Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

22 ఏళ్ళ వయస్సులో స్వదేశీ ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ చేస్తూ బలిదానం అయిన బాబూ గేను - About Babu Genus in Telugu

మొట్ట మొదటిసారి భారతదేశంలో 1905 డిసెంబర్ లో విదేశీ వస్త్ర బహిస్కరణతో స్వదేశీ ఆందోళన మొదలయ్యింది. పూణేలో నివసించే బాల గంగాధర్ తిల...

మొట్ట మొదటిసారి భారతదేశంలో 1905 డిసెంబర్ లో విదేశీ వస్త్ర బహిస్కరణతో స్వదేశీ ఆందోళన మొదలయ్యింది. పూణేలో నివసించే బాల గంగాధర్ తిలక్ 1905 డిసెంబర్ 30వ తేదీన విదేశీ వస్త్రాలు నడిరోడ్డులో కుప్పగా వేసి, నిప్పంటించటంతో ఈ ఆందోళన మొదలయ్యింది. వీరి పిలుపు మేరకు లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అప్పటికి గాంధీజీ ఇంకా స్వాతంత్ర్య పోరాటంలో ప్రవేశించ లేదు, భారాత్ లో కూడా లేరు. 1915లో  గాంధీజీ భారత్ వచ్చే సరికే స్వాతంత్ర్య పోరాటం బాగా జోరందుకుంది.

పూణే సమీపంలోఎక్కడో ఒక చిన్న ఊర్లో ప్రారంభమైన ఈ విదేశీ బహిష్కరణోద్యమం, ఆరే ఆరు సంవత్సరాల్లో దేశమంతా వ్యాపించింది. దేశమంతా విదేశీ వస్త్ర దహనం  కొనసాగింది. ఈ ఉద్యమం ఏ స్థాయికి చేరుకుందీ అంటే, బట్టలు కొనుక్కునే స్తోమత లేని పేద వారుసైతం తన శరీరంమ్మీద ఉన్న విదేశీ వస్త్రాలు తీసి మంటల్లో వేసేవారు, ఇంటిలో ఉన్న విదేశీ వస్త్రాలను వెతికి వెతికి బూడిద చేసేసేవారు. చూస్తూ చూస్తూనే ఒక కోటీ నలభై లక్షల మంది కార్యకర్తలతో ఒక సంఘటన గా ఏర్పడింది. దేశంలోని పలు కార్యకర్తలు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అందులో ఒకరు బాబు గేను.

ఆయన ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని, ముంబాయ్ బందర్గా లో దిగుమతి అవుతున్న విదేశీ వస్తువుల ఆచూకీ తెలుసుకుని అక్కడికక్కడే నిప్పంటించేవారు. ఒకరోజు విదేశీ వస్తువులతో నిండిన ఒక ఓడ బందర్గా వస్తుందన్న వార్త ఎలానో తెలిసింది. బాబు గేను బృందం హుటాహుటీన అక్కడికి చేరింది. లోడు ఇక్కడ దిగడానికి వీల్లేదు, తిరిగి తీసుకెళ్లిపోండి, లేదంటే కాల్చేస్తామని హెచ్చరించారు. ఆంగ్లేయులు వీరి మాట ఖాతరు చేయలేదు. ఓడనుండి సరుకు దించి లారీల్లో ఎక్కించి ముంబయ్ వైపు తరలించే ప్రయత్నం చేశారు.

బాబూ గేను మళ్ళీ  హెచ్చరించాడు. ఆంగ్లేయులు వినలేదు. బాబూ గేనుకు మరేమీ తోచలేదు. వెళ్ళి ఆ లారీలకు అడ్డంగా పడుకున్నారు. బాబు గేను మీదుగా ట్రక్కును నడపాలని పోలీసు అధికారి డ్రైవర్‌ను ఆదేశించాడు.  ట్రక్ డ్రైవర్ - బల్బీర్ సింగ్ - ఒక భారతీయుడు నిరసనకారుల దగ్గరికి వచ్చి ఆగాడు.  అతను "నేను భారతీయుడిని మరియు అతను కూడా భారతీయుడు, కాబట్టి, మేము ఇద్దరూ ఒకరికొకరు సోదరులు, అప్పుడు నేను నా సోదరుడిని ఎలా హత్య చేయగలను?" అని అన్నారు.  ట్రక్ నుండి క్రిందకు దింపాడు బ్రిటిష్ అధికారి బల్బీర్ సింగ్ ని ఆ తరువాత, ఇంగ్లీష్ అధికారి డ్రైవర్ సీటుపై కూర్చుని దుర్మార్గుడు, క్షణం కూడా ఆలోచించకుండా ఆ భారత సింహం గుండెలమీద నుండి లారీ ట్రక్ ఎక్కించేశారు. బాబూ గేను అక్కడికక్కడే బలిదానం అయ్యాడు.
ఇది విని భారతీయుల కళ్ళల్లో నిప్పులు కురిశాయి. స్వదేశీ ఉద్యమం మరింత ఉగ్ర రూపం దాల్చింది. ప్రభలమై ఈ ఉద్యమం మొత్తం విదేశీ ఉత్పాదనల పైనే నిషేధం ప్రకటించింది. అప్పటికి సుమారు 60 నుండి 70 వస్తువులు బ్రిటీషు నుండి భారత్ వచ్చేవి. వాటన్నింటిని బహిష్కరించారు భారతీయులు. విదేశం నుండి షుగర్(పంచదార) దిగుమతి అయ్యేది. దానిని బహిష్కరించి ఆ స్థానంలో బెల్లం వాడడం ప్రారంభించారు. బ్లేడ్లు వచ్చేవి. వాటికి బదులు మంగళ కత్తులు  వాడడం ఆరంభించారు. ఇలా ఒకటేమిటి అన్నీ పూర్తి స్థాయిలో బహిష్కరించారు. ఆంగ్లేయుల వ్యాపారానికి తీవ్రమైన ఇబ్బంది ఎదురయ్యింది వాళ్ళ దిగుమతి నిలిచిపోయింది.

బాబుగేను 1908 లో ఒక పేద కుటుంబం లో జన్మించిన పిల్లాడు, పేదరికం కారణంగా చదువుమానేశాడు, గోవుల కాపరిగా మారాడు మిత్రుడు ప్రహ్లాద్ స్నేహం తో బొంబాయి లో ఏదో చిన్న ఉద్యోగం లో చేరాడు. తిలక్, లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, గాంధీ లను ప్రేరణగా తీసుకుని చిన్నప్పటినుండే దేశం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ అనేక బృందాలను తయారు చేశాడు. స్వదేశీ ఉధ్యమంలో ఒక విప్లవ కెరటం గా ముందుకు దూకాడు 1930 డిసెంబర్ 12 న స్వదేశీ వస్త్ర బహిష్కరణలో పాల్గొన ఊపిరివదిలాడు. ఇలా ఎందరో పిన్నవయస్కులు దేశం కోసం తమ జీవితాలు త్యాగం చేశారు అటువంటి వారిని మనం స్మరించుకుని వారిని గౌరవించుకుందాం వారి మార్గంలో కొంతైనా నడుద్దాం. -రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments