Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వామి శ్రద్ధానంద ను హత్య చేసిన మతోన్మాది అబ్దుల్ రషీద్. About Swami Shraddhananda in Telugu

స్వామి శ్రద్ధానంద 1856 ఫిబ్రవరి 22 నాడు తల్వాన్ గ్రామం, జలంధర్ జిల్లా పంజాబులో జన్మించాడు. ఆయన తండ్రి లాలానానక్ చంద్ పోలీసు ఇన్ ...

స్వామి శ్రద్ధానంద 1856 ఫిబ్రవరి 22 నాడు తల్వాన్ గ్రామం, జలంధర్ జిల్లా పంజాబులో జన్మించాడు. ఆయన తండ్రి లాలానానక్ చంద్ పోలీసు ఇన్ స్పెక్టర్. ఆయన చిన్ననాటి పేరు బృహస్పతి విజ్. తరువాత ఆయన్ని మున్షీరామ్ విజ్ అని పిలిచారు. కొన్ని పరిస్థితుల ప్రభావంతో ఆయన నాస్తికుడయ్యాడు. మంచి వక్త. లాహోర్ లోని డిఎవి కళాశాలలో వేద విద్యను పాఠ్యాంశంగా ఉంచేందుకు ఆయన ఉద్యమించాడు. ఆర్య సమాజ ప్రభావానికి లోనై, ఆర్యసమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతిని కలిశాడు. స్వామి దయానంద ధైర్యం, నైపుణ్యం బలమైన వ్యక్తిత్వానికి ప్రభావితమయ్యాడు. చదువు పూర్తయ్యాక న్యాయవాదిగా వృత్తి చేయడం ప్రారంభించాడు. 1897లో లాలా లేఖ్ రామ్ హత్యకు గురయిన తరువాత పంజాబ్ ఆర్య ప్రతినిధి సభకు నాయకత్వం వహించాడు. మాస పత్రిక “ఆర్య మాసాధీర్” ను ప్రారంభించాడు. 1902లో హరిద్వార్ సమీపంలో కాలగ్రీలో గురుకులం స్థాపించాడు.

1917లో మహాత్మా మున్షీరామ్ స్వామి శ్రద్ధానంద సరస్వతీగా సన్యాసి దీక్ష తీసుకున్నాడు. శ్రద్ధానంద్ హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో ఆరావళిలో గురుకుల ఇంద్ర ప్రస్థాన్ని స్థాపించాడు. అప్పటి నుండి స్వామి శ్రద్ధానంద్ హిందూ సంస్కరణోద్యమాలలో, భారత స్వాతంత్ర్యద్యోమంలో చురుకైన పాత్ర పోషించడం మొదలెట్టాడు. 1919లో అమృత్ సర్ లో సమావేశం నిర్వహించాలని ఆహ్వానించి కాంగ్రెస్ తో కలిసి పని చేయడం ప్రారంభించాడు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించాడు. 1920లో హిందూ మహాసభను ప్రారంభించాడు. హిందీ, ఉర్దూ భాషలలో మతపరమైన విషయాలపై వ్యాసాలు వ్రాసేవాడు. రెండు భాషలలో వార్తా పత్రికలు ప్రచురించేవాడు. మహిళా విద్యను ప్రోత్సహించేవాడు. 1922లో శ్రద్ధానంద్ ను డాక్టర్ అంబేద్కర్ అంటరాని వారి యొక్క నిజాయితీగల ఛాంపియన్ అనిపించారు. 

సన్యాసాస్రమానికి ముందు అతనికి భార్య శైవాదేవి ఇద్దరు కుమారులు, కుమార్తెలున్నారు. అతనికి 35 సం॥ల వయసులో భార్య మరణించింది. ఆయన అనేక గ్రంథాలు వ్రాశారు. ఆర్య సమాజ్ అండ్ యిట్స్ డిస్ట్రిక్ట్, హిందూ సంఘటన్ వంటివి యిందులో ముఖ్యమైనవి. 1923లో సామాజిక రంగాన్ని విడిచి పెట్టి శుద్ధి ఉద్యమంలో చేరాడు. హిందూ మతం మారిన మహమ్మదీయులను తిరిగి మాతృధర్మంలోకి మార్చాలనే లక్ష్యంతో రూపొందించిన “భారతీయ హిందూ శుద్ధి సభ” కు అధ్యక్షుడయ్యాడు. ప్రత్యేకంగా పశ్చిమాన “మల్కాన రాజపుత్రులను” మాతృ ధర్మంలోకి ఆహ్వానించేందుకు పూనుకున్నాడు. హిందూ సమాజం లోని అంటరానితనం వంటి దురాచారాలకు ఆర్య సమాజం ఆ రోజుల్లో పనిచేస్తూండేది. స్వామి శ్రద్ధానంద మరికొంత ముందుకు వెళ్ళి అంటరానితనం మూలంగా, ప్రలోభాల కారణంగా, బలప్రయోగం వల్ల దారి తప్పి, మతం మారిన హిందువులను మళ్ళీ మాతృ ధర్మంలోకి పునరాగమనం చేయించేందుకు శుద్ది ఉద్యమం ప్రారంభించారు.

ఆ రోజున స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింలను కలుపుకుని పోయేందుకు కాంగ్రెస్ నాయకులు చాలా అపోహలు పడేవారు హిందీ భాషను కాదని ముస్లింలను మంచి చేసేందుకు హిందుస్థానీ భాష రూపొందించి పాఠ్య పుస్తకాల్లో బాద్దారామ్ బేగమ్ సేవ పదప్రయోగాలు చేయడం, శివాజీ ఘనతను కీర్తిస్తూ మహాకవి భూషణుడు రచించిన “శివ భావని” ని ఎక్కడా ఉపయోగించరాదని గాంధీ లాంటి వాళ్ళు ఆదేశించడం, రఘుపతి రాఘవరాజారాం పతిత పావన సీతారాం అన్న హృద్యమైన భజనకు "ఈశ్వర అల్లా తేరేనాం” అనే పంక్తిని జోడించడం యిలా ముస్లిం, సంతుస్టీకరణ జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం తరువాత దేశంలో పెద్ద ఎత్తున అలజడి సృష్టించి హిందువులను పెద్ద సంఖ్యలో బలవంతంగా ముస్లింలుగా మతం మార్చడం కాంగ్రెస్ వాదులకు నబుంది, కాని స్వామి శ్రద్ధానంద వంటి వారు సహించలేక పోయారు.

శుద్ధి కార్యక్రమంలో భాగంగా 1923 సం||లో సుమారు 50వేల మంది ముస్లింలను స్వామి శ్రద్ధానంద హిందూ ధర్మంలోకి పునరాగమనం చేయించారు అంతవరకు ఏక పక్షంగా సాగుతున్న మతాంతీకరణ, ఎదురు తిరగడం, మతం మౌడ్య ముస్లిం నేతలకు సహించరాని విషయం అయింది. స్వామి శ్రద్ధానందను భౌతికంగా అడ్డు తొలగించుకునేందుకు వారు కుట్ర పన్నారు. నాడు హిందూ ధర్మంలో ఉన్న ఓ బలహీనత “పునరాగమన నిషేధం". మతం మారి హిందూధర్మం త్యజించిన వాళ్ళు తిరిగి హిందూ ధర్మంలోకి రావడాన్ని పండితులు, ధర్మాచార్యులు అంగీకరించే వారు కాదు. స్వామి శ్రద్ధానంద ఈ ఆలోచనను వ్యతిరేకించారు. తన మృదుమధుర భాషణలతో, పాండిత్యంతో ఎందరో ముస్లింలు తిరిగి తమ హిందూధర్మం స్వీకరించేలా చేశారాయన. స్వామి శ్రద్ధానందకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఆయన భయపడలేదు.

నవంబరు 1926లో స్వామీజీకి జబ్బుచేసింది. మంచంలో వున్నారు. డా||అన్నారీ అనే ఆయన వైద్యం చేస్తూండేవారు. శిష్యుడు ధరమ్ సింగ్ ఆయన్ను కంటికి రెప్పలా చూస్తూండేవారు. 1926 డిసెంబర్ 23 వ తేదీన అబ్దుల్ రసీద్ అనే ముస్లిం స్వామీజి ఇంటికి వచ్చాడు. స్వామీజీతో ఇస్లాం మతం గురించి ధార్మిక చర్చ చేయాలి అన్నాడు. ధరమ్ సింగ్ "ఆయనకు ఆరోగ్యం బాగులేదు. ఇప్పుడు మాట్లాడటానికి వీల్లేదు” అన్నాడు. వారిద్దరి మధ్య వాదులాట జరిగింది. ఆ వాదులాట విన్న స్వామి అతన్ని లోపలికి పంపమన్నాడు. స్వామిజీ మంచం మీద పడుకొని వున్నాడు. “దాహంగా ఉంది, మంచి నీళ్ళు, అన్నాడు రసీద్” ధరమ్ సింగ్ మంచినీళ్ళు తేవడానికి వెళ్ళాడు. చివ్వున లేచి రసీద్, చేతిలో రివాల్వర్ తీసి వృద్ధ స్వామీజీ పై నిర్ధాక్షిణంగా గుళ్ళ వర్షం కురిపించాడు. స్వామి శ్రద్ధానంద అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో గౌహతీలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. స్వామి శ్రద్ధానంద హత్య వార్త అక్కడికి చేరింది. గాంధీతో సహా ఎవరూ ఈ హత్యను ఖండించలేదు. స్వామీజీ అమరుడై చంద్రలో చిరస్మరణీయుడయ్యాడు. అసలు మహాత్ముడై భాషించాడు. -తాడేపల్లి హనుమత్ ప్రసాద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments