Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నేతాజీ పాల్కర్ ఎవరు? ముస్లిం గా మారిన పాల్కర్ తిరిగి హిందూ ధర్మం లోకి ఎలా వచ్చాడు? - About Netaji Palkar in Telugu - megaminds

అసలు నేతాజీ పాల్కర్ ఎవరు?: శివాజీ కుడి భుజంగా ఉండి అనేక యుద్ధాలలో తోడునిలిచిన వీరుడు అలాగే శివాజీ కి బంధువు నేతాజీ పాల్కర్. భేద...

అసలు నేతాజీ పాల్కర్ ఎవరు?: శివాజీ కుడి భుజంగా ఉండి అనేక యుద్ధాలలో తోడునిలిచిన వీరుడు అలాగే శివాజీ కి బంధువు నేతాజీ పాల్కర్. భేదాభి ప్రాయం చేతనో ప్రలోభాల కారణం చేతనో బీజాపూరు నవాబు వద్ద కొలువులో చేరాడు పాల్కర్. రాజా జయసింగ్ దౌత్యనీతిననుసరించి, అతన్ని ఔరంగజేబు తన కొలువులోనికి తీసుకొని అయిదువేల ఆశ్వీక దళానికి అధిపతిని చేశాడు. అయితే శివాజీ ఔరంగజేబు కట్టడి నుండి తప్పించుకొని పోవడంతో ఔరంగజేబు ఆఙ్ఞ మేరకు నేతాజీ పాల్కర్ ని వంచనతో బంధించాడు జయ సింహ్.

ఆగ్రాలో కొంతకాలం చెఱలో ఉంచబడి, బలవంతంగా మతం మార్చబడినాడు. మతం మారిన తరువాత అనేక బహుమతులతో ఆఫ్ఘనిస్తాన్లో సేనా నాయకునిగా నియమించబడి త్వరలోనే అతడి మామా గోంకజీ కూడా మార్చుకొని చిన సేనా నాయకుడైనాడు. ఔరంగజేబు నేతాజీ భార్యలను ఢిల్లీకి రప్పించాడు. మతం మార్చుకోమని బలవంత పెట్టించాడు. అంగీకరించలేదు. వారు మతం మార్చుకోపోతే వారిని వదిలిపెట్టి ముస్లింకన్యలను వివాహం చేసుకోవాలని నేతాజీని బెదిరించాడు. ఇంతలో నేతాజీ పాల్కర్ భార్యలు కూడా మతం మార్చుకొన్నారు.

ఆ తరువాత శివాజీ పట్టాభిషేక సమయంలో ఔరంగజేబు దక్షిణాదిపై దాడికి బహాదురా ఖాన్ అను సేనానిని పంపినాడు. శివాజీ సైన్యం అడుగడుగునా అతన్ని ఓడించి అవమానించింది. అవమానభారంతో- కోపంతో ఔరంగజేబు అతన్ని వెనుకకు దిల్లీకి రప్పించాడు. దిలే ఖాన్ అను సేనాని ఔరంగజేబుకు సన్నిహితుడు. అతడు ఔరంగజేబుకు ఒక సలహా ఇచ్చాడు. అదేమిటంటే - శివాజీ సేనాపతి నేతాజీ పాల్కర్ పది సంవత్సరముల క్రిందట ఔరంగజేబుకు బందీగా చిక్కగా అతన్ని మొహమ్మద్ కులీఖాన్ గా మతం మార్చి, సేనాపతిగా ఆఫ్ఘనిస్థాన్‌కు పంపియున్నాము అనే విషయం గుర్తుచేసి. శివాజీని ఎదిరించగల వీరుడు అతడొక్కడే అని దిలేర్ఖాన్ ఔరంగజేబుకు సలహా ఇచ్చాడు.

ఔరంగజేబుకు ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే నేతాజీ పాల్కర్ (మొహమ్మద్ కులీఖాన్)ను పిలిపించాడు. ది లేరా ఖానకు తోడుగా మహారాష్ట్రపై దాడికి పంపినాడు. మహారాష్ట్ర చేరిన తర్వాత నేతాజీ పాల్కర్ మొగలు సైన్యంనుండి అదృశ్యమైపోయాడు. నేతాజీ పాల్కర్ రహస్యంగా శివాజీ వద్దకు చేరుకున్నాడు. శివాజీ అతన్ని ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. తనను బలవంతంగా మతం మార్చి మొహ్మద్ కులీఖాన్ గా పేరు పెట్టారని నేతాజీ పాల్కర్ విలపించాడు.

శివాజీ వెంటనే అతన్ని  1676 జూన్ 19న శుద్ధీకరణ గావించి హిందూ మతంలోకి తిరిగి తీసుకురావడమేకాక తన దగ్గరి బంధువుల అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాడు. అతని హోదాకు తగినరీతిలో సేనాపతి పదవినిచ్చి గౌరవించాడు. అనేక యుద్ధాలలో శివాజీకి విజయాలను సమకూర్చి పెట్టిన వీరయోధుడు నేతాజీ పాల్కర్. దిల్లీలో ఔరంగజేబు బాగా అవమానభారంతో క్రుంగిపోయాడు. శివాజీ ఎప్పుడు దాడి చేస్తాడోనని భయంతో నిద్రకు దూరమైనాడు. శివాజీ తన సామ్రాజ్యం లో ప్రలోభాల వలన, భానిసలు చేసుకొని మతం మారిని వారిని ముస్లిం మతం లోనే ఉండిపోకుండా తిరిగి హిందూ ధర్మం లోకి పునరాగమనం చేశారు. -నన్నపనేని రాజశేఖర్. 

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments