Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పాల బుగ్గల ఆడపిల్లలు ఎంతపని చేశారో తెలుసా? - Who Murder C G B Stevens in Comilla - MegaMinds

ఈ కుర్రాళ్ళు నిజంగా రాక్షసులు వార్తాపత్రికల్లో క్రాంతికారుల సాహసాలు చదివిన ఆంగ్ల అధికారి అసంకల్పింతంగా అన్నమాటలివి. ఆ అధికారి చి...

ఈ కుర్రాళ్ళు నిజంగా రాక్షసులు వార్తాపత్రికల్లో క్రాంతికారుల సాహసాలు చదివిన ఆంగ్ల అధికారి అసంకల్పింతంగా అన్నమాటలివి. ఆ అధికారి చిన్న చితకావాడు కాదు. కొమిల్లాలో కలెక్టరు. మేజిస్ట్రేట్. త్రిపురకు రాజకీయ ప్రముఖ్. ఎవడో ఒక క్రాంతికారుడు తుపాకీ పట్టుకొని తనవెంట పడొచ్చు. ఈ ఆలోచన రాగానే బూట్లలోంచి వణుకు మొదలై ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు సర్ సి.జి.బి. స్టీవెన్స్.

అది డిసెంబర్ 14, 1931. ఉదయం పదిగంటలైంది. ఓ చిన్నబండి వచ్చి కోర్టుముందు ఆగింది. స్టేవెన్స్ గారున్నారా? ఓ కుర్రాడు అడిగాడు. ఇదిగో ఈ ఆడపిల్లలు ఆయనకు ఓ హాజరు సమర్పించుకోవాలి. స్టేవెన్సుగారక్కడ లేరు, జిల్లా మేజిస్ట్రేట్ వారి ఇంటికి పోనీ.. బండివాడికి చెప్పింది అందులో ఓ అమ్మాయి. అవును. అక్కడికే పోదాం. మేము వెళ్తాంలెండి. మీరెందుకు శ్రమ పడటం, ఆగిపోండి అంది యువకుడితో ఆ అమ్మాయి. మీ వల్ల వుతుందంటారా?‌- ఓ! తప్పకుండా అంటూ ఓ కాగితాల కట్ట చూపించిందామె. అది (పిటిషన్) మహజరు అయ్యుండాలి. ఆ అమ్మాయి నాజూకుతనం కొంత తగ్గిందేమో అనిపించింది. ఆ మాటలంటుంటే.

బండి మేజిస్ట్రేట్ గారి భవనానికి చేరింది. పిల్లలిద్దరూ బండి దిగారు. పట్టుమని పదహారేళ్ళుండవు ఇద్దరికీ. పాలబుగ్గల సున్నితత్వం ఇంకా వదలలేదు. మేం ఇద్దరం ఫైజుముస్సా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చాం, మేజిస్ట్రేట్ గారితో ఇంటర్వ్యూ కావాలి. బయట వున్న గుమాస్తాతో విన్నవించుకున్నది ఓ అమ్మాయి. రెండో అమ్మాయి ఓ పరిచయ పత్రాన్ని చూపించింది. అందులో ఈలాసేన్, మీరాదేవి అని వ్రాసివుంది.

గుమాస్తా ఆ పిల్ల లిద్దర్నీ తేరిపార చూసాడు. నిలబడి వున్నారు ఆ ఇద్దరూ. బహుశ మంచి గౌరవనీయ కుటుంబాలకు చెంది ఉండాలి అనుకున్నాడు మనస్సులో. కూర్చోండి అంటూ ఆ పరిచయపత్రాన్ని లోపలకు పంపడం వాళ్ళ చేతుల్లోని కాగితాల కట్ట మీద అతని దృష్టి నిలిచివుంది. మహజరా? అన్నాడు మామూలుగా, పిల్లలు తలూపారు.‌ అబ్బే, మీరంత కంగారు పడనక్కర్లేదు. మేజిస్ట్రేట్ గారు మీ విన్నపం తప్పక వింటారు అన్నాడు ధైర్యం చెబుతూ. ఆయన వింటారనే ఆశ అన్నాదో అమ్మాయి. పిలుపొచ్చింది లోపలనుంచి స్టీవెన్స్ ముందు కాగితాలు విప్పారు.

బెంగాలీ ఆడపిల్లల ఈత పోటీల గురించి సార్! అలాగే? అంటూ కాగితం తీసుకుని చదివాడు, చిరునవ్వు నవ్వి ప్రధానోపాధ్యాయునికి సిఫారసు చేస్తూ సంతకం చేశారు. ఆమె మిగతా పని చూచుకుంటందిలే అంటూ కాగితం తిరిగి ఇచ్చాడు స్టేవెన్స్ ఓ అమ్మాయి చెయ్యి చాచింది కాగితం అందుకోవటానికి.

అప్పుడు, ఆ క్షణంలో కనుమూసి తెరిచేలోగా జరిగిందో, విచిత్రం. రెండో అమ్మాయి ఓ రివాల్వర్ తీసి ఆ క్షణంలో అతన్ని కాల్చి వేసింది. అతని కళ్ళు బైర్లు కమ్మాయి. భయంతో వణికిపోతూ ఒక్క దూకుదూకి వెనుకగదిలోకి పరుగెత్తసాగాడు. మొదటి అమ్మాయి మరో రివాల్వర్ తో గురిచూచి మరోమారు పేల్చింది, ఓ చిన్న కేకతో కుప్పకూలిపోయాడు ఆ ఆంగ్ల అధికారి స్టీవెన్స్.

విచారణ జరిగింది. కోర్టులో జడ్జిగారితో సహా అందరూ ఆ అమ్మాయిలు వంక అపనమ్మకంతో చూచారు. ఈ పసిపిల్లలు క్రాంతికారి! ఏముంది? 27, జనవరి, 1932న తీర్పు చెప్పబడ్డది. విచారణలో విశేషంగా మరో శనిగాడిని మేం వదిలించుకున్నాం అని ఆ పిల్లలు గర్వంగా చెప్తూనే వున్నారు.

మీరిద్దరూ పదహారేళ్లు నిండని పసివాళ్ళు, మిమ్మల్ని ఉరితీయించే బదులు యావజ్జీవ శిక్ష తో అండమానుకు పంపుతున్నాను తీర్పు ఇవ్వబడినది. ఇద్దరూ ప్రశాంతంగా వున్నారు. మా మాతృభూమిని ఆక్రమించి అక్రమంగా పాలించే వారిలో కనీసం ఒక్క విదేశీయుడిని రూపు మాపగలిగాం! అని తృప్తిగా వుంది వాళ్ళకు‌. ఇంతకూ ఆ ఇద్దరమ్మాయిల పేర్లాంటా అని అనుకుంటున్నారు కదూ... సునీతి చౌదరి, శాంతి ఘోష్... ఇప్పటికీ త్రిపుర లో వీరి గురించి జానపద గేయాల రూపంలో పాడుకుంటూ ఉంటారు. జైలు శిక్ష పూర్తయిన తరువాత వీరుఇరువురు దేశ సేవకు అంకితమయ్యారు. వీరిని క్రింది చిత్రం లో చూడవచ్చు.. జై హింద్.
ఇలాంటి జీవిత చరిత్రల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments