Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బెంగాల్ విభజనను అడ్డుకోవడం లో ఆంధ్రుల పాత్ర - MegaMinds

కర్జన్ తన కుటిల నీతితో బెంగాల్ విభజన ద్వారా దేశ విభజన కు నాంది పలికాడు. ఆనాడు భారత ప్రజ మేల్కొని వందేమాతరం అని నినదిస్తూ చేసిన స...

కర్జన్ తన కుటిల నీతితో బెంగాల్ విభజన ద్వారా దేశ విభజన కు నాంది పలికాడు. ఆనాడు భారత ప్రజ మేల్కొని వందేమాతరం అని నినదిస్తూ చేసిన స్వదేశీ ఉద్యమం అఖండ భారత్ ను నిలుపుకొంది. కర్జన్ కుటిల నీతిని సమర్థవంతంగా ఎదుర్కొంది. స్వాతంత్రోద్యపు గతిని మార్చింది. ఈ ఉద్యమం లో వేలాది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఉద్యమం ను లాల్, బాల్, పాల్ త్రయం. ఠాగూర్, అరవింద్ ఘోష్ వంటి అనేకమంది నాయకత్వం లో సాగింది. ఈ మహోద్యమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా వుంది. ఆంధ్ర ప్రాంతం లో ముఖ్యంగా జాతీయ పాఠశాలలు మొదలయ్యాయి, రాజమహేంద్రవరం లో ఆర్ట్స్ కాలేజీలో బిపిన్ చంద్రపాల్ పర్యాటన కారణంగా 138 మంది విద్యార్థులు సస్పెండ్ అయ్యారు, ఆ తరువాత ఆంధ్ర ప్రాంతం అంతా ప్రజా ఉద్యమంగా మారి బెంగాల్ విభజనను అడ్డుకోవడం లో ముందువరుసలో ఆంధ్రులు కూడా ఉన్నారని చెప్పడానికి గర్వంగా ఉంది. ఒకసారి ఆంధ్ర ప్రాంతం లో ప్రజా ఉద్యమం గా మారడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.

ఆంధ్ర ప్రాంతంలో జాతీయ పాఠశాల: శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి కథనం ప్రకారం మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్ గారి ద్వారా ఒక జాతీయ పాఠశాల ప్రారంభించబడింది. 13 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ద్వారా జాతీయ విశ్వవిద్యాలయం ప్రారంభించాలని సంకల్పించారు. 11 సంవత్సరాల అవిశ్రాంత పరిశ్రమ తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీలోనే మొదటి మోడల్ కాలేజీ మచిలీపట్టణం ప్రారంభించబడింది. 1 జూలై 1909. మద్రాస్ లో జరుగుతున్న కాంగ్రెస్ సభలకు వెళ్తున్న రాస్ బిహారీ ఘోష్ ఆంధ్ర దేశానికి సంబంధించిన కార్యకర్తలు కలిశారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లోనే సభ జరిగింది. 200 మంది పాల్గొన్న ఈ సభలో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ప్రయత్నాలను శ్రీ ఘోష్ పలువిధాలుగా ప్రశంసించారు. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ద్వారా శ్రీ రాస్ బిహారీ ఘోష్ సన్మానించారు.

బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రాంత పర్యటన: బిపిన్ చంద్రపాల్ దేశవ్యాప్త పర్యటన చేస్తూ 1907 ఏప్రిల్ 19 నుండి 24 వరకు రాజమండ్రిలో ఉన్నారు. ఆ రోజులలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి గోదావరి జిల్లా ఉండేవి. శ్రీ బిపిన్ రావడానికి ముందు బాలభారతి సమితి రాజమండ్రిలో స్థాపించారు. ఈ సంస్థ ద్వారా స్వదేశిని విరివిగా ప్రచారం చేసారు. యువకులు వందేమాతరం బ్యాడ్జీలు ధరించేవారు. కలిసినప్పుడల్లా వందేమాతరంతో పలకరించుకునేవారు. ఆంగ్లేయులెవరైనా కనిపిస్తే గట్టిగా వందేమాతరం అని నినదించేవారు. శ్రీ బిపిన్ చంద్ర జిల్లా ప్రజలను ఉద్యమంలో పాల్గొనేటట్లు చేసారు. శ్రీ బిపిన్ చంద్ర ఉపన్యాసానికి ఉత్తేజితుడైన మహాకవి శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులుగారు ఆశువుగా ఈ పద్యాలు చెప్పారు

భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి!

దుడుకుతనమున తీరదీ గడుసుదనము
కాన, తాపులు, పోటులు కార్యమనక
లేగలన్నిటి నేకమౌ లాగొనర్చి
నేర్పుతో తల్లికే గజేప నేర్ప వలయు!

రాజమండ్రిలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ అనే ఆంగ్లేయుడు. హంటర్ 1907 మార్చి 28 నుండి ఏప్రిల్ 22 వరకు ఊర్లో లేడు. తిరిగి వచ్చిన తరువాత ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారని తెలిసింది. ఉపాధ్యాయ శిక్షణాలయంలో చదువుతున్న విద్యార్థి శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఏప్రిల్ 24న శ్రీ బిపిన్ చంద్ర సన్మానించినట్లు హంటర్ తెలుసుకున్నాడు. మండిపడ్డాడు! ఆ రోజున విద్యార్థులందరూ వందేమాతరం బ్యాడ్జీలు ధరించి కళాశాలకు వచ్చారు. హంటర్ అందరిని బ్యాడ్జీలు తీసేయమని చెప్పాడు. విద్యార్థులందరూ ఒక్కసారిగా వందేమాతరం! భారత్ మాతాకీ జై అని నినాదాలిచ్చారు. ఈ చర్యతో కళాశాలలోని 138 మంది విద్యార్థులను సస్పెండ్ చేసాడు. నగర ప్రముఖులు హంటర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. కాని హంటర్ విద్యార్థులను క్షమాపణ పత్రం వ్రాసి యిమ్మన్నాడు. విద్యార్థులు వ్రాసి ఇవ్వలేదు. అందరూ సస్పెండ్ అయ్యారు.

ఈ రెండు సంఘటనలు ఆంధ్రదేశంలో జరిగిన తరువాత ఆంధ్ర అంతా వందేమాతరం నినాదాలతో మారుమోగింది. కర్జన్ ఈ దేశ వ్యాప్త ఉద్యమం కు దిగి వచ్చి బెంగాల్ విభజనను నిలిపివేశాడు‌.. ఇంతటి మహోద్యమంలో ఆంధ్రులు భాగస్వామ్యం చాలా వుంది. జై హింద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

3 comments

  1. స్వాతంత్ర్యం రాక ముందు మీరు చెప్పుతున్న చరిత్రలో ఆంద్రా అన్నది లేదు,మీరు కూడా చరిత్ర లొ జరిగినది చెప్పండి

    ReplyDelete
  2. ఆంధ్రప్రదేశ్ లెదు ఆప్పుడు

    ReplyDelete
  3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేనంత మాత్రాన ఆంధ్రులు లేనట్టా...మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగువారు...రాష్ట్రం పెరు మరింత మాత్రాన ఆంధ్రులు పెరు మార్చుకోలేరు...

    ReplyDelete