Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రండి దేశాన్ని ముందుకు తీసుకువెళదాం - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ఘటకునిగా చేరుదాం - రాంపల్లి మల్లిఖార్జున్ - about RSS in Telugu - megamindsindia

రండి దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం:  విజయాలకు చిహ్నమైన విజయదశమిపండుగ  రోజున ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చారిత్రక నేప...

రండి దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం:  విజయాలకు చిహ్నమైన విజయదశమిపండుగ  రోజున ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చారిత్రక నేపథ్యం, జాతీయ సమైక్యతకు చేస్తున్న ప్రయత్నాలు, సంఘ మౌలికపనులు అవగాహనకు  అవలోకనే  ఈ ప్రయత్నం. ఈస్టిండియా కంపెనీ పై 1857 సంవత్సరం జరిగిన స్వతంత్ర పోరాటం తరువాత భారతదేశం ఒకరకంగా అంతర్ముఖం అయినదని  చెప్పవచ్చు, జాతి పునర్నిర్మాణమునకు ఆలోచన వెల్లువలు ప్రారంభమైన అని చెప్పవచ్చు, దేశ పునర్నిర్మాణం మనకు ఆ ఆలోచనల నుండి పుట్టుకొచ్చిన ఒక క్రమ ప్రయత్నం ఆ సమయంలో మనకు కనబడుతుంది. ఆసమయంలో  పేర్కొనదగిన ప్రయత్నాలు చేసిన వారిలో 1] దయానంద సరస్వతి 2] బంకించంద్ర 3] స్వామి వివేకానంద 4] అరవింద 5] డాక్టర్ హెడ్గేవార్ ఈ అయిదుగురి ప్రయత్నాలు ఒకరి తరువాత ఒకరికి కొనసాగింపుగా కనపడతాయి.

దయానంద సరస్వతి: దయానంద సరస్వతి రెండు ప్రముఖమైన ప్రయత్నాలు చేశారు, అందులో 1] ఈ దేశ భవిష్యత్తు వేద విజ్ఞానం పై ఆధారపడి ఉంటుంది, ఆ విజ్ఞానం ఇప్పుడు కేవలం పండితులకే  పరిమితమైంది, ఆ విజ్ఞానాన్ని సామాన్య ప్రజల వరకు తీసుకెళ్లే ప్రయత్నం సఫలీకృతం గా చేశారు 2] శతాబ్దాలుగా హిందూ సమాజం నుండి ఇస్లాం క్రైస్తవములోకి మతం మార్పిడిలు    జరుగుతున్నాయి ఇది చాలా ప్రమాదకరమైన పోకడని దయానంద సరస్వతి గుర్తించారు, దానికోసం మతం మార్పిడులు జరగకుండా చూడటం, మతం మారిన వాళ్లను తిరిగి మాతృ ధర్మం లోకి తీసుకుని వచ్చేందుకు శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  శుద్ధి కార్యక్రమం ఆ రోజుల్లో ఒక తుఫానులాగానే సాగింది, ఈ పనులను దేశవ్యాప్తంగా చేసేందుకు 1875 ఏప్రిల్ 10 న ముంబైలో ఆర్య సమాజం ఏర్పాటు చేశారు.

బంకించంద్ర: మాతా భూమిహీ  పుత్రో హం పృథ్వి వ్యాహా -అనేది వేద వాక్యం. అది అధర్వణ వేదంలో భూమి సూక్తం లోనిది. దాని భావం ఈ భూమి నా తల్లి నేను ఆమె పుత్రుడను, ఈ సృష్టిలో మాతృభావన ఆత్మీయతకు, వాత్సల్యానికి ప్రతీక, తల్లి వాత్సల్య మే పుత్రులను సరైన మార్గంలో నడిపిస్తుంది, సహోదర భావాన్ని కూడా జాగృతం చేస్తుంది. వేల సంవత్సరాల నుండి మన మనస్సులో నిక్షిప్తమై ఉన్నా ఆ మాతృభూమి కల్పన జాగృతం చేయాలని బంకించంద్ర సంకల్పించారు, భవభూతి కాళిదాసు లాగా శక్తివంతమైన సార్వకాలిక మైన ఒక పదం సృష్టించాలని తపన పడ్డారు దాని ఫలం స్వరూపమే ''వందేమాతరం'' వందేమాతరం గీతాన్ని బంకించంద్ర 1875 నవంబర్ 7వ తేదీన రచించారు స్వతంత్ర పోరాటంలోఅది ఒక పెద్ద విప్లవమే.

వివేకానంద: వివేకానందుడు 1893 వ సంవత్సరం అమెరికాలో జరిగిన ప్రపంచ మతమహా సమ్మేళనం లో పాల్గొన్నారు అక్కడ  వారు తొలి రోజు చేసిన ప్రసంగం ఒక సింహ గర్జనే, ఆ గర్జనకు యావత్  ప్రపంచం ఒక్కసారి  ఉలిక్కిపడింది, ఆ గర్జన భారత చరిత్రలో ఒక పెద్ద  మలుపు. వివేకానందుడు భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొలంబో నుండి ఆల్మోరా వరకు ఒక తుఫాన్ పర్యటన చేశారు ఆ పర్యటనలో వారు మనం "హిందువులుగా గర్వపడాలి'' అని పిలుపునిచ్చారు. నేను హిందువుని అని మనం అనుకుంటే వేల సంవత్సరాల చరిత్ర మనకు గుర్తు వస్తుంది అని చెప్పారు. నేను హిందువుని అని గర్వంగా చెప్పండి వివేకానందుని పిలుపు. ఈ దేశ ప్రజలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచేందుకు 1897 మే 1 న రామకృష్ణ మఠాన్ని ప్రారంభించారు.
                                          
అరవింద మహర్షి: అరవిందుడు "హిందుత్వమే భారత జాతీయత'' అనే తాత్విక చింతన స్వాతంత్ర పోరాటానికి అందించినవారు, హిందూ ధర్మం ప్రచారం చేసినవారు. 1910 ఏప్రిల్ 4 నాడు అరవిందులు పాండిచ్చేరి చేరారు.  అక్కడ వేదాధ్యయనము యోగ సాధన ప్రారంభించారు,  భారతజాతి జాగృతి కొరకు తపస్సు చేశారు, వారి ఆశ్రమంలో అఖండ భారత్ పటాన్ని పెట్టారు. దేశ విభజన పై వ్యాఖ్యానిస్తూ ఈ విభజన ఏ మార్గంలోనైనా సమసి  పోవాలి అప్పుడే భారత్ శక్తివంతమవుతుంది అని పిలుపునిచ్చారు.
                                                    
డాక్టర్ హెడ్గేవార్: పరమపూజ్య డాక్టర్ జీ హిందూ సమాజ సంఘటన కొరకు 1925 సంవత్సరం సెప్టెంబర్ 27 విజయదశమి పండుగ రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు. దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ను ప్రారంభించిన 50 సంవత్సరాల తరువాత  నాగపూర్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభమైంది. దయానంద సరస్వతి నుండి డాక్టర్ హెడ్గేవార్ వరకు జాతీయ పునర్నిర్మాణ ప్రక్రియలో ''సంఘం'' కీలకమైన మలుపు, ఒక సమగ్ర యోజన అని కూడా చెప్పవచ్చు, డాక్టర్ జీ సంఘాన్ని ప్రారంభించేందుకు  మౌలిక కారణాలలో 1] హిందూ సమాజం రకరకాల కారణాలతోదేశమంతా  బలహీనమైంది, ఈ దేశాన్ని కాపాడాలంటే హిందూ సమాజం శక్తివంతం కావాలి 2] ఆ రోజుల్లోనే ఈ దేశం ఒకే దేశం కాదు అని ప్రాదేశిక రాష్ట్రవాదం ప్రచారంలో ఉంది. వాస్తవంగా వేల సంవత్సరాల నుండి ఇది ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, అందుకే డాక్టర్జీ ఇది "హిందూ రాష్ట్రం'' అని నిర్ద్వందంగా ప్రకటించారు, ఈ సత్యాన్ని ఈ దేశ ప్రజలు  గుర్తించాలి 3] దేశంలో రాజులు, రాజ్యాలు, రాజరిక వ్యవస్థలు  కనుమరుగవుతూ దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు ప్రయాణిస్తున్నది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య  స్వభావం చూస్తే అంతా అదే సర్వస్వం లాగా ఉంటోంది, భారతదేశంలో ఎప్పుడూ రాజ్య శక్తి  సర్వస్వం కాదు, రాజ్య శక్తిని  నియంత్రించే ధర్మ శక్తి ఉంటుంది, ఆ శక్తిని నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకతను డాక్టర్జీ గుర్తించారు 4] ధర్మ సంరక్షణ ద్వారా తిరిగి  ఈ దేశాన్ని  పరమ వైభవ స్థితికి తీసుకువెళ్లాలి అనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ విజయదశమికి సంఘం ప్రారంభించి 95 సంవత్సరాలు పూర్తి అయ్యి 96  లో అడుగు పెడుతున్నది  ఈ 95 సంవత్సరాల కాల ఖండంలో సంఘం దేశమంతా  విస్తరించింది.

సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేచిన వేళ:  భారతదేశంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభం కంటే ముందే 1885 సంవత్సరంలో కాంగ్రెస్ సంస్థ ప్రారంభమైంది, 1920వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది,  అదేసమయంలో సోషలిస్టు ఉద్యమాలు  కూడా ప్రారంభమైనాయి. 1920వ సంవత్సరం నాటికి కాంగ్రెస్ ఒక సంస్థగా కాకుండా ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందటం ప్రారంభమైంది, దేశంలో వివిధ ప్రాంతాలలో పలు  రాజకీయ పార్టీలు కూడా ప్రారంభమైనాయి. ఆ రోజుల్లో ఈ దేశాన్ని ప్రభావితం చేసిన కార్ల్ మార్క్స్ గురించి కొద్దిగా ఇక్కడ  తెలుసుకోవాలి.  కార్ల్ మార్క్స్ భారతదేశాన్ని ఎప్పుడూ చూడలేదు, ఈ దేశానికి సంబంధించిన సాహిత్యాన్ని కూడా పరిశీలించలేదు, అయినా తాను విన్న విషయాలను ఆధారం చేసుకుని భారతదేశం గురించి పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశాడు,  నిరంతర తన రచనల ద్వారా భారతీయ మేధావులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడు. 1853 జూన్ 22వ తేదీ నాడు అమెరికాలోని న్యూయార్క  హెరాల్డ్( ప్రస్తుతం అది హెరాల్డ్ ట్రిబ్యూన్) పత్రికలో వరుసగా రెండు వ్యాసాలు రాశాడు. దాని సారాంశం భారతీయ గ్రామీణ వ్యవస్థ చాలా శక్తివంతమైంది, దోపిడీ లేని వ్యవస్థ అది, భారత్ ఒక ప్రత్యేక జాతి, గడిచిన రెండు వేల సంవత్సరాలుగా భారత  దేశంలో ఏ మార్పులు జరగలేదు,  బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేశారు దానితో భారతీయులు తమ అస్తిత్వం కోసం పోరాటం చేయవలసి వచ్చింది అని వ్రాశారు,  భారతదేశం గురించి ఓనమాలు కూడా తెలియని మార్క్స్ చెప్పిన విషయాలు భారతీయ మేధావులను ప్రభావితం చేయటం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం,  అవగాహన రాహిత్యంతో మార్క్స్  చెప్పన విషయాలను తలకు  ఎక్కించుకొని ఈ దేశంలో ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీలు దేశం లో  ఒక సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేపాయీ కమ్యూనిస్ట్  సిద్ధాంతం, పార్టీలు బలహీనపడిన ఆ సంఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది, ఆ సంఘర్షణ నుండి దేశం పూర్తిగా బయట పడాలి అప్పుడే దేశం శక్తివంతమవుతుంది.
                               
సంఘం విశిష్టత: సంఘం వ్యక్తి నిర్మాణం చేసే సంస్థ, అప్పటికే భారతదేశంలో సామాజిక, రాజకీయ, ధార్మిక, సేవా, సంస్థలు అనేకం ప్రారంభమై పని చేస్తున్నాయి,  ఆయా సంస్థల కార్యకలాపాలను అవగాహన చేసుకున్న వారు సంఘాన్ని కూడా ఆ సంస్థల లాంటి ఏదో ఒక సంస్థ అని అనుకుంటూ ఉండేవారు కొందరైతే సంఘాన్ని మతతత్వ సంస్థ అని  మరికొందరు ప్రచ్ఛన్న రాజకీయ సంస్థ అని,  ఇట్లా ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానిస్తూ ఉండేవారు అయితే సంఘము వాళ్ల అంచనాలకు అందని సంస్థ. సంఘము లాంటి సంస్థ మన దేశంలో గాని ప్రపంచంలో గాని మరొకటి లేదు సంఘాన్ని పోల్చాలి అంటే సంఘం తోనే పోల్చాలి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.    సంఘం అంటే శాఖ, శాఖ స్వరూపము ఎట్లా ఉంటుంది అంటే భవిష్యత్తులో భారతదేశంలోని ప్రజలు ఎలా కలిసి ఉండగలుగుతారు, కలిసి మాట్లాడుకో గలుగుతారు, ఎట్లా కలిసి పని చేయగలుగుతారు, అనేదానికి ఒక నమూనా.  శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుంది ఆ వ్యక్తులు సమాజానికి సంబంధించిన అన్ని రంగాలలో ప్రవేశించి వ్యవస్థలను,  సంస్థలను, నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు తద్వారా సంపూర్ణ సమాజ పరివర్తనకు కృషి చేస్తున్నారు. ఆ సంస్థల విషయంలో  సంఘం ఏంచేస్తుంది అంటే సంఘం ఆ పనులను సమీక్షించడం,  ఆ సంస్థలను  సమన్వయం చేయడం తద్వారా ఈ  దేశంలో  ఒక క్రమ వికాసం కోసం కృషి చేస్తోంది. భారతదేశంలో అతి చిన్న యూనిట్ ఒక గ్రామం అక్కడ నుండి అఖిల భారత స్థాయి వరకు నిర్దిష్ట కార్యకర్తల వ్యవస్థను నిర్మాణం చేసుకుంటూ వస్తున్నది. గడిచిన వేల సంవత్సరాల కాల ఖండంలో  ఇటువంటి వ్యవస్థ ఎప్పుడూ ఏర్పడలేదు, అందుకే సంఘం అంటే హిందూ సమాజం యొక్క ఒక సూక్ష్మ రూపము సంఘం వ్యవస్థ నిర్మాణం చేయడంతో పాటు హిందువులలో సమైక్యతను,  జాతీయ భావ చైతన్యం ను నిర్మాణం చేయటానికి కృషి చేస్తున్నది,  దానికోసం అప్పుడప్పుడు ఉద్యమాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది.

జాతీయ సమైక్యత ప్రజల హృదయాల నుండి ఉప్పొంగే ఒక భావాత్మక ప్రేరణ, అది అక్కడ మరణిస్తే ఏ ప్రభుత్వం గానీ సైన్యం కానీ దానిని రక్షించ లేవు, ఈ దేశంలోని వైవిధ్యం మధ్య సామరస్యం అతి ముఖ్యమైన ఐక్యత భావం, అదే  మన జాతీయ సమైక్యత కు గుండెకాయ లాంటిది. భారతీయ ఆత్మల ఐక్యత కోసం ఆత్మీయ కరణ కోసం, శతాబ్దాలుగా తహతహలాడుతోంది. దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మినహ ఇంకా ఏ సంస్థ ఈ దిశలో ప్రయత్నం చేయడం లేదు, అదే సంఘం యొక్క విశిష్టత.
                  
సంఘాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు: రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని వ్యతిరేకించే వాళ్ళు విభిన్న వర్గాలుగా ఉన్నారు. 1] ముస్లింలు శతాబ్దాలుగా ఈ దేశంలో సృష్టించిన విధ్వంసం చూసి  భయభ్రాంతులైన  మేధావులు ఏదో విధంగా వాళ్లతో సర్దుకొని పోవడమే శ్రేయస్కరమని భావిస్తూ వాళ్ళ పైన ఈగ కూడా వాలకుండా రక్షణ కవచంగా నిలబడ్డారు ఆ వర్గం దేశంలో ఈ రోజు కూడా  బలంగా ఉంది,  వాళ్ల దృష్టిలో సంఘం ముస్లింలకు  వ్యతిరేకం, అందుకని సంఘాన్ని విమర్శిస్తుంటారు.  అంతేకానీ సంఘ సిద్ధాంతం గురించి సంఘం చేస్తున్న పనులు గురించి  తెలుసుకుని అవి సరి అయినవి కావు అని విమర్శించడం లేదు,  సంఘం మైనారిటీలకు  వ్యతిరేకము అనేది వాళ్ళ నిశ్చిత అభిప్రాయం,  మరికొందరు సంఘంకూడా  ఒక మతతత్వ సంస్థ అంటుంటారు. 2] ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు కావాలంటే ఓట్లు  కావాలి  దేశంలో మైనారిటీలు అని పిలువబడే వాళ్ళు తమ  ఓట్  బ్యాంకులతో రాజకీయాలను శాసిస్తున్నారు,  ఆ నాయకులు కూడా మైనారిటీల మెప్పు  పొందటానికి సంఘం మైనారిటీలకు వ్యతిరేకం  అని ముద్ర వేసి ప్రచారం చేస్తున్నారు అంతేగాని సంఘ సిద్ధాంతాన్ని చూసి కాదు. 3] మార్క్స్ మావో  భావజాలంతో పనిచేసే పార్టీలు,  సంస్థలు జాతీయ భావానికి వ్యతిరేకం,  సంఘం జాతీయ భావంతో పని చేస్తుంటుంది కాబట్టిసంఘాన్ని  వ్యతిరేకిస్తున్నారు, అలాగే మేము చెప్పిందే సత్యం అని మాట్లాడే ఎడారి మతాల వాళ్ళు మరొకరిని అంగీకరించారు అందుకే  శతాబ్దాలుగా సంఘర్షణకు తెరలేపారు,  ఈ వ్యతిరేకతలను, సంఘర్షణలను అధిగమిస్తూ సంఘం సమాజంలో జాతీయ సమైక్యత నిర్మాణం చేయటం లో సఫలమైంది. సంఘం  ఆ దిశలో వేగంగా ముందుకు వెళుతున్నది
సంఘ వ్యతిరేకులు కూడా సంఘాన్ని ఎందుకు ఒప్పుకుంటారు.

సంఘాన్ని వ్యతిరేకించే వాళ్ళు సంఘం నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలను చూసి ఒప్పుకుంటున్నారు, ఉదాహరణకు 1975 సంవత్సరంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంఘం నిర్వహించిన అజ్ఞాత ఉద్యమాన్ని జైళ్లను నింపటం చూసి కమ్యూనిస్టులు ఆశ్చర్య పోయేవాళ్ళు జైలు నుంచి  బయటకు  వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు సంఘాన్ని మాకు అర్థం చేయించిండని  మన పెద్దలను  అడిగారు వాళ్లకు మన కార్యక్రమాలు శిక్ష వర్గం చూపించారు, అక్కడ స్వయం సేవకులు అనుశాసనం  చూసి ఆశ్చర్యపోయారు. సంఘం చాలా మంచి పని  చేస్తోoది అని తాత్కాలికంగానైనా అంగీకరించారు.  సంఘం ప్రారంభించిన స్వదేశీ ఉద్యమాన్ని  చాలామంది సమర్థిస్తున్నారు. సంఘము చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సంఘం చేస్తున్న కార్యక్రమాలు, వందల సంవత్సరాలుగా ఈ దేశాన్ని వెంటాడుతున్నా సామాజిక దురాచారాలను రూపుమాపడానికి సమాజంలో సంఘం చేస్తున్న ప్రయత్నాలను చూసి చాలామంది  సంఘం దగ్గరకు వస్తున్నారు. ఈమధ్య ప్రపంచాన్ని కుదిపేస్తున్న  కరోనా సమయంలో స్వయం సేవకులు ముంబై పూనా,  హైదరాబాద్ మొదలైన చోట్ల నిర్వహించిన కార్యక్రమాలు చూసి  చాలా మందిని ఆశ్చర్యానికి లోనైనారు చాలా చోట్ల స్వయంసేవకులతో  కలిసి అనేకమంది పని చేశారు.

1962 సంవత్సరంలో చైనా భారతదేశంపై యుద్ధం చేసినప్పుడు స్వయం సేవకులు సైన్యానికిచేసిన  సహకారం ఆ పనిలోస్వయంసేవకుల  బలిదానాలు చూసి జవహర్లాల్ నెహ్రూకూడా  ఒక్కసారి ఆలోచనలో పడ్డారు అందుకే ఆ తర్వాత జరిగిన జనవరి 26 రిపబ్లిక్ డే కార్యక్రమంలో పరేడ్ చేయమని సంఘాన్ని ఆహ్వానించారు. ఇట్లా  అనేకం ఉంటాయి,  అదే సంఘము యొక్క సమాజం నిష్ఠ, అది చూపించే ప్రభావం.  పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత పాలకులే అన్నీ చేయాలి  అనే అభిప్రాయం ప్రజలలో పాలకులు కూడా ఏర్పడింది ప్రజలు దానికి అలవాటు పడిపోయారు, దానితో రాజకీయ నాయకులు ప్రజలను తమ వ్యూహాలకు అనుగుణంగా చీల్చడం భ్రమలు నిర్మాణం చేయడం చేస్తూ పోతున్నారు, దాని నుండి బయట పడితే ఇంకా పెద్ద మార్పు దేశంలో వచ్చే అవకాశం ఉంది, ఒక్క మాట చెప్పాలంటే రాజకీయాలను దేశం కోసం నడపటం  ప్రజలు నేర్చుకొన్న వేళ  ప్రజలుపూర్తిగా సంఘానికి  దగ్గరగా వస్తారు.
                         
మౌలికంగా సంఘం ఏమి చేస్తున్నది: మన దేశ చరిత్రలో ఒక మౌలిక పాఠం ఉన్నది, ఈ దేశంలో ప్రజలు ఎల్లప్పుడూ తన ఆదర్శాలను, నైతిక ప్రమాణాలను, పెద్దల నుండి  స్వీకరిస్తూ ఉంటారు, ఆ ఆదర్శాలను కాంతి పుంజాలు గా మలుచుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ఉంటారు.   అటువంటి నైతిక, సామాజిక, ధార్మిక, రాజకీయ నాయకత్వం కోసం దేశం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నది,  అటువంటి శ్రేష్టమైన నాయకత్వాన్ని నిర్మాణం చేయడంలో సంఘం విజయవంత మైనది లక్షలాది మంది సంఘ  కార్యకర్తలు ఈరోజు సమాజంలో కలిసిపోతూ సమాజాన్ని జాగృతం చేస్తున్నారు.

లీట క్విలి  అనే సామాజిక శాస్త్రవేత్త మాటలలో వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ ఒంటరిగా ఉండలేదు,  దానికి సద్గుణం అనే సహజలక్షణం తోడుకావాలి,  స్వేచ్ఛ- నైతికత, స్వేచ్ఛ- చట్టం, స్వేచ్ఛ- న్యాయం ,స్వేచ్ఛ- సర్వజన శ్రేయస్సు, స్వేచ్ఛ -పౌర బాధ్యత ఉండాలని చెప్పారు.  వాటన్నింటినీ సంఘం స్వయంసేవకులలో  జోడించ కలుగుతున్నది.  దానితో  సంఘం సమాజంలో  అమూలగ్ర పరివర్తన దిశలో వేగంగా అడుగులు వేస్తున్నది  ఆ ప్రవాహం లో మనం కూడా కలిసి పోవాలి,  సమీప భవిష్యత్తులో ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా, ప్రపంచ శాంతిసాధించేదిగా  చేయగలుగుతాము, అందుకే  రండి ఈ  దేశాన్నిమనమందరం  ముందుకు తీసుకుని వెళ్దాం, అదే సంఘం మనకు ఇచ్చే పిలుపు. అందరకి  విజయదశిమి శుభాకాంక్షలు. -రాంపల్లి మల్లిఖార్జున్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments