Page Nav

HIDE
GRID_STYLE

Classic Header

{fbt_classic_header}

Popular Posts

Latest Posts

latest

ఆవు మన శ్రద్దాకేంద్రము, మన తల్లి - About Holy Cow - MegaMinds

ఆవు మన శ్రద్ధాకేంద్రము, మన తల్లి: వేదకాలంలో సత్యము, జ్ఞానము - ఇవి రెండు మూలభూత ధర్మాలు. ఈ రెండింటి సాధనలో భాగమే గో భక్తి. ఋగ...

ఆవు మన శ్రద్ధాకేంద్రము, మన తల్లి: వేదకాలంలో సత్యము, జ్ఞానము - ఇవి రెండు మూలభూత ధర్మాలు. ఈ రెండింటి సాధనలో భాగమే గో భక్తి. ఋగ్వేదంలోని గోసూక్తానికి సంబంధించి భరద్వాజ మహర్షి ఇలా అంటారు - గోవులు ఐశ్వర్యం. గోవులే నాకు ఇంద్రాది దేవతలు. ఇంద్రుని ప్రతినిధులైన గోవులను నేను నా హృదయ పూర్వకంగానూ, మనఃపూర్వకంగానూ ప్రేమిస్తాను. ఈ మంత్రంలో గోవు యొక్క ఆధ్యాత్మిక, భౌతిక అర్థాలు రెండూ కలిసి ఉన్నాయి. ఆ తర్వాతి సాహిత్యం - పురాణాలు, స్మృతులు, ధర్మ శాస్త్రాలలో గో భక్తి అతి స్పష్టంగా నిరూపించబడింది. గోహత్య మహాపాతకంగా చూడబడింది. అధర్వణవేదంలోని గోసూక్తం యొక్క మొదటి మంత్రం మాతా రుద్రాణాం దుహితా వసూనాం స్వసాదిత్యానామమృతస్యనాభి:..మా వధిష్ట అంటే గోవు రుద్రులకు తల్లి, వసువుల కూతురు, ఆదిత్యుల సోదరి, అమృతం యొక్క నాభి! గోవును చంపవద్దు అని చెప్పబడింది. ఇదే సూక్తంలో మరోచోట ధేనుఃసదనమ్ రయీణామ్ అంటే గోవు సకల సంపత్తులకు నిలయము మరోరకంగా చెప్పాలంటే జగత్తులోని సమస్త పదార్థాలకు తల్లి వంటిది గోవు అని అర్థం.

ఆర్ష సాహిత్యంలో - పాణిని వ్రాసిన అష్టాధ్యాయి వ్యవసాయానికి తోడుగా గోచర భూమి కూడా ఉల్లేఖించబడింది. పాణిని కాలంలో - అంటే క్రీ.పూ. 2800 నుండి 500 వరకు ఏ ప్రదేశం యొక్క సుఖసంపదలనైనా గణించడానికి ప్రమాణం ఆ ప్రదేశం గోసంపదే. స్మృతులు కాలంలో పంచగవ్యం వ్యాప్తిలో ఉంది దానిని పరమ పవిత్రమైన ప్రసాదంగా భావించారు. రఘువంశానికి చెందిన దిలీప మహారాజు యొక్క గో భక్తి జగత్ప్రసిద్ధం. వారు నీడలా గోవు వెనువెంట నడిచేవారు. నందిని తనను గురించి నేను ప్రసన్నురాలనైతే కేవలం పాలు ఇవ్వడం కాదు సకల మనోవాంఛలు అనుగ్రహిస్తాను అంటూ వాస్తవాన్ని చెప్పింది. గోపాలకృష్ణుని జీవిత చరిత్ర భారతీయ విలువలు చెరగని ముద్రవేసింది. సిక్కు జైన, బౌద్ధ గ్రంథాలలో జీవరాసులన్నింటి పైనా కరుణ, అహింసలు ప్రతిపాదింపబడి ఉన్నాయి. ఆదినాథుడే ఋషభదేవుడు, సింధులోయ మరియు హరప్పాలలో లభించిన నాణాలపై ఋషభుని చిత్రం కనిపిస్తుంది. సామవేదం ఇలా అంటుంది. సదా గావః శుచయో విశ్వధాయసః అంటే గోవులు సదా పవిత్రములు మరియు సర్వజన కళ్యాణ కారకములు అని అర్థం.

అధర్వణవేదంలోని గోసూక్తానికి అనుబంధంగానే స్కందపురాణంలో గోవు సర్వదేవమయీ, సర్వతీర్థమయీ అని వర్ణింపబడింది. గోరజం కాస్త నుదుటికి రుద్దుకుంటే చాలు సమస్త పాపాలనుండి, దోషాలనుండి ముక్తి లభిస్తుంది వత్సల అంటే తన దూడను ఆప్యాయంగా ప్రేమించేది గోవు. 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' బలమున్నవాడికే బ్రతికే హక్కు' అని నమ్మే ఐరోపీయ సమూహాలకు సర్వే జనాః సుఖినోభవన్తుు..(అందరు జనులూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి) ఈ దృష్టికోణం అవగాహనకు అందని అంశమే అవుతుంది.

గోవు భారతీయ సభ్యత, సంస్కృతి మరియు జాతీయ జీవనంతో ముడి పెట్టుకొని ఉన్న అంశం. గోవు పట్లగల సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ దృష్టి కోణాలన్నీ ఈ దేశ వాసుల ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంతో ముడిపెట్టుకొని ఉన్నాయి. భారతీయ సంస్కృతి యొక్క మూలాధార విశ్వాసం ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి ఒకే సత్యాన్ని బుద్ధిమంతులు అనేక విధాలుగా పిలుస్తారు. అన్నది ధ్యేయ వాక్యమైన కారణంగా ఇచ్చటి సమాజ సహజీవనం యొక్క అందరూ అంగీకరించే ఆధారం అహింస గా పరిగణించబడింది. భారతీయులకు గోపూజ ఆత్మ బోధకు ఉపకరించే ఒక సనాతన మార్గము. పరంపరాగతమైన భారతీయ సమాజానికి ప్రతీక గోవు. అది అహింసా ప్రధానము, ఆత్మ బోధాత్మకమే గాక సనాతన భారతీయ సంస్కృతి యొక్క సంవర్ధనకై సమాజంలో సామూహిక స్ఫూర్తిని అది అందిస్తుంది. అందువల్లే యజుర్వేదం ఇలా అంటుంది. గో:మాత్రా న విద్యతే అంటే 'గోవు చేసే ఉపకారాలకు అంతమే లేదు' - అది మనకెంతగానో మేలు చేస్తుంది.

ధార్మిక, సాంస్కృతిక దృష్టితో పరిశీలించినప్పుడు గోవు అనాది కాలం నుండి హిందూ సమాజానికి అత్యంత ప్రీతి పాత్రము, శ్రద్ధా కేంద్రము, పూజార్హము అహింసా ప్రధానమైన మన సంస్కృతికి గోమాత కేంద్రబిందువుగాను నిలిచినట్లు దర్శనమిస్తుంది. అంతేగాక గోవు మన సామాజిక, ఆర్థిక జీవనానికి వెన్నెముకగానూ నిలిచినట్లు బోధపడుతుంది. గోరక్ష, గోసేవ, వీటిని మన సామాజిక ఆకాంక్షలలో ఒక విడదీయలేని భాగంగా గుర్తించాము.

చారిత్రక దృష్టితో పరికించితే గోరక్షణకు సంబంధించిన ప్రశ్న మొట్టమొదటగా ముస్లిం శాసనకాలంలోనే కనపడుతుంది. అంతకు ముందు కాలంలో గోహత్య అసలు ఊహకందని మాట. ఇస్లాం ఈ దేశంలో హిందూ ధర్మ సంస్కృతులను సమూలంగా నాశనం చేయాలని ఆశించింది. అంతకు పూర్వం అది ఆక్రమించిన దేశాలన్నింటిలోనూ ఆయాదేశాల ధర్మ సంస్కృతులను నాశనం చేయడంలో అది కృతకృత్యమైంది. అయితే ఈ దేశంలో అది పూర్తి సాఫల్యతను పొందనప్పటికీ అందుకోసం అది అన్ని ప్రయత్నాలు చేసింది. ఇస్లాం ను మించి ఆంగ్లేయుల కాలంలో విదేశ సంస్కారాలతో ఎదిగిన హిందువులు హిందూ వ్యతిరేకతలో ఇస్లామీ భక్తులు సహాయకులుగానే నిలిచారు. హిందూ ధర్మ సంస్కృతుల చిహ్నాలైన ఆవులు, దేవాలయాలపైన బరితెగించి సమ్మెట పోట్లు పొడిచారు. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉన్నది. ఈ యుగంలో గోవా అత్యంత దయనీయమైన స్థితికి గురియైపోయింది. ఈ నేలపై గోమాత యొక్క రక్తపు నదులు ప్రవహింప జేయబడుతున్నాయి.

ఆంగ్లేయులు గోమాంస భక్షకులు. వారు అవును మాంసాన్నిచ్చే జంతువుగానే గుర్తించారు. ముస్లింలు తాము తినడానికన్నా హిందువుల మనోభావాలను గాయపరిచేందుకే గోహత్యను ముమ్మరంగా కొనసాగించారు. మందిరాలను నేలమట్టం చేసి మసీదులు కట్టేందుకు ముందు వారు కావాలని గోవుల రక్తాన్ని ఆ స్థలం పై అలికేవారు. కారణమేమంటే ఆ స్థలంలో మరెన్నడూ హిందువు మళ్ళీ దేవాలయం కట్టరాదని, తాము ముట్టడి జరిపే సమయంలో చేజిక్కిన ప్రాంతంలోని బావులు, చెరువులు, నదులు, కాలువలలో గోవు మాంసాన్ని, రక్తాన్ని కలుపుతూండేవారు. కారణం విధిలేక హిందువులు తమ పాదాక్రాంతం కావాలని. హిందువులు విశేషించి బ్రాహ్మణులు, సాధుసంతుల నోళ్ళలో బలవంతంగా గోమాంసాన్ని కుక్కి వారిని మతాంతరీకరణకు గురి చేస్తుండేవారు. అయితే ఇన్ని ఘాతుకాలకు గురైనప్పటికీ హిందూ సమాజం సదా సర్వదా గోరక్ష కార్యంలో తన ప్రయత్నాలను మానలేదు. ఇకనైనా హిందువులు మేల్కొని గోరక్షణకు ముందుండాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..