Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఓ జమిందార్ - About Veer Narayan Singh in Telugu

బ్రిటిష్ పాలకుల భారతదేశాన్ని పాలించడం మొదలైన తరువాత దేశం లో ప్రజలంతా ఒకేసారి స్వాతంత్ర్య కోరుకున్న సమయం 1857. అదే మనమందరం చదువుక...

బ్రిటిష్ పాలకుల భారతదేశాన్ని పాలించడం మొదలైన తరువాత దేశం లో ప్రజలంతా ఒకేసారి స్వాతంత్ర్య కోరుకున్న సమయం 1857. అదే మనమందరం చదువుకున్న వక్రీకరించిన సిపాయిల తిరుగుబాటు ఇదే అసలు భారత స్వాతంత్ర్య మొదటి సంగ్రామం. ఈ సంగ్రామంలో కోట్లమంది సామాన్య ప్రజలు కూడా పాల్గొన్నారు. అప్పుడు దేశం లో ప్రజలు తీవ్రకరువు బారిన పడ్డారు. ఆహార నిల్వలు తగ్గిపోయాయి, బ్రిటిష్ పాలకుల జమిందారీ వ్యవస్థలో చొచ్చుకుపోయి అనుకూలంగా లేని జమిందారీలకు ఆహార నిల్వలు పంపేవారు కాదు అప్పుడు  చత్తీస్‌గఢ్ లో ఓ జమీందారు కొడుకు వీర నారాయణ సింగ్ ప్రజలకోసం ఎంచేశాడన్నదే ఈ సారాంశం.

ఛత్తీస్ ఘడ్ అటవీ సంపద కలిగిన రాష్ట్రం. ఇంతకు ముందు మధ్యప్రదేశ్‌లో ఉండేది. బ్రిటీషు పరిపాలనా కాలంలో, రాయ్‌పూర్‌లో బ్రిటిష్ వారు ఒక కమిషనర్‌ను స్థాపించారు. సోనాఖాన్ (బంగారు-గని) ఒక చిన్న రాచరిక రాష్ట్రం. అక్కడి నేలలో బంగారు కణాలు లభించేవి. అందువలన ఆ ప్రాంతానిక సోనాఖాన్ అనే పేరు వచ్చింది. బింజావర్ రాజరిక కుటుంబానికి చెందిన వీర్ నారాయణ్ సింగ్ అక్కడ జమీందార్. అతను చాలా ధైర్యవంతుడు. స్వాభిమానం కలవాడు. 1830లో రామరాయ్ సింగ్ మరణం తరువాత, జమీందారీ పర్యవేక్షణ అతని కుమారుడు నారాయణ్ సింగ్ చేతికి వచ్చింది. నారాయణ్ సింగ్ తన తండ్రిని అనుసరించి ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు. ప్రజలు రాజుగా భావించసాగారు.

1856లో, వర్షం లేకపోవడంతో వ్యవసాయం ఎండిపోయింది. నారాయణ్ సింగ్ తన వ్యక్తిగత ధాన్యాగారాన్ని తెరిచారు, అయినప్పటికీ అది సరిపోలేదు. దానితో అయన కస్‌డోల్ వ్యాపారి మాఖన్ సింగ్ నుండి ఆహారం కోరాడు. మాఖన్ సింగ్ బ్రిటిష్ తొత్తు. అతను ఆహారం ఇవ్వలేదు. పైగా, కష్ట సమయంలో ప్రజల నుండి బలవంతంగా పన్ను వసూలు చేసాడు. కోపోద్రికుడైన నారాయణ్ సింగ్, మాఖన్-సింగ్ ధాన్యాగారాన్ని కొల్లగొట్టి ప్రజలకు పంపిణీ చేశాడు. మాఖన్-సింగ్, రాయ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ చార్లెస్ డి ఇలియట్‌కి నారాయణ్ సింగ్‌పై ఫిర్యాదు చేశారు. నారాయణ్ సింగ్‌ని పట్టుకుని, రాయ్‌పూర్ జైలులో పెట్టారు.

ఇంతలో, ఉత్తర భారతదేశంలో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య పోరాటానికి ఒక ప్రణాళిక ఏర్పడింది. ఆ పథకానికి సంబంధించిన సమాచారాన్ని రొట్టి-కమలం ద్వారా నానా సాహెబ్ దేశవ్యాప్తంగా ఉన్న సైనిక కంటోన్మెంట్లకు సందేశం పంపారు. ఈ సమాచారం రాయ్‌పూర్‌కి కూడా చేరింది. సైనికులు, కొంతమంది దేశభక్తిగల జైలు సిబ్బంది కలిసి జైలు నుండి రహస్య సొరంగం తయారు చేసి, నారాయణ్ సింగ్‌ను విడిపించారు.

నారాయణ్ సింగ్ 500 మంది సైనికులతో సైన్యాన్ని ఏర్పాటు చేసి, 1857 ఆగస్టు 20న సోనాఖాన్‌లో స్వాతంత్ర్య శంఖం పూరించాడు. ఇలియట్ స్మిత్ అనే కమాండర్ నాయకత్వంలో ఆంగ్లయులు సైన్యాన్ని పంపారు. నారాయణ్ సింగ్ అనుకోకుండా బయటకు వచ్చి దాడిచేసే యుద్ధ-తంత్రాన్ని ఉపయోగించాడు. ఆంగ్ల సైనికులను పారిపోయేలా చేసాడు. కానీ ద్రోహులైన కొందరు జమ్మీందారుల కారణంగా అతడు యుద్ధం విరమించి, ఒక కొండ వెనక ఆశ్రయానికి వెళ్ళవలసి వచ్చింది, బ్రిటిష్ వారు సోనాఖాన్లోకి ప్రవేశించి నగరమంతా నిప్పపెట్టారు.

నారాయణ్ సింగ్‌లో బలం, శక్తి ఉన్నంత వరకు, బ్రిటిష్ వారిపై గెరిల్లా యుద్ధం కొనసాగించి, తెల్లవారికి నిద్ర లేకుండా చేసాడు. అయితే, దేశ ద్రోహులు, తెల్లవారి తొత్తులైన జమ్మీందార్లు నారాయణ్ సింగ్‌ని మళ్శీ పట్టించారు. కానీ అప్పటికే, నారాయణ సింగ్ ప్రజల హృదయంలో రాజుగా స్థిరపడ్డారు. బ్రిటీషువారు న్యాయం చేస్తున్నట్లుగా నటించి, దేశద్రోహం నేరాన్ని ఆరోపించి, నారాయణకి ఉరిశిక్ష నిర్ణయించారు. 1857 డిసెంబర్ 10న బ్రిటిష్ వారు నారాయణ్ సింగ్‌ను ఉరితీశారు. భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చాక, వీర్ నారాయణ్ సింగ్ బలిదానం అయిన చోట 'జయ స్థంబాన్ని' నిర్మించారు. అది నేటికీ ఛత్తీస్‌ఘడ్ ముద్దు బిడ్డ ధైర్య, సాహసాలని, బలిదానాన్ని అందరికి గుర్తు చేస్తోంది. చత్తీస్‌గఢ్ లో కళాశాలలు, పాటశాలలకు, అలాగే ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కు ఇతనిపేర్లు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను కూడా వీరిపేరుతో విడుదల చేసింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments