Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

శ్రీ సూర్య నారాయణ రావు (సూరీజీ) - About RSS Pracharak Surya Narayana Rao in Telugu

డెబ్భై వసంతాలు వెలుగులు పంచిన సూరీడు: శ్రీ సూర్య నారాయణ రావు (సూరీజీ ) ఈ పేరు తెలియని  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త ఉండర...

డెబ్భై వసంతాలు వెలుగులు పంచిన సూరీడు: శ్రీ సూర్య నారాయణ రావు (సూరీజీ ) ఈ పేరు తెలియని  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త ఉండరు. ఎందుకంటే మరొక వివేకానందుల వారు. సూరీజీ 23 ఆగష్టు 1920 వ తేదిన క్రిష్ణప్ప, సుందరమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. 1942 లో విద్యార్థి దశలో ఉన్నపుడే ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1946 బిఎస్సి గణితంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పూర్తి సమయ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా మారారు. యాదవరావు జోషీజీ మార్గదర్శనంలో కర్ణాటక నుంచి  వచ్చిన మొదటి ముగ్గురు ప్రచారకులలో సూరీజీ, ఒకరు. మిగిలిన ఇద్దరు శేషాద్రి జీ, చంపకనాథ్ జీ మిగిలిన వారు. ఆరుగురు సంతానంలో సూరీజీ ఒకరు. సూరీజీ చిన్న తమ్ముడు కే నరహరి గారు జ్యేష్ట  స్వయంసేవకులు. చిన్న చెల్లెలు రుక్మిణి రాష్ట్ర సేవికా సమితి కార్యకర్త. మిగతా ముగ్గురు తమ్ముళ్లు  అనంతు, గోపీనాథ్, శివ.

సూర్యనారాయణ రావు గారు  సంఘంలో వివిధ బాధ్యతల్లో సేవలందించారు. కర్ణాటక ప్రాంతంలో విభాగ్ ప్రచారక్ గా, తమిళనాడు ప్రాంత ప్రచారక్ గా 1972 నుండి 1984 వరకు, తరువాత తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంయుక్తంగా క్షేత్ర ప్రచారక్ గా ఉన్నారు. చాలా సంవత్సరాల పాటు వారు అఖిల భారత సేవా ప్రముఖ్ గా ఉన్నారు. వారి మార్గ దర్శనంలో సేవా విభాగానికి ఒక క్రొత్త రూపాన్ని తీసుకొచ్చారు. సూరీజీ అమెరికా, ట్రినిడాడ్, కెనడా, ఇంగ్లాడ్, జర్మనీ, హాలండ్, నార్వే, కెన్యా, మలేషియా, సింగపూర్ మరియు నేపాల్ వంటి దేశాల్లో కూడా  పర్యటించారు. సూరీజీ విశ్వహిందూ పరిషత్, వనవాసీ కళ్యాణ పరిషత్, ఆరోగ్య భారతి, సేవా భారతి వంటి వివిధ సంస్థలతో అనుబంధాన్ని కలిగివుండేవారు. వారు 2012 వ సంవత్సరం వరకు అఖిల భారత కార్యకారిణీ సదస్యులుగా (కేంద్ర కార్యకారిణి మండలి) ఉన్నారు.

శ్రీ గురూజీ నేతృత్వంలో సూర్యనారాయణ రావు గారికి 1969 వ సంవత్సరంలో కర్ణాటక లోని ఉడుపిలో జరిగిన సాధుసంతు సమ్మేళనానికి సంబంధించిన  కార్యనిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అప్పటికి విశ్వహిందు పరిషత్ స్థాపించి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇక్కడే సాధుసంతులు, ధర్మాచార్యులతో కూడిన సభలోనే హిందూ సమాజం నుండి అంటరానితనాన్ని నిర్మూలించడానికి చారిత్రాత్మకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.

సూరీజీ గురించి ఒక సంఘటన: భారతీయత మూర్తీభవించినవారు చో రామస్వామి. తుగ్లక్ పత్రిక సంపాదకులుగా విశేషఖ్యాతి సంపాదించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తో మంచి సంబంధాలు ఉన్నవారు. మూడు దశాబ్దాలకు పూర్వం చోరామస్వామి గారు ఒక చిన్న తమాషా చేశారు.  ఆరోజులలో మన క్షేత్ర ప్రచారక్ సూరీజీని అట్లాగే తమిళనాడు ప్రాంతానికి చెందిన మౌల్వీని తన పత్రిక కార్యాలయానికి పిలిచి మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను నా పత్రికలో ఒక వ్యాసం వ్రాసుకొంటాను అని చెప్పారు. సూరీజీ, ఆ మౌల్వి కొద్ది క్షణాలు ఒకరి నొకరు చూసుకొన్నారు. సూరీజీ మొదట ఆ మౌల్వీని “మీరు హిందువు” అని అన్నారు. దానికి ఆ మౌల్వీ “కాదు కాదు నేను ముస్లింని” అని అన్నారు. దానికి సూరీజీ మతం రీత్యా మీరు ముస్లిం జాతి రీత్యా హిందువు అని అన్నారు. దానిఫై చాలా వాదన జరిగింది. చివరకు ఆ మౌల్వీ “అవును నేను హిందువుని” అని ఒప్పుకొన్నారు. “మీరు హిందువు ఐతే మీకు ఒక కులం ఉండాలి. అది ఏమిటి?” అని అడిగారు. దానికి “మేము బ్రాహ్మణులము” అని చెప్పారు. తన వివరాలు చెప్పారు. ఈ దేశంలో మతం మారిన ముస్లింలు తమ జాతీయతను గుర్తు చేసుకొంటే వారి చరిత్ర వారికి తెలుస్తుంది. ఈ విషయాన్ని చో రామస్వామి గారు తన తుగ్లక్ పత్రిక లో వ్రాశారు. ఆ రోజు అది ఒక సంచలన వార్త. అలా మతం మారిన ముస్లింలలో సైతం వారి పూర్వీకులు ఎవరో తెలీయజెప్పే చైతన్యం సమాజంలో అనేక మందికి కలిగించారు.

సూరీజీ గురించి మరొక సంఘటన: సూరీజీ గాంధీజీ హత్యానంతరం ఓరోజు కర్ణాటకలోని ఒక ప్రముఖ న్యాయవాదిని కలవడానికి వెళ్ళారు. ఆరోజున ఆ న్యాయవాది సూరీజీని చూడగానే వారి శ్రీమతితో “గాంధీజీ హంతకులు వచ్చారు కానీ కుర్చీ వేయి” అన్నారు. అప్పుడు సూరీజీ  కూర్చుంటూ “మీరు గాంధీజీని అవమానిస్తున్నారు” అన్నారు. అప్పుడు ఆ న్యాయవాది ఎందుకు అన్నారు సూరుజీ సమాధానం చెబుతూ “ఈ దేశం కోసం గాంధీజీ సర్వస్వాన్ని త్యాగం చేశారు. నేడు దేశంలో ఉన్న ప్రతి పౌరుడి హృదయంలో ఉన్నారు. అలాంటిది మీరు ఆర్ ఎస్ ఎస్ వారిని గాంధీజీ హంతకులు అంటే ఆర్ ఎస్ ఎస్ లో పని చేసే కార్యకర్తలు నేడు 20 లక్షల పైబడి ఉన్నారు కాబట్టి ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు అని వారిని అవమానించినట్లు కాదా?” అని సూరీజీ సమధానం ఇచ్చారు, అప్పుడు ఆ న్యాయవాది “తప్పైంది నన్ను క్షమించండి” అని అన్నారు. సూరీజీ అప్పుడు గాంధీజీని దేశ ప్రజలు ఎలా గౌరవించుకుంటున్నారో మేమూ అలాగే గౌరవించుకుంటాం అన్నారు. గాంధీజీ హత్య జరిగిన సమయంలో గురూజీ జైలులో ఉన్నప్పుడు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో సంఘపనిని సూరీజీ ముందుకు నడిపించారు.
ఆర్ ఎస్ ఎస్  సేవా విభాగాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించారు. 2009 నుండి నెమ్మది నెమ్మదిగా వారి ఆరోగ్యం పాడైంది. 2010 నుండి వారు వీల్ చైర్ లో ఉండి సంఘ స్వయంసేవకులకు మార్గదర్శనం చేశారు. 93 సంవత్సరాల వయసులో వారు  అనారోగ్యంతో 2016 నవంబర్ 19, శుక్రవారం రాత్రి 11 గంటలకు బెంగళూరులోని సాగర్ అపోలో హాస్పిటల్ లో కన్నుమూశారు. 93 సంవత్సరాల వయసులో కూడా వారు దేశం, సమాజాహితం కొరకే జీవించారు. సూరీజీ 70 సంవత్సరాలు  ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ గా సేవలు అందించారు. నేడు వారి నాల్గవ వర్ధంతి. - నన్నపనేని రాజశేఖర్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments