Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హైదరాబాద్ విమోచన దినోత్సవం గురించి క్లుప్తంగా - About Hyderabad Liberation Day in Telugu - megaminds

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం ప్రాప్తించింది. లక్షలాది మంది దేశ భక్తులు బలిదానాల వల్ల సామ్రాజ్యవాద దురహంకారులు బ్రిటిషర్స్ ...


భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం ప్రాప్తించింది. లక్షలాది మంది దేశ భక్తులు బలిదానాల వల్ల సామ్రాజ్యవాద దురహంకారులు బ్రిటిషర్స్ దేశం మీద పెత్తనం వదలిపెట్టి వెళ్లి పోయారు దేశమంతటా 566 సంస్థానాలున్నాయి. భారత ప్రభుత్వంలో విలీనం కావడానికి చాలా సంస్థానాలు సిద్ధంగా ఉన్నాయి. భారత్ ఏకతా నిర్మాత, ఉక్కుమనిషి, నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయి పటేల్ పిలుపుననుసరించి సంస్థానాలు భారత్ ప్రభుత్వం (ఇండియన్ యూనియన్) లో విలీనమయ్యాయి. నాలుగు సంస్థానాలు కాశ్మీర్, హైదరాబాద్, జోధ్ పూర్, జునాగడ్ విలీనానికి అనుకూలంగా లేవు.

బ్రిటిషువారి 'విభజించు పరిపాలించు' సూత్రం దేశాన్ని వదలి వెళ్లేప్పుడు కూడా పనిచేసింది. సంస్థానాధిపతులు భారత్ లో గాని, పాకిస్థాన్లో గాని కలవచ్చు, లేదా స్వతంత్రం గా ఉండవచ్చునని పుండుపెట్టారు. దాంతో ఈ నాలుగు సంస్థానాల్లో జునాగడ్ పాకిస్థాన్ లో కలవాలని ప్రయ త్నించింది. దేశీ వ్యవహారాల మంత్రి అయిన సర్దార్ పటేల్ అక్కడికి సైన్యాన్ని పంపించాడు. రెండు రోజుల్లో జునాగడ్ తల వంచింది. జోధ్ పూర్ రాజు దగ్గరికి రాయబారిని పంపించాడు అతను వెంటనే ఒప్పుకొని తానూ యూనియన్లో కలుస్తున్నానని ప్రకటించారు.

ఇక మిగిలింది హైదరాబాద్, కశ్మీర్ సంగతి. కశ్మీర్ సంగతి తాను చూసుకొంటానన్నాడు పండిట్ నెహ్రూ, అక్కడి రాజు హిందువే. పేరు రాజా హరి సింగ్ ప్రజలు ముస్లిం లెక్కువ అంతేగాక పాకిస్థాన్ సైన్యం దాడి చేసింది. పూజ్య శ్రీ గురూజీ తదితరుల సలహాతో హరిసింగ్ భారత సైన్యాన్ని ఆహ్వానించాడు. పండిట్ నెహ్రూ సర్దార్ పటేల్ తో ఆలోచించి పంపించాడు మన సైన్యం జయించి వారిని తరిమికొట్టినా నెహ్రూకు అబ్దుల్లాకు ఉన్న స్నేహం కారణంగా మొన్నటి వరకూ (2019 ఆగష్టు 5 వరకు) రావణకాష్టంలా కాశ్మీరు మండుతూనే ఉన్నది. 370, 35ఎ తొలగి జమ్మూ కాశ్మీర్, లద్దాక్ శాశ్వతంగా భారత్ లో కలిసిపోయాయి. ఇన్నాళ్లు ఆకుపచ్చ మంటల్లో అందాల కాశ్మీరు కుతకుత ఉడకడానికి కారణం ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూనే అన్నది చరిత్ర చెబుతున్నది.

హైదరాబాదు సంస్థానాన్ని స్వతంత్ర ఉస్మానిస్థాన్ గా రాజా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించుకొన్నాడు. భారత్ యూనియన్ తో యుద్ధం చేయడానికి అతను ఆయుధాలు సేకరిస్తున్నాడు ఇతర ప్రాంతాల నుండి ముస్లింలను (8 లక్షల మందిని) రప్పించాడు. హిందూ మాన ప్రాణాలకు భంగం కలిగే విధంగా రాకాసి రజాకార్లు, జిహాదీ పోలీసులు వ్యవహ రించడానికి కారకుడయ్యాడు. సంస్థానంలోని హైదరాబాద్ అత్రాఫ్ బల్దా, నల్గొండ, వరంగల్లు, కరీంనగర్, ఆదిలాబాదు, మెదక్, బీదరు, నాందేడ్, పర్భణీ ఔరంగాబాదు, బీడు, ఉస్మానాబాదు, గుల్బర్గా, రాయచూర్ మహబూబ్నగర్ - మొత్తం 16 జిల్లాల్లో హిందువులపై హత్య-అత్యాచారాలు జరిగాయి. ఆస్తులు విధ్వంసమయ్యాయి ఎందరో ప్రాణాలు అరచేత పట్టుకొని పక్క రాజ్యాలకు పారిపోయారు.

ఈ అత్యాచారాలు - విధ్వంసాలు ప్రధాని (నెహ్రూకు) ఉప ప్రధాని (పటేల్) నివేదించారు. అయినా నెహ్రూ పట్టించు కోలేదు. అత్యాచారాలు జరుగుతున్నాయని పార్లమెంటులో ప్రకటించినా తాత్సారం చేస్తూ వచ్చారు. ఇక పటేల్ సైనిక చర్యకు (పోలీసు చర్యకు) ఆజ్ఞ జారీ చేశామని నెహ్రూ దగ్గర సంతకం తీసుకునదేరింది.

1948 సెప్టెంబర్ 12న సైన్యం హైదరాబాదు వెళ్లడానికి ఆజ్ఞ జారీ అయింది. 13వ తేదీన జనరల్ జె.ఎన్. చౌదరి ఆధ్వర్యంలోని సైన్యం షోలాపూర్ నుండి హైదరాబాదు వైపుగా, కెప్టెన్ ఎం.వి.రుద్ర నాయకత్వంలో ఔరంగాబాదు నుండి జాల్నా మీదుగా వచ్చేసింది. ఇదే రోజు వరంగల్లు విమానాశ్రయాన్ని సైన్యం ఆక్రమించుకున్నది బీదరు విమానాశ్రయం సైన్యం వశమైంది. రెండోరోజు (14 సెప్టెంబర్) ఔరంగాబాదు, రాజేశ్వరం, ఉస్మానాబాద్, నిర్మల్ సైన్యం వశమయ్యాయి. విజయవాడ నుండి సూర్యాపేట మీదుగా సైన్యం వచ్చేస్తున్నది. ఎక్కడ రజాకార్లు అక్కడే పరారయ్యారు. భారత సైన్యం ప్రజలపై అత్యాచారాలు చేస్తుందంటూ కమ్యూనిస్టులు విషప్రచారం మొదలెట్టారు విచిత్రంగా వీళ్లు నిజాంకు అనుకూలురయ్యారు. మూడో రోజు (15 సెప్టెంబర్) హైదరాబాద్ మీదుగా పటాన్ చెరువు వరకు సైన్యం వచ్చేసింది. ఇదేరోజు వరంగల్లు మొత్తం సైన్యం స్వాధీనమైంది. ఖమ్మం తదితర అన్ని జిల్లాలో రజాకర్లు ఆయుధాలు పారేసి, ట్రక్కులు వదిలేసి పారిపోయారు. 
నాలుగో రోజు (16 సెప్టెంబర్) సూర్యాపేట దగ్గర నిజాం పోలీసులు, రజాకార్లు, కమ్యూనిస్టులు కలిసి సైన్యం రాకుండా రోడ్డు వంతెన కూల్చివేశారు. కాని సూర్యాపేట వ్యాపారులూ - ప్రజల సహకారంతో సైన్యం మూడు గంటల్లో వంతెన నిర్మించి బయలు దేరింది. ఇక అయిదో రోజు (17 సెప్టెంబర్) యుద్ధమే లేదు భారత ప్రభుత్వ ఏజెంటు కె.ఎం.మున్షీ నిజాం తో మంతనాలు జరిపి సరెండరయ్యేందుకు ఒప్పించాడు. ఆ రోజు సాయం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఉపప్రధాని సర్దార్ వల్లభభాయి పటేల్ ముందు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సరెండరయ్యాడు. తాను యుద్ధ విరమణ చేస్తున్నట్లు రేడియోలో ప్రకటించాడు

నెహ్రూ మున్షీ తంత్రం(కు) మంత్రం కారణంగా నిజాంకు శిక్ష లేదు, రజాకర్లకు శిక్షల్లేవు. వారి దోపిడీ సొమ్ము వారి దగ్గరే ఉండిపోయింది. కాశీం రజ్వీలాంటి వాళ్లు పాకిస్థాన్ పారిపోయారు గానీ, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనబడే రజాకర్ల మనస్తత్వంలో మార్పు రాలేదు. వాళ్లు ఏనాటికైనా హైదరాబాదును ఆక్రమించాలనే మనస్తత్వాన్నే నిర్మాణం చేస్తున్నారు భారత్ ఏకతా నిర్మాత సర్దార్ పటేల్ కలలు నిజం కావాలంటే ప్రజలు ఆ దిశలో సంసిద్ధం కావాల్సి ఉంది సెప్టెంబర్ 17 ఉత్సవం ఎలా చేసుకోవాల్సి ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments