Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ - About Dokka Sitamma in Telugu - megamindsindia

'అతిథి దేవోభవ' అన్నపదానికి భారతదేశం కేర్ ఆఫ్ అడ్రస్. భారతీయ సాంప్రదాయంలో 'అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అని మనం చెప్...

'అతిథి దేవోభవ' అన్నపదానికి భారతదేశం కేర్ ఆఫ్ అడ్రస్. భారతీయ సాంప్రదాయంలో 'అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అని మనం చెప్పుకుంటాము. దేశ జీవన విదానం‌ కూడా అదే చెబుతుంది. అన్నదానానికి మించిన దానం లేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా జీవించినవారు భారతదేశంలో అనేకమంది ఉన్నారు. అటువంటి వారిలో మన డొక్కా‌ సీతమ్మ ఒకరు.

డొక్కా సీతమ్మ గారు  1841 లో గోదావరి జిల్లా లోని మండపేటలో నరసమ్మ, భవానీ శంకరం అను పుణ్యదంపతులకు జన్మించారు. చిన్నతనములోనే తల్లిని కోల్పోయిన సీతమ్మ కి ఇంటి పనులు చేయడం, తండ్రికి సహాయంగా ఉండటం నేర్చుకున్నారు. చిన్నతనము నుండే ఆమెకు అతిథులను ఆదరించడం  అలవడింది. ఒకరోజు గ్రామాంతరం వెళ్ళిన భవానీ శంకరం గారి ఇంటికి ఏదో పని మీద ఆ ఊరికి వెళ్ళిన జోగయ్య అనే సంపన్నమైన కుటుంబీకుడు ఆ ఎనిమిదేళ్ళ బాలిక ఆతిథ్యానికి మర్యాదలకు అణకువకు సంతసించి తరువాత కొద్దినాళ్ళకు ఆమెనే వివాహం చేసుకున్నాడు.

లంకల గన్నవరానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన వాడు జోగన్న. ఈ ప్రాంతములో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన మహాఇల్లాలు. 'అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహాఇల్లాలు. ఈమె సాధారణ గృహిణి. కానీ తన ఇంటికి వచ్చిన వారికి, ఆకలి అన్నవారికి ఆమె ఎన్నడు లేదన్న మాట లేకుండా స్వయంగా వండి వారి ఆకలి తీర్చేది. పెళ్ళయిన కొత్తల్లో తన భర్త ఏమయినా అనుకుంటారేమో ఇలా అన్నదానం చేస్తే అనుకున్న ఆమెను ఆమె భర్త జోగన్న వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇప్పటికీ గోదావరి ప్రాంతములో ఆమె గూర్చి కథలు కథలుగా ఆమె దాతృత్వం గూర్చి ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.

సీతమ్మ గురించి మన చాగంటి వారు చెప్పిన కొన్ని ముఖ్య సంఘటనలు: ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే - ఆవిడ జీవితములో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు "ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం... అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు" అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మగారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి... వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ.

ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భార్తగారు "ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు..." అన్నారు. దానికి ఆవిడ "నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు" అని చెప్పి పెట్టింది. ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త ఒక రోజు సాయంకాలం గొయ్యి తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. తీసుకొచ్చి ఇంట్లో బంగారు కాసుల రాశులు పోసి, మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.

ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే "నాకు పట్టాభిషేకము జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రము దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారము పెట్టి అప్పుడు పట్టాభిషేకము చేసుకుంటా" అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, "నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకలు ఎందుకు, వద్దు" అన్నారు ఆవిడ. "అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు" అని ఆ కలక్టరు గారు చెబితే, "నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి" అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం.

అంతటి గొప్ప నిరతాన్నదాత సీతమ్మ గారి గూర్చి ఒకప్పుడు తెలుగు పాఠ్యాంశము ఉండేది. 1990 ల తర్వాత తీసి వేసారు కానీ ఆమె గూర్చి ప్రతి ఒకరికీ తెలియాలి. డొక్కా సీతమ్మ గారు చనిపోయినపుడు. ఒక మహోజ్వల తార నేల రాలిందని ఆనాడు చూసినవారు అందరు చెప్పుకున్నారు. ఇలాంటి ఎందరో మనదేశంలో సేవాతత్పరత కలిగిన భారత దేశం మనది. నేటికీ ఈ అన్నదాన‌ కార్యక్రమాలు అనేక సత్రాలలో, దేవాలయాలలో, మఠాలలో, పీఠాలలో జరుగుతూనే ఉన్నవి, ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి. భారతదేశం సనాతనం నిత్యనుతనం. జై శ్రీ రామ్... జై హిందు రాష్ట్ర. -మీ నన్నపనేని రాజశేఖర్.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments