1857 స్వరాజ్య సంగ్రామానికి నాంది ఇలా: భారత హిందూ దేశ చరిత్రలో 1857 స్వతంత్ర్య సంగ్రామం ఒక ముఖ్యఘట్టం. స్వధర్మ రక్షణ, స్వాతంత్ర్యం కోసం జరిగి...
మన దేశానికి స్వాతంత్ర్యం 1947లో వచ్చింది. ఈ స్వరాజ్య సంగ్రామానికి పునాది పడింది మాత్రం 1857లోనే..! 1857 స్వరాజ్య సంగ్రామ స్ఫూర్తితోనే తర్వాత కాలంలో భారత స్వాతంత్ర్య పోరాటం జరిగింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఆ రోజుల్లో ఆంగ్లేయులను ఫిరంగిలని పిలిచేవారు. మన ఆర్థిక వనరులన్నింటిని బ్రిటీష్ వారు దోపిడి చేశారు. ఇది మానవత్వము మంటగలిపిన నీచాతినీచమైన దోపిడీ...! ఇంకా ఎంతకాలమీ దౌర్జన్యం భరించాలని ఇటు దేశ ప్రజల్లో... అటు సిపాయిల్లో ఆవేదన, అంతర్మథనం మొదలైంది.
బ్రిటీష్ ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో భారతీయులను కుక్కలకంటే హీనంగా చూసేశారు ఆంగ్లేయులు.! భారతీయులతో నీచాతి నీచమైన పనులు చేయించుకునేవారు. ఇంకా హోటళ్లల్లో అయితే కుక్కలకు, భారతీయులకు చోటు లేదని బోర్డులు తగిలించేవారు. ఇక ఈస్టిండియా కంపెనీ సైన్యంలో భారతీయుల దుస్థితి అంతా ఇంతా కాదు...!
భారత్ ను శాశ్వతంగా ఇంగ్లాండుకు బానిస దేశంగా తయారు చేసేందుకు ఈస్టిండియా కంపెనీ సరికొత్త ఎత్తులు వేసింది. అదే భారతీయులను మతంమార్చే పని. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ నుంచి బయలు దేరే కంపెనీ నౌకలతోపాటు సైనికులు, చర్చి ఫాదర్స్ కూడా ఉండేవారు. ఈ వ్యవహారం కూడా భారతీయులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
ఆంగ్లేయుల పాలన దేశంలో ఇలాగే కొనసాగితే దేశంలో తమ ధర్మం పూర్తిగా నాశనమైపోతుందనే అభిప్రాయం దేశ ప్రజల్లో బలపడసాగింది. భారత ప్రజలు ఏ రకమయమైనా దోపిడినైనా సహించగలరు కానీ ధర్మ విశ్వాసాలకు, మత విశ్వాసాలకు భంగం కలిగితే మాత్రం సహించలేరు. తమ మతాన్ని, ధర్మాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలందరూ ఒక్కటి అయ్యారు. ఫిరంగి ఆంగ్లేయులపై మహా విస్ఫోటనానికి సిద్ధమయ్యారు. ఇదే 1857 స్వరాజ్య సంగ్రామానికి నాంది అయ్యింది.
No comments