Type Here to Get Search Results !

స్వామి శ్రద్ధానంద త్యాగం - గాంధీజీ వ్యాఖ్యలు - Swami Shraddananda Murder Mystery and Gandhi Statements


స్వామి శ్రద్ధానంద 1920 - 1926 సంవత్సరాల మధ్య పశ్చిమ పంజాబ్ లో చాలా పేరుపొందిన వ్యక్తి. గొప్ప సంఘ సంస్కర్త. హిందూ ధర్మంలో ఓ బలహీనత పునరాగమన నిషేధం. మతం మారి హిందూ ధర్మాన్ని త్యజించిన వాళ్ళు తిరిగి హిందూ ధర్మంలోకి రావటాన్ని పండితులు, ధర్మాచార్యులు అంగీకరించేవాళ్ళు కాదు.

కాశ్మీర్ లో ముస్లింలు హిందూ ధర్మాన్ని స్వీకరిస్తామన్నప్పుడు కాశీ పండితులు ససేమిరా అంగీకరించలేదు. ఆనాడు కాశ్మీరు ముస్లింలంతా హిందువులైపోయి వుంటే ఈనాడీ సమస్య వుండేది కాదు అది మరో విషయం. ప్రస్తుత విషయానికి వస్తే శ్రద్ధానంద జీవితం ముస్లింలను హిందువులు గా మార్చటంలోనే సార్థకమైంది. తన మృదుమధుర భాషణలతో, పాండిత్యంతో ఎందరో ముస్లింలు తిరిగి తమ పారంపర్య హిందూ ధర్మాన్ని స్వీకరించేలా చేశారాయన. సహజంగానే ఇది ముస్లింలకు కడుపుమండేలా చేసింది, ఆయనకు ఎన్నో బెదిరింపు ఉత్తరాలు వచ్చేవి. సమాజం కోసం జీవితాన్నే ధారపోసిన స్వామీజీ చంపుతామంటే భయపడతారా? ఆయన కార్యదీక్ష పురోగమిస్తుంది.

నవంబరు, 1926లో స్వామీజీకి జబ్బు చేసింది. మంచంలో వున్నారు. డా॥ అన్సారీ అనే వైద్యుడు వైద్యం చేస్తుండేవారు. శిష్యుడు ధరంసింగ్, ఆయన్ను కంటికి రెప్పలా చూస్తుండేవాడు. అది డిసెంబర్ 23 ఆరోజు ఓ ముసల్మాన్ ఆయన ఇంటికి వచ్చాడు. స్వామీజీతో ఇస్లాం గురించి ధార్మిక చర్చ చెయ్యాలి అని చెప్పాడు ధరమ్ సింగ్ కి ఆయన ఆరోగ్యం బాగులేదు. ఇప్పుడు మాట్లాడ్డానికి వీల్లేదు అన్నాడు ధరంసింగ్ స్వామీజీని అడుగు అని ముస్లిం ఆగంతకుడు, వీల్లేదని ధరం సింగ్ ఇలా వాదులాట జరుగుతోంది. వాగ్వివాదాన్ని విన్న శ్రద్ధానంద అతన్ని లోపలికి పంపమన్నాడు, స్వామీజీ మంచం మీద పడుకుని వున్నాడు. సలాం! అన్నాడు ఆగంతకుడు! స్వామీజీ వెల్లకిలా తిరిగి నవ్వుతూ అతన్ని కూర్చోమన్నాడు, దాహం గా ఉంది, మంచినీళ్లు అన్నారు అతిథి. ధరంసింగ్ నీళ్ళు తేవటానికి లోపలి వెళ్ళాడు, చివ్వున లేచి ఆగంతకుడు. అతని చేతిలో పిడిబాకు వుంది, కన్ను మూసి తెరిచేలోగా కసాకసామని రెండుసార్లు స్వామీజీ ఛాతిమీద పొడిచి పారిపొయ్యాడా ముస్లిం. అతని పేరే అబ్దుల్ రషీద్.

నీళ్ళు తీసుకుని వచ్చిన ధరం సింగ్ కు మంచం నిండా రక్తం మడుగు, ఆ మడుగు మధ్య స్వామి శ్రద్ధానంద కనిపించాడు హిందూ ధర్మ పునరుద్ధరణ సేవలకు అంకితమై పోయింది స్వామి శ్రద్ధానంద జీవితం. త్యాగధనుడైన స్వామీజీ అమరుడై, చిరస్మరణీయు డయ్యాడు చరిత్రలో, ఈ చరిత్రతో బాటే రషీద్ కు ఉరి పడకుండా కాపాడే ప్రయత్నంలో మహాత్మాగాంధీ చేసిన శ్రమకూడా మరో రెండు పేజీల చరిత్ర అయింది.

30.12.1926 న తన యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ ఓ వ్యాసం వ్రాశారు. అందులోని కొన్ని గుర్తించుకోతగ్గ పంక్తుల్ని నెమరువేసుకుందాం. స్వామి శ్రద్ధానంద గొప్ప సంఘ సంస్కర్త. తన ఆదర్శంకోసం అమరుడయ్యాడు. అతనో యుద్ధ వీరుడు. హీరోలా జీవించాడు, హీరోలా మరణించాడు. ఈ సంఘటనకు రెండో వైపూ కథ వుంది. నన్ను నేను ముసల్మాన్ల స్నేహితుడిలా భావిస్తాను. వాళ్ళు నా రక్త సంబంధంవున్న సోదరులు. వాళ్ళ తప్పులు నావి. నేను వాళ్ళ సుఖ దుఃఖాల్ని పంచుకుంటాను. ఈ చెడ్డపని (హత్య) ముస్లిం పేరున్న వ్యక్తి చేశాడు, ముస్లింలకు స్నేహితుడిగా ఈ సంఘటన చాలా విచారిస్తున్నాను.

ఇతరుల తప్పులకు మనం పొంగిపోరాదు (దీన్ని అవకాశంగా తీసుకోరాదు.) హిందూ - ముస్లిం ఐకమత్యం ( ఈ సంఘటన వల్ల) ఆగరాదు. హిందువులు ఓర్పు వహించాలి. క్షమాశీలి అయిన యుధిష్ఠిరుడు, ఉపనిషత్తులు అందించే సందేశాన్ని విస్మరించరాదు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని ముస్లిం సమాజం మీద రుద్దరాదు, ప్రతీకార చర్య వద్దు. ముస్లిం, హిందువుల పట్ల చేసిన దుర్మార్గంలా భావించొద్దు. ఒక హీరోపట్ల మరో సోదరుడు చేసిన తప్పులా భావించాలి. ముస్లింలు వారి మత రీత్యా కత్తులు పిస్తోళ్ళతో స్వేచ్చగా వ్యవహరిస్తుండవచ్చు. ఖడ్గం ఇస్లాం చిహ్నం. ఖడ్గం అన్ని చట్టాల్ని అధిగమించిన చట్టంలా చూడబడే భూభాగంలో ఇస్లాం పుట్టింది అక్కడ ఇప్పటికీ ఖడ్గమే అత్యున్నత చట్టం. అక్కడ జీసస్ బోధలే పనిచెయ్యలేదు. (కాబట్టి హిందువులు ముస్లింల ఖడ్గ ప్రహారాన్ని నిరంతరం భరించాలి కాబోలు)

ముస్లింలు ఈ పిచ్చిపనిని ఆమోదించే ప్రమాదమూ వుంది. మనకు భగవంతుని మీద నమ్మకం కంటే ఖడ్గం మీద నమ్మకం అసందర్భం. అబ్దుల్ రషీద్ తరపున వాదించాలనే కోరిక ఉంది నాకు అతనెవరో నాకు తెలియదు. ఏ కారణం చేత అతనాపనిని చేశాడో తెలుసుకోవడం (స్వామీజీ హత్య) నాకనవసరం. తప్పు మనది. ఈ విషయం గురించి పత్రికలు ప్రచారం చెయ్యటం తప్పు. చదువర్ల మనస్సులను తమ భాషతో చెదరగొట్టటం తప్పు. అబ్దుల్ రషీద్ లాటివారు వేడెక్కటానికి బాధ్యత మనదే ఇలా సాగిపోయింది వ్యాఖ్యానం.

మన సమాజానికి, మనకు కావలసింది స్వామి శ్రద్ధానందలా లేక మహాత్మా గాంధీలా? ఇక మనమే తేల్చుకోవాలి, స్వామి శ్రద్ధానంద ను ఆదర్శంగా తీసుకుని తెలిసో తెలియకో మతం మారుతున్న వారిని తిరిగి స్వధర్మంలోకి అమ్మ ఒడికి చేర్చాల్సి‌న బాధ్యత మనపై ఉంది, మృదువైన మాటలతో మదురంగా మాట్లాడి తిరిగి స్వధర్మంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. జై హింద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

2 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. ఈ అబ్దుల్లా పేరు షిరిడీ సాయిబాబా కధలలో కూడా చూస్తాము.ఆఆబ్దుల్లా ఈఅబ్దుల్లా ఒకరేనా?

    ReplyDelete
  2. ఈ అబ్దుల్లా పేరు షిరిడీ సాయిబాబా కధలలో కూడా చూస్తాము.ఆఆబ్దుల్లా ఈఅబ్దుల్లా ఒకరేనా?

    ReplyDelete

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..