Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

ఆక్సిజన్ లెవల్స్ ని‌ సహజ పద్దతిలో పెంచుకోవడం ఎలా? - how to increase oxygen levels naturally

ఆక్సిజన్ ఈ వాయువు సమస్థ ప్రాణికోటికి ప్రాణవాయువు ప్రకృతిలో అన్ని మూలకాల కంటే ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది....

ఆక్సిజన్ ఈ వాయువు సమస్థ ప్రాణికోటికి ప్రాణవాయువు ప్రకృతిలో అన్ని మూలకాల కంటే ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘన పరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. సంకేతం O, అణుఫార్ములా O2. పరమాణు సంఖ్య -8. ఇంతవరకు కనీస అవగాహన ఇది మనం చిన్నప్పుడే చదువుకున్నాం.

దేశం లో కొరొనా ఉదృతి పెరుగుతున్న కారణంగా ఆక్సిజన్ వాయువు అందకపోవడం వలన అనేకమంది ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ రోగులుకు అందకపోవడానికి అనేక కారణాలు వాటి ప్రస్తావన అనవసరం. 

రెండో దశలో కరోనా నేరుగా శ్వాసవ్యవస్థపై దెబ్బకొడుతుంటడంతో ప్రాణవాయవుకు డిమాండ్‌ పెరుగుతున్న వేళ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 82 ఏళ్ల బామ్మ ఆక్సిజన్‌ అవసరం లేకుండానే వైరస్‌ను జయించారు. ‘ప్రోనింగ్‌’ పద్ధతిలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకుని కేవలం 12 రోజుల్లోనే కరోనా నుంచి క్షేమంగా బయటపడ్డారు. 

గోరఖ్‌పూర్‌ జిల్లాలోని అలీనగర్‌ ప్రాంతానికి చెందిన 82ఏళ్ల విద్య శ్రీవాస్తవ ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఒక రోజు ఆమె ఆక్సిజన్‌ స్థాయులు 79కి పడిపోయాయి. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆసుపత్రిలో చేర్చకుండా ఆమెను మంచంపై బోర్లా పడుకోబెట్టారు. ప్రోనింగ్ పద్ధతిలో శ్వాస తీసుకునేలా చూసుకున్నారు. దీంతో నాలుగు రోజులు తిరగకుండానే ఆమె ఆక్సిజన్‌ స్థాయులు 94కు చేరుకున్నాయని విద్య కుమారుడు హరిమోహన్‌ తెలిపారు. ఆక్సిజన్‌ సిలిండర్ అవసరం లేకుండానే ప్రోనింగ్‌తో తన తల్లి శ్వాసవ్యవస్థ మెరుగుపడిందని చెప్పారు. అలా కేవలం 12 రోజుల్లోనే విద్య కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా రాగానే చాలా మంది ఒకింత ఆందోళనకు గురవుతుంటారు. అలా కాకుండా మనోధైర్యంతో ఉంటూ వైద్యుల సూచనలు తప్పకుండా పాటిస్తే ఇంట్లోనే వైరస్‌ను జయించొచ్చని చెప్పేందుకు ఈ బామ్మే ఉదాహరణ. 
ఏంటీ ప్రోనింగ్‌.. ఎలా చేయాలి..

ఛాతి, పొట్టభాగంపై బరువుపడే విధంగా (బోర్లా) పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ చేరుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల సూచించింది. ‘ప్రోనింగ్‌’గా పిలిచే ఈ విధానం వైద్యపరంగా ధ్రువీకరణ పొందిందని పేర్కొంది. ముఖ్యంగా ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు ‘ప్రోనింగ్‌’ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.

* మొదట మంచంపై బోర్లా పడుకోవాలి.

* ఒక మెత్తటి దిండు తీసుకుని మెడ కిందభాగంలో ఉంచాలి.

* ఛాతి నుంచి తొడ వరకూ ఒకటి లేదా రెండు దిండ్లను ఉంచవచ్చు.

* మరో రెండు దిండ్లను మోకాలి కింద భాగంలో ఉండేలా చూసుకోవాలి. ఇక ఎక్కువ సమయం పడకపై ఉండే రోగులకు రోజంతా ఒకేవిధంగా కాకుండా పలు భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్‌ చేయవద్దు.

* తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్‌ చేయండి.

* పలు సమయాల్లో రోజులో గరిష్ఠంగా 16 గంటల వరకు ప్రోనింగ్‌ చేయవచ్చు.(వైద్యుల సూచనల మేరకు)

* హృద్రోగ సమస్యలు, గర్భిణిలు, వెన్నెముక సమస్యలున్నవారు ఈ విధానానికి దూరంగా ఉండాలి.

* ప్రోనింగ్‌ సమయంలో దిండ్లను సౌకర్యవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.

ప్రయోజనాలు..

* ప్రోనింగ్‌ పొజిషన్‌ వల్ల శ్వాసమార్గం సరళతరమై గాలి ప్రసరణ మెరుగవుతుంది.

* ఆక్సిజన్‌ స్థాయులు 94శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్‌ అవసరం.

* ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయులు, రక్తంలో చక్కెర స్థాయులను పరిశీలించడం ఎంతో ముఖ్యం.

* మంచి వెంటిలేషన్‌, సకాలంలో ‘ప్రోనింగ్‌’ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు.

అసలు మనకు కొరొనా సోకకముందే ఇవన్నీ చేస్తే ఇంకా మంచిది....

సహజంగా మనకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు అలసట, తలనొప్పి మరియు ముక్కులు పొడిగా మారడం లేదా ముక్కుల నుండి రక్తం కారుతుంది. ఇది కొరొనా రావడం వలనే కాదు సహజంగా కూడా మనలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోకుండా ఉండటానికి ఈ ఐదు సూత్రాలు పాటించండి... ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి.

ఆహారపు అలవాట్లు: జంక్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, చైనా ఫుడ్స్ పూర్తిగా మానేయండి. రోజూ మన ఇంటి భోజనం చేయండి. సహజంగా మన ఇంట్లో ఎటువంటి ఆహారం తీసుకుంటారో అదే ఆహారం తీసుకోండి.. నాన్ వెజ్ కుటుంబం అయితే నాన్ వెజ్ తీసుకోవచ్చు, ముఖ్యంగా చేప కూడా తినొచ్చు. ఆకు కూరలు అన్నీ తినాలి, సొరకాయ, బీరకాయ వంటి నీటి శాతం ఉన్న అన్ని కూరగాయలు తినాలి. రేగి పండ్లు, సోయాబీన్, వాల్ నట్స్ తినండి.

చురుకుగా ఉండండి: ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం కీలకం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫారసు చేసినట్లుగా రోజుకు 30 నిమిషాలు సాధారణ నడక ఎక్కువ ప్రభావం చూపుతుంది, ఈ నడక క్లాక్ వైస్ డైరెక్షన్ లో నడవాలి భారతదేశం లో. నడక మానసిక స్థితి, విశ్వాసం మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.

యోగా చేయండి: ప్రాణాయామం చేయాలి... ప్రాణాయామం అనగా శ్వాసను తీసుకొవటడం, కుంభించటం, వదలడం, ఒక క్రమ పద్ధతిలో జరుపడం. దీని వలన శరీరంలోని చెడు వాయువు బయటకు వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు లోనికి వస్తుతుంది. రక్తం శుభ్రపడుతుంది. నరములకు బలము కలుగుంది. ప్రాణాయామం సాధన చేయటానికి సంసిద్ధం చేసే శ్వాస ప్రక్రియ ఇది. శ్వాసక్రియను సరిదిద్ది, ఊపిరితిత్తుల శక్తిని పెంచుతుంది. ఈ ప్రాణాయామం చేసేప్పుడు వజ్రాసనం వేయండి. అలాగే నడుము నొప్పి, హార్ట్ సమస్యలు లేనివారు సూర్యనమస్కారాలు చేయండి.

మనకున్న ఇంటిలో ఆరోగ్యకరమైన వాతావరణం: ఇంటి ఆవరణలో తులసి మొక్క దగ్గర కాసేపు గడపండి. అలాగే ఇంట్లో వేపచెట్టు ఉన్నట్లయితే ఆ స్వచ్చమైన గాలిని పీలుస్తూ వదులుతూ ఉండండి‌.. శరీరం ను అటు ఇటూ కదిపినప్పుడు కూడా శ్వాసను గమనిస్తూ శ్వాస ని తీసుకోవడం వదలడం చేయండి. ఇంకా ఇంట్లో శుభ్రత పాటించండి. లెట్రిన్ బేసిన్ నీట్ గా ఎప్పటికప్పుడు కడుగుకోవాలి. మన వంటగదిలో గిన్నెలు కడిగే స్థలాన్ని కూడా శుభ్రంగా ఉంచండి.. ఇలా ఇంటిలో మంచి శుభ్రతను పాటించే ప్రయత్నం చేయండి. మనకు కాస్త ఈ రోగాలబారి నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా తెలుగు మీడియాలో వచ్చే అనవసర చర్చలు అలాగే కొరొనా వార్తలు చూడటం మానేసి సరదా కబుర్లు చెప్పుకోండి. ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చూసుకోండి... జై హింద్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

3 comments

  1. చాలా విలువైన సమాచారం ఇచ్చారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..