Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ధీరవనిత రాణి అబ్బక్క చౌత - About Rani Abbakka Chowta in telugu - azadi ka amrut mahotsav

1947కు 300 ఏళ్లకు ముందే అత్యాధునిక సైన్యం గల పోర్చుగీస్ వారిని మంగళూరుకు సమీపంలో ని ఉల్లాల్ అనే చిన్న సామ్రాజ్యం గల 30 ఏళ్ళ యువత...


1947కు 300 ఏళ్లకు ముందే అత్యాధునిక సైన్యం గల పోర్చుగీస్ వారిని మంగళూరుకు సమీపంలో ని ఉల్లాల్ అనే చిన్న సామ్రాజ్యం గల 30 ఏళ్ళ యువతి రాణి అబ్బక్క చౌతా వీరోచితంగా పోరాడి ముచ్చెమటలు పట్టించడం మన చరిత్ర గ్రంథాలలో ఎక్కడైనా కనిపిస్తుందా?

భయమంటే ఏమిటో తెలియని గొప్ప వీరనారి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక యుద్ధనౌక కు ఒక మహిళ పేరు, రాణి పేరు కాని పెట్టలేదు. కానీ ఒక్క మన భారతదేశం నౌకలు మాత్రమే ఆఅదృష్టం చేసుకున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ గొప్ప వీరవనిత గురించి మన చరిత్రపుటల్లో ఏ పుస్తకంలోనూ నోచుకోలేకపోయింది ఆమె అబ్బక్క.


ఏ పాఠ్యపుస్తకములో లేని రాణి అబ్బక్క చరిత్ర: భారతీయ చరిత్రలో ఒకే ఒక ధీరవనిత, పలుమార్లు పోర్చుగీస్ వాళ్లను ఓడించిన మహారాణి రాణి అబ్బక్క. ఆమె ధైర్యంలో, వీరత్వంలో రాణి లక్ష్మీ బాయికి, రాణి రుద్రమ దేవికి మరియు రాణి దుర్గావతి కీ సరిసమానమైన వ్యక్తి.

7వ శతాబ్దం నుండి మన భారతదేశానికి మరియు అరేబియన్ దేశాలకు మధ్య వాణిజ్య సంబంధాలుండేవి. యూరోపియన్ దేశాలు మన భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి అప్పటికి. 1498 లో మొదటిసారి వాస్కోడిగామా మన భారతదేశంలోని కాలికట్ ప్రాంతానికి సముద్రమార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. యూరోపియన్ దేశాల నుంచి మొదట భారత్ కి వచ్చింది పోర్చుగీస్. ఐదు సంవత్సరాల తరువాత పోర్చుగీసు వాళ్లు మొదటి ఓడరేవును కట్టారు. దాని తర్వాత వాళ్లు వివిధ నౌకాశ్రయాలు కట్టారు.

మనదేశం తో సహా మస్కట్, మొజాంబిక్, శ్రీలంక, ఇండోనేసియా తో పాటు ఎక్కడో దూరంలో చైనాలో ఉన్న మకావు కలుపుతూ సముద్ర మార్గాన్ని నిర్మించారు. 20 సంవత్సరాలలో పోర్చుగీస్ ఈ మార్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. భారతీయులకు, అరబ్బులకు, పెర్షియన్ మరియు ఆఫ్రికన్ ఓడలకు హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం దగ్గరగా ఉండేది. 16 వ శతాబ్దం నాటికి పోర్చుగీస్ యొక్క ఆధిపత్యాన్ని ఏ ఒక్క యూరోపియన్ దేశం అడ్డుపడలేకపోయాయి (డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు 17 వ శతాబ్దం మొదట్లో భారత్ లోకి వచ్చారు). ఎప్పటి నుండి అయితే ఈ సముద్ర మార్గంలో పోర్చుగీస్ ఆధిపత్యం పెరిగిందో అప్పటి నుండి వాళ్లు రుసుములు విధించడం మొదలుపెట్టారు. పోర్చుగీస్ వాళ్లకు స్థానికంగా ఉన్న రాజులు ఎదురుతిరిగిన వాళ్లను ఓడించి ఆ మార్గాన్ని వశం చేసుకున్నారు.

1526 లో పోర్చుగీస్ మంగళూర్ పోర్ట్ ని ఆక్రమించిన తర్వాత వాళ్ళ తదుపరి లక్ష్యం ఉల్లాల పోర్ట్ పైన పెట్టారు. ఉల్లాల అనేది చౌత రాజు 3 వ తిరుమల రాయ రాజధాని. అది విజయనగరం రాజ్యం కీ కట్టుబడి ఉండేది. చౌతలు మొదట జైన్ రాజులు వాళ్ళు 2 వ శతాబ్దం లో గుజరాత్ నుండి వలస వచ్చారు (అది ఇప్పుడు దక్షిణ కన్నడ, ఉడిపి మరియు కేరళలోని కాసర్ గోడ్ జిల్లా వరకు ఉంది). చౌత లు మాతృస్వామ్య రాజవంశీయులు. ఆ రాజు యొక్క మేన కోడలే రాణి అబ్బక్క. ఆ రాజు అబ్బక్క ను దత్తత తీసుకొని రాజ్యానికి రాణిగా ప్రకటించాడు. ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు కత్తి యుద్ధం, విలు విద్య, గుర్రపు స్వారీ, సైనిక వ్యూహం, దౌత్య పరమైన అన్ని విద్యలలో చిన్నప్పటి నుండే ఆరితేరింది. ఆమె రాజ్య సింహాసనం అధిరోహించిన నాటి నుండే రాజ్యానికి పోర్చుగీస్ నుండి ఉన్న ముప్పు తెలుసు. 3 వ తిరుమల రాయ చనిపోయేముందు రాణి అబ్బక్కని లక్ష్మప్ప బంగరాజ (మంగళూర్ రాజు) తో వ్యూహాత్మక వివాహ కూటమి ఒప్పందంతో పెళ్లి జరిగింది. అబ్బక్కకి పెళ్లి అయినా కూడా తన ముగ్గురు పిల్లలతో తన సొంత ఇంట్లో ఉల్లాల లో ఉండసాగింది. కొన్ని రోజులకు వాళ్ళ వైవాహిక బంధం తెగిపోయింది బంగరాజ పోర్చుగీస్ తో సంధి చేసుకోవడం వల్ల.

అబ్బక్క నాయకత్వంలో వెలిగిపోతున్న ఉల్లల రాజ్యం పైన పోర్చుగీస్ ఒక కన్ను వేసి ఉంచారు. ఆమె నుండి అధిక పన్నులు వసూలు చేయడమే కాక ఆమె పైన మితిమీరిన ఆంక్షలు వేయడంతో ఆమె పోర్చుగీస్ కి ఎదురు తిరిగింది. పోర్చుగీస్ వాళ్లు తన ఓడల పైన దాడి చేసిన కూడా అరబ్ లతో వ్యాపారం చేయడం ఆపలేదు. మగవీరుల, బిల్లవా విలు విద్యలు మొదలు మప్పిలః తెడ్డులు నడిపే అన్ని కులాలకు మరియు మతాలకు అతీతంగా తన సైన్యంలో మరియు నౌకా దళంలో మగవారు ఉండేవాళ్ళు.

ఆమె మొండిపట్టుని చూసి పోర్చుగీస్ పలుమార్లు ఉల్లలా పైన దాడి చేశారు. 1556 సంవత్సరంలో మొదటి సారి పోర్చుగీస్ అడ్మిరల్ డాన్ అల్వరో డి సివేరియా ఆధ్వర్యంలో యుద్ధం చేశారు కానీ అది అననుకూల సంది జరిగింది. మళ్లీ 2 సంవత్సరాల తర్వాత పోర్చుగీస్ అతి పెద్ద సైన్యంతో ఉల్లాల పైకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు అబ్బక్క యుద్ధవ్యూహాలతో మరియు దౌత్య వ్యూహంతో (అరబ్బులు మరియు కోజికోడ్ జమోవియా వాళ్లతో చేతులు కలిపి) పోర్చుగీస్ వాళ్లను ఓడించి వెను తిరిగేలా చేసింది.

General Joao Pexixoto ఆధ్వర్యంలో మరోసారి ఉల్లల పైన దాడి చేసి కోటను ఆక్రమించుకున్నారు. కానీ అప్పటికే వాళ్ళ దాడిని గ్రహించిన రాణి ఆ కోట నుండి తప్పించుకుని పారి పోయింది. అదే రోజు రాత్రి ఆమెకు నమ్మకం గా ఉండే 200 మంది సైనికులతో పోర్చుగీస్ స్థావరాలపై మహాకాళిల రౌద్రరూపం దాల్చి విరుచుకుపడింది. 70 మంది సైనికులతో పాటు ఆమె కోటను ఆక్రమించిన General ను నరికి చంపింది. ఆమె రౌద్రానికి భయపడిన మిగతా పోర్చుగీస్ సైన్యం పడవలలో పారిపోయారు.

రాణి అబ్బక్క ధైర్యాన్ని మరియు మనో నిబ్బరం మిగతా రాజులకు కూడా స్ఫూర్తినిస్తున్న విషయం పోర్చుగీస్ వారు జీర్ణించుకో లేకపోయారు. వేరే రాజులతో ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాలని చూసారు. అంతే కాకుండా స్వయానా తన భర్త యుద్ధం చేస్తాము మరియు ఉల్లాల రాజ్యాన్ని తగులబెడతామని బెదిరించిన కూడా బెదరలేదు.

ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా అదరని, బెదరని రాణి అబ్బక్క ను చూసి పోర్చుగీస్ ఖంగుతిన్నారు. ఈసారి Anthony D Noronha ( Portuguese Viceroy of Goa) ను రంగంలోకి దింపారు. 1571 లో మూడువేల మంది పోర్చుగీస్ సైన్యంతో Armada అనే యుద్ధనౌక సహాయంతో ఉల్లాల పైన మెరుపు దాడి చేశారు.

రాణి అబ్బక్క తన కులదైవాన్ని దర్శనం చేసుకొని కోటకు బయలుదేరి వస్తుంటే మార్గ మధ్యలో కోట కాపలాదారుడు వచ్చి జరిగిన ఉదంతం చెప్పగానే వెను వెంటనే తన గుర్రాన్ని యుద్ధ రంగం వైపు తిప్పింది. ఒక మెరుపుల, ఒక మహాచండీల యుద్ధ భూమిలోకి దూకింది. భరతమాత కోసం, దేశం కోసం అని అరుస్తూ యుద్ధభూమిలో కి దిగింది. అటు నేల పైన మరియు ఇటు సముద్రంలో, అటు వీధి వీధిలో మరియు ఇటు సముద్రతీరంలో యుద్ధం భీకరంగా సాగింది. మెల్లగా ఒడ్డు పైన ఉన్న పూర్తి పోర్చుగీస్ సైన్యాన్ని సముద్రంలోకి దింపుతూ వాళ్ల పడవలలో పారిపోయేలా చేశారు. ఇటు పిమ్మట ఒడ్డు పైన ఉన్న తన సైన్యాన్ని అగ్ని బాణాలు వేయించ సాగింది. నేలపై నుండి కొన్ని వేల బాణాలు సముద్రంలో ఉన్న పోర్చుగీస్ పైకి వేయించి వాళ్లను సముద్రంలోనే మట్టు పెట్టించింది.

కానీ యుద్ధంలో గాయపడిన రాణి అబ్బక్క ను ఎలాగైనా చంపాలని సామంతులకు డబ్బు మభ్యపెట్టి ఆమె పైకి యుద్ధం చేయించారు. కానీ భయమంటే ఎరుగని రాణి తను గాయాలపాలైన కూడా యుద్ధం చేస్తూ కదనరంగంలో కన్నుమూసింది. ఒక గొప్ప వీర వనిత మాతృదేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. రాణి అబ్బక్క పోర్చుగీస్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని ఘట్టం. చిరస్మరణీయురాలు అయ్యింది. భారతదేశం ఉన్నన్ని రోజులు ఈ భారతీయులం అందరం మీకు రుణపడి ఉంటాము అబ్బక్కకు. తన వీరత్వానికి ప్రతీకగా మరియు భయం అంటూ ఎరుగని తన ధైర్యానికి దాసోహమంటూ 2015 లో మోడీ ప్రభుత్వం నౌకా దళం లోని ఒక నౌకకి రాణి అబ్బక్క పేరు పెట్టి తమ రుణం తీర్చుకున్నారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments