల సమష్టి ప్రవృత్తి, ఐరోపావారి చిత్తవృత్తి, తురుష్కుల వికృతి! కానీ భారతదేశపు స్వజాతీయులైన హిందువుల సమష్టి ప్రవృత్తి సర్వమత సమభావం, సర్వవైవిధ్య సమభావం! అందువల్లనే యూదులను భారతీయులు రక్షించగలిగారు. 1948లో స్వతంత్ర దేశంగా ఏర్పడిన యూదులు తమ కొత్త ఇజ్రాయిల్‌లో సర్వమత సమభావ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు! ఇదే భారతదేశంలో యూదులు ఆశ్రయం పొందిన ఫలితం.

ప్రాచీన పాలస్తీనా, విభజన ఫలితంగా ‘యూదుల’ ఇజ్రాయిల్, ‘అరబ్బు’ పాలస్తీనా పక్క పక్కనే రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడినాయి. ఇజ్రాయిల్ సర్వమత సమభావ సెక్యులర్ రాజ్యాంగంగా ఏర్పడగా, ‘అరబ్ పాలస్తీనా’ జిహాదీ స్వభావం కల ఇస్లాం మత రాజ్యంగా ఏర్పడడం ‘సంఘర్షణ’ కొనసాగడానికి దోహదం చేసింది! పాలస్తీనాకు తూర్పుగా విస్తరించి ఉండిన ‘బాబిలోనియా’ సామ్రాజ్య నియంతలు క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దిలో యూదులకు చెందిన ‘జెరూసలెం’ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కానీ యూదులు ఆలయాన్ని పునర్ నిర్మించుకున్నారు! క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో ‘ఇజ్రాయిల్’ ప్రాచీన పాలస్తీనా గ్రీసువారికి, బాబిలోనియా నాగరికులకు మధ్య ఆధిపత్య యుద్ధక్షేత్రంగా మారింది! క్రీస్తునకు పూర్వం మూడవ శతాబ్దిలో ‘బాబిలోనియా’ నాగరికతను గ్రీసువారు ధ్వంసం చేశారు! ‘యూదులను’ బాబిలోనీయులను నిర్మూలించ యత్నించారు! బాబిలోనియులను గ్రీసు బీభత్సకారుడు అలెగ్జాండర్ తదితరులు మట్టుపెట్టారు! గ్రీసు వారిని ‘రోము’వారు, రోము ‘నాగరికము’ను క్రైస్తవులు ధ్వంసం చేశారు! ‘రోము’ మూకలు నశించిన తరువాత పాలస్తీనా - ఇజ్రాయిల్- ఐరోపా వారికి, అరబ్ జాతులకు మధ్య మత యుద్ధాలకు రంగభూమిగా మారింది!.

క్రీస్తుశకం నాలుగవ శతాబ్దినుంచి విస్తరించిన బైఝాంటైన్ సామ్రాజ్యం రోము నాగరిక అవశేషాలను సైతం తుడిపివేసింది, క్రైస్తవం వర్థిల్లింది! ఎనిమిదవ శతాబ్ది నుంచి క్రైస్తవం, ఇస్లాం పాలస్తీనాలో పరస్పరం ఢీకొన్నాయి. పదిహేనవ శతాబ్దిలో ఈ ‘బైఝాంటైన్’ సామ్రాజ్యాన్ని తరుష్క ‘ఒట్టమన్’ సామ్రాజ్యం వారు ధ్వంసం చేశారు. రాజధాని ‘కానిస్టాంట్‌నోపెల్’ పేరును ‘ఇస్తాన్‌బుల్’గా మార్చారు. పాలస్తీనాలోకి అరబ్బీ ఇస్లాం మతస్థులు వ్యాపించడానికి ఒట్టమన్ సామ్రాజ్యం దోహదం చేసింది! 1918 నాటి మొదటి ప్రపంచ యుద్ధం వరకు పాలస్తీనాలోకి అరబ్ ఇస్లాం మతస్థులు వెల్లువెత్తుతూనే ఉన్నారు. 1947లో విభజనకు ఇదీ నేపథ్యం. ఇలా పంతొమ్మిది వందల ఏళ్లు ప్రాచీన యూదుల సీమ విజాతీయ దురాక్రమణకు గురి అయ్యింది!

‘ఒట్టమన్’ సామ్రాజ్యం 1918లో పతనం కావడంతో వివిధ దేశాలలో వివక్షకు గురి అవుతూండిన యూదులు తమ ప్రాచీన ఇజ్రాయిల్‌కు తిరిగి రావడం ఆరంభమైంది. మధ్యధరా సముద్ర తీరంలోని హయిఫా నగరాన్ని తురుష్కుల నుంచి బ్రిటన్ మిత్ర దేశాల కూటమి స్వాధీనం చేసుకొనడంతో ఒట్టమన్ సామ్రాజ్యం పతనం పూర్తయింది, ఒట్టమన్‌లకు బాసటగా నిలిచిన జర్మనీ పరాజయం పాలయింది! ఈ మొదటి ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్ మన దేశాన్ని దురాక్రమించి ఉంది. యాభయి ఐదు శాతం మన దేశాన్ని బ్రిటన్ ప్రత్యక్షంగా పాలించింది, నలభై ఐదు శాతం మన దేశాన్ని బ్రిటన్ దురాక్రమణదారుల ‘పరమోన్నత అధికార’- పారవౌంటసీ- పరిధికి లోబడిన సంస్థానాధీశులు పాలించారు!

మొదటి ప్రపంచ యుద్ధ సమయం నాటికి మన దేశంలో బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సాయుధ ఘర్షణలు మొదలయ్యాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటివారు జైళ్లకు వెళ్లివచ్చారు, స్వతంత్ర వీర వినాయక దామోదర్ సావర్కార్ వంటివారు జైళ్లలో మగ్గుతున్నారు. కానీ సైన్యంలో చేరి ఉండిన భారతీయులు వివిధ దేశాలలో బ్రిటన్ తరఫున రెండు ప్రపంచ యుద్ధాలలోను పోరాడారు! ఇలా హయిఫా విముక్తికోసం పోరాడినవారు భారతీయ సైనికులు! మైసూరు, హైదరాబాద్, జోధ్‌పూర్ సంస్థానాలకు చెందిన వీరులు, భారతీయ సంప్రదాయ బద్ధులు కాబట్టి హయిఫాకు తరుష్కులనుంచి విముక్తి లభించింది! సమరంలో వెన్నుచూపకపోవడం ఈ సంప్రదాయం! ‘విజయమా? వీర స్వర్గమా?’ అన్నవి మాత్రమే ప్రత్యామ్నాయాలు! ‘యోగయుక్తుడైన పరివ్రాజకుడు, యుద్ధంలో వెన్ను చూపని, అభిముఖహతుడైన వీరుడు- వీరిద్దరూ సూర్యమండలాన్ని ఛేదిస్తారు!’ అన్న భారతీయ సంప్రదాయం.. పరివ్రాజకుడు సన్యాసి. రణాభిముఖహతుడు అమరవీరుడు. సూర్యమండలాన్ని ఛేదించుకొని వీరిద్దరూ మోక్షం వైపు సాగిపోతారు!

అలా నలబయి నలుగురు భారతీయ సైనికులు ‘హయిఫా’ను విముక్తి చేయించడం కోసం అమరులయ్యారు! ‘హయిఫా’ విముక్తి బ్రిటన్ వారి యుద్ధ విజయం కాదు, భారతీయుల నైతిక విజయం. ఈ నైతిక విజయం ‘ఇజ్రాయిల్’ అవతరణకు దారితీసింది. 3 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యూదుల దేశం ఇజ్రాయెల్ నుండి దురాక్రమణ దారుల వల్ల తమ దేశాన్ని వదిలి ఇతర దేశాలకి వలస వెళ్ళి పోవాల్సి వచ్చింది. 2900 సంవత్సరాల తరువాత మళ్ళీ తమ మాతృభూమిని పొందిన ఇజ్రాయెల్ యూదులకి దక్కింది అసలు లో 10 వ వంతు మాత్రమే. దక్కిన ఆ 10 శాతం భూమిని యూదులు తమ తెలివితేటలతో అభివృద్ధి చేసుకొని బ్రతుకుతున్నారు. ఇజ్రాయిల్ విస్తీర్ణం దాదాపు ఎనిమిది వేల చదరపు మైళ్లు, ఇరవై వేల చదరపు కిలోమీటర్లు! ఎనభయి మూడు లక్షల ఇజ్రాయిలీల ‘స్వభావ సామ్యం’ ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ, వరల్డ్ డెమోక్రాటిక్ ఆర్డన్‌ను 1948 నుంచి పెంపొందిస్తోంది! ఇజ్రాయిల్ జనాభాలో ఐదవ వంతు అరబ్ ముస్లింలు! హీబ్రూ భాష అధికార భాష, అరబ్బీ భాష రెండో అధికార భాష! ఈ సర్వమత సమభావ వ్యవస్థను ధ్వంసం చేసి ఇస్లాం మత రాజ్యాన్ని స్థాపించడానికై ఇజ్రాయిల్‌తో అరబ్ దేశాలవారు నాలుగు సార్లు యుద్ధం చేశారు! తొలి దురాక్రమణ ఇజ్రాయిల్ ఏర్పడిన రోజే జరిగింది!

ముస్లింల తీవ్ర వ్యతిరేకత ఉన్నా వారి ఛాతీ మీద తలెత్తి నిలబడింది ఇజ్రాయెల్. నలువైపులా ముస్లిందేశాలు, మధ్యన ఇజ్రాయెల్. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో దిక్కుతోచని షేకులు మేక గడ్డాలను సవరించుకుంటూ కాళ్ళుచేతులు పిసుక్కున్నారు. ఐక్యరాజ్యసమితి కి తమకు రాజధానిగా జెరూసలెం ను ఇవ్వాలని యూదులు విన్నవించుకున్నారు, పట్టుబట్టారు. అయితే యూదులకు భూభాగాన్నివ్వడంవల్ల బాగా కోపంగా ఉన్న అరబ్బులు జెరూసలెం ను కూడా పోగొట్టుకుంటే మరింత క్రుద్ధులవుతారని గ్రహించిన బ్రిటిషర్లు దానిని యూదులకు గాని, అరబ్బులకు గాని ఇవ్వలేదు. దాన్ని ఐక్యరాజ్యసమితి కి అప్పగించారు.

కొంతకాలంపాటు జెరూసలెం శాంతంగా ఉండింది. అయితే పాలస్తీనా తురకల దురద వారిని మౌనంగా కూర్చోనివ్వలేదు. 1967 లో జెరూసలెం ను వశపరచుకోవడానికి అరబ్బు దేశాల సహకారంతో పాలస్తీనా సిద్ధమైంది. దీనిగురించి ముందుగానే సమాచారం సేకరించిన ఇజ్రాయిల్ ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత వ్యూహాత్మక యుద్ధం అని పిలవబడే ఆరు రోజుల సమరానికి నాంది పలికింది. ఒంటరి దేశం అని భావించి గుంపుగా వచ్చిన అరబ్బులు ఇజ్రాయెల్ చావుదెబ్బలకు పిరుదులు కాలిన కుక్కల్లాగా ఒక మూలకు సర్దుకున్నారు. అప్పటివరకూ మానవత్వమే చట్టం అని జెరూసలెం ను వశపరచుకోకుండా వదిలేసిన యూదులు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఏదో పీకుతామని వెళ్ళి మూతులు పగలగొట్టించుకున్న అరబ్బులు సంప్రదింపులకు వచ్చారు. అప్పటివరకూ టెంపుల్ మౌంట్ మీద వక్ఫ్ పట్టు ఉండేది. ఇజ్రాయెల్ కాసింత ఉదారత్వంతో దీనిలో ఏ మార్పు చేయలేదు. ముస్లింలతో ఒక ఒప్పందం చేసుకుంది. టెంపుల్ మౌంట్ బాధ్యతను జోర్డాన్ దేశానికి అప్పగించడం, యూదులకు అక్కడ ప్రార్థనకు అవకాశం కల్పించడం ఈ ఒప్పందంలో ముఖ్య అంశం.

అయితే ఈ ఒప్పందంపట్ల ఛాందస ముస్లింలతో బాటు ఛాందస యూదులకు సదభిప్రాయం లేకపోయింది. ముస్లింలు అల్ అక్సా మసీదు ఆవరణలోకి ముస్లిమేతరులు కాలు పెట్టడాన్ని కూడా సహించేవారు కాదు. అలాగే ఈ ఒప్పందంలో యూదులకు కేవలం పర్యాటకులుగా వచ్చిపోవడానికి మాత్రమే అనుమతి ఉంది తప్ప పూజ చేయడానికి హక్కు లేదు. ఇది యూదులకు సహించరానిదైంది. జెరూసలెం ను తమ బాహుబలంతో గెలిచాక కూడా ,దాన్ని సంపూర్ణంగా ఇజ్రాయెల్ తన వశం చేసుకోకుండా ముస్లింలతో ఒప్పందం చేసుకోవడమెందుకు అనేది వారి ప్రశ్న. 2014 లో జెరూసలెం యూదుల పుణ్యభూమి అని ప్రకటించిన ఒక యూదు నాయకుడిని పాలస్తీనా తీవ్రవాదులు చంపడానికి విఫలయత్నం చేశారు. అది తీవ్రమైన గొడవకు కారణమైంది. ఈ సంఘటన తర్వాత ముస్లింలను టెంపుల్ మౌంట్ నుండి దూరంగా పెట్టడం జరిగింది. అయినప్పటికీ అరబ్బులు ఇజ్రాయెల్ భూమి ని ఆక్రమించే ప్రయత్నం ప్రతిసారీ ఈ జీహదీ మూకలు చేస్తూనే ఉన్నవి.

మరి మనమెందుకు ఇజ్రాయెల్ కు అండగా ఉండాలి, ఒకటి మనద్వారా స్వతంత్రం పొందింది ఒకరకంగా అలాగే మనదేశానికి వారు తలదాచుకోవడానికి వచ్చినప్పుడు మన మత సాంప్రదాయాలు గౌరవించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చాక అనేకమార్లు ఇజ్రాయేల్ అనేకరకాలుగా సహాయపడింది. 1962లో భారత్‌పై చైనా దండెత్తిన సమయంలో భారత్‌కు ఇజ్రాయెల్ సైనిక సాయాన్ని అందించిన విషయాన్ని మర్చిపోలేం. అలాగే 1965, 1971 సంవత్సరాల్లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ సమయాల్లో కూడా ఇజ్రాయెల్ ఎంతగానో సహకరించింది. భారత్ కూడా ఇజ్రాయెల్ రుణం తీర్చుకుంది. 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ఎంతోగానో తోడ్పడింది. ఇదీ ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా బలపడుతూ వచ్చిన సహకారం బంధం.అంతేాాగాకుండా కార్గిల్‌ యుద్దం వంటి క్లిష్ట సమయాల్లో అవసరమైన మేర ఆయుధసాయం కూడా అందించటం జరిగింది, కాబట్టి మనం ఖచ్చితంగా మతాలను పక్కనబెట్టి దేశభక్తులుగా ఇజ్రాయేల్ కి అండగా ఉండాలి. జై హింద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top