Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

Change Fake Indian History ఎందుకు? ఎవరీ ప్రచారం చేసేది? - MegaMinds

#changefakeindianhistory పేరుతో తెలుగు రాష్ట్రాలలో పెద్దయెత్తున చాపక్రింద నీరులా ప్రచారం జరుగుతోంది. అసలు changefakeindianhistor...

#changefakeindianhistory పేరుతో తెలుగు రాష్ట్రాలలో పెద్దయెత్తున చాపక్రింద నీరులా ప్రచారం జరుగుతోంది. అసలు changefakeindianhistory అనే # ట్యాగ్ తో ఎందుకు ప్రచారం చేయాల్సి వస్తుంది, ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం, ఏందుకో తెలుసుకున్నాక ఈ ప్రచారంలో మీరు భాగస్వాములు కావొచ్చు.

హిందూ ఉపాధ్యాయ సమితి: ఆంద్రప్రదేశ్ లో దేశభక్తి కలిగిన ఉపాద్యాయులు కలిగిన ఒక ఉపాధ్యాయ సంఘం,  ఈ సంఘం ప్రారంభం అయిన రోజు నుంచే దేశం గురించి ఆలోచన చేసే ఉపాధ్యాయులు అలాగే మంచి విద్యార్థులను సమాజానికి అందించడమే లక్ష్యం గా పనిచేస్తుంది. ఈ సంస్థ ఆద్వర్యంలోనే అధ్యక్షుడు శ్రీ మహేష్ డేగల తన ఉపాధ్యాయ బృదంతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకు రాబోతున్న జాతీయ విద్యావిధానం లో చోటు చేసుకోబోయే మార్పులతో బాటుగా మనదైన చరిత్ర స్వాతంత్ర్య సిద్దించిన తరువాత మనం వ్రాసుకోలేకపోయాము, గతంలో వ్రాసిన చరిత్రలోని తప్పులు దిద్దుకొనడానికి, ఇప్పుడు సాగుతున్న చరిత్ర రచనలో అటువంటి లోపాలు, దోషాలూ చొచ్చుకురాకుండా, సరైనతీరులో చరిత్ర రచింపబడడానికి ప్రయత్నం చేసేందుకు చేంజ్ ది ఫేక్ ఇండియన్ హిస్టరీ అనే సంకల్పం ప్రారంభమైంది. ఈ దేశానికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉన్నదని ఆనాటి పద్ధతులలో నమోదు చేయబడిన అంశాలను ఇప్పటి ప్రజలకు, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తిరిగి మనదైన చరిత్ర రాయాలని దీని ఉద్దేశ్యం.

మన చరిత్రలో కొంతమంది వీరులు, వాస్తవాలు:
భారతీయులకు చరిత్ర రచన అలవాటు లేని విషయమనీ, అందువలన చరిత్ర తెలుసుకోవాలంటే విదేశీయుల రచనలపై ఆధారపడక తప్పదనీ, విదేశీయులు వ్రాసే చరిత్రలో తమ విజయాల గురించి ఘనంగా చాటుకోవటమేగాక, హిందువులు విజయం సాధించిన సందర్భాలను అంత ప్రాధాన్యం లేనివిగా చిత్రించటం లేక అసలు పేర్కొనకుండా మాయం చేయటమో జరిగింది ఈ కారణాలవల్ల మనకు మనదేశాన్ని గురించిన వాస్తవ చరిత్ర తెలియకుండా ఉన్నదని ఎందరెందరో విద్వజ్జనులు వాపోతూ ఉండటం మనం చాలాకాలంగా చూస్తున్నదే.

ఆర్యజాతివారు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ స్థిరపడినారని, ఈదేశపు చరిత్ర అంతా పరాజయాల చరిత్ర అని ఆంగ్లేయులు తమ పాలనా కాలంలో రాసి పెట్టి పోయిన తప్పుడు సిద్ధాంతాలు, చరిత్ర పాఠ్యంశాలలో పొందుపరిచారు. మన చరిత్రలో స్థానం కల్పించకుండా ఆంగ్లేయులు బుద్ధిపూర్వకంగా వదిలివేసిన అంశాలను శాస్త్రీయ పరిశోధనా పద్ధతులలో సంపాదించి వెలుగులోకి తీసికొచ్చి మన పాఠ్య పుస్తకాల చేర్చాలని‌ ఈ ప్రయత్నం.

అయితే మన చరిత్ర ను పాతరాతియుగం, కొత్త రాతియుగం, లోహయుగం, హిందూ యుగము, మహమ్మదీయ యుగము, బ్రిటీషు మహాయుగమూ వంటి అధ్యాయాలతో కూడిన చరిత్ర గ్రంథాలల్లో ఆక్రామకులుగా వచ్చిన శక్తులను తరిమికొట్టి యుగపురుషులైన విక్రమ శాలివాహనుల గురించి పాఠ్యాంశాలలో చేర్చాలి.

మహమ్మదీయ మతం ప్రేరణతో హిందూ దేశంపై దాడిచేయ వచ్చిన ముహమ్మద్ బిన్ కాసిం, గజనీ మహమూద్, గోరీ ముహమ్మదులను ఎదిరించిన రాజా దాహీర్, బాప్పారావల్, నాగభట్టు రణబలుడు, రెండవ రణబలుడు, జయపాలుడు, ఆనందపాలుడు, త్రిలోచనపాలుడు. భీమపాలుడు, అలాగే చౌహాన్, గద్వాల్, మాళవ రాజ్య పారమార రాజవంశీయుల, బుందేల్ ఖండ్ చందేల్ రాజవంశీయులు, చాళుక్య రాజవంశీయులూ ఎంతటి గట్టి ప్రతిఘటన ఇచ్చారో ఆ వీరుల గురించి పాఠ్యాంశాలలో చేర్చాలి.

ఢిల్లీలో తురకల పాలన మొదలైన తర్వాత కూడా రాజపుత్ర స్థానంలో రాణాహమ్మీర్, రాణా కుంభ, రాణా సంగ్రామ సింహుడు వంటివారు ఎంతటి విశాలమైన రాజ్యాన్ని ఎంత వైభవోపేతంగా పరిపాలించారో వారి గురించి పాఠ్యాంశాలలో చేర్చాలి. మహమ్మదీయుల పాలనలోకి రాకుండా వందల సంవత్సరాలపాటు స్వతంత్రంగా ఉండిన నేపాల్, కామరూప (అస్సాం), ఉత్కళ (ఒడిశా), బుందేల్ ఖండ్, గోండ్వానా, తదితర ప్రాంతాల చరిత్ర గురించి పాఠ్యాంశాలలో చేర్చాలి.

మహమ్మదీయ దండయాత్రల పదఘట్టనలతో నలిగిన తర్వాత కూడా దక్షిణ భారత దేశంలో ముసునూరి నాయకులు, అద్దంకి రెడ్డి రాజులు, ఆ తర్వాత విజయనగర రాజులు దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని రక్షించుకొంటూ ఎంతటి వైభవాన్ని సాకారం చేశారో అటువంటి వారి గురించి పాఠ్యాంశాలలో చేర్చాలి.. ఢిల్లీలోని మహమ్మదీయ పాలకులకు అడుగడుగునా అవరోధాలు కల్పించిన ఝాట్ వీరుల గాథల గురించి పాఠ్యాంశాలలో చేర్చాలి.. 

ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా అనే మాటను కవి ఏక్షణాన, ఏ దృష్టితో చెప్పాడో గాని ఢిల్లీ పరిపాలించినవారే భారతదేశ సామ్రాట్టు లు, వారు విశ్వవిజేతలతో సమానులు అనే ధోరణిలోనే చరిత్ర రచన నడుస్తూ రాగా... ఇప్పుడు దానిని సరిదిద్దే ప్రయత్నం చేయాలని హిందూ ఉపాధ్యాయ సమితి ఈ ప్రయత్నం చేస్తున్నది. మనవంతుగా మనం కూడా వారి ప్రయత్నానికి మద్దతు తెలుపుతూ #changefakeindianhistory ఓ పేపర్ పైన వ్రాసి ఫోటో దిగి మీమీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి, అదే విధంగా PMO కార్యాలయానికి ఈ మెయిల్ మరియు ఉత్తరాలు వ్రాయండి, ఈ ప్రయత్నంలో ముందడుగు వేస్తూ నేనూ ఈ విషయాన్ని మీ ముందుంచాను... సైన్ పిటీ షన్ వెబ్ సైట్ లో నా మద్దతు తెలిపాను.. మీరు తెలుపండి. మీ రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. It is good and essential to do, how can I help for this.

    ReplyDelete
  2. Yes... change the fake Indian History...

    ReplyDelete

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..