Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఖాల్సా పంథా - పంచ ప్యారీ గురించి మీకు తెలుసా? - About Khalsa Pantha in Telugu

సిక్కులు త్యాగబుద్ధిని వారి గురువుల వద్దనుండి నేర్చుకున్నారు. గురువులు సైతం మానవాళికై అత్యున్నత త్యాగాలు చేశారు. తొమ్మిదవ గురువై...

సిక్కులు త్యాగబుద్ధిని వారి గురువుల వద్దనుండి నేర్చుకున్నారు. గురువులు సైతం మానవాళికై అత్యున్నత త్యాగాలు చేశారు. తొమ్మిదవ గురువైన 'తేగ్ బహదూర్' హిందూమతాన్ని రక్షించటానికై చేసిన త్యాగం ఒక సజీవ ఉదాహరణ. ఆ తరువాత పదవ గురువు అయిన 'గురుగో వింద్ సింగ్' అప్పటి పరిస్థితులకు అనుగుణంగా భక్తి (ధ్యానం)ని ఇంకా శక్తి (గెలిచే శక్తిని) ని తగిన రీతిలో కలిపారు. అప్పటి పాలకులు హిందువులపై చేస్తున్న ఘోరమైన మతపరమైన సామాజిక అన్యాయాలను ఎదరించటానికై ఆయన 17వ శతాబ్ది చివరిలో 'ఖల్సాపంథా'ను స్థాపించారు. అప్పటి ప్రభువులు హిందువుల మత చిహ్నాలను (జంధ్యం, శిఖ మొదలైన ) అపవిత్రం చేస్తున్నారు. గురువు గారు దానిని ఎదిరించి ఖల్సాకు, పొడవైన కత్తిరించబడని జుట్టు ఇంకా ధరించే దుస్తులకు ఒక నియమావళిని రూపొందించటం ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చారు.

అప్పటి పాలకుల క్రూరమైన పాలన కారణంగా ప్రాణభీతితో భయభ్రాంతులైన, నిర్వీర్యమైన సమాజంలో ధైర్యం. శౌర్యాలతో కూడిన చైతన్యాన్ని రగిలించటానికై, గురు గోవింద్ సింగ్ 1699లో బైశాఖీ రోజున ఆనందపూర్ సాహిబ్ వద్ద ఒక సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాలనుండి ప్రజలు వచ్చారు. గురువుగారు అప్పుడు ఒరలో నుండి కత్త దూసి "తన జీతాన్ని నాకివ్వటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు?" అని ప్రశ్నించారు. అప్పడక్కడంతా నిశ్శబ్దమావహించింది. ఈ విధమైన శోధనకు ఎవరూ సిద్ధంగా లేరా? అంతలో లాహోర్ నుంచి వచ్చిన దయారాం అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. గురువు గారు అతనిని ఒక గుడారంలోకి తీసుకువెళ్ళారు. కొద్ది సేపు తర్వాత గురువుగారు రక్తమోడుతున్న కత్తితో బయటకు వచ్చి తర్వాత ఎవరు సంసిద్ధంగా ఉన్నారని అడిగారు. గురువుగారు ఇలా ఐదుసార్లు చేసారు. ప్రతి సారికి ఈ శోధన కఠినమవుతూ వచ్చింది. ఎటువంటి భయం లేకుండా హస్తినాపురం నుండి ధరమ్ దాస్, జగన్నాధ పూరీ నుండి హిమ్మత్ రాయ్, గుజరాత్ నుండి మోహకమ్ చాంద్ ఇంకా కర్ణాటక నుండి సాహిబ్ చంద్ లు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చారు. ఇదంతా చూస్తున్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు గురువుగారు గుడారపు తెరని పైకి ఎత్తారు. ఆ ఐదుగురు ప్రాణాలతో నిలబడి కనబడ్డారు. గురువుగారి యొక్క అద్వితీయమైన ఈ త్యాగశోధనా ధానం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. గురువుగారు ఆ ఐదుగురిని అమృతం (పవిత్రమైన సుధ) తో అభిషేకించి 'ఖల్సా (అంటే శుద్ధమైనది) ఇప్పుడు సిద్ధంగా ఉంది', వీరు అన్యాయంగానూ నిరంకుశత్వంగానూ ప్రవర్తించరు, ఇంకా దానిని సహించబోరు. అవసరమైతే తమ ప్రాణాలొడ్డటానికి వెనుకాడబోరు అని ప్రకటించారు. గురువుగారు వారికి దయాసింగ్, ధరమ్ సింగ్, హిమ్మత్ సింగ్, మోహమ్ సింగ్, సాహిబ్ సింగ్ అని నామకరణం చేసి వారిని 'పంచ్ ప్యారే' (ప్రియమైన ఐదుగురు) అని సంబోధించారు. ఐదుగురు 'ప్యారే'లతో స్థాపించబడిన ఖల్సా నేడు కోట్ల సంఖ్యకు చేరుకుంది.

ఖల్సా స్థాపించబడినప్పటి నుండి భారత దేశాన్ని కాపాడే భారాన్ని తమపై వేసుకున్నారనటానికి చరిత్రే తార్కాణం. 18వ శతాబ్దపు ప్రారంభంలో భారతదేశంపై చాలామంది పర్షియా రాజు నాదిర్షా, అహ్మద్ షా అబ్దాలీ వంటి వారు దండయాత్రలు చేశారు. వాళ్ళు బంగారం, వజ్రాలు ఇంకా విలువైన వస్తువులు.. దోచుకోవటంతో పాటు భారతదేశపు నలుమూలల నుండి మహిళలను కూడా చెరపట్టి తీసుకువెళ్ళారు.. ఈ చెరపట్టిన ఆడవారిని కాబూల్, ఘజని, పర్షియా మున్నగు ప్రదేశాలలో అమ్మి వేసేవారు. అక్కడ వాళ్ళను మానభంగాలు చేసి వారియెడల విచక్షణా రహితంగా ప్రవర్తించేవారు. ఇలా ఈ దోపిడి చేసిన సొత్తుతో వాళ్ళు తిరిగి పంజాబు గుండా తమ దేశాలకు వెళ్ళవలసి వచ్చేది. భారతదేశంలోని ప్రజలందరూ వారి మాన ప్రాణాలను సంపదలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే, సిక్కులు స్త్రీలను రక్షించటానికి పూనుకున్నారు.

వారు రాత్రి 12 గంటలకు దండయాత్ర చేసిన వారిని దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఒక చిన్న వ్యూహాత్మకమైన వాక్యం 'బారా బజ్ గయే (12 గంటలు అయ్యింది)' ని తయారు చేసి, దోపిడి దారుల క్యాంపులపై పడటానికి తమ గుంపులను అప్రమత్తపరిచేవారు. భాధాకరంగా ఈ సిక్కులే కనుక ధైర్యం వహించక పోయినట్లైతే భారతస్త్రీలు మానాలు కోల్పోయి నీచమైన బ్రతుకులు బ్రతకవలసి వచ్చేది. ఈ విషయం తెలియక ఈ వ్యూహాత్మకమైన వాక్యం సరిగా అర్ధం చేసుకోబడలేదు. ఈ పదం సిక్కులకు గర్వకారణం. ఇది వారి ధైర్యాన్ని, ధర్మ పరాయణత్వాన్ని చూపుతుంది. భారతదేశ చరిత్రలో దానికి ఒక ప్రత్యేకత, అస్థిత్వము, స్థానం ఉన్నాయి. ఖల్సా పంథా స్థాపన తరువాత విదేశీ మూకల మన మహిళలపై దాడులు పూర్తిగా కొంతకాలం పాటు తగ్గిపోయాయి... భారతజాతికి శిక్కులు చేసిన సేవాలు అమోఘమైనవి. 

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments