Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చిత్రహింసలు చేసినా, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా మతం మారని ఛత్రపతి శంభాజీ -About Chtrapati Sambhaji in Telugu - megaminds

హిందూదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం ఔరంగజేబు స్వప్నం. అతనికి పూర్వం అనేకమంది ఈ ప్రయత్నం చేశారు. వాళ్లు సఫలం కాలేకపోయారు. షాయిస్త...

హిందూదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం ఔరంగజేబు స్వప్నం. అతనికి పూర్వం అనేకమంది ఈ ప్రయత్నం చేశారు. వాళ్లు సఫలం కాలేకపోయారు. షాయిస్తాఖాన్, దిలేర్ ఖాన్, దావూద్ ఖాన్, మహాబత్ ఖాన్, బహాదురా ఖాన్- మొదలగు అసమాన పరాక్రమశాలురు ఔరంగజేబు సేనాపతులు, సుబేదార్లు, వీరంతా పరాజితులయ్యారు, వివిధ యుద్ధాలలో, వందలాది సేనానులు, సర్దారులు చనిపోయారు. 50-60వేల మంది సైనికులు చనిపోయారు. దిల్లీ-మొగలు సామ్రాజ్య పరువు ప్రతిష్ఠలు మట్టికొట్టుకు పోయినవి. ఔరంగజేబు స్వయంగా దక్షిణాది పైకి దాడికి వెళ్లాలని అనేకసార్లు అనుకున్నాడు. ప్రాణభీతి (రక్షణ సమస్య)తో మానుకున్నాడు. శివాజీ ఉన్న సమయంలో భయంతో వణికిపోయాడు. పరాజితుడైతే పరువు పోతుందని కూడా ఆలోచించాడు. శివాజీ 1680 లో మరణించుటతో భయం తొలగిపోయింది. మంచి అవకాశం వచ్చింది. 

శివాజీ హిందూ స్వరాజ్యాన్ని పటిష్ఠపరిచి గొప్ప ప్రతిష్ఠను సంపాదించాడు. దాన్ని బాగా నిలబెట్టుకోలేకపోయాడు శంభాజీ, శివాజీ హిందూ సింహాసనానికి గొప్ప గౌరవాన్ని సమకూర్చాడు. శంభాజీ గొప్ప యోధునిగా మాత్రం పేరుపొందినాడు. శంభాజీ మొగల్ పాలకులకు చుక్కలు చూపించాడు మొఘలుల వలన హిందూ మహిళలు ఏమాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు. మొఘలుల  వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న హిందూ స్త్రీల మాన, ప్రాణాలు కాపాడే భాద్యతను తీసుకున్నాడు.

ఔరంగజేబు సర్దారులు-సేనానులు ఎవ్వరుకూడా శంభాజీతో తలపడడానికి ముందుకు రాలేదు. శంభాజీ పరాక్రమం అటువంటిది. ఔరంగజేబు తన పెద్ద కుమారుని శంభాజీ పై దాడికి వెళ్లమన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లో నున్న సేనాని అమీర్ ఖాన్ తోడువస్తే తాను శంభాజీపై దాడికి వెళ్తానన్నాడు. అమీర్ ఖాన్ ను అక్కడి నుండి పిలిస్తే ఆ భూభాగం, అఫ్ఘనిస్థాన్ శత్రు వశమైపోతుంది. శంభాజీని ఎదిరించుటకు తన నేనాపతులెవ్వరూ సిద్ధంగా లేరని తేలిపోయింది. విధిలేని పరిస్థితిలో ఔరంగజేబు మహారాష్ట్ర పై దాడి ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నాడు.

మూడేళ్లపాటు బీజాపూరు, గోల్కొండ సుల్తాన్లను లొంగదీసుకొనే ప్రయత్నం చేశాడు. ఇది మంచి అవకాశం శంభాజీకి, అయినా దీనినుండి లాభం పొందే ప్రయత్నం శంభాజీ పెద్దగా చేయలేదు. ఔరంగజేబు తనపై దాడికి వచ్చినపుడు చూసుకుందాంలే అని శంభాజీ అంతరంగ వ్యవహారాలను చక్కదిద్దుకోవటంలో మునిగిపోయాడు. ఔరంగజేబు ఈ స్థితిని గమనించాడు. లాభం పొందేందుకు ముందడుగు వేశాడు. మహారాష్ట్ర హిందూస్వరాజ్య భాగాలపై దాడికి సేనల్ని కదిలించాడు. మొగలు సైనికులు ఖాన్దేశ్ మరియు కొంకణ ప్రాంతాలను తన వశం చేసుకున్నారు. అయితే శంభాజీ బ్రతికి ఉన్నంతవరకు మహారాష్ట్రను స్వాధీనం చేసుకోవటం సాధ్యంకాదని ఔరంగజేబు గ్రహించాడు. స్వరాజ్య పోరాటాలలో శంభాజీ బాగా ఆరితేరినాడు. ఎలాగైనా శంభాజీని నిర్బంధించి తనవైపు త్రిప్పుకుంటేనే దక్షిణాదిలో, మహారాష్ట్రలో మొగలు సామ్రాజ్య విస్తరణ సాధ్యమవుతుంది. శంభాజీని నిర్భంధించుటకు వ్యూహం ఆలోచించాడు శంభాజీ శివాజీలా సమగ్రమైన ఆలోచన చేయలేదు. 

మంత్రులు-సేనానులు-ప్రజలు అందరి సమ్మతితో సింహాసనం ఎక్కి ఉండాల్సింది. కానీ శివాజీ చనిపోగానే వెంటనే శంభాజీ సింహాసనాన్ని అధిష్టించిన కారణంగా అన్ని తెలిసిరాలేదు. శివాజీ వద్ద పనిచేసిన అనుభవజ్ఞులై న పెద్దలను లెక్కచేయకుండానే శంభాజీ ఔరంగజేబుతో నిరంతర యుద్ధాలలో గడిపాడు. తాను వీరయోధుడైనందున, శివాజీ ఏర్పాటుచేసిన సువ్యవస్థ కారణంగా సులభంగానే ఔరంగజేబును ఎదుర్కొన్నాడు. శంభాజీ వ్యవహారం గిట్టనివారు, రాజకుటుంబంలో వారసత్వ కలహాల ప్రభావంతో శంభాజీకి వ్యతిరేకంగా ఔరంగజేబుకు సహకరించారు. 1689 ఫిబ్రవరిలో విశ్వాసఘాతుకం కారణంగా ఔరంగజేబు శంభాజీని బంధించగలిగాడు.

శంభాజీలో తన ఏకపక్ష నిర్ణయాలకు పశ్చాత్తాపం కలిగింది. అప్పటికే ప్రమాదం ముంచుకొచ్చింది. ఔరంగజేబు శంభాజీని ఇస్లాం మతం స్వీకరించి తనకు లొంగిపొమ్మని ఆదేశించాడు. కణకణం, క్షణక్షణం తండ్రి అడుగుజాడల్లో హిందూ స్వరాజ్యం కోసం తపించిన శంభాజీ మతం మారి ప్రాణాలు కాపాడుకోవాలను కోలేదు. ఔరంగజేబు ఆదేశాన్ని సాహసోపేతంగా తిరస్కరించాడు.

ఔరంగజేబు క్రుద్ధుడైనాడు. కాళ్లు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి శంభాజీని తన ముందుకు తీసుకు రమ్మన్నాడు. మళ్లీ మళ్లీ ఇస్లాంలోకి మారమని తీవ్రంగా హింసించినాడు. శంభాజీ బాధల్ని సహిస్తూనే చిరునవ్వు చిందిస్తూనే ఔరంగజేబును ధిక్కరించాడు. ప్రాణభీతి ఏమాత్రం లేదన్నాడు. ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరింది. 40 రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లూ పీకారు బతికుండగానే చర్మం వలిచారు. ఇప్పటికైనా ఇస్లాంలోకి మారతావా  అని అడిగాడు నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నా మారను, ఒక్క కోట ను కూడా స్వాధీనం చెయ్యనని  సింహం ల ధైర్యంగా గర్జించాడు శంభాజీ.

చివరకు మార్చి 11, 1689 న అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని ముక్కలుముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు.పూణే దగ్గర భీమా నది ఒడ్డున, ఔరంగజేబు సైన్యాలు వెళ్లిపోయిన తర్వాత గ్రామస్థులు వచ్చి శంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమసంస్కారం చేశారు. ఆ స్థలంలో ఇప్పుడు భవ్యమైన స్మారకం నిర్మాణమై అందరికీ ప్రేరణనిస్తున్నది. ఇలా శంభాజీ వీరమరణం పొందాడు ఆ తరువాత మరాఠా ప్రజలు మరల సంఘటితం అయ్యారు. ఎందరో ఇలాంటి వీరులకు జన్మనిచ్చిన గడ్డ మనది... జై శంభాజీ జై హిందురాష్ట్ర. -నన్నపనేని రాజశేఖర్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments