Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సిందూనది కి పూజలు చేసి‌న ప్రదాని - పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత - MegaMinds

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. స్నానమాచరించే సమయంలో చెప్పేశ్లోకం. భారత ప్రధాని నరేంద...

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు.
స్నానమాచరించే సమయంలో చెప్పేశ్లోకం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సింధూ నదిని దర్శించుకుని పూజలు చేశారు.

ఈ వార్త వినగానే పై శ్లోకం గుర్తుకొచ్చింది. భారతదేశంలో జన్మించిన ప్రజలకు  నదులు కేవలము నీటి ప్రవాహాలు కాదు  అవి అమృత ప్రవాహాలు, ప్రాణధారలు. వాటిని నదీమ తల్లులని పిలుస్తాం. మన ఉత్థానానికి, మన పతనానికి నదులు సజీవ సాక్ష్యాలు.

ఈ దేశమును తల్లి యొక్క స్వరూపంగా, భారతమాత గా భావిస్తాము ఆ తల్లి, తన సంతానాన్ని పోషించడానికి  ఆమె స్తనాలనుండి మాతృ దుగ్ధ సమానమైన ధారలను నదుల రూపంలో ఇచ్చిందని భావిస్తాం. ఏ నదినైనా గంగగానే తలుస్తాం. శివుడిని గంగాధరుడుగా పిలుస్తాం. ఇలా ప్రజలు తమజీవితంలో దేవతగా, తల్లితో సమాన స్థానంఇచ్చి నదులను పూజించే సంప్రదాయం హిందువులది. అందుకే నదులు కలిషితం కాకుండా సంవత్సరంలో అనేక సందర్భాలలో నది దర్శనం కోసం పండుగలను ఏర్పాటు చేసుకుని వెళ్లి దర్శించుకోవడంతో పాటు, నదిని పసుపు కుంకుమలు జల్లి పూజించడం, అర్చించటం ఆనవాయితీ. పసుపు కుంకుమలు కాలుష్య నివారణ కారకాలు. 

ప్రతి సంవత్సరం నది స్నానమని, నదీ దర్శనం అని,  మాఘమేళా అని, 12 సంవత్సరాలకు పుష్కరాలు అని, కుంభమేళా అని, అర్ధ కుంభమేళా అని నదీ స్నానాల కోసం ప్రజల్ని ఉత్సాహపరిచి నదుల గురించి ఆలోచించేటట్లుగా చేయడం హిందువుల పండుగలలో దాగి ఉన్న పర్యావరణ పరిరక్షణ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి.

ముఖ్యంగా సింధూనది మన దేశంలో ప్రవహిస్తున్నది కొంత భాగమే, చాలా భాగం పాకిస్తాన్లో ప్రవహిస్తున్నది. ఈ సింధునది విషయంలో కొన్ని  సంవత్సరాల క్రితం అప్పటి భారత ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ గారు సింధూ నది దర్శనం చేసుకోవడం కోసం చక్కగా సింధు దర్శన్. అని పేరు పెట్టారు. అద్భుతమైన కార్యక్రమాన్ని రచన చేశారు. లక్షలాదిమంది వెళ్లి దర్శించుకున్నారు. సాహస యాత్రగా వెళ్ళండనీ యువకులను సింధుదర్శన్ పేరుతో ప్రోత్సహించారు. మళ్లీ భారత ప్రధానిగా మోడీ గారు వెళ్లి పూజలు నిర్వహించడం గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది దేశ భక్తులందరికీ.

అయితే ప్రతి ఒక్కరూ పర్యావరణ ప్రేమికులుగా మారాల్సిన సమయం ఆసన్నమైనది, గత రెండు దశాబ్దల కాలంలో పర్యావరణం అనేక రకాల కారణాల మూలాన కలుషితమైంది. అన్ని రకాల కలుషితాలు జరిగాయి, ప్రస్తుతం దేశం లో యువత అంతా జాగరూకులై ఉన్న తరుణంలో మొక్కల ని పెంచడం, అలాగే ప్రభుత్వాలు మన పండుగలలో వాడే కొన్ని మొక్కలను పెంచి ప్రజల ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడే పథకాలు కూడా రచించాలి. ఉదాహరణకు వినాయక చవితి సందర్భంలో వాడే మొక్కలు, కాయలు పండే చెట్లు పెంపకం. అలాగే ప్లాస్టిక్ ని వాడకం ను పూర్తిగా మానేసే విధంగా ప్రయత్నం చేయడం, ప్రచారాలు చేయడం. నిత్యం యువత వాడే గ్యాడ్జెట్స్ వలన లెడ్ ఎక్కువగా దేశం లో పెరుకుపోతుంది, దీనిని మరలా ఉపయేగించే సెంటర్లు, అలాగే కలెక్షన్ సెంటర్ల ను పెంచి దాని ద్వారా నిరుద్యోగ యువతకు ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడం అలాగే ఎన్ జి ఓ లను ప్రోత్సహించడం ఇలా అనేక కార్యక్రమాలు రచించి మనకు‌ మనమే పర్యావరణం ను కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని‌ చెప్పగలము. భారతీయులు ప్రకృతి ఆరాదకులు, పోషకులు. మనకు పోషణ తప్ప సోషణ తెలియదు వీటన్నిటినీ మనం తిప్పి కోట్టాలని ఆకాంక్షిస్తూ చివరిగా సావార్కర్ గారి ఆఖరి కోరిక నెరవారలి కోరుకుందాం, ఆ కోరికేందో చూద్దాం.

గమనిక:‌ భారత జాతికి ప్రేరణనిచ్చిన మహనీయుడు వీరసావర్కర్ గారు తన చితాభస్మాన్ని సింధునది సంపూర్ణంగా భారతదేశంలో విలీనమైన తర్వాత ఆ నదిలోనే కలపాలని ఆకాంక్షించారు. ఇప్పటికీ వారి కోరిక నెరవేరని కారణంగా వారి చితాభస్మం ఇప్పటికీ అలాగే కలశంలోనే ఉండిపోయింది. ఇంతటి మహత్యం కలిగిన సింధూ నది దర్శనంఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని మనసు ఉవ్విళ్లూరుతోంది కదూ అందరికీ‌ త్వరలోనే నెరవారలని తల్లి భారతి‌ని పూజిద్దాం, భారత్ మాతాకీ జై. -ఆకారపు కేశవరాజు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments