Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రష్యాపై విజయం సాధించిన జపాన్ - Russian Battleship vs Japanese Battleship

రష్యా జపాన్ మీదకి యుద్ధానికొచ్చింది. యుద్ధం ముమ్మరంగా సాగుతోంది. రష్యాతో పోలిస్తే జపాను ఎంత? చిన్న దేశం. గరుత్మంతుడి ముందు పిచ్చ...

రష్యా జపాన్ మీదకి యుద్ధానికొచ్చింది. యుద్ధం ముమ్మరంగా సాగుతోంది. రష్యాతో పోలిస్తే జపాను ఎంత? చిన్న దేశం. గరుత్మంతుడి ముందు పిచ్చుక పిల్లంత ఆ రోజుల్లో రష్యాను జార్ రాజ వంశీయులు పాలించారు. ఆనాటికింకా కమ్యూనిజం రాలేదు రష్యాలో, రాచరికమే. అలానే జపాన్ లో మికాడో రాజు. జపాన్ ఎన్నో దీవుల సమూహమాయె. దాడి నావలతో జరుగుతోంది. ఎన్నో రష్యా నావలు జపాన్ వైపు సాగి వస్తున్నాయి. నావల నిండా సైన్యం. ఆ నావికా బలం ముందు జపాన్ ఎన్ని రోజులు నిలవగలదు? మహా పోరాడితే నాలుగు రోజులు. ఓటమి ఖాయం. బానిసత్వం రాసి పెట్టుంది జపాన్ వాళ్ళ ముఖం మీద?

ఉన్న సైన్యాన్ని సమాయత్తం చేశాడు పోరాటానికి మికాడో రాజు, తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోటానికి ఒక్కటే ఉపాయం. యోజన తయారైంది. చాలా మంది నిస్వార్థ త్యాగమూర్తులు కావాలి దాని కోసం, జపాన్ ప్రజలకు మికాడో రాజు తరపు నుంచి ఆహ్వానం ప్రకటించబడింది. మన దేశం, మన స్వాతంత్ర్యం ప్రమాదంలో పడ్డాయి. వీటి పరిరక్షణకు త్యాగమూర్తులు కావాలి. రష్యా పెద్ద దేశం. బలమైన దేశం వాళ్ళ నావికాబలమూ గొప్పదే. అయితే ఆ నావల ని సముద్రంలో ముంచెయ్యగల వీరులు కావాలి. పద్ధతి మేం తెల్పుతాం. కానీ ఆ వీరులు బహుశా నావలా సముద్ర గర్భంలో లీనమై పోవలసి వస్తుంది. దరిచేరే అవకాశాలుండవు. సాహసులు, దేశంకోసం త్యాగం చెయ్యగల ధీరులు ముదుకు రండి.

వేలాది దరఖాస్తులు మికాడో సముఖాన కుప్పలు పడ్డాయి ఊహించని ఫలితం! రోజురోజుకూ వచ్చే జవాబులు కుప్పలు పెద్దవుతున్నాయి. మికాడో రోమాంచితుడయ్యాడు. అతని హృదయం ఉప్పొంగింది. కళ్ళల్లో నీళ్ళు చిమ్మాయి. ప్రేమగా ఆ ఉత్తరాల కుప్పల్ని చేతులతో తడమసాగాడు. కంఠం గద్గద మైంది. ఆవేశం, ఆనందం అతన్ని మూగవాడ్ని చేశాయి. దేశంకోసం సర్వస్వాన్నీ అర్పించటానికి ఎందరు తయారయ్యారు! వీళ్ళంతా నా ప్రజ! జపాన్ పులకించిన క్షణం అది. పరిశీలించగా ఆ అర్జీలు ఎంత ఆవేశపూరితంగా వున్నాయో తెలిసింది. ఒక్కో పత్రం ఒక్కో ఆణిముత్యం. కొన్ని తెల్ల కాగితాల మీద రక్తంతో వ్రాసివున్నాయి! అందరిలో ఒకటే ఆవేశం. భాష భేదించినా భావం ఒక్కటే. ఈ సంకట కాలంలో మేంకూడా దేశానికి పనికివస్తాం. ఎంతో గర్వంగా వుంది అని. 

పిలుపు ఇవ్వబడ్డది అర్జీలు పంపిన వాళ్ళు రంగంలోకి దూకారు యోజన ప్రకారం చెయ్యాల్సినపని చాలా తేలిక! కానీ చెయ్యటం ఎలా! అన్నదే ప్రశ్న. రష్యా నౌకలో పొగగొట్టం (చిమ్నీ)లోకి బాంబులు విసరాలి. అంతే కానీ రష్యా సైన్యాన్ని తప్పించుకొని చిమ్నీలు లోకి బాంబులెలా వెయ్యాలి? ఇది ప్రశ్న యువకులు బయలుదేరారు. సముద్రపు ఒడ్డున రాజు, జనం వచ్చే నౌక వైపు దృష్టి సారించి నిలబడి వున్నారు. ఏమవుతుందో? ఎలా సాధించగలరో తమ యువకులు చీకటి పడింది. రష్యా నావలు మరింత దగ్గరకు వస్తున్నాయి. జనంలో ఆందోళన పెరిగింది. ఇంతలో పెద్ద మెరుపు. మంటలు! ఒక నౌక పేలిపోయి సముద్రంలో మునిగిపోయింది. మరో పది నిముషాలు. మరో మెరుపు - మంటలు. నావ మునక. అలా మరోటి, రెండు, పదులు. మెరుపుల సంఖ్య, మునిగే రష్యా నావల సంఖ్య పెరిగిపోతోంది గంట గంటకూ. ఒడ్డున జనంలో వీరావేశం, నినాదాలు.

రష్యా నావికాదళానికి అంతా ఆగమ్యగోచరంగా వుంది. ఏమీ అర్థం కావడం లేదు. నావలెలా పేలి మునిగిపోతున్నాయి? శత్రు నావలు లేవు. శత్రువులు కనిపించడం లేదు. శత్రుసైన్యం కనిపించడం లేదు. కానీ నావలు జపాన్ తీరం చేరటం లేదు! సముద్రంలో మునిగిపోతున్నాయి. నావలతో బాటుగా వేలాది రష్యా సైన్యం సముద్రం పాలవుతోంది ఆజ్ఞలు జారీ అయ్యాయి. రష్యా నావలు వెనుదిరిగాయి. జపాన్ యుద్ధంలో గెలిచింది.

అసలేం జరిగింది:
రష్యా సైనికులు దృష్టిని తప్పించుకుని నావికా గొట్టాల్లో బాంబులు విసరటం దుర్లభం. తాము పడవుల్లో బయలుదేరితే రష్యా సైనికులు తప్పక గమనించి తమని పట్టేస్తారు. సముద్రంలోంచి విసిరినా బాంబులు గొట్టాల్లో పడకపోవచ్చు. అందుకనే జపాన్ యువకులు బోలెడన్ని బాంబుల్ని తమ ఛాతీల చుట్టూ కట్టుకున్నారు. అవి తడవకుండా కట్టుదిట్టం చేసుకున్నారు. కొంకర్లుపోయే చలిలో సముద్రంలోకి దూకి ఈద సాగారు. చీకట్లో నావల్ని సమీపించి పైకి ఎగబాకారు. చిమ్నీ చేరి అందులో తామే దూకేశారు. నావ మీద కొత్త వ్యక్తి, రష్యా వారు గమనించే సరికే వాళ్ళు గొట్టాల్లో దూకటం బాంబులు పేల్చటం జరిగిపోయేది. గొట్టం నుంచి నేరుగా ఇంజన్లోకి బాంబు పేలాక ఇక నావ పేలడం, సముద్రంలో మునగటం తప్ప మరో పరిస్థితే లేదు.

బాంబుతో బాటుగా తామూ తుత్తి నియులైపోతామని ప్రతి యువకుడికీ సృష్టంగా తెలుసు. కాని ఒక్కరు కూడా వెనుకాడలేదు. వేలాది వీరపుత్రులు ముందుకురికారు. వాళ్ళ ఉత్సాహం, త్యాగనిరతి మాతృభూమిని పరదాస్యం నుంచి కాపాడాయి, అంత చిన్న జపాన్ రష్యాను ఓడించింది. ప్రపంచమంతా దిగ్ర్బమ చెందింది. అసంభవం సంభవమైంది. ఆనాడే కాదు ఈనాడైనా, ఏనాడైనా త్యాగమూర్తులున్న దేశాన్ని ఎవ్వరూ బానిసగా చెయ్యలేరు. ప్రస్తుతం భారతదేశం ఉన్న పరిస్థితులలో ఇలాంటి పిలుపు వస్తే కధన రంగంలో దూకడానికి లక్షలాదిమంది యువకులు సిద్ధంగా ఉన్నారని తలుస్తాము. జై హింద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments